బీసీలు అంటే ప్రాణమిస్తా అంటూ, జగన్, విజయవాడలో పెద్ద షో చేశారు... చివరకి ఆ బీసీ వర్గానికి చెందిన తన పార్టీకి చెందిన, బీసీ మహిళా ఎంపీని అవమాన పరుస్తూ, తన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు...

ఒక పక్క బీసీలకు అండగా ఉంటాను అంటూ, ఒక బీసీ మహిళా ఎంపీని సస్పెండ్ చెయ్యటంతో, పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. వైసీపీ ఎంపీ బుట్టా రేణుకు పార్టీ మారతారు అని అందరికీ తెలుసు... అందరూ వెళ్ళినట్టే ఆమె వెళ్ళేది.. ఈలోపు ఈ సస్పెన్షన్ ఎందుకు అంటూ, సీనియర్ లు తల పట్టుకుంటున్నారు...

కేవలం జగన్ కు ఉన్న ఇగో తప్ప, ఈ చర్య వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటూ, వాపోతున్నారు... ఉపయోగం లేక పోగా, తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని, ఇప్పటికే తమ పేపర్లో మహిళ అని కూడా చూడకుండా, అసభ్యకరంగా హెడింగ్ లు పెట్టాం, ఇవాళ బీసీలకు అండగా ఉంటాం అంటూ మీటింగ్ పెట్టి, అదే బీసీ వర్గానికి చెందిన మహిళా ఎంపీని సస్పెండ్ చెయ్యటం, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అంటున్నారు..

అంతే కాదు, జగన్ ఇగో వల్ల, ఈ చర్య ఒక పెద్ద సెల్ఫ్ గోల్ అంటున్నారు... ఆమెను సస్పెండ్ చేయడం వలన పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు ఫిర్యాదు చేసే అవకాశం కోల్పోతామని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అసహనంగా ఉన్నారని, ఇలాంటి అహంభావం చూపిస్తే, ఎవరూ జగన్ తో ఉండరని అంటున్నారు... కనీసం సీనియర్లతో చర్చించకుండా, జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలా సమర్ధించాలి అనే విషయం పై చర్చిస్తున్నారు, వైసిపి ముఖ్య నేతలు...

ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు 337 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం... 2016-2017 సంవత్సరానికి రావాల్సిన బకాయిల్లో కొంత విడుదల అయింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వారి అనుమానులు నివృత్తి చేసి, కేంద్రం అడిగిన సందేహాలు తీర్చి, కూలి వారికి రావరాల్సిన డబ్బులు సాధించారు...

ఉపాధిహామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి అని ప్రతిపక్ష పార్టీ ఎంపీలు లేఖలు రాసి పేద ప్రజలకు వేతనాలు రాకుండా అడ్డుకున్నారు. కూలీల నోటికాడ కూడు లాగటానికి ప్రయత్నించారు.

అయితే ఉపాధిహామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆడిటింగ్ పద్ధతులు, కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించి, పేదలకు రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేపించారు మంత్రి లోకేష్... ఎన్ని అడ్డంకులు సృష్టించినా డబ్బులు విడుదల చేసినందుకు, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తోమర్ గారికి, ధన్యవాదాలు తెలిపారు మంత్రి నారా లోకేష్...

upadi hami 16102017 2

నగరంలో అత్యంత కీలకమైన ఎన్ఏడీ కూడలిలో ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రాజెక్టు ఎపట్టాలపై కెక్కింది. సుమారు రూ. 113 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఈ ఎన్ఏడీ ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేయ్యనున్నారు.

జూలై 7న ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించగా, విజయ్ నిర్మాణ్ కంపెనీ లిమిటెడ్, ఎం.వెంకట్రావ్ ఇన్ఫ్రా ప్రాజెక్టు సంస్థలు టెండర్లు వేశాయి. వీటని వుడా అధికారులు ఎవాల్యుయేషన్ చేసి విజయ్ నిర్మాణ్ కంపెనీకి టెండర్లు ఖరారు చేశారు.

దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. కింది నుంచి చిన్న వాహనాలు.. పై నుంచి భారీ వాహనాలు.. నాలుగు వైపుల నుంచి పాదచారులు వెళ్ళేలా నిర్మిస్తారు. మెట్రో రైలు నిర్మాణానికి అనువుగా ఈ వంతెన నిర్మాణం సాగునుంది. రెండేళ్ళ గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాల్సి ఉంది.

అత్యంత రద్దీ కూడలి
ఎన్ఏడీ జంక్షన్ విశాఖ నగర కూడళ్లలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. నగరం నుంచి గోపాలపట్నం, సింహాచలం, పెందుర్తి, అరకు వెళ్లేందుకు ఈ జంక్షనే ప్రధాన మార్గం. నగర శివారు ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇదే కీలకమైన కూడలి. చెన్నై, విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు ఈ రహదారే ముఖ్యమైన మార్గం.

రవాణా శాఖ అంచనాల ప్రకారం ఈ జంక్షన్ ను గంటకు 3,500 మంది పాదచారులు దాటుతున్నారు. వాహనాల సంఖ్య దాదాపు 50 వేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాంటి జంక్షన్లో ఫ్లై ఓవర్ నిర్మిస్తే నగరానికి సంబంధించిన ట్రాఫిక్ను దాదాపు తగ్గించవచ్చని అధికారులు అంచనా. అందుకే ఈ ఫైఓవర్ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలని జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, తన సహజ శైలికి భిన్నంగా బాగా కష్టపడుతున్నారు. అయితే ఆ పార్టీ నుంచి జంపింగ్ లు ఎక్కువ కావడంతో అధినేత జగన్ కు తలనొప్పిగా మారింది. కొంతమందిని జగనే స్వయంగా పక్కనపెడుతుండడం, మరికొంతమంది అధినేతనే పక్కన పెట్టడంతో సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. అయితే ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తోంది.

అనంతపురం జిల్లాలో తమకు మంచి పట్టుందని వైసీపీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అనంతలో పలువురు పార్టీ నేతలు సైకిలెక్కబోతున్నారనే వార్త జగన్ ను కలవరపెడుతోంది. ఆ జాబితాలో మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ముందున్నారు. రేపోమాపో ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఇన్ ఛార్జ్, ఎంపీ మిథున్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని వైసీపీ నేతలంతా దాదాపు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి గురునాథరెడ్డికి మాత్రం పిలుపు రాలేదు. ఆయన పార్టీని వీడడం ఖాయమనుకున్నారో ఏమో.. ఆయన్ను పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో.. గురునాథరెడ్డి అనుచరులు రచ్చ రచ్చ చేశారు.

సమావేశం జరుగుతున్న హాల్లో గురునాథ రెడ్డి అనుచరులు ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకున్నారు. గురునాథ రెడ్డిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఏవేవో ఊహాగానాలు పెట్టుకుని నాయకుడ్ని పట్టించుకోకపోవడం సరికాదని హెచ్చరించారు. అయినా మిథున్ రెడ్డి నుంచి సమాధానం రాకపోవడంతో కుర్చీలు విరగ్గొట్టారు. దీంతో సమావేశాన్ని మధ్యలోనే ముగించి మిథున్ రెడ్డి బయటకు వెళ్లసాగారు. అయినా కూడా ఆగని గురునాథ రెడ్డి అనుచరులు మిథున్ రెడ్డిని మధ్యలోనే అడ్డుకున్నారు. మిథున్ రెడ్డి తన చేతుల్లో ఏమీ లేదని తేల్చేయడంతో జగన్ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిణామాలను చూసిన జిల్లా వైసీపీ నేతలు కిమ్మనకుండా అక్కడి నుంచి జారుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read