వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఝలక్. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ప్రశంసలు కురిపించారు. సొంత సామాజిక వర్గం ఎమ్మల్యే ఇలా చెయ్యటంతో అందరూ అవాక్కయ్యారు... ఒక పక్క, గిడ్డి ఈశ్వరితో పాటు మరో ముగ్గురు ఉత్తరాంధ్ర ఎమ్మల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అని వార్తలు వస్తున్న తరుణంలో, ఇప్పుడు రాయలసీమ ఎమ్మల్యే జగన్ కు ఝలక్ ఇచ్చారు...

jagan 25112017 1

కర్నూల్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబును మెచ్చుకుంటూ, వైఎస్ఆర్ పరిపాలన పై విమర్శలు చేశారు . ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాన్న మెచ్చుకున్నారు. ఎస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు కూలిపోతున్నాయన్నారు. కానీ తాజాగా టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జీప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం చాలా బాగుందని వైసీపీ ఎమ్మెల్యే కితాబిచ్చారు.

jagan 25112017 1

అయితే ఈ ఎమ్మల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అని వార్తలు వస్తే, వాటిని ఖండించారు... టీడీపీలో చేరితో భారీ మొత్తం ఇస్తామని అధికార పార్టీ నేతలు ఆఫర్ చేశారని గత ఏడాది సాయిప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను, తన సోదరుడు ప్రలోభాలకు లొంగే వ్యక్తులం కాదన్నారు... తాజాగా, ఇలా మాట్లాడటం జగన్ ను ఇబ్బంది పెట్టే అంశం... జగన్ కర్నూల్ లో పాదయాత్ర చేస్తూ, చంద్రబాబు ఏమి చెయ్యట్లేదు అని ప్రచారం చేస్తుంటే, సొంత పార్టీకి చెందిన ఎమ్మల్యే మాత్రం, చంద్రబాబు పరిపాలనను మెచ్చుకుంటున్నారు....

పాపం ఈ కేరళా వాళ్లకి, చంద్రబాబుకి కులం ఆపాదించటం తెలీదు, చంద్రబాబు సైకిల్ పార్టీ వాడని తెలీదు.... కాని చంద్రబాబు విజన్ తెలుసు, చంద్రబాబు సమర్ధత తెలుసు, చంద్రబాబు ఈ దేశంలో గౌరవించదగ్గ నాయకుడు అని మాత్రమే తెలుసు... అందుకే గౌరవార్ధం చంద్రబాబు పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు... కేరళ సూపర్ స్టార్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపీ మన ముఖ్యమంత్రికి ఇచ్చిన గౌరవం ఇది... అంతె కాదు మన అమరావతిని, పొగిడారు కూడా...

cbn gopi 24112017 2

ఇవాళ మలయాళ హీరో సురేష్ గోపి అమరావతి వచ్చారు... వెలగపూడి సచివాలయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబుటి భేటి అయ్యారు.. కేరళలో జరిగే జాతీయ బానానా ఫెస్టివల్ కు సియం చంద్రబాబు ఆహ్వనించారు హీరో సురేష్ గోపి.. 2018 ఫిభ్రవరి 17 నుండి 21వరకు తన సొంత గ్రామం కల్లియార్ గ్రామం త్రివేండ్రంలో జరుగుతున్నందున తప్పకుండా రావాలని చంద్రబాబును కోరారు... ఈ ఫెస్టివల్ కు జాతీయ స్థాయిలో విద్యార్థులు, శాస్త్రవేతలు,అరటి రైతులు పాల్గుంటున్నారని చెప్పారు... కల్లియార్ గ్రామ పంచాయతీ, కేంద్ర, రాష్ట్ర సంస్థల భాగస్వామ్యంతో సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ సోషల్‌ యాక్షన్‌(సీఐఎస్‌ఎస్‌ఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది...

cbn gopi 24112017 3

దేశంలో అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది... ఇందుకోసమే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పాల్గన్నాలని ఆహ్వానించటానికి ఇక్కడ వరకు వచ్చానని చంద్రబాబుతో చెప్పారు... ఈ ఫెస్టివల్ లో 457రకాల అరటి ఉత్పత్తులు ప్రదర్శనకు రానున్నాయని చంద్రబాబుకి వివరించారు... మొదటిసారిగా అమరావతికి రావడం చాలా ఆనందంగా ఉందని, అమరావతి చూడటానికి ప్రకృతి వనంలా ఉందని, మలయాళ హీరో సురేష్ గోపి అన్నారు... అయితే సురేష్ గోపి, వెళ్ళేటప్పుడు, గౌరవార్ధం చంద్రబాబు పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు...

మంగళగిరి ఆటోనగర్ లో 2 ఐటీ సంస్ధలకు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు... అక్షర ఎంటర్ ప్రైజస్, కేజే సిస్టమ్స్ భూమిపూజ కార్యక్రమాల్లో లోకేశ్ పాల్గున్నారు. మంగళగిరి ఐటి పార్క్ మధ్య, చిన్న తరగతి కంపెనీలకు వేదిక కాబోతుందని లోకేష్ అన్నారు.. మంగళగిరి ఐటి పార్క్ లో 10 వేల ఉద్యోగాలు రాబోతున్నాయని, అమరావతిలో ఐటి రంగం అభివృద్ధి కి ముఖ్యమంత్రి  200 ఎకరాలు కేటాయించారని చెప్పారు..  2014 రాష్ట్ర విభజన జరిగిన నాటికి మనకి రాజధాని కూడా లేదు, పరిపాలన ఎక్కడ నుండి ప్రారంభించాలో కూడా తెలియని పరిస్థితి కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని లోకేష్ చెప్పారు. సాదారణ ఐటి కంపెనీలు కాకుండా ఫింటెక్,బ్లాక్ చైన్ టెక్నాలజీ,సైబర్ సెక్యూరిటి సేవలు అందిస్తున్న కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నామని చెప్పారు...

mangalagiri 24112017 2

6 నెలల్లోనే సచివాలయం నిర్మించుకున్నాం, విభజన జరిగిన తరువాత ఐటి రంగం మొత్తం హైదరాబాద్ లోనే ఉంది, అప్పటికి కేవలం కొన్ని చిన్న ఐటి కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, పోయిన మూడు ఏళ్లలో ముఖ్యమంత్రి గారి కష్టం వలన అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని లోకేష్ చెప్పారు... లోకేష్ మాట్లాడుతూ, మంత్రి అయ్యిన వెంటనే ఐటిలో 2019 కి లక్ష ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాను 2019 కి ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు...

mangalagiri 24112017 3

ఐటి రంగంలో కేవలం పెద్ద కంపెనీలే కాదు మధ్య,చిన్న తరగతి కంపెనీలు కూడా ముఖ్యమని చెప్పారు... ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉందన్నారు.. అందుకే కియా,హోండా,అపోలో టైర్స్ లాంటి కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. రాష్ట్ర విభజన సమయానికి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మన రాష్ట్రంలో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదని, కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఫోన్లు మన రాష్ట్రంలోనే తయారు అవుతున్నాయన్నారు. 2019 నాటికి దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 5 ఫోన్లు మన రాష్ట్రంలోనే తయారు చేసేలా ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని అభివృద్ధి చెయ్యబోతున్నామని చెప్పారు..

నవ్యాంధ్ర రాజధానిలోని మందడం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో వర్చువల్ క్లాస్‌రూమ్‌‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు. వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. వర్చువల్ క్లాస్‌రూమ్‌‌ల ఏర్పాటుపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం ఆన్ లైన్ ద్వారా 20 పాఠశాలల విద్యార్థులకు స్వయంగా డిజిటల్ పాఠాలు బోధించారు. 40 స్టూడియోల ఏర్పాటు చేసి ఒక్కొక్క స్టూడియోలో 10మంది సబ్జెక్టు నిపుణులు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఉంటారని తెలియజేశారు.

cbn class 24112017 2

దాదాపు 5 వేల పాఠశాలలను డిజిటైజేషన్ కు అనుసంధానం చేస్తున్నామని, దీని వలన విద్యార్థులలో ఆలోచన విధానం, విషయ పరిజ్ఞానం పెరగడంతోపాటు వారికి అర్ధమయ్యే రీతిలో బోధన ఉంటుందని తెలిపారు. ప్రతి పాఠశాలకు 15 ఎంబీపీఎస్ స్పీడుతో ఫైబర్ నెట్ కనెక్షన్, వర్చువల్ క్లాస్‌రూమ్‌ ద్వారా చెప్పే పాఠాలను టీవీ ద్వారా మళ్లీ ప్లే చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం ద్వారా తల్లిదండ్రులు పిల్లల హాజరును స్వయంగా తెలుసుకోవచ్చన్నారు.

రాష్ట్రంలో తొలి వర్చువల్ క్లాస్‌రూమ్‌గా మందడం హైస్కూల్ చరిత్రకెక్కినందున ఫలితాల్లో కూడా ఈ పాఠశాల ముందంజ వేయాలని విద్యార్థులను సీయం కోరారు. ప్రతి పాఠశాలకు ఒక టీవీ. వర్చువల్ క్లాస్‌రూమ్‌ ద్వారా చెప్పే పాఠాలను టీవీ ద్వారా మళ్లీ మళ్లీ ప్లే చేసుకునేందుకు వీలు ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఉపాధ్యాయుడు గంటసేపు చెప్పగలిగే పాఠ్యాంశాన్ని వర్చువల్ క్లాస్ రూమ్ పద్ధతిలో 10 నిమిషాల్లో విద్యార్థి అవగాహన చేసుకునే వీలు ఉంటుంది. మందడం హైస్కూల్‌లో టాయిలెట్లు, ప్రహరీ, విద్యుత్ సదుపాయాలతో పాటు, క్లాస్‌రూమ్స్ రిపేర్లు, ల్యాండ్ స్కేపింగ్‌తో మంచి ఉద్యానవనంగా తీర్చిదిద్ది, ఆటస్థలాన్ని అభివృద్ధి చేసి మందడం స్కూలును ఒక మోడల్ స్కూల్‌గా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు..

Advertisements

Latest Articles

Most Read