జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్టణం పర్యటనలో భాగంగా వారసత్వ రాజకీయాలపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయా పార్టీలు, వారసత్వ రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు. వారసత్వంతో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, తమకంటూ ఓ గుర్తింపు ఉందని, రాజకీయ నాయకుల వారసులమైనంత మాత్రాన తమకు సత్తాలేదనడం సరికాదని అన్నారు.
వారసత్వంతో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, తమకంటూ ఓ గుర్తింపు ఉందని, రాజకీయ నాయకుల వారసులమైనంత మాత్రాన తమకు సత్తాలేదనడం సరికాదని వ్యాఖ్యానించారు. ఓ అవకాశం వస్తేనే కదా తామేంటో నిరూపించుకునేదని లేదన్నాయన.. వారసత్వ రాజకీయాలపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్, ఇతర మంత్రుల కొడుకులు, కుమార్తెలు కావచ్చు ఎవరైనా వారసత్వం నుంచి వచ్చినా, సత్తాలేనివారని అంచనాలు చేయడం సరికాదంటూ రామ్మోహన్నాయుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఐటీ, పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా లోకేష్ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. జనహితమే, మన అభిమతమనే నినాదంతో శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సిక్కోల్ సైన్యం ఆవిర్భావం కార్యక్రమానికి రామ్మోహన్నాయుడు హాజరయ్యారు. ఓ సర్వే ప్రకారం దేశంలో 92 శాతం మంది ఏదో ఒక సమయంలో అవినీతికి పాల్పడ్డారనే విషయం తేలిందన్నారు. పార్లమెంటులో సైతం 81 శాతం నాయకులు అవినీతిపరులుండటం బాధాకరమన్నారు. ఇప్పటికే పవన్ వారసత్వ వ్యాఖ్యల పై ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి... సినిమాల్లో పవన్ ఎమన్నా కష్టపడి వచ్చాడా ? చిరంజీవిని పట్టుకుని వచ్చాడు.. సత్తా ఉంది కాబట్టి సినిమాల్లో నిలదొక్కుకున్నాడు, అందరూ అంతే అంటూ విమర్శలు వచ్చాయి...