రాయలసీమవాసుల మూడు దశాబ్దాల కల నెరవేరింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న గాలేరు నగరి సుజల స్రవంతి పథకం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. సీమనేలను ముద్దాడుతూ.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పూర్తి స్థాయిలో పనులు కాకున్నా ప్రజల దాహార్తి తీర్చేందుకు అవకు సొరంగ మార్గం ద్వారా 5వేల క్యూసెక్కుల నీటిని గండికోటకు తరలిస్తున్నారు. కర్నూలు, కడప, చిత్తూరుతోపాటు నెల్లూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం ఎట్టకేలకు ప్రారంభమైంది. సీమ భూములను తడిపేందుకు కృష్ణమ్మ పరుగులెడుతోంది. దాదాపు ఐదువేల క్యూసెక్కుల నీటితో జీఎన్‌ఎస్‌ఎస్ కాలువ కళకళలాడుతోంది. అవకు సొరంగ మార్గం ద్వారా కృష్ణా జలాలు, గండికోట జలసాయానికి చేరనున్నాయి...
రాయలసీమను రాతనలసీమగా మార్చేందుకు మూడు దశాబ్దాల క్రితమే జీఎన్‌ఎస్‌ఎస్ ప్రారంభించారు.. 30 ఏళ్ళుగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి... కృష్ణా జలాల పై సీమ వాసులు పూర్తిగా ఆసలు వదులుకున్న తరుణంలో, చంద్రబాబు ఈ పధకాన్ని ప్రతిష్టాత్మికంగా తీసుకుని, పనులు పరుగులెత్తించింది... ఎట్టి పరిస్థితుల్లోనూ, ఈ ఏడాది గాలేరు నగరి ద్వారా నీళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు... అందుక తగ్గట్టుగా, ప్రస్తుతానికి 5 వేల క్యూసెక్కుల తరలించే ఏర్పాటు చేశారు. ఒక వైపు పనులు కొనసాగిస్తూనే, నీటిని కడప జిల్లాకు తరలిస్తున్నారు... మూడు దశాబ్దాల కలను నిజం చేస్తూ, చంద్రబాబు సీమ వాసుల కలను నెరవేరుస్తున్నారు...
ఇది గాలేరు-నగిరి సుజల స్రవంతి ప్రాజెక్ట్: కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా గాలేరు - నగరి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నది. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 38 టి.యం.సి.ల కృష్ణా నది మిగులు జలాలను గండికోట ప్రధాన జలాశయానికి తరలించి, గండికోట జలాశయానికి దిగువన 8 చిన్న చిన్న జలాశయాలను(వామికొండ సాగరం, సర్వరాజ సాగరం, ఉద్ధిమడుగు సాగరం, వెలిగొండ సాగరం, కృష్ణ సాగరం, శ్రీ బాలాజీ జలాశయం, పద్మ సాగరం, శ్రీనివాస సాగరం) నిర్మించి, వాటి ద్వారా కడప జిల్లాలోని 15 మండలాల్లో 1,30,000, చిత్తూరు జిల్లాలోని 13 మండలాల్లో 1,60,000, నెల్లూరు జిల్లాలోని 4 మండలాల్లో 35,000, మొత్తం 3.25 లక్షల ఎకరాలకు సాగు నీటిని, మార్గమధ్యంలో పలు పట్టణాలకు, గ్రామాలకు త్రాగు నీటిని సరఫరా చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు.