బెజవాడలో గత మూడు సంవత్సరాల నుంచి, 72 అడుగుల భారీ మట్టి వినాయకుడిని, పర్యావరణహితంగా ప్రతిష్టిస్తూ వస్తున్నారు. ఈ భారీ వినాయకుడి విగ్రహాన్ని నిర్మించిన చోటనే నిమజ్జనం చేస్తారు. దీంతో పర్యావరణం కాపాడుతూ వస్తున్నారు.

ఇప్పుడు అదే బాటలో వచ్చే సంవత్సరం నుంచి, హైదరాబాద్, ఖైరతాబాద్‌ గణేష్ డు కూడా రెడీ అవుతున్నారు. ఖైరతాబాద్‌ ఉత్సవ సమితి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి.. హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్‌ వివరించారు.

పెద్ద విగ్రహాలు ఇలా మట్టితో తయారు చేస్తే, మిగతా వారు కూడా, మట్టి విగ్రహలకే ప్రాధన్యాత ఇస్తారని, తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు ప్రజలు.

వంగవీటి రంగా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఆఫిషియల్ స్పోక్స్ పర్సన్ విజయవాడ నేత గౌతంరెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైఎస్ జగన్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

పార్టీలో క్రమశిక్షణ తప్పితే, పార్టీకి నష్టం అని, ఎవరికైనా ఇలాంటి శిక్ష తప్పదు అని జగన్ చెప్పారు. ఇక్కడ వరకు బాగనే ఉంది కాని, వైసీపీ శ్రేణులు ఈ విషయంలో అయోమయంలో ఉన్నాయి.

గౌతం రెడ్డి అంటే విజయవాడలో పెద్దగా ఎవరికీ తెలీదు... ఆయన ఏమన్నా, పార్టీకి వచ్చే పెద్ద నష్టం ఏమీ లేదు... కాని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి, ఆక్షన్ తీసుకున్నారు... మరి రోజా, జగన్ నోటి దురుసు వల్ల, కాకినాడ, నంద్యాల ఎలక్షన్ లో చిత్తూగా వైసీపీ ఓడిపోయింది.... రోజా అయితే, మేమేమి దళితులం కాదు, మమ్మల్ని పట్టుకోవచ్చు అంటూ, దళితులని కించపరిచినప్పుడు, జగన్ ఒక్క మాట కూడా మాట్లడలేదు... అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యక్తిగతంగా ఏంతో దూరం వెళ్లి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి..

బయటివారిని తిట్టినప్పుడు తప్పుగా కనిపించని జగన్ కు... ఎదుటివారిని తిట్టమని మారి చెప్పి తిట్టించి సంతోషపడే జగన్ కు... గౌతమ్ రెడ్డి ఆరోపణలు ఎందుకు భాదకలిగాయో అని అయోమయంలో ఉన్నాయి వైసీపీ శ్రేణులు... నోటి దురుసుతో పార్టీని నాకించిన జగన్ రెడ్డి, రోజా రెడ్డి ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గౌరవాధ్యక్షురాలు విజయమ్మని డిమాండ్ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు...

జగన్ వ్యవహార శైలి నచ్చక, తన సొంత మనిషే ఎదురు తిరుగుతున్నాడా ? అన్నిట్లో A1, A2 గా ఉండే జగన్, విజయసాయి మధ్య గొడవలు జరుగుతున్నాయా ? కాకినాడ ఫలితాలు తరువాత అవి తీవ్ర స్థాయికి చేరి, జగన్ అక్రమాస్తుల కేసులో, విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారే దాకా వెళ్ళాయా ? అవును అనే అంటున్నాయి లోటస్ పాండ్ వర్గాలు.

కాకినాడ ఎన్నికల ప్రచారం మొత్తం, విజయసాయి రెడ్డి దగ్గర ఉండి చేశారు.. తీరా ఫలితాలు చుస్తే నంద్యాల కంటే ఘోరంగా వచ్చాయి.. ఫలితాలు వచ్చిన తరువాత, జగన్, విజయసాయి రెడ్డిని పిలిచి కాకినాడ ఎన్నికకు బాధ్యత తీసుకున్నారు కాబట్టి, ఈ రిజల్ట్ కి కారణం ఏంటో రిపోర్ట్ ఇవ్వమన్నారని, దాంతో ఒళ్ళు మండిన విజయసాయి రిపోర్ట్ దాక ఎందుకు, ఈ రిజుల్ట్ ఇలా రావటానికి, మీ వ్యవహార శైలే కారణం అన్నారు అని సమాచారం.

ఈ సమాధానం విని, షాక్ అయినా, తేరుకుని, కనీసం మీడియా ముందుకు వెళ్లి మాట్లాడమన్నారు అంట జగన్. దీంతో విజయసాయి రివర్స్ అయ్యి, నాకేమి సంబంధం, అధినేత మీరు, మీరు వెళ్లి నంద్యాలలో చెప్పినట్టు, కొట్టాడు, కొట్టించుకున్నాం అని చెప్పండి అనటంతో, సహనం కోల్పోయిన జగన్, విజయసాయి రెడ్డిని అనరాని మాటలు అన్నారని సమాచారం. దీంతో విజయసాయి రెడ్డి, నీ కోసం కేసుల్లో ఇరుకున్నాను, తెలివి ఉండి కూడా నీ వల్ల దొంగోడిగా, అన్నిట్లో A2గా ముద్ర వేసుకుని తిరుగుతున్నాను, పార్టీని చూసి, నిన్ను చూసి ప్రజలు ఇచ్చిన తీర్పు, నా మీదకు రుద్దాలని చూస్తావా, అదేమిటి అంటే నన్ను తిడతావా అంటూ ఆవేదన చెంది... నిన్ను భరించటం చాలా కష్టం, అవసరమైతే అన్ని కేసుల్లో అప్రూవర్ గా మారిపోతాను అని చెప్పి, అక్కడ నుంచి వెళ్ళిపోయారు...

అందుకే నిన్న వైఎస్ వర్ధంతి పులివెందులలో ఘనంగా జరిగినా ఎక్కడా కనపడలేదు, ఇవాళ కేంద్ర కేబినేట్ విస్తరణ జరిగినా ఎక్కడ కనపడలేదు... లేకపోతే ఈ పాటికే అందరి కొత్త మంత్రులని కలిసి, ఒక బోకే ఇచ్చి, ఫోటో ఫేస్బుక్ లో పెట్టేవారు... మొత్తానికి, కాకినాడ ఎన్నికల ఫలితాలు తరువాత, జగన్ కు, విజయసాయి కి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, అవి ఎటు దారి తీస్తాయో అని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఆంధ్రా కోడలైన నిర్మల సీతారామన్ కు దేశ రక్షణకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పచెప్పారు ప్రధాని మోడీ. ఆదివారం జరిగిన కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్తికరణలో స‌హాయ‌మంత్రి ప‌ద‌వి నుంచి కేబినెట్ హోదా పొందిన అత్యంత కీలక శాఖ అయిన ర‌క్ష‌ణ శాఖ‌ను ఆమెకు కేటాయించారు.

ఇందిరాగాంధీ త‌ర్వాత ఆ శాఖను చూస్తున్న రెండో మ‌హిళ‌గా నిర్మల సీతారామన్ రికార్డు సృష్టించారు. ఇక నుంచి శత్రు దేశాలైన పాకిస్తాన, చైనా లాంటి దేశాలను డీల్ చెయ్యనున్నారు మన ఆంధ్రా కోడలు, నిర్మల సీతారామన్.

చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల్ని పక్కన పెట్టుకోని ఒక మహిళని రక్షణ శాఖ మంత్రిగా చేయటం అనేది మోడీ తీసుకున్న సెన్సేషనల్ నిర్ణయం అని, మన మహిళా శక్తి ఏంటో, ప్రపంచానికి తెలియ చేస్తారు అంటున్నారు.

రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక కార్ల తయారీ సంస్థ వస్తోంది. రాష్ట్రంలో అత్యాధునిక ‘ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌’ వాహనాలను తయారు చేసేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని జపాన్‌కు చెందిన టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తయారీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అఖిటో తఛిబనతో పాటు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టాయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తయారీసంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తయారు చేయబోయే కార్ల మోడళ్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రదర్శించారు. ఈ సంస్థ టొయోటా మోటార్‌ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థ.

‘ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌’ వాహనాల తయారీలో ఉపయోగించే ఆధునిక టెక్నాలజీ, యంత్ర సామాగ్రి, పరికరాలు, వాహనాలకు ఉపయోగించే మెటీరియల్‌, వాటి సామర్థ్యం, కాలపరిమితి తదితర కీలకమైన అంశాలపై అఖిటో తఛిబన తన ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ రూపంలో వివరించారు. ఈ వాహనాలు అటు ఇంధనంతోనూ ఇటు బ్యాటరీతోనూ రెండు విధాలుగా పని చేస్తాయని సంస్థ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది. ఈ వాహనాలు ఛార్జింగ్‌తో తక్కువ దూరం ప్రయాణించే విధంగానే కాకుండా, ఎంత దూరమైనా ఇంధనంతో ప్రయాణించే వీలుండటంతో పాటు ఎక్కడైనా ఛార్జింగ్‌ చేసుకునే సౌలభ్యం ఉండేలా రూపొందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

అఖిటో తఛిబన బృందం వివరించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. కంపెనీ ప్రతిపా దనలు బాగున్నాయని, తక్షణమే పనులు ప్రారంభించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అఖిటో తఛిబనతో సీఎం మాట్లా డుతూ ‘మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం అందించడానికైనా సిద్ధంగానే ఉన్నామని, సంస్థ ఏర్పాటుకు అవసరమైన వనరులు సమకూర్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రపంచస్థాయిలో అమరావతిని ఒక మోడల్‌ రాజధానిగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నామని’ చెప్పారు. ప్రాజెక్టులు ఆలస్యం అయితే రాష్ట్ర భవిష్యత్తు పై తీవ్ర ప్రభావం పడుతుందని, సంస్థలు నిర్ధేశించిన సమయంలోనే కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు.

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సదుపాయాలపై ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అవ కాశం కల్పించినందుకు వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఉట్టిపడేలా రూపొందించిన కార్యక్రమాలు రాజధాని అమరావతికి మరింత శోభను ఇస్తాయన్నారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read