ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు వేరు, ఇప్పటి చంద్రబాబు వేరు... అప్పుడు ఎలాంటి ఎమోషన్స్ కు అస్సలు లోనయ్యేవారు కాదు... కాని ఇప్పుడు పూర్తిగా భిన్నం... వయసుతో పాటు వచ్చిన సున్నితత్వమో, లేక చంద్రబాబు చెప్ప్తున్నట్టు 2012లో చేసిన పాదయత్ర అనుభవమో కాని, ప్రజలకు కష్టం ఉంది అని తెలిస్తే చాలు, వారికి సహాయం చేస్తున్నారు... ప్రజలు ఏ సమస్య ఉంది అన్నా, సియం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారు.
తాజాగా చంద్రబాబుకి ఒక వింత అనుభవం ఎదురైంది... సహాయం పొందిన వాళ్ళు, చాలా మంది తరువాత మర్చిపోతారు... చాలా కొంత మందే కృతజ్ఞత చూపిస్తారు... నిన్న విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబుని, శ్రీకాకుళం జిల్లా రాజాం సమీపంలోని వావిలవలసకి చెందిన పాలూరి సిద్ధార్థ దంపతులు కలిసారు. తన భార్య సుధారాణికి జబ్బు చేసినప్పుడు, చంద్రబాబు చేసిన సాహయం గుర్తు చేసి, తన భార్య కోలుకునేందుకు ఆర్థికంగా చేయూతనందించిన చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతగా, చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడి పేరుని తన బిడ్డకు పెట్టుకున్నాని, ముఖ్యమంత్రికి చెప్పాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏంతో సంతోషంతో ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు..
పాలూరి సిద్ధార్థ భార్య, సుధారాణి జన్మనిచ్చిన తొలిబిడ్డ పురిట్లోనే చనిపోయింది. ఆ సమయంలో గర్భసంచి జారి చిల్లుపడిందని. అది సరిచెయ్యాలి అంటే, ఖరీదైన వైద్యం చెయ్యాలి అని వైద్యులు చెప్పారు. అంత స్తోమత లేని సిద్ధార్థ, ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్నాడు. చంద్రబాబు వెంటంటే, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆరు లక్షలు విడుదల చేసి, సిద్ధార్థ భార్యకి వైద్యం చేయించారు. ఈ క్రమంలో ఆమె 40 రోజుల క్రితం మగబిడ్డకి జన్మనిచ్చింది. తమకు ఇంత ఆనందాన్ని అందించిన తమ నాయకుడుకి కృతజ్ఞతగా.. చంద్రబాబు తండ్రి పేరు బిడ్డకు పెట్టుకున్నారు.