1997...అప్పట్లో ఐటి అంటే ఒక సంచలనం.... మైక్రోసాఫ్ అధినేత బిల్ గేట్స్ అంటే అమెరికా ప్రెసిడెంట్ లాంటి హోదా కలిగిన వ్యక్తి... సాధారణంగా రాజకీయ నాయకులతో భేటీ కావడం ప్రపంచ శ్రేణి ఐటీ ఐకాన్ ఐన బిల్ గేట్స్ కు ఇష్టం వుండదు... కాని అప్పట్లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆయనతో భేటి కోసం ప్రయత్నించారు... ఐతే వ్యక్తిగతంగా నేతలతో భేటీకి బిల్ గేట్స్ అయిష్టతను వ్యక్తం చేశారంటూ సమాధానం వచ్చింది. అయినప్పటికీ తనదైన శైలిలో పట్టు వదలకుండా ఇతరత్రా మార్గాల ద్వారా కేవలం పది నిమిషాల కోసం చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ సంపాదించారు.

bill gates 17112017 2

బిల్ గేట్స్ మెచ్చేలా అద్భుతమైన ప్రజెంటేషన్ చంద్రబాబునాయుడు ఇచ్చారు. బాబు తీరు ఐటీ దిగ్గజాన్ని కట్టిపడేసింది. ఫలితంగా పదినిమిషాల ఇంటర్వ్యూ కాస్త 45 నిమిషాల పాటు కొనసాగింది. చంద్రబాబునాయుడు చెప్పినదంతా శ్రద్ధగా ఆలకించిన బిల్ గేట్స్ అసలు తన నుంచి ఏమి ఆశిస్తున్నారని సూటిగా అడిగారు... తాను వ్యక్తిగతంగా ఏమీ ఆశించడం లేదని కేవలం మైక్రోసాఫ్ డెవలప్ మెంట్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభించాలని మాత్రమే తాను గట్టిగా కోరుకుంటున్నట్ను చంద్రబాబునాయుడు బదులిచ్చారు. తమ కంపెనీని అమెరికా బయట విస్తరించిన పక్షంలో హైదరాబాద్లో నూరుశాతం మైక్రోసాఫ్ యూనిట్ ను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జరిగింది... మైక్రోసాఫ్ రాకతో, హైదరబాద్ రూపు రేఖలు మారిపోయాయి...

bill gates 17112017 3

ఈ పరిణామాల క్రమంలో రెండు దశాబ్దాల తరువాత, ఈ పాత మిత్రులు మళ్ళీ మన గడ్డ పై కలిసారు... ఈ సారి బిల్ గేట్స్ వస్తుంది సాఫ్ట్ వేర్ విప్లవానికి కాదు, వ్యవసాయం గతి మార్చటానికి వస్తున్నారు (ఏటి - అగ్రికల్చర్ టెక్నాలజీ)... విశాఖ వేదికగా ఏపీఐసీసీ మైదానంలో జరుగుతున్న 'ఏపీ అగ్రిటెక్‌ సమ్మిట్‌- 2017'లో పాల్గున్నారు... రైతులను సాంకేతికంగా ముందంజలో నిలిపి, వారి జీవితాల్లో మార్పు తేవాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, బిల్ గేట్స్ సంపూర్ణ సహకారం అందించాలి అని ఆశిద్దాం...

33 వేలు ఎకరాలు మన కలల రాజధాని కోసం త్యాగం చేసారు వారు... వారికి అన్ని విధాలుగా అండగా ఉండాల్సింది పోయి, వారి సమస్యలు ప్రభుత్వంతో పోరాడాల్సింది పోయి, మన రాష్ట్రంలో అసుర జాతి, వారికి అడుగడుగునా అడ్డం పడ్డారు... వారికి భవిష్యత్తు మీద నమ్మకం లేకుండా చేస్తున్నారు... వారికి మానిసిక ప్రశాంతత లేకుండా, రాక్షస పత్రికలు, టీవీల్లో సైకో కధనాలు వేస్తూ, సాడిస్ట్ లు లాగా ఆనందం పొందారు... ఇంత చేసినా వారు కేవలం ఒకే ఒక్క వ్యక్తిని నమ్మారు... ఆయనే మన ముఖ్యమంత్రి.... ఒక్క ఆందోళన లేకుండా 33 వేలు ఎకరాలు ఆయన చేతిలో పెట్టారు... ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదు... అది ఒక నాయకుడు మీద, ప్రజలకు ఉన్న నమ్మకం...

amaravati farmers 17112017 2

అందుకే ఈ అసుర జాతి రూట్ మార్చింది... రైతులని రెచ్చగొట్టి ఏమి చెయ్యలేమని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టలేమని అలోచించి, అసత్య ప్రచారాలు చేసింది... కోర్ట్ లో కేసులు వేసి లేట్ చేస్తుంది... సహాయం చేసే వారికి దొంగ ఈమెయిల్స్ పంపింది... వారి దొంగ చానల్స్, దొంగ పేపర్ లో, అమరావతి పరువు తీసుతూ, లూస్ సాయిల్ అని, బూకంపాలు అని, కొండవీటి వాగుతో వరదలు అని, ఇలా అన్ని రకాలుగా దొంగ ప్రచారాలు చేసింది... చివరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసింది...

amaravati farmers 17112017 3

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సత విధాలుగా అమరావతిని ఆపటానికి ప్రయత్నాలు చేసింది... వీరి మాట వినకుండా, ప్రభుత్వానికి 33 వేలు ఎకరాలు ఇచ్చిన రైతుల జీవితాలు నాశనం చెయ్యాలని ప్లాన్ వేసింది... అయితే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీరి మాటలు వినలేదు... అమరావతి అన్నదాతల త్యాగం ఫలం గెలిచింది... రాక్షసులు ఓడిపోయారని తెలుసుకున్న రాజధాని రైతులు సంబరాలు చేసుకున్నారు.. స్వీట్లు పంచుకుంటూ, టపాకాయలు కాలుస్తూ ఈ అసురల ఆటలు సాగావ్ అంటూ, పండగ చేసుకున్నారు...

నిన్న రాష్ట్ర మంత్రులు, శాసనమండలి, శాసనసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ముందుగా పట్టిసీమ దగ్గరకు వెళ్లారు... పట్టిసీమను తిలకించి మహాద్భుతంగా అభివర్ణించారు... అక్కడకు వెళ్ళిన రాయలసీమ ఎమ్మల్యేలు పట్టిసీమ పరవళ్ళు చూసి భావోద్వేగానికి లోనయ్యారు... ఈ నీరే లేకపోతే, మా రాయలసీమకు చుక్క నీరు ఉండేది కాదు అంటూ, గోదారమ్మకు దండం పెట్టారు... కొంత మంది ఎమ్మల్యేలు చాలా ఎమోషన్ అయ్యారు... పట్టిసీమ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే భయం వేస్తుంది అన్నారు...

pattiseema 17112017 2

గోదావరి జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది అని రాయలసీమ ఎమ్మల్యేలు అన్నారు... గోదావరి జలాలతో రాయలసీమ సస్యశ్యామలమవుతోంది, సీమ ప్రజల జీవితాలు బాగుపడ్డాయి, రాయలసీమను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం చంద్రబాబుది అంటూ వాళ్ళ అనుభూతులు పంచుకున్నారు... పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సీమకు పూర్తిగా సాగు నీరిస్తాం అనే ధీమా వచ్చింది అన్నారు... గోదావరి నుంచి పంపుల ద్వారా నీరు తోడి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న తీరు స్వయంగా చూశారు. ముఖ్యంగా రాయలసీమ ఎమ్మెల్యేలు అత్యంత ఆసక్తిగా చూశారు. నీటి సరఫరా వ్యవస్థను ఆమూలాగ్రం తిలకించారు.. ఈ పథకం విలువేమిటో తెలిసిందని ప్రజాప్రతినిధులు అన్నారు.

pattiseema 17112017 3

తరువాత పోలవరం పనుల జోరు చూసి మురిసిపోయారు. కాంక్రీట్‌ పనులు, గ్రౌటింగ్‌.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం పనులు ముమ్మరంగా సాగుతుండడం చూసి హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ‘మహాద్భుతం. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్ప బలంతోనే పట్టిసీమ పూర్తయింది. దీనిని చూడడానికి రెండు కళ్లూ చాలలేదు అన్నారు... దారి పొడవునా పచ్చటి వరి చేలను చూసి కొందరు ప్రజాప్రతినిధులు అబ్బురపడ్డారు. నేల మీద పచ్చటి పరదా వేసినట్లు అన్ని చోట్లా కనిపించిందని.. ఈ మధ్యకాలంలో ఇంతలా ప్రకృతిని ఆస్వాదించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు....

అమరావతి అంటేనే మరణం లేనిది.... ఇలాంటి అమరావతి నిర్మాణం ఆపాలని దుష్ట శక్తులు చేసిన కుట్రలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గూబ గుయ్యిమనే తీర్పు ఇచ్చింది... అమరావతి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది... ఇక అమరావతి నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి.... పర్యవనానని ఎటువంటి ఆటంకం కాకుండా, నిర్మాణాలు చేసుకోమని తీర్పు ఇచ్చింది... సైట్ క్లియరెన్స్ రావటంతో, ఇక అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదు... రాజధాని నిర్మాణానికి తగిన ప్రాంతం కాదంటూ, కొంత మందిని ముందుంచి, అమరావతి ద్వేషులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయించి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశారు... 

amaravati 17112017 2

అమరావతికి వ్యతిరేకంగా శ్రీమన్నారయణ అనే వ్యక్తి జాతీయ హరిత ధర్మాసనంలో పిటిషన్ వేశారు. రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతం అమరావతి తగిన ప్రాంతం కాదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించింది... అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశామని, అమరావతి నిర్మాణం చేపట్టడానికి అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతమని ఏపీ వాదించింది. 

amaravati 17112017 3

పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకు తగిన రీతిలో జవాబిచ్చింది. వరద ముప్పు సమస్య లేకుండా ప్రణాళిక రూపొందించామని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలపరంగా నిర్మాణం జరుగుతుందని తెలిపింది. నాణ్యత, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం వివరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ఈ ప్రాంతమే రాజధాని నిర్మాణానికి అత్యంత అనుకూలమని ఎన్జీటీలో వాదించింది. నిర్మాణం విషయంలో పర్యావరణ హక్కుల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతిని అడ్డుకునే అవసరం లేదు అంటూ తీర్పు ఇచ్చింది... అమరావతిని ఆపే సైకో గాళ్ళు, ఇంకో ప్లాన్ తో ముందుకు రండి... మీరు ఏమి చేసినా, మా అమరావతిని ఆపలేరు...

Advertisements

Latest Articles

Most Read