కాపులకు రిజర్వేషన్ అంటూ హడావిడి చేస్తున్న ముద్రగడ, మరో మారు చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, మరో తిక్క కోరికతో ముందుకు వచ్చారు... చంద్రబాబు కాపులకి రిజర్వేషన్ ఇచ్చేస్తున్నారు అన్న సమాచారం ఉండటంతో, అది జరిగితే తనను ఇంకా ఎవరూ పట్టించుకోరు అనే ఉద్దేశంతో మరో ఇబ్బంది పెట్టటానికి రెడీ అయ్యారు ముద్రగడ... కాపులని బిసిలలో చేరుస్తున్నారు బాగానే ఉంది కాని, బీసీల్లో ఉన్న కేటగిరీల్లో భాగంగా కాకుండా.. తమకు ప్రత్యేకంగా ఒక కేటగిరీ క్రియేట్ చేసి రక్షణ ఇవ్వాలని ఆయన అంటున్నారు...

mudragada 24112017 2

ఇలాంటి కోరిక కోసం, MRPSఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ, ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్నారు... దీనికి అన్ని పార్టీలు ఒప్పుకున్నా, కొన్ని ఇబ్బందులు వల్ల, ఇది కుదరటం లేదు.. ఇప్పుడు ముద్రగడ కూడా అలాంటి కోరికతోనే ఇప్పుడు ముందుకువచ్చారు... ఒక పక్క, కాపులని బీసీలలో చేర్పించవద్దు అంటూ కొన్ని రాజకీయ పార్టీల, బీసీ సంఘాలు ముసుగులో ఆందోళన చేస్తున్నాయి... మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, కాపులని బీసి లకు ఇబ్బంది లేకుండా, రిజర్వేషన్ కల్పించటానికి కసరత్తు చేస్తుంది... మరో నెల రెండు నెలల్లోనే ఈ నిర్ణయం రానుంది...

mudragada 24112017 3

దీని మీద స్పష్టమైన సమాచారం ఉన్న ముద్రగడ, ఇప్పుడు మరో పిచ్చి కోరికతో ముందుకు వస్తున్నారు... ముద్రగడ కోరిక చుసిన తరువాత, చంద్రబాబు కనుక కాపులకు రిజర్వేషన్ ఇస్తే, ఇక తన పని అయిపోయినట్టే అని, తనని నమ్ముకున్న జగన్ నట్టేట మునుగుతాడని, అందుకే ముద్రగడ ఈ కొత్త డ్రామాకు తెర లేపారని, ఈయన నిజంగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడా లేక వాటిని అడ్డుకోవడం ద్వారా ఎవరికో మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాడా అని కాపులలో కూడా ఆందోళన మొదలైంది... తన రాజకీయ పబ్బం కోసం, మమ్మల్ని బలి చేసే ప్రయత్నం ఎదో జరుగుతుంది అని కాపులు గ్రహిస్తున్నారు... ఇలాంటి జటిలమైన సమస్య పరిష్కార దశలో ఉన్న సమయంలో, ముద్రగడ ఇలా చెయ్యటంతో, ఆయన నైజం బయట పడింది అని, జాతి కోసం కాకుండా, జగన్ కోసమే ముద్రగడ పని చేస్తున్నారని అంటున్నారు...

ఒక పక్క జగన్ నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ, ఊరు ఊరు తిరుగుతుంటే, మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చెయ్యటానికి అభ్యర్ధులే కరువు అవుతున్నారు... జగన్ పరిస్థితి ఎంత దారుణం అంటే, కృష్ణా జిల్లా లాంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లలో, కీలకమైన గన్నవరం నియోజకవర్గంలో, వైసిపి తరుపున నిలబడటానికి నాయకులు లేక జగన్ పార్టీ ఇబ్బంది పడుతుంది... 2019 ఇంకో ఏడాదిన్నర కాలంలో ఉండగా పార్టీనే అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతోంది.... గన్నవరంలో వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఇప్పటిదాకా దుట్టా రామచంద్రరావు... 2014 లో, వల్లభనేని వంశీ పై పోటీ చేసి ఓడిపోయారు.

jagan 24112017 2

ఓడిపోయినా సరే, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు... ఏమైందో ఏమో కాని, హఠాత్తుగా ఈ మధ్య పార్టీకి దూరామై, తాజాగా గన్నవరంలో కూడా తనకి పోటీ చేసే ఉద్దేశం లేదని, ఇంకో అభ్యర్థి ని చూసుకోవాలని జగన్ కి చెప్పారు... పైకి మాత్రం, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, 2019 లో గెలుపు మీద నమ్మకం లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు... ఒక పక్క వంశీ బలమైన అబ్యార్ధిగా ఎదగటం, మరో పక్క ప్రభుత్వం గన్నవరం నియోజకవరాగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యటంతో, తెలుగుదేశం తరుపున నుంచునే అభ్యర్ధి మాత్రమే గెలుపొందే అవకాశాలు ఉండటంతో, దుట్టా ఈ నిర్ణయం తీసుకున్నారు...

jagan 24112017 3

దీంతో జగన్, కొత్త అబ్యార్ది కోసం వెతుకుతూ, గన్నవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కొత్త పదవి యార్లగడ్డ వెంకట్రావును నియమించారు... యార్లగడ్డ వెంకట్రావు, ఇప్పటి వరకు పెన‌మ‌లూరు సీటు కోసం ప్రయత్నించి, అక్కడ ఒక ట్రస్ట్ పెట్టి, పని చేస్తూ వస్తున్నారు... ఇప్పుడు ఆర్థిక‌, సామాజిక బ‌లం బేరీజు వేసుకుని, జగన్, వంశీ పై యార్లగడ్డ వెంకట్రావును దింపారు... కాని, స్థానికేతరుడైన యార్లగడ్డ వెంకట్రావును ప్రజలు ఆదరిస్తారా అనేది చూడాలి... నిజానికి పోయిన సారి అభ్యర్ధిగా నుంచున్న దుట్టా రామచంద్రరావుకు, క్లీన్ ఇమేజ్ ఉంది.. నియోజకవర్గంలో మంచి వ్యక్తిగా, మంచి డాక్టర్ గా పేరు ఉంది... జగన్ ఇమేజ్ కంటే, ఈయన సొంత ఇమేజ్ తోనే పోయిన సారి ఓట్లు వచ్చాయి... ఈ సారి, యార్లగడ్డ వెంకట్రావు అబ్యార్ధిగా నుంచుంటే, ఆ ఇమేజ్ కూడా ఉండదు...ఈయన కొత్త వారు, జగన్ ఇమేజ్ సంగతి సరే సరి... ఇది కృష్ణా జిల్లా లాంటి కీలకమైన చోట, జగన్ పార్టీ పరిస్థితి... ఇక అనుకోకుండా డెలిమిటేషన్ కూడా జరిగితే 225 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం కూడా వైసీపీ కి కత్తి మీద సామే అవుతుంది.

నవ్యాంధ్ర రాజధాని ఏర్పడిన తరువాత విజయవాడకు ఎక్కడలేని మహర్దశ వచ్చిందనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం గుణదలలో విద్యుత్ సౌధను అందంగా నిర్మించారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లకు చెందిన రాష్ట్రస్థాయి విభాగాలన్నీ ఈ భవనంలో పనిచేస్తున్నాయి. ఈ భవనం ఏలూరు రోడ్డులోని రామవరప్పాడు వద్ద పవర్ హౌస్ సమీపంలో ఉంది. అయితే తాజాగా బందర్ రోడ్డులోని కీలకమైన ప్రదేశంలో (డీటీసీ కార్యాలయం పక్కన) రోడ్డుకు పక్కగా ఒ అందమై భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో అన్ని హంగులను వేగంగా ఏర్పాటు చేశారు. ఆర్ అండ్ బీ రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఈ భవనంలో ఉండనున్నాయి. రాత్రి వేళ ఈ భవనాన్ని చూస్తే పారిస్ భవనాలు గుర్తుకొస్తాయి. రంగులు మార్చుకుంటూ తళుక్కుమంటున్న విద్యుద్దీప కాంతులతో ఈ భవనం జిగేల్ మంటున్నది. గ్రీనరీతోపాటు ఇక్కడే ఒక పౌంటెన్ను కూడా భవనం ముందు ఏర్పాటు చేశారు.

r and b 23112017 2

ఈ భవనాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రారంభించనున్నారు. ప్రధాన కార్యాలయంలోని అన్ని శాఖలను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు బందరు రోడ్డులో సుమారు 3.5 ఎకరాల్లో 2.70 లక్షల విస్తీర్ణంలో రూ.101 కోట్ల వ్యయంతో జీ+5 భవనం నిర్మించారు. హైదరాబాద్ కు చెందిన ఒకప్రైవేటు సంస్థకు భవన నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా ఈ బహుళ అంతస్తుల భవనం బందరు రోడు పై నిర్మిస్తుండడంతో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని భావించి, భవన నిర్మాణానికి అవసరమైన బీమ్, పిల్లర్లు, స్లాబ్ కు సంబంధించిన మెటీరియల్ అంతా బయటే తయారు చేసి తీసుకువచ్చారు..

r and b 23112017 3

ప్రీ కాస్ట్‌ విధానంలో నిర్మాణం వేగవంతంగా ఈ భవనం పూర్తయ్యింది... ప్రతి అంతస్తులో... ఒకేసారి 200 మంది వరకు అధికారులతో భేటీ అయ్యేలా సమావేశ మందిరాలు, 100 మందితో భేటీలు నిర్వహించే మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ను నిర్మించారు. వీడియో కాన్ఫరెన్స్‌లకోసం ప్రత్యేకంగా భారీ మందిరం ఉంటుంది. మొత్తంగా ఈ భవనంలో ఆర్‌ అండ్‌ బీ తో పాటు మరో 10 శాఖలు కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉంటాయి.

అనంతపురం జిల్లా పెనుగొండలోని ఎర్రమంచి గ్రామం దగ్గర, దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్ తమ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని శరవేగంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే... మొన్నటి దాకా ఊరూపేరూ లేని ఓ చిన్న ఊరు ఇది. ఇవాళ ఇక్కడ 587 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అనంతపూర్ జిల్లాకి సిరులు అందించబోతున్న ఒక అద్భుతం ఆవిష్కృతమవుతోంది. కియా మోటర్స్. యుద్ధ ప్రాతిపదికన కియా పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. ఇదే విషయం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వస్తుంది...

kia 23112017 2

ఇంటర్నేషనల్ మీడియాలో కూడా, మన అనంతపూర్ కియా గురించి చెప్తున్నారు... కియా మోటార్స్ రూ.13వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతోంది.. ఇది దేశంలోనే అతి పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్... ఈ ప్లాంటు వలన 11వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి... కొరియా నుంచి తెప్పించిన సామగ్రితో తాత్కాలిక పరిపాలన భవనాన్ని నిర్మిస్తున్నారు. కార్లకు వాడే పెయింట్‌ నిల్వ కోసం పెద్దఎత్తున గుంతలు తీసి కాంక్రీటుతో నిర్మాణాలు చేస్తున్నారు. బాడీ షాప్‌ కాంక్రీటు పనులు కూడా మొదలయ్యాయి. రోజుకు 68 లక్షల లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంటు నిర్మాణమూ జరుగుతోంది...

kia 23112017 3

కియ ప్లాంటులో పని చేస్తున్న, చేయనున్న కొరియా అధికారులు, సిబ్బంది కోసం... ఇక్కడే 30 ఎకరాల్లో పూర్తిగా వారి శైలిలో ప్రత్యేక టౌన్‌ షిప్‌ నిర్మిస్తున్నారు.ఇక్కడ కొరియా ఆహార పదార్థాలను వండి వడ్డించేందుకు క్యాంటీన్‌ కూడా సిద్ధమవుతోంది. దానికి అనుకునే... 12 ఎకరాల్లో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి సాధించిన ‘కియ’కు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. అటు... పరిశ్రమ వర్గాలు కూడా అదే స్థాయిలో, శరవేగంగా పనులు సహకరిస్తుండటం విశేషం. ఇక... కియకు అనుబంధంగా రానున్న సంస్థల కోసం 600 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. 2019 నాటికి ఇక్కడ నుంచి, మొదటి కార్ ఉత్పత్తి అవుతుంది... ఒక దార్శనికుడి సంకల్పం, దూరదృష్టి, అకుంఠిత దీక్ష వల్ల ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే ఆటోహబ్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చెందబోతోంది. ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కధనం మీరూ వినండి...

Advertisements

Latest Articles

Most Read