ఆంధ్రపదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు ఈరోజు ప్రాజెక్టును సందర్శించారు. విహంగ వీక్షణం ద్వారా కాపర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ పనులను పరిశీలించారు. పనుల తీరును ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చేస్తున్న విమర్శ‌ల గురించి మాట్లాడుతూ…

polavaram jagan 11122017 3

ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి జ‌గ‌న్ ని తీసుకొచ్చినా ఆయ‌న‌కు అర్థ‌మ‌య్యేది ఏముంద‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కి పిల్ల‌ర్ అంటే తెలుసా, ఎర్త్ వ‌ర్క్ అంటే తెలుసా, డ‌యాఫామ్ వాల్ అంటే తెలుసా అంటూ వ్యాఖ్యానించారు. న‌ల‌భైయేళ్లుగా ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాల‌ను చూస్తున్న త‌న‌కు కూడా కొన్ని సాంకేతిక అంశాలు ఇప్పటికీ తెలియ‌వని చంద్ర‌బాబు చెప్పారు. ఈ మ‌ధ్య ప్రాజెక్టు చూడ్డానికి వ‌చ్చిన ఒక నాయ‌కుడు (అంబటి రాంబాబుని ఉద్దేశించి).. డ‌యాఫామ్ వాల్ ఎక్క‌డుంద‌ని అడుగుతున్నార‌నీ, అవ‌గాహ‌న లేక‌పోతే హుందాగా ఉండాలిగానీ… ఏమీ తెలియ‌న‌ప్పుడు ఎందుకు మాట్లాడాలి అన్నారు. డ‌యాఫామ్ వాల్ తెలియాలంటే ఆయ‌న్ని భూమి లోపలికి పంపించాల‌న్నారు.

polavaram jagan 11122017 2

ఏడు ముంపు మండలాలు రాకపోతే పోలవరం మన వూహకు కూడా అందేది కాదు. కాంక్రీటు పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తయితే గ్రావిటీ ద్వారా నీరందిస్తాం. పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోంది.ప్రతి సోమవారం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తున్నాం. రోజువారీ లెక్కలు చెబుతుంటే మళ్లీ శ్వేతపత్రం ఏమిటి?. ప్రాజెక్టును అడ్డుకోవద్దని విపక్షాలను కోరుతున్నా. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి రాజీ పడబోం. అడ్డుకుంటే చూస్తూ వూరుకోం’ అని హెచ్చరించారు.

పోలవరం... ఇది ప్రతి ఆంధ్రుడి నరనరానా జీర్ణించుకుపోయిన ప్రాజెక్ట్... మొన్న రెండు రోజులు, పోలవరం పై కేంద్రం ఇబ్బందులకి గురి చేస్తుంది అని తెలియగానే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా స్పందించారు... పోలవరానికి ఇబ్బందులు పెడితే ఎంత వరకు అయినా వెళ్తాం, అవసరమైతే అందరం విరాళాలు వేసుకుని పూర్తి చేస్తాం అంటూ ప్రతి పౌరుడు స్పందించాడు... అదే మూడ్ అఫ్ ది స్టేట్ గా, పోలవరం అనేది తన జీవిత ఆశయంగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఇవాళ పోలవరం సందర్శన సందర్భంగా, అంతే ఘాటుగా స్పందించారు... పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తాను అంటూ హెచ్చరించారు.

polavaram cm 111122017 1

తప్పుడు ఆరోపణలతో పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడొద్దని, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు భావితరాలకు భద్రత అని గుర్తు చేశారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఎలా వస్తాయని.. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్‌ కుడికాలువకు నీరు విడుదల చేస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు ఉదారంగా కాదు బాధ్యతగా పునరావాసం కల్పిస్తామని, ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. పోలవరంలో కాంక్రీట్‌ వర్క్స్‌ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్‌ పనులు పూర్తిచేసి కాఫర్‌ డ్యాం నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు.

polavaram cm 111122017 3

పోలవరం ప్రాజెక్ట్‌పై రూ.12,506 కోట్లు ఖర్చుచేశామని, కేంద్రం నుంచి రూ.4,390 కోట్లు..ఇంకా రూ.3200 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. పవర్‌ ప్రాజెక్ట్‌కు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని, 2013 చట్టంతో భూసేకరణ వ్యయం పది రెట్లు పెరిగిందని చెప్పారు. యూపీఏ తెచ్చిన చట్టం వల్లే పరిహారం ఖర్చు బాగా పెరిగిందని, ఆ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాలా వద్దా.. విపక్షాలు చెప్పాలన్నారు. 98 వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వస్తుందని బాబు పేర్కొన్నారు. పోలవరం వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని, శ్వేతపత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులపై ప్రతి సోమవారం సమీక్ష చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు..

మన బ్రతుకు మనం బ్రతుకుతున్నా ఇంకా మన మీద పడి ఏడుస్తూనే ఉన్నారు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో, మీ కళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే, నేను నా పంటితో తీస్తాను అని హైదరాబాద్ లో ఓట్లు కోసం కబ్రులు చెప్తే, ఆయన ఎమ్మల్యేలు మాత్రం, ఆంధ్రా వారి మీద దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు... సాక్షాత్తు ఎమ్మల్యేలే ఇలా ప్రవర్తిసుంటే, ఇక చోటా మోటా నాయకులు ఎలా ప్రవరిస్తారో అర్ధం చేసుకోవచ్చు... ఈయన తెలంగాణ రాష్ట్రం, నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం... ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అధికారి రూల్స్ ప్రకారం పని చేసినందుకు, పచ్చి బూతులు బహుమనగంగా ఇచ్చారు... రాష్ట్రం విడిపోయినా, నవ్వు ఆంధ్రావాడివి, మాకు సలాం కొట్టాల్సిందే అంటున్నారు...

telangana mla 10122017 2

ఆంధ్రా అధికారివి... నీయయ్య నాకే ఎదురొస్తావా?" అంటూ పరుషపదజాలంతో దూషించారు. ఈ ఎమ్మెల్యే బూతుపురాణానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళ్తే, నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీజీఎం లక్షమ్మ నిధుల దుర్వినియోగం కేసులో సస్పెండ్ అయింది. ఆమె తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓ మదన్ మోహన్‌కు వేముల వీరేశం ఫోన్ చేశాడు. ఈ విషయం తన పరిధిలోది కాదని సీఈవో సమాధానం ఇస్తుండగానే, "నా మాటకే ఎదురు చెప్తావా... ఆంధ్రా అధికారివి" అంటూ నోరు జారారు...

telangana mla 10122017 3

అంతటితో ఆగకుండా బండ బూతులు తిట్టారు. నేనడిగిన పని చేయకుంటే అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన మాటకే ఎదురు చెబుతావా అంటూ నోటికి పని చెప్పాడు.పని కోసం10 లక్షలు డిమాండ్ చేస్తున్నావని నీ పై అధికారులకు పిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. కాగా... ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో కాస్త ఆదివారం లీకైంది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా... ఇంత రచ్చ అవుతున్నా, అతను తన చర్యను సమర్ధించుకుంటున్నారు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు ఎన్నో అవమానాలు ఎదురుకున్న సంగతి తెలిసిందే... చివరకు కార్యాలయాల్లోకి వెళ్లి కొట్టారు కూడా... అన్నీ మర్చిపోయి ఎవరు బ్రతుకు వారు బ్రతుకుంటే, ఇప్పటికీ ఆంధ్రా వాడు అంటూ తెలంగాణలో ఎమ్మల్యే స్థాయి వారే దాడులు చేస్తున్నారు...

మొన్నా మధ్య ఒకాయిన కాకినాడ వచ్చి, మాది పది జిల్లాల పార్టీ కాదు, జాతీయ పార్టీ, మీరెంత అని మన రాష్ట్ర పార్టీల గురించి అన్నాడు... పాపం ఆయన గారు మర్చిపోయారు అనుకుంటా, ఆయన పార్టీకి 2 ఎంపి సీట్లు ఉన్నప్పుడు, మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ, అన్న గారి తెలుగువారి ఆత్మాభిమాన నినాదంతో ఢిల్లీని ఎదుర్కుని, 1984 నుంచి 1989 మధ్య పార్లమెంట్ లో ప్రతి పక్షంగా ఉంది... అది మా తెలుగువారి చరిత్ర... ఈయన గారికి ఇప్పుడు నెత్తికి ఎక్కి, మీది పది జిల్లాల పార్టీ అని అవహేళన చేసి వెళ్ళాడు... ఆయన్ను చూసుకుని, ఇప్పుడు ఇంకొకడు బయలుదేరాడు... మా పార్టీ లేకపోతే, మీకు డిపాజిట్ కూడా రాదు, మీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వలేడు అని వార్నింగ్ ఇచ్చాడు... ఆ కధ ఏంటో చూద్దాం...

cbn bjp 10122017 2

బీజేపీతో పొత్తు లేకపోతే టీడీపీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని ఆ పార్టీ జాతీయ నేత చల్లపల్లి నరసింహా రెడ్డి అన్నారు. 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీకి 17 చోట్ల డిపాజిట్లు దక్కలేదని ఆయన గుర్తు చేసారు. 2014లో తమతో పొత్తు ఉంది కాబట్టే చంద్రబాబు గెలిచారు అన్నారు. అదే విధంగా తాము 2019లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.

cbn bjp 10122017 3

సార్ గారు చెపుతున్న ప్రకారం టీడీపీకి డిపాజిట్లు రావు, ఇటు పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఉండదు, అంటే వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్రభంజనమే అనే ఆయన చెప్తున్నారు... ఆయన చెప్తున్న ప్రకారం ఇక రాష్ట్రంలో బీజేపీ, వైకాపా మాత్రమే ఉంటాయి... 175 నియోజకవర్గాల్లో, 2014లో చంద్రబాబు వీరికి 15 సీట్లు ఇచ్చారు... చివరకు వీరు గెలిచింది 4... వీళ్ళు కూడా డిపాజిట్లు గురించి మాట్లాడుతున్నారు అంటే, మన ఖర్మ అనుకోవటమే... ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంది రాష్ట్ర ప్రయోజనాలు కోసం, అంతే కాని చంద్రబాబుకి డిపాజిట్ రావటానికి కాదు... సార్ గారిని నిద్ర లేపరా సాంబా, కలలు ఎక్కువ కంటున్నారు..

Advertisements

Latest Articles

Most Read