ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ, ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న జగన్ కు, దేశంలోనే టాప్ 10 జాబితాలో ప్లేస్ దొరికింది... దీంతో ఇవాళ పాదయాత్రలో సంబరాలు చేసుకుంటారేమో అని ప్రత్యర్ధి పార్టీలు అంటున్నాయి.... ఇంతకీ జగన్, దేంట్లో టాప్ 10 లిస్టు లో ఉన్నారా అని ఆలోచిస్తున్నారా ? ఇంకా దేంట్లో ఉంటారు, ఆయనకు ఆరి తేరిన విద్యలోనే... ఈడీ (Enforcement Directorate) ఇచ్చిన జాబితాలో, నల్లధనంను తెల్లధనంగా మార్చుకోవటం కోసం నకిలీ కంపెనీలు సృష్టించిన వారి లిస్టు తీస్తే, దేశంలోనే టాప్ 10మందిలో, మన ప్రతిపక్ష నేతకు ప్లేస్ ఇచ్చింది Enforcement Directorate... ఈ విషయం, ఇవాళ టైమ్స్ అఫ్ ఇండియా పేపర్ లో కధనం వచ్చింది...
జగన్ మొత్తం 31 షెల్ కంపెనీలతో, రూ.368 కోట్లు మనీలాండరింగ్‌కి పాల్పడి, ఆ టాప్ 10 లిస్టులో పేరు సంపాదించుకున్నారు... ఈ టాప్ జాబితాలో కంపెనీలు ఉండగా, రాయకీయ నాయకుల్లో జగన్ ఉన్నారు... జగన్ తో పాటు, మరో NCP నేత కూడా ఈ లిస్టులో ఉన్నారు... అక్రమాస్తుల కేసులో.. వైసీపీ అధినేత జగన్ ఆస్తులను, ఇప్పటికే చాలా ఆస్తులు ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే...
చివరకి హైదరాబాద్ లోటన్ పాండ్ కూడా, ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే... జగన్‌కు సంబంధించి ఇంతకు ముందు దఫదఫాలుగా సుమారు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువ పైనే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగనపై నమోదైన అభియోగాలు హైదరాబాద్ కోర్టులో రుజువైతే అటాచ్ చేసిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఆవినీతి మీద యుద్ధం చేస్తా, అవినీతి పరులని జైలుకి పంపిస్తా అన్న జగన్, దీని మీద ఏమి సమాధానం చెప్తారో...