గుజరాత్ ఎన్నికల్లో, కాంగ్రెస్, బీజేపీ పోరు... వాటి తరువాత, ఇవాళ వచ్చిన ఫలితాలు... బీజేపీ అన్నీ తట్టుకుని నిలబడటం.. ఏ ఒక్క ఆకర్షణీయ సంక్షేమ పధకాలు బీజీపీ ప్రకటించకపోయినా, రిజర్వేషన్లు ఇవ్వను అన్నా, ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపటం, మరో పక్క కాంగ్రెస్ పార్టీ, అన్నీ ఫ్రీ అని చెప్పినా, అడిగినవారికి అందరకీ రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పినా, కాంగ్రెస్ ఓడిపోవటం, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఆయన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ టెలి కాన్ఫరెన్స్ లో విశ్లేషించుకున్నారు. బీజేపీ గెలిచినా, కాంగ్రెస్ ది నైతిక విజయం అని విశ్లేషకులు అంటున్నా, గెలుపు గెలుపే కాబట్టి, గుజరాత్ ఫార్ములా మనం కూడా వర్క్ అవుట్ చేద్దాం అని నిర్ణయానికి వచ్చి, రెండు నిర్ణయాలు తీసుకున్నారు...

jagan gujarat 18122017

మొదటిది, గుజరాత్ లో చివరి వరకు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గెట్టి పోటీ ఇచ్చింది.. కాని చివర్లో ప్రధాని నరేంద్ర మోడి ప్రచారం, ప్రజల్లో భావోద్వేగాన్ని రగిల్చింది... ప్రధాని స్థాయి వ్యక్టి తన స్థాయికి దిగజారి, నన్ను చంపటానికి సుపారీ ఇచ్చారు అని, నన్ను నీఛ్ అంటున్నారు అని, నన్ను తప్పించటానికి పాకిస్తాన్ తో చేతులు కలిపారు అని ఇలా ప్రచారం చేశారు... ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది... ఒక్కసారిగా బీజేపీ వైపు వేవ్ వచ్చింది.. అందుకే జగన్ కూడా తన పంధా మార్చాలి అని నిర్ణయించుకున్నారు... మొన్నటి దాకా చంద్రబాబుని కాల్చేస్తా, ఉరి వేస్తా, చెప్పుతో కొడతా, చీపురు పెట్టి కొడతా అన్న జగన్, ఇప్పుడు స్టైల్ మార్చి, నన్ను చంపటానికి చంద్రబాబు చూస్తున్నారు... నన్ను చంపటానికి విదేశాల్లో స్కెచ్ వేశారు అనే ప్రచారం చేసి, ప్రజల్లో సానుభూతి పొందటానికి ప్రయత్నం చెయ్యనున్నారు...

jagan gujarat 18122017

రెండోది, రిజర్వేషన్ల విషయం... గుజరాత్ లో రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతుంటే, మోడీ మాత్రం, రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు.. అయినా, ఆయన్ను అక్కడ ప్రజలు గెలిపించారు... అందుకే జగన్ కూడా, ఈ ఫార్ములా వైపు మొగ్గు చూపుతున్నారు... ముద్రగడతో అర్జంట్ గా కటీఫ్ కొట్టి, ఇలాంటి రిజర్వేషన్లు మంచివి కావు అనే వాదన పైకి తేవటానికి ప్రయత్నం చెయ్యనున్నారు... ఎసి రిజర్వేషన్ల అంశంలో కూడా, దానికి నేను వ్యతిరేకం అని జగన్ చెప్పనున్నారు... ఈ విధంగా, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఆకట్టుకోవొచ్చు అని, గుజరాత్ లో అదే జరిగింది అనేది జగన్, ప్రశాంత్ కిషోర్ ఆలోచన... మరి, వీటిని ప్రజలు ఎలా స్వీకరిస్తారో చూడాలి...

దేశ వ్యాప్తంగా 40 వేల మంది దగ్గర డబ్బులు కొట్టేసి, 300 కోట్ల స్వాహా చేసిన, మోసగాడి కోసం ఢిల్లీ పోలీసులు వెతుకుతున్న అతనితో, ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్ తో పాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరితో, తాను ఇదివరకు చనువుగా ఉన్న ఫోటోలు బయట పడటం సంచలనం అయ్యింది... వివరాల లోకి వెళితే రూ. 300 కోట్ల భారీ కుంభకోణంలో ప్రకాశం జిల్లాకి చెందినా వైకాపా నేత సైకం రామకృష్ణ రెడ్డి పోలీసులకు చిక్కాడు. ఈయన వైసీపీ తమిళనాడు విభాగం సేవాదళ్‌కు అధికార ప్రతినిధిగా కూడా చేశారు, ఇప్పుడు కనిగిరి ఎమ్మల్యే అభ్యర్ధిని అని చెప్పుకుని తిరుగుతున్నారు..

sykam 18122017 2

తొలుత ప్రకాశం జిల్లా కనిగిరిలోనే తన దుకాణం తెరిచాడు. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆర్‌బీఐ అనుమతులు చూపాల్సిందిగా నిలదీయడంతో వెనక్కు తగ్గి అనంతరం హైదరాబాద్ టీ హబ్ లో దుకాణం తెరిచాడు.. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుతో పాటు…ఢిల్లీ వరకూ 28 వేల మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేశాడు. కాని ఇప్పుడు ఆ లెక్క 40 వేల మంది అని, దాదాపు ౩౦౦ కోట్ల స్కాం అని తేలింది... కొద్ది రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. భాధితుల ఫిర్యాదు మేరకు, ఫలితంగా బరిలోకి దిగిన ఢిల్లీ పోలీసులు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఫిర్యాదు చేశారు.

sykam 18122017 3

మన దేశంలో బిట్‌ కాయిన్‌ పద్దతి లేదు. కానీ వారిని నమ్మించి పెట్టుబడులు రాబట్టాడు. పెట్టుబడి పెట్టిన వారు ఆరా తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోందని అందుకే కొన్నాళ్లు ఆగాలని అబద్దం చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫోన్‌ నెంబర్లు ఆఫ్‌ చేశాడు. ఫలితంగా నోయిడాకు చెందిన సుమిత్‌ అతని స్నేహితులు ఢిల్లీ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైఎస్ఆర్ పార్టీ, అతనికి, పార్టీకి సంబంధం లేదు అని చెప్పింది... కాని, ఇప్పుడు బయటకు వస్తున్నా ఫోటోలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి... జగన్ పక్కన ఒక రూమ్ లో కూర్చుని వన్ టు వన్ మాట్లాడుతున్నాడు అంటే, ఇతను జగన్ కు ఎంత చనువుగా ఉండే వాడో అర్ధమవుతుంది. అంతే కాదు, రోజా, చెవి రెడ్డి, వైవి సుబ్బా రెడ్డి (ఇతనే ఆ కంపెనీ ఓపెనింగ్ కి వచ్చారు అనే వార్తలు కూడా ఉన్నాయి), విజయసాయి రెడ్డి, ఇలా అందరి నాయకులతో చనువుగా ఉంటున్నా, వైఎస్ఆర్ పార్టీ మాత్రం, ఈ స్కాం బయట పడగానే, మాకు సంభందం లేదు అంటుంది... ఈ కంపనీతో, వైఎస్ఆర్ పార్టీ బడా నేతల హస్తం కూడా ఉంది అని వార్తలు వస్తున్నాయి... పోలీసులు ముందు ఈ సైకం రామకృష్ణ రెడ్డి కోసం వెతుకుతున్నారు... ఈయన దొరికితే, ఆ బడా నేతలు ఎవరు అనేది బయట పడనుంది...

ప్రజా సేవ, ఆయన లక్ష్యం... ప్రజా సమస్యల పరిష్కారం నీతి కృత్యం... అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా... ప్రతిక్షం జనం గురించే, జనం కోసమే, జనమే ఊపిరిగా బ్రతికారు దివంగత నేత ఎర్రం నాయుడు... బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తూ, ఆయన రాజకీయ జీవితంలో చివరి వరకు పోరాడారు... ఆయన వారసత్వం తీసుకుని, సిక్కోలు యువ సింహంలా గర్జిస్తూ... ఎర్రన్న అడుగుజాడల్లో ప్రజలకోసం ఉద్యమిస్తూ... ప్రజాగళాన్ని...పార్లమెంటులో వినిపిస్తున్న యువ కిశోరం... కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా, తండ్రి బాటలోనే ప్రజా సమస్యలు తీరుస్తున్నారు... ఇదే ఇప్పుడు ప్రతి పక్ష నేత వైఎస్ జగన్ ను ఇబ్బంది పెడుతున్న అంశం... కుర్ర ఎంపీ ఇప్పుడు జగన్ ను గడగడలాడిస్తున్నాడు... జిల్లా మొత్తాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నాడు...

jagan 18122017 2

రామ్మోహన్ నాయుడు స్థానికంగా ప్రజా సమస్యలనే కాదు, పార్లమెంట్ లో కూడా మార్కులు కొట్టేస్తున్నారు... ప్రతి పక్ష పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, దూకుడుగా వెళ్తున్నారు... పార్ల‌మెంటులో ఆంధ్రా స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళ‌మెత్తుతూ కేవ‌లం శ్రీకాకుళం జిల్లా ప్ర‌జ‌ల్లోనే కాకుండా తెలుగు ప్ర‌జ‌ల్లో కూడా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు. తాజాగా విశాఖ రైల్వేజోన్‌పై పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు ఆయ‌న ప్రైవేటు బిల్లు కూడా ప్ర‌వేశ పెడుతోన్న సంగ‌తి తెలిసిందే... పార్ల‌మెంటులో ఏపీ నుంచి ఎంతో మంది సీనియ‌ర్ ఎంపీలు ఉన్నా రామ్మోహ‌న్ నాయుడు వాయిస్ మాత్ర‌మే వినిపిస్తుండ‌డం, ప్రతి పక్ష గొంతు అసలు వినిపించకపోవటం జగన్ కు ఇంకా చిరాకు తెప్పిస్తుంది...

jagan 18122017 3

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రెడ్డి శాంతిపై రామ్మోహ‌న్ నాయుడు ఏకంగా 1.27 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. అయితే ఈ సారి జగన్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా, మ్మినేని సీతారాంను రంగంలోకి దించాడు... అయితే తమ్మినేని మాత్రం, రామ్మోహన్ స్పీడ్ కు తట్టుకోలేక, ఎన్నికల ముందే చేతులు ఎత్తేశాడు... ఆ కుర్రాడిని ఎదుర్కోలేను అని, జగన్ కు చెప్పేసాడు కూడా... ఇప్పుడు జగన్ కొత్త కాండిడేట్ కోసం ఎదురు చూస్తున్నారు.. కాని, రామ్మోహన్ నాయుడుని ఎదుర్కోవాటానికి, జగన్ కు ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదు... ఈ ఎఫెక్ట్ మొత్తం జిల్లా పై పడుతుంది అని జగన్ తెగ ఆందోళన చెందుతున్నారు...

గుజరాత్ ఎన్నికల్లో, చావు తప్పి కన్ను లొట్ట పోయినా, రాష్ట్ర బీజేపీ నాయకులకు జ్ఞాదోయం అవ్వలేదు... కనీసం వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేని బీజేపీ నాయకుడుగా పేరు ఉన్న సోము వీర్రాజు విర్రవీగుతూ, నేను 2019లో ఏపి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అంటూ, గుజరాత్ ఎన్నికల గెలుపు, ఈయన వల్లే అన్నంత బిల్డ్ అప్ ఇస్తున్నారు.. అంతే కాదు 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని సోము వీర్రాజు అంటున్నారు... వచ్చే ఎన్నికల్లో తాము డిసైడ్‌ చేసే స్థితిలో ఉంటామని, ప్రతి గ్రామంలో కార్యకర్తలు బిజెపిలో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల నాటికి మేము ఏమి చెప్తే అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది అని అంటున్నారు...

2019 cm 18122017 2

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పరిస్థితి గురించి చెప్పాలి అంటే వర్ణనాతీతం. ఆంధ్రాలో ఆ పార్టీ పయనం చుక్కాని లేని నావ లాగా ఉందంటే అంగీకరించక తప్పని వాస్తవం. ఎపిలో ఆ పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల సంఖ్య మిగతా పార్టీలతో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువే. అయినా వీళ్లలో వీళ్లకే ప‌ది గ్రూపులా అన్నట్లుంటుంది పరిస్థితి. ఉన్న న‌లుగురు ఎమ్మెల్యేల్లో ఇద్ద‌రు మంత్రుల‌ది చెరోదారి. ఇద్దరు ఎంపీల్లో ఎవరి దారి వారిదే.. ఈ సోము వీర్రాజు అయితే, జగన్ ఏ ట్యూన్ ఆడమంటే ఆ ట్యూన్ ఆడతాడు... ఈయనగారి సత్తా మొన్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరికీ తెలిసిందే... అయినా, మళ్ళీ విర్ర వీగుతున్నారు.. పోలవరం, నిధులు, ఉమ్మడి ఆస్తులు లాంటి విషయాల్లో మాత్రం, ఈయన గారు ఒక్క మాట మాట్లాడడు...

2019 cm 18122017 3

మొన్నా మధ్య ఒకాయిన కాకినాడ వచ్చి, మాది పది జిల్లాల పార్టీ కాదు, జాతీయ పార్టీ, మీరెంత అని మన రాష్ట్ర పార్టీల గురించి అన్నాడు... నిన్న ఒకాయిన మేము తలుచుకుంటే, చంద్రబాబు పార్టీకి డిపాజిట్ కూడా రాదు అన్నాడు, ఇప్పుడు ఈ వీర్రాజు విర్రవీగుతూ, 2019లో ఏపి ముఖ్యమంత్రి ఎవరో నేను డిసైడ్ చేస్తా అంటున్నాడు. 175 నియోజకవర్గాల్లో, 2014లో చంద్రబాబు వీరికి 15 సీట్లు ఇచ్చారు... చివరకు వీరు గెలిచింది 4... వీళ్ళు సియం సీటు గురించి, డిపాజిట్లు గురించి మాట్లాడుతున్నారు అంటే, మన ఖర్మ అనుకోవటమే...

Advertisements

Latest Articles

Most Read