2014లో అధికారం చేపట్టగానే చంద్రబాబు చేసిన మొదటి పెద్ద ప్రాజెక్ట్, పట్టిసీమ పూర్తి చెయ్యటం.. అది చేస్తూనే, పురుషోత్తపట్నం మొదలు పెట్టటం... అప్పుడు ఎంత చెప్పినా, కొంత మందికి వీటి విలువ తెలియలేదు... ఇవాళ కృష్ణా, గోదావరి డెల్టా పచ్చగా ఉన్నా, ఇప్పటకీ పట్టిసీమ దండగ అని అంటూనే ఉన్నారు... నిజానికి పోలవరం పూర్తి అయితే, ఇవి అవసరం ఉండదు.... కాని అటు కేంద్రం గురించి చంద్రబాబుకి తెలుసు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పనికిరాని ప్రతిపక్షం గురించి చంద్రబాబుకి తెలుసు... పోలవరం విషయంలో ఇబ్బందులు ఉంటాయి అని ముందు ఊహించే, పట్టిసీమ కాని, పురుషోత్తపట్నం కాని మొదలు పెట్టారు...

polavaram 01122017 2

ఒక్కసారి పట్టిసీమ లేకపోతే, ఈ రెండు సంవత్సరాలు పరిస్థితి ఏంటో ఆలోచించండి... ఎండిన భూములే కాదు, చివరకి తాగటానికి కూడా నీళ్ళు ఉండేవి కాదు... పోలవరం నిర్మాణంలో, రాజకీయంగా కేంద్రం ఇబ్బంది పెడుతుంది అని చంద్రబాబు ముందే ఊహించి, పట్టిసీమ, పురుషోత్తపట్నం పూర్తి చేశారు... ఇవి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కాబట్టి, నిర్వహణ భారం ఎక్కువ ఉంటుంది, అందుకే పోలవరం త్వరగా పూర్తి చెయ్యటానికి చంద్రబాబు తాపత్రయ పడుతుంటే, ఇన్ని అడ్డంకాలు సృష్టిస్తున్నారు... పట్టిసీమ నీటితోనే కృష్ణా డెల్టా రైతులు ఒడ్డున పడ్డారు... గత ఐదు నెలల నుంచి నిరాఘాటంగా గోదావరి జలాలు ఇస్తుండడంతో సాగునీటి కొరత తీరింది. దీంతో తూర్పు కాలువ పరిధిలోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పొలాల్లో అప్పుడే కోతలు మొదలయ్యాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి కోతల వరకు ఎక్కడా నీటికి ఇబ్బంది లేకపోవడంతో పాటు తుపాన్ల ప్రభావం కూడా లేకపోవడంతో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా దిగుబడి ఇళ్లకు చేరుతోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ మంచి దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం తొణికిసలాడుతోంది...

polavaram 01122017 3

మరి ఇలాంటి, పట్టిసీమ దండగన్న మేధావులు, పోలవరం పై కేంద్ర వైఖరిపై మాట్లాడరే ? కేంద్ర అతి తెలివితేటల వల్ల పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుంది. అదే ఇప్పుడు పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలు లేకపోతే పరిస్థితి ఏంటో విజ్ఞునులు కూడ ఆలోచించాలి... ఇవన్నీ ముందే ఊహించిన ముఖ్యమంత్రి, రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం పూర్తి చేశారు... రాజకీయంగా ఆయనికి ఇబ్బంది అయినా, రైతులకి మేలు చేకూర్చాలని, పోలవరం పూర్తి అయ్యే లోపు, ఇవి రైతులని ఆదుకోవాలనే ఉద్దేశంలో ఈ ప్రాజెక్ట్ లు పూర్తి చేశారు... ఆయనకు అడ్డంకులు లేకుండా సహకరించండి... కొండను కూడా పిండి చేసే సంకల్పం ఆయనకు ఉంది.... లేదు అంటే, మీ ఖర్మ... ఆంధ్రోడి దెబ్బ ఏంటో, మీ పక్కనే ఉన్న సోనియా గాంధీని అడగండి...

ఏపి అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కూడా.. అలాంటి ఈ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే, మిగిలిన వారు ఇబ్బంది పెడుతున్నారు..... నిన్న పోలవరం విషయంలో, కేంద్రం ఇబ్బంది పెట్టిన సంగతి చూశాం... ఇప్పుడు అమరావతి విషయంలో, కొంత మంది అదృశ్య శక్తులు ఆపటానికి చూస్తున్నారు... అమరావతిని అడ్డుకోవటమే ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న కొంత మంది, రాజధాని నిర్మాణం కోసం లోన్ ఇస్తున్న ప్రపంచ బ్యాంకుకి, లోన్ ఇవ్వద్దు అంటూ, లేఖలు రాసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు వీరికి తోడు మరి కొంత మంది ప్రపంచ బ్యాంకుకు మరో లెటర్ రాశారు...

amaravati 01122017 2

"జరగబోయే విపరిణామాలకు మీరే బాధ్యతహించాల్సి ఉంటుంది' అని హెచ్చరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. మేధా పాట్కర్, ప్రపుల్ల సమంత్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఈఏఎస్ శర్మ తోపాటు 46 మంది సామాజిక కార్యకర్తలు "నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్" పేరిట ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు ఇటీవల లేఖ రాశారు. రాజదాని అమరావతికి ఎలాంటి రుణం ఇవ్వద్దు అంటూ లేఖలు రాశారు... నిజానికి వీరి వెనుక మరికొంత మంది అదృశ్య శక్తులు ఉన్నాయి... ఈ అదృశ్య శక్తులు మొదటి నుంచి అమరావతి ఆపటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి...

amaravati 01122017 3

అయితే ఇది వరకు కొంత మంది రాష్ట్రానికి చెందిన వారు రుణం ఇవ్వద్దు అంటూ లేఖలు రాశారు... అది అప్పట్లో సంచలనం అయ్యింది.. అయితే, ప్రపంచ బ్యాంకు బోర్డు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకుండా అమరావతి ప్రాజెక్ట్ కు రుణం మంజూరు చేసేందుకు సుముఖంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా, కొంత మంది వెనుక ఉండి, సామాజిక వేత్తల పేరిట లోన్ రాకుండా, అమరావతిలో భవిష్యత్తులో తలెత్తబోయే విపరిణామాలకు రుణమిచ్చిన సంస్థలుగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ, ప్రపంచ బ్యాంకును హెచ్చరిస్తూ లేఖలు రాశారు... ఒక పక్క కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, రాష్ట్రం లోన్ కోసం వెళ్తుంటే, ఆ లోన్ కూడా రాకుండా, రాష్ట్రంలోని అదృశ్య శక్తులు, ఆ లోన్ రాకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు...

జాతీయ స్థాయి నాయకత్వం మరియు సుధీర్ఘ రాజకీయ అనుభవంతో, జాతీయ స్థాయి ప్రాజెక్టు అయినా... ప్రాజెక్టు రిపోర్టులు తయారు చెయ్యడం, అంచనాలు తయారు చెయ్యడం, డిజైన్లు దశకు వచ్చే సరికి దశాబ్దాలు అవ్వడం, మళ్లీ అంచనాల నుండి మొదలెట్టడం... ఇదే దేశంలో జరిగేది... మధ్యలో ప్రభుత్వాలు మారతాయి.. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకొంటారు. అందుకే, జరిగే జాప్యం తనకు తెలుసు, ఈ వయసులో, తన పని కాదని తెలిసీ.. తనతోనే ఈ పని అవుతుంది అని తెలిసి... ఓ కూలీగా మారాడు.. రాష్ట్ర ఎనిమిది దశాబ్దాల కల పోలవరాన్ని తన చేతుల మీద.. తన రాజకీయ జీవిత కానుకగా ఇద్దామనుకొని చంద్రబాబు గారు.. కాని 2010 వరకు 2932 కోట్లు వ్యయ అంచనాగా వున్న భూసేకరణ భారం.. ఈరోజు 10 రెట్లకు పైగా పెరిగి 33858 కోట్లుగా పెరిగింది కొండలా.. అయినా దిగాక లోతు చలి చూసి విదుల్చుకొని వెళ్లిపోయే కూలీ కాదు బాబు గారు... విభజనతో నెత్తిన పెట్టిన అప్పులు లోటు బడ్జెట్... అన్నదాతలకు అందించాల్సిన రుణమాఫీ... అయినా సర్దాడు ఏడువేల కోట్లకు పైగా... కూలీ దగ్గర లెక్క చెప్పించుకొని.. తొమ్మిది విడతలుగా ఇచ్చింది నాలుగు వేల కోట్లు... అందులో ఓ విడత కూలీ మనసు ఎంత నొచ్చుకొంటుందో... అనే కనీస స్పృహ లేకుండా ఒకటిన్నర కోటి విదిల్చింది కేంద్రం... అవమానం ఆక్రోశం పరీక్ష సహనం నశించే... సుధీర్ఘ అనుభవ నాయకుడు గా కాకుండా... రాష్ట్ర కూలీ కాబట్టి భరించాడు... ఇంకా సర్దిందే రావాల్సింది మూడువేల కోట్లకు పైగా.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఓ ప్రాజెక్టు దగ్గరకి వెళ్లని విధంగా, చలి ఎండ వాన కాలాలు చూడని కూలీగా, 24 సార్లు వెళ్లాడు... బురదలో నడుచుకొని వెళ్లాడు... ఆసరాతో ఎత్తులకు వెళ్లి పరిశీలించాడు...

అయినా ఏ పనిలో వున్నా మనసంతా అక్కడే వున్నప్పుడు, తను పనిచేసే చోటునుండే 50 సార్లకు పైగా వర్చువల్ ఇన్స్‌పెక్షన్ చేసాడు... ప్రత్యర్థులు యజమానులు గుండెను త్రవ్వుతున్నా, పని మీద మనసు పెట్టిన పోలవరం కూలీ, హెడ్‌వర్క్స్ 61% కుడి ప్రధాన కాలువ 99%, ఎడమ ప్రధాన కాలువ 88% మట్టిని ఎత్తి పోయించాడు... కాంక్రీట్ దిమ్మెతో కొడితే ఎంత నొప్పి వస్తుందో, అన్ని సూటి పోటి మాటలు భరిస్తూ, హెడ్‌వర్క్స్ 10% కుడి ప్రధాన కాలువ 83%, ఎడమ ప్రధాన కాలువ 47% కాంక్రీట్ పనులను, కాంక్రీట్ గుండెతో కూలీ పూర్తి చేసాడు... సిమెంటు నిర్మాణాలు 284 పూర్తి అయ్యి, 173 పురోగతిలో పెట్టి చేతిలో చేయాల్సింది, 270 పెట్టుకొని వున్నాడు కూలీ... మధ్యలో కాంట్రాక్టర్ ను మార్చం నుండి, చాలా కథలు వినిపిస్తున్నా, ఆత్మలు, ఊసరవల్లులు, మాటలతో ఎంత హింసిస్తున్నా సహనం కోల్పోక, ఓ కూలీగా సహిస్తోంది రాష్ట్ర బృహత్తర కార్యం కోసం... తనకన్నా చిన్న వాడు అయినా, మనసులో ఏ అంతరాయాలు పెట్టుకోకుండా, ఆయనింటికే వెళ్లి పోలవరం అవాంతరాలను, అంగాలార్చి వచ్చాడు తనకు తాను, కూలీగా అనుకోబట్టే... నాటకం లో కృష్ణ పాత్రధారులను మార్చినట్టు, పనులకు ఎన్నెన్నో కమిటీలు కమిట్మెంట్ కూలీ దిగుమతయ్యే ప్రతి కమిటీకీ, సమాధానాలు చెబుతూ, చేసుకొంటూ పోతున్నాడు శ్రద్దతో... చేతగాని ప్రత్యర్థుల తాటాకుల శబ్దాలకు, బెదిరే కూలీ కాదు... ఎందుకంటే ఆయన గుండెల్లో, రాష్ట్ర పచ్చదనం ఆశ శబ్దం చేస్తోంది... (చాకిరేవు బ్లాగ్ సౌజన్యంతో)

మెత్తగా ఉంటే మొత్త బుద్దేస్తుందంట! అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగాడు..! మోడీ గారు అత్యంత విశ్వసనీయ మైన ఎన్డీయే భాగస్వామిని ముప్పుతిప్పలు పెడుతున్నారు...ఆటంకాలు,,అడ్డంకులు,,లోకల్ లీడర్ల అర్దం లేని విమర్శలు... అన్నీ భరించి,,సహించి,,ఓర్పుగా,,నేర్పుగా నెట్టుకొచ్చారు...పోలవరం దగ్గర కొచ్చేసరికి ఆయన ఇంక సహనం కోల్పోతున్నారు... ఆయన పని ఆయన్ని చేసుకోనివ్వకుండా..కెలికి..కెలికి..కెలికి..ఆయన్ని విసిగించారు...ఇబ్బంది పెట్టారు..రాజకీయంగా ఆయన మేరునగధీరుడు ...ఆయన మీకంటే ఉన్నత స్దాయి రాజకీయవేత్త..ఎంత ఉన్నతుడంటే ...తలెత్తి ఆయన వంక చూస్తే ..మెడలు నొప్పి పెడతాయి...మీకు భయం..అభద్రత..అనుమానం..ఈ అవలక్షణాలు తో తెగతెంపులవరకు తెచ్చేసుకుంటున్నారు.... మోదీ గారు చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు...అసలు మీకు ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటే ఈయనే!చంద్రబాబు మీ పక్షాన ఉండగా గుండెలమీద చెయ్యేసుకుని అడిగినవి, అడగనివి ఇచ్చి రాష్ట్రానికి మేలు చేసి తద్వారా అయినా మీరు బలపడాల్సింది పోయి...సమాధి లోంచి కాంగ్రెస్ సైతాను ని నిద్రలేపుతున్నారు....పోలవరంలో సిగపట్లు వద్దు, బాబు భరిస్తారు మాకోసం... కానీ ఆయనను బాధపెట్టడానికి, రాష్ట్ర వినాశనానికి తెగబడితే, ఆయన బాధపడతారు... ఆయన బాధపడితే, రాష్ట్రం బాధపడుతుంది ఎన్నికల ఫలితాల వరకు ఎరుకవ్వదు... ఆంధ్రుడు ఆగ్రహిస్తే, ఎంతటి బోసడీకె ‘చెయ్యి’ని అయ్యినా, భస్మాసుర ‘హస్తం’గా మారుస్తారని... రాజకీయాలలో హత్యలుండవు...ఆత్మహత్యలే!

ముఖ్యమంత్రి అవ్వటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’ చేస్తుంటే, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మళ్ళీ సీట్ పొందటం కోసం, కూడా తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో నగరి వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. గాలేరు- నగరి ప్రాజెక్టు సాధనకై రోజా ఈ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించి గురువారానికి రెండు రోజులు పూర్తయింది. అయితే పాదయాత్రలో ఆమె రెండు కాళ్లకు బొబ్బలు వచ్చాయి.

roja 01122017 2

అయితే, రోజా మాత్రం పాదయత్రలో చిత్తసుద్ధిగా నడిచి ప్రజలు కష్టాలు తెలుసుకోవాల్సింది పోయి, ఫోటోలు, వీడియోలు కోసం ఎక్కువగా పాకులాడుతున్నారు... క్రింద వీడియోలో చూడవచ్చు... వీడియోకి అడ్డుగా ఉన్నారు అని, ప్రజలను పక్కకు జరగమన్నారు... అంతే కాదు, అక్కడ వీడియో కెమెరామెన్ ను, తన కాళ్ళ వైపు కెమెరా పెట్టి చూపించమంటున్నారు... ఇందంతా ఎందుకో ఆవిడకే తెలియాలి... ప్రజల కోసం పాదయాత్ర అంటూ, నా పదాలు ఫోటో తియ్యండి, నేను నడిచేప్పుడు, నా కాళ్ళు చూపించండి అని మీడియా వాళ్ళని పాకులాడటం చూస్తుంటే, రోజాకి ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధమవుతుంది...

roja 01122017 3

అయితే, ఇలా చెయ్యటానికి కారణాలు లేకపోలేదు... ఇలా తీసిన వీడియోలు, ఫోటోలు జగన్ మోహన్ రెడ్డికి, ప్రశాంత్ కిషోర్ టీంకి రొజూ సాయంత్రం పంపిస్తున్నారు... నేను ఎంతో కష్టపడుతున్నా అనే అభిప్రాయం కలగచేస్తున్నారు... అలాగే ఇలాంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి, సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు... కాని ప్రజలు పిచ్చోళ్ళు కాదు అనే విషయం వీరికి ఎప్పటికి అర్ధం అవుతుందో... ఏదైనా చిత్తశుద్దితో చేసుకుంటూ పొతే, రిజల్ట్ అదే వస్తుంది... కాని, ఇలాంటి సెల్ఫ్ మేడ్ ప్రమోషన్స్ ప్రజలను పిచ్చోల్లని చేద్దాం అనుకుంటే, ప్రజలు మనలని పిచ్చోల్లని చేస్తారు...

Advertisements

Latest Articles

Most Read