చాలా మందికి పదవులు అలంకారం... కొంత మంది వల్ల ఆ పదవలుకే అలంకారం... అలాంటి వారే మన అశోక్ గజపతిరాజు... టీడీపీతో పొత్తు నేపథ్యంలో 2014లో కేంద్రంలో మంత్రి పదవి వచ్చినప్పుడు, పౌర విమానయాన శాఖ లాంటి చెత్త శాఖ ఇచ్చి, రాజు గారిని ఇబ్బంది పెట్టారు అనుకున్నారు... నిజానికి అప్పటికి కేంద్ర పౌర విమానయాన శాఖ పని తీరు అధ్వాన్నంగా ఉండేది... అశోక్ గజపతిరాజు విమానయాన బాధ్యతలు చేపట్టిన తర్వాత దాని రూపు రేఖలను మార్చివేశారు. సామాన్యుడికి విమానప్రయాణానికి పెద్ద పీట వేస్తూ దేశవ్యాప్తంగా 80విమానశ్రయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా చూసుకుంటే, విమానయాన రంగం పదో స్థానంలో ఉండేది. దీనిని ఛాలెంజ్ గా తీసుకున్న రాజుగారు మూడేళ్లలోనే ఆ పరిస్థితిమార్చేసారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2017కి గాను విమానయాన రంగానికి మూడో స్థానం దక్కడం అశోక్ గజపతిరాజు కృషిని చాటుతోంది. విమానయాన రంగంలో ఇంత ఎక్కువ కాలం కొనసాగిన మంత్రి కూడా అశోక్ గజపతి రాజు ఒక్కరే. 42నెలలుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు.
2014 నాటికి దేశంలో 70ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఈ మూడేళ్లలో దేశంలో నిరుపయోగంగా ఉన్న 80 విమానశ్రయాలను ఆయన అందుబాటులోకి తీసుకురాగలిగారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా చిన్న తరహా పట్టణాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేసారు...ఈ విమానశ్రయాల్లో మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. 70ఏళ్లలో జరిగిన ప్రగతి ఒక ఎత్తు అయితే, రాజు గారు ఈ మూడేళ్ల వ్యవధిలో విమానయాన రంగానికి చేసిన కృషి మరో ఎత్తు... ఆంధ్రా వాడి దమ్ము చూపించారు... శభాష్ రాజు గారు...