అది ప్రకృతి విపత్తయిగాగానీ, మానవ వైఫల్యం గానీ, ప్రజలను విషాదంలో ముంచిన దుర్ఘటన గానీ.. జనం కష్టాల్లో ఉంటే అందరికంటే ముందు వారి ముంగిట వెళ్లి, భుజం తట్టి భరోసా ఇచ్చే నాయకుడు చంద్రబాబు. అధికారంలో ఉన్నా, లేక పోయినా విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అక్కడికి వెళ్లి, బాధితులను ఓదార్చి, ఆర్థిక సాయం చేయడమో, వారిని ఆదుకోవడమో కొత్తేమీ కాదు. ఆయనకి పగలు రాత్రి తేడా లేదు... ఎప్పుడూ ఇబ్బంది ఉంటే, అప్పుడు రంగంలోకి దిగుతారు... డిజాస్టర్ మ్యానేజ్మెంట్ లో చంద్రబాబుని కొట్టే వాడు, ఈ దేశంలోనే లేడు అంటారు... అంత ఫాస్ట్ గా, ఎఫెక్టివ్ గా రియాక్ట్ అవుతారు చంద్రబాబు...

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి సహకరించకపోయినా అక్కడే తిష్ఠవేసి, సహాయ చర్యలను స్వయంగా సమీక్షించిన సంగతి ఎలా మర్చిపోగలం. 2000 ఆగస్ట్, హైదరాబాద్ లో ఒక్క రోజే 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ సగం మునిగిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ, మోకాళ్ళ లోతు నీటిలో తిరుగుతూ, సహాయక చర్యలు చేసిన సంగతి ఎలా మర్చిపోగలం... వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ లోని గాంధీనగర్ ప్రాంతంలో కలుషిత నీరు తాగి 12మంది చనిపోతే వైఎస్ పట్టించుకోకుండా గోవాలో జన్మ దిన వేడుకలకు హాజరయితే చంద్రబాబు బాధితులకు అండగా నిలిచారు. పాద యాత్ర సందర్భంగా వరదలు వచ్చిన సందర్భంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి రైతులను పరామర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా, ఉత్తరాఖండ్ విషాదంలో మన తెలుగువారు కూడా ఉండటం, ఇంకా అక్కడే సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు వారికి భరోసా ఇచ్చేందుకు అమెరికా నుంచీ వచ్చీరాగానే ఉత్తరాఖండ్‌కు వెళ్ళటం, సొంత ఖర్చులతో వారి ఇంటి ముందు దింపిన సంగతి ఎలా మర్చిపోగలం... నిన్న కాక మొన్న, మన సుందర విశాఖని హుడ్ హుడ్ అతలాకుతలం చేస్తే, వారం రోజుల్లో సామాన్య స్థితికి తీసుకురావటం ఎలా మర్చిపోగలం...

ఈ సందర్భంగా ఇంకో సంఘటన గుర్తుచేసుకుందాం... 2015 నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి... నెల్లూరు జిల్లాలో అంచనాలకి మించి నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజులపాటు జిల్లాలోనే ఉండిపోయారు. రాష్ట్ర మంత్రులు, అధికారులందర్నీ నెల్లూరుకి పిలిపించి హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రాంతాల్లో ముమ్మరంగా తిరిగి బాధితులకి వెంటనే సహాయం అందేలా చర్యలు చేపట్టారు. ఇక మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావులు నిన్నమొన్నటి వరకూ జిల్లాలోనే ఉండిపోయారు. దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, పల్లె రఘునాథరెడ్డి తదితర మంత్రివర్గ సహచరులంతా జిల్లాలో వాలిపోయి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మూడు రోజులుపాటు చంద్రబాబు పర్యటిస్తే ప్రతిరోజూ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు, విలేకరుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకునేవారు.... వరద నీటిలోనే ఉంటున్న, బాధితుల దగ్గరకు వెళ్లి భరోసా ఇచ్చారు...

ఇక్కడితో ఆయన పని అయిపోదు... సమస్య ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అని రివ్యూ మీటింగ్ పెడతారు.... లాంగ్ టర్మ్ ప్లాన్... షార్ట్ టర్మ్ ప్లాన్ రెడీ చెయ్యమంటారు.... ఇంకోసారి ఇంత నష్టం జరగకూడదు అని టార్గెట్ ఇస్తారు... అసలు ఈ సమస్యే మరో సారి రాకూడదు, మీ ప్రణాళికలు ఏంటో చెప్పండి అని అధికారలుని ఆదేశిస్తారు...

నాయకుడు అంటే ఇలా ఉండాలి... ఇప్పుడు హైదరాబాద్ వరదలు చూస్తున్నాం... మూడు సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది.. ఈ పరిస్థుతుల్లో తప్పు ఒప్పులు కాదు... ప్రజలకి కావాల్సింది భరోసా... మరి అక్కడ ఒక్క నాయకుడు అన్నా ప్రజల మధ్యకి వచ్చారా ? భరోసా ఇచ్చారా ? ట్విట్టర్ లో ఆంధ్ర రాష్ట్రం గురించి ఎగతాళి చేసే KTR, కనీసం ఒక్క ట్వీట్ చేశారా ? ఎదో సమీక్షలు అంటే, వార్తల్లో న్యూస్ కోసం హడావిడి తప్ప, ఇప్పటి వరకు, వీళ్ళు అక్కడ ప్రజలకు ఇచ్చిన భరోసా ఏంటి ? అమరావతి వరదలకి కొట్టుకుపోతుంది అని ఎడిటోరియల్ రాసే ఒకడు... ఒక బిల్డింగ్ లో నీళ్ళు వస్తే, ఆ బిల్డింగ్ కూలిపోయింది అని వార్తలు రాసే ఇంకొకడు.. వీళ్ళంతా ఉన్నారా ? హైదరాబాద్ వరదల్లో కొట్టుకు పోయారా ? లేక కెసిఆర్ కి భయపడి, హైదరాబాద్ వరదలు గురించి చెప్పలేకపోతున్నారా ?

మా రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి, విపత్తుల్లో ప్రజలకి ఎలా భరోసా ఇవ్వాలో నేర్చుకోండి...

జియో టాగింగ్ అంటాడు.... టెక్నాలజీ అంటాడు... ఇవన్నీ జరిగే పనేనా అంటూ ఉంటారు, కొంత మంది... అదే టెక్నాలజీతో ఏంతో మంది అక్రమార్కుల ఆట కట్టించారు చంద్రబాబు... స్మశానాల్లో పెన్షన్ లు తీసుకున్న రోజులు కూడా మనం చూశాం... అంతటి దోపిడీ చూసిన ప్రజలకి, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంకి పెన్షన్ తీసుకున్నారో కూడా మన ముందు ఉంచుతున్నారు...

తాజాగా, ఇవాళ లక్ష మంది పేదలకి ప్రభుత్వం ఇల్లు కట్టించింది... ఇవాళ గాంధీ జయంతిని పురస్కరించుకుని గృహప్రవేశాలు జరిగాయి... ఇదో శుభకార్యంగా భావిస్తూ, గృహప్రవేశాలు చేసిన లబ్దిదార్ల దంపతులకు రాష్ట్రం ప్రభుత్వం పక్షాన నూతన వస్త్రాలను కూడా బహుకరించారు... ఇది వరకు మనం చూసాం... ఇందిరమ్మ ఇల్లు అని, ఉన్న పూరి పాకలు పీకి, ఊరి బయట మొండి గోడలతో మమ అనిపించి, కాంట్రాక్టర్ల జేబులు నింపారు.... అది కూడా చాలా తక్కువ... నాలుగు పిల్లర్లు లేపి, ఇవే ఇల్లు అంటూ, బిల్లులు పెట్టుకుని, పేదల డబ్బులు నోక్కేసారు...

ఇప్పుడు చంద్రబాబు వచ్చారు... ప్రతి పేద వాడి మొఖంలో భరోసా ఇస్తూ, సొంత ఇంటి కలను నిజం చేస్తున్నారు... ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభించారు.. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చెయ్యమని చెప్పారు...

ఈ ప్రక్రియ అంతా ఎంత పారదర్శకంగా జరిగింది అంటే... కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లించేటప్పుడు, లబ్దిదారులకు ఫోన్ చేసి, ఎవరైనా లంచం అడిగారా అని అడిగి తెలుసుకుంటున్నారు.. ప్రతి ఇంటినీ జియో ట్యాంగింగ్ చేసి, ఫోటోలు తీసి వెబ్సైటులో పెట్టారు...

మీరు చూడండి... పైసా అవినీతి లేకుండా, పేద వాడికి ఎలా లబ్ది చేకురుస్తున్నారో...
ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in//NTRNutanaGruhaPravesam.do
ఇక్కడ మీ జిల్లా, ఊరు సెలెక్ట్ చేస్తే, మీ ఊరిలో ఎవరికి ఈ ఇల్లు ఇచ్చారు... వారి పేరు, ఇవాళ గృహప్రవేశం చేసిన ఫోటోలు వస్తాయి...
మరిన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి https://apgovhousing.apcfss.in/gruhapravesaluReport.do

సరిగ్గా అయిదేళ్ళ క్రితం... సుద్దీర్ఘ రాజకీయ అనుభవం, సైబెరాబాద్ లాంటి సిటీ కట్టిన విజన్ ఉన్న నాయకుడు, మరో పక్క అన్నగారు పెట్టిన పార్టీని 20 ఏళ్ళ పాటు ముందుకు తీసుకువచ్చిన నాయకుడు, ఈయన పని అయిపోయింది అనుకున్నారు అందరూ...

నిండు చంద్రబాబు ఒక వైపు, చుక్కలు ఒక వైపు అన్నట్టు... అన్ని పార్టీలు కలిసి, చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని కనుమరుగు చెయ్యటానికి కుట్ర పన్నారు.. మరో పక్క రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యింది...

ఇలాంటి పరిస్థుతులలో,
నిస్తేజంలో కాడర్ ఉంది....
పార్టిని వదిలి వెళ్తున్న నాయకులు ఒక వైపు...
అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి...
తెలుగుదేశం, చంద్రబాబు పని అయిపోయింది అనుకున్న జనం..
డిపాజిట్స్ గల్లంతయ్యే పరిస్థితి...
ఇదే సమయంలో కుటుంబంలో నుంచి కూడా సమస్యలు...
ఎదురుగా అవినీతి సొమ్ముతో, ఏడుపులు సానుభూతిని నమ్ముకున్న పార్టీ...
పంటి బిగువున దిగమింగారు...

ఆ సమయంలో చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యింది.... 60 ఏళ్ళ వయసు ఆయన ఉక్కు సంకల్పం ముందు చిన్నబోయింది.... పరీక్షించిన గాయాలు ఆయన చిత్తసుధిని శంకించలేకపోయాయి..... వస్తున్నా మీ కోసం అంటూ ఆయన మొదలెట్టిన పాదయాత్ర,దానిని కొనసాగించిన తీరు...రాష్ట్ర రాజకీయ యవనిక మీద చెరగని ముద్ర వేసాయ్..... జన రాజనాలు..... ఉప్పొంగిన ఉత్సాహం తో ముందుకు ఉరికిన కాడర్.....

ప్రపంచం లో ఎక్కడా లేనంత నీచం గా ఒక రాష్ట్రాన్ని విడకొట్టారు..... అక్కడ ఆయన వల్లే ఆగింది అని...ఇక్కడ ఈయన వల్లే జరిగింది అని దాడి....

కట్ చేస్తే....
పంచాయితీ ఎలక్షన్స్, మున్సిపల్ పరిషత్ ఎన్నికలు..... స్వీప్.... సార్వత్రిక ఎన్నికల టైంకి టిడిపి బలం నమ్మిన వారి చేరికలు... కొత్త ఇక్వేషన్స్.... పొత్తులు.... అయిపోయాడురా అన్న దగ్గర నుంచి మనల్ని నిలబెట్టేది ఈయనేరా అనేదాకా,ఈ ఐదేళ్ళ చంద్రబాబు ప్రస్థానం, ఏంతో మంది ముందు తరాల నాయకులకి ఆదర్శం... ఒక రాష్ట్రం లో ఇక లేదు అనుకున్న చోట, ప్రతిపక్షంగా....ఇంకొక రాష్ట్రంలో అధికార పక్షంగా నిలవటం ఒక చ్జరిత్ర.... ఇది ఒక కేసు స్టడీ.... ప్రజల పక్షాన నిలబడితే, ప్రజలు మన వైపే ఉంటారు అనే దానికి ఉదాహరణ...

ఆ పాదయత్రలో ఎదురైన ఎన్నో ప్రజా సమస్యలతో, ప్రజల అవసరాలతో పధకాలు వచ్చాయి...

అయిదేళ్ళ తరువాత, మరో సారి ఈయన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, చివరగా ఒక మాట...

"తన ఇంటిని విడిచి విడిచి........తన క్షేమం మరచి మరచి..... రైతులకై వగచి వగచి..... నిరుపేదల తలచి తలచి... బాటలెన్నో నడిచి నడిచి...... నడిచి నడిచి నడిచి నడిచి నడిచి....... అదిగో మన చంద్రబాబు వస్తున్నాడు..."

"వస్తున్నా మీ కోసం" పాదయాత్రలో పాట ఇది...

అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు... అయినా ఈ పాటలో ఏమి మారలేదు... తన ఇంటిని కుటుంబాన్ని వదిలి, 67 ఏళ్ళ వయసులో నవ్యాంధ్ర నిర్మాణానికి పూనుకున్నారు... రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు.... పేదలకి ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారు... మన భవిష్యత్తు కోసం, ఆయన పడుతున్న కష్టాన్ని గుర్తిద్దాం...

ఏమిచ్చి ఈయన రుణం తీర్చోగలం... కాపాడుకుందాం ఇలాంటి నాయకుడ్ని... కులాలకతీతంగా... మతాలకతీతంగా... ప్రాంతాలకతీతంగా... వర్గాలకతీతంగా, కాపాడుకుందాం...

ఇవాళ లక్ష గృహ ప్రవేశాలతో లక్ష కుటుంబాల కళ్లల్లో ఆనందం చూశానని, ఇది తన జీవితంలో మరపురాని రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ లక్ష గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాలలో 12 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ16 వేల కోట్లు వెచ్చిస్తున్నామని, పట్టణ ప్రాంతాలలో 5,40,000 గృహాల నిర్మాణానికి దాదాపు 33,000 కోట్లు వ్యయం చేస్తున్నామని, రెండూ కలిపి రూ.50 వేల కోట్లతో 17 లక్షల 40 వేల గృహాలను నిర్మించడం తమ లక్ష్యమని చంద్రబాబు వివరించారు. ఇళ్లు కట్టడం, పెళ్లి చేయడం కష్టమని అంటారని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇదో శుభకార్యంగా భావిస్తూ, గృహప్రవేశాలు చేసిన లబ్దిదార్ల దంపతులకు రాష్ట్రం ప్రభుత్వం పక్షాన నూతన వస్త్రాలను బహూకరిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. లబ్ది దారులను అభినందిస్తున్నామన్నారు. ఒకే రోజు లక్షగృహప్రవేశాలతో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినట్లు చంద్రబాబు వివరిచారు. గతంలో తాను చేపట్టిన పాదయాత్ర ద్వారా పేదవాళ్ల సమస్యలన్నీ తెలుసుకున్నానని.. వాటిని ఆర్ధిక సమస్యలు అధిగమిస్తూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్య రంగంలో పేదవాళ్ల ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పేదవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.

ఒక్కపైసా అవినీతికి తావులేకుండా ఒకే రోజు లక్ష నూతన గృహాల ప్రారంభోత్సవం చరిత్రాత్మకమైనదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరైనా సరే మంజూరులో కానీ, బిల్లు ఇచ్చే సందర్భంలో లంచం అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలా ఎక్కడైనా జరిగితే 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తమ దృష్టికి తేవాలని ముఖ్యమంత్రి కోరారు.

గతంలో గృహనిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. అలాంటి అవినీతి, అక్రమాలకు తాము నిరోధించామని, పూర్తి పారదర్శకంగా వ్యవహరించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు ‘మీకు చేతనైతే మరో 10 రూపాయలు అదనంగా ఇచ్చి ఇళ్లు ఇంకా మంచిగా నిర్మించాలి. అండగా ఉండాలి. చేయూతనివ్వాలి. అంతే తప్ప ఏరకంగానూ, ఎక్కడా అవినీతికి జరగడానికి వీలు లేదు’ అని ముఖ్యమంత్రి అన్నారు. బిల్లుల మంజూరు సందర్భంగా లబ్దిదారుల సమాచారం తాను తీసుకుంటానని, లబ్దిదారులు నిర్మొహమాటంగా తన దృష్టికి తేవాలన్నారు. అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ స్థాయిలో కూడా పైసా అవినీతికి తావు లేదని అన్నారు. ప్రతి ఇంటినీ జియో ట్యాంగింగ్ చేస్తున్నామని, ఛాయాచిత్రాలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇవాళ లక్ష ఇళ్లు పూర్తయితే గృహ ప్రవేశాలు చేయించామని, వచ్చే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు లక్ష, తాను ప్రమాణ స్వీకారం చేసిన వచ్చే జూన్ 8వ తేదీన మరో లక్ష ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

Advertisements

Latest Articles

Most Read