కట్టడం చేతకాని వారు ఏం చేస్తారు? కూలగొడతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాడు. ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన విధ్వంసం, అమరావతి నాశనానికి కంకణం కట్టుకోవడంతో పతాకస్థాయికి చేరింది. మూడు రాజధానుల పేరుతో విశాఖని ధ్వంసం చేస్తున్నారు. కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ చీవాట్లు పెడుతున్నా రుషికొండకి గుండు కొట్టడం ఆపలేదు. సెల్ఫ్ ఫైనాన్ష్ ప్రాజెక్టు అయిన అమరావతిని పూర్తి చేయడానికి లక్ష కోట్లు కావాలని సాకు చూపెడుతూ, మరోవైపు రాజధానిలో విధ్వంసం చేస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతిలో టిడిపి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లని నేటికీ లబ్ధిదారులకు వైకాపా ప్రభుత్వం అప్పగించలేదు. ఇప్పుడు రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నిమిత్తం 1134ఎకరాల భూమిని బదలాయించారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా, రాజధాని ప్రాంతంలో నోటిఫై చేసిన ఆర్-5 కొత్త జోన్‌లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించడం అమరావతిలో మరో విద్వేష విధ్వంస కుతంత్రమేదో పన్నినట్టు తెలుస్తోంది. గుంటూరు-కృష్ణా జిల్లాల మొత్తం రెవెన్యూ యంత్రాంగమంతా ఈ పట్టాల పంపిణీ పూర్తి చేసేవరకూ వేరే పనులు ముట్టుకోవద్దని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయని ప్రచారం సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలకి సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు అప్పగించకుండా, రాజధాని ఇతర ప్రాంతాల పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైకాపా అనుకూల మీడియా కథనాల ప్రకారం రాజధాని ప్రాంతంలో ఉన్న వ్యతిరేకతతో ఇక్కడి సీట్లు ఓడిపోవడం ఖాయమని, ఇతర ప్రాంతాల నుంచి తమకు సాలిడ్ ఓటింగ్ వర్గాలని ఇక్కడకి తరలించేందుకు ఈ సెంటు స్థలం నాటకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
news
అదృశ్యశక్తి పనిచేసిందా ? అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోయిందా ?
ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కోర్టుకి చెప్పిన సీబీఐ ఏమైంది? ముందస్తు బెయిల్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు హైకోర్టుకి పంపింది. హైకోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అయినా అవినాష్ రెడ్డి అరెస్టు జరగలేదు. అన్నికోర్టుల్లోనా అవినాష్ రెడ్డి నిందితుడు అని అఫిడవిట్లు వేసిన సీబీఐ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో పూర్తిగా మౌనం దాల్చేసింది. దీని వెనుక ఏదో అదృశ్యశక్తి ఉందంటూ ఏబీఎన్ ఆర్కే తన కొత్త పలుకులో రాశారు. ఆయన పేరు రాయకపోయినా కేంద్రంలో ఉన్న బీజేపీయే ఆ అదృశ్యశక్తి అని ఏపీలో చిన్నపిల్లాడికి సైతం తెలుసు. తన తండ్రిని చంపేశారని రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేయించిన జగన్ రెడ్డి అదే రిలయన్స్ వాళ్లకి రాజ్యసభ సీటిచ్చారు. ఆయనే పరిమళ్ నత్వానీ. రిలయన్స్ తరఫున లాబీయింగ్ చేసే కింగ్ పిన్. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో సీబీఐపై ఒత్తిడి తెచ్చి వివేకానందరెడ్డి కేసు నీరుగార్చేందుకు, అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండేందుకు జగన్ రెడ్డి కోసం పనిచేసిన మొదటి అదృశ్యశక్తి. ఒక కన్నుని పొడిచిన మరో కన్ను అరెస్ట్ తప్పదనుకునే సమయంలో ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడు అదానీతో జగన్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మరో అదృశ్యశక్తి పనిచేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి హాయిగా తడిగుడ్డ వేసుకుని ఇంట్లో పడుకున్నాడు. తనను ఏ సీబీఐ ఏం చేయలేదనే ధైర్యంతో వీడియోలు విడుదల చేస్తున్నాడు. అన్ని అదృశ్యశక్తులు కలిసి..వివేకానందరెడ్డి ఆత్మహత్యచేసుకున్నాడని కేసు క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఏపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముసుగు తీసేసిన ముద్రగడ.. జగన్ పిలుపు కోసం ఎదురు చూపులు..
ప్లేటూ గరిటె విసిరేశాడు. కాపు ఉద్యమాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కి తాకట్టు పెట్టేశాడు. ఎన్నికలు వచ్చే వేళకి ఉద్యమనాయకుడి ముసుగు తీసేసి, వైకాపా ప్రీపెయిడ్ ఆర్టిస్ట్ అని తనకి తానే సర్టిఫికెట్ ఇస్తున్నాడు ముద్రగడ పద్మనాభం. గత ఎన్నికలకి ముందు ఈబీసీల రిజర్వేషన్‌లో 5 శాతాన్ని కాపులకి కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేలకోట్లు కాపుల సంక్షేమానికి ఖర్చుచేసింది. అయినా కాపు రిజర్వేషన్లు పేరుతో టిడిపి అధికారం కోల్పోయేవరకూ ప్లేట్లు, గరిటెలు కొడుతూ డ్రామా ఆడిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...వైకాపా అధికారంలోకి రావడంతోనే ప్లేటుగరిటెలు వదిలేసి అస్త్రసన్యాసం చేసేశారు. చంద్రబాబు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ కాపులకి జగన్ ఎత్తేసినా నోరు మెదపలేదు. వైకాపా ప్రభుత్వంపై అన్నివర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పుట్టలోంచి పాములా మెల్లగా బయటకొస్తున్నారు. కాపు ఓట్లు చీల్చి టిడిపి-జనసేనని దెబ్బకొట్టే వ్యూహంతో కుంభకర్ణుడి నిద్రవీడి రాజకీయ రంగ ప్రవేశప్రకటన చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వైకాపా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ముద్రగడ పోటీ చేస్తారని సమాచారం. తాజాగా రాష్ట్ర ప్రజలకు రాసిన లేఖలో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. కాపు ఉద్యమం ద్వారా, రాజకీయాల్లో చేరి డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎప్పుడు రాలేదన్నారు. తమ జాతి రిజర్వేషన్ ఉద్యమం జోకర్ కార్డులా అయిపోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పేకల్లో జోకర్‌లా మార్చింది తానేనని ముద్రగడకీ తెలిసిన విషయం. వైకాపా లైఫ్ అయితే, ముద్రగడ జోకర్ అనేది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బహిరంగ రహస్యం. కానీ ఆయనేదో జాతి ఉద్ధారకుడిలా ఏమండి అంటూ దీర్ఘాలు తీస్తూ రాసే లేఖల్లో తెలుగుదేశంపై ద్వేషం, వైకాపాపై ప్రేమ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటాయి. చాలా నీతి కబుర్లు చెప్పే ముద్రగడ 5 శాతం రిజర్వేషన్ కాపులకి ఇచ్చిన చంద్రబాబుపై ద్వేషం చిమ్ముతూ ఉద్యమించి విధ్వంసం సృష్టించి, అదే రిజర్వేషన్ ఎత్తేసిన జగన్ రెడ్డిపై ప్రేమ కురిపిస్తూ..ఉద్యమాన్ని మూటకట్టి, మూతి మూసుకుని కూర్చోవడం ఏ జాతి ప్రయోజనాల కోసమో ఏనాడూ ముద్రగడ మాట్లాడరు.
చంద్రబాబుతో భేటీ, పొత్తుల పై, పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన ..
జనసేన ముసుగులో ఇన్నాళ్లు వైకాపా పేటీఎం బ్యాచులు చేస్తున్న క్యాంపెయిన్‌కి ఒక్క ప్రెస్మీట్‌తో పవన్ కళ్యాణ్ చెక్ పెట్టేశారు. పొత్తుల్లో సీఎం అభ్యర్థి కండీషన్ ఉండదని క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కండిషన్ మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. సీఎం అభ్యర్థి విషయంలో మా పార్టీలో విమర్శలు ఉన్నాయి.. వాటిని పట్టించుకోను..ఇది సినిమా కు సంబంధించినది కాదు.. నాతో నడిచే వారే నా వాళ్ళు..అని కుండబద్దలు కొట్టారు. కష్టపడి పనిచేస్తే సీఎం పదవి వరించి తీరాలని, దాని కోసం పాకులాడ కూడదన్నారు. ఎన్నికల్లో ప్రభావితం చూపించగలగే పార్టీలు కలవాలన్నారు. పొత్తుల వల్లే బీజేపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలు బలపడ్డాయని చెప్పారు. వైసీపీ అరాచకపాలన చూశాక, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని ఫిక్సయ్యానన్నారు. అసెంబ్లీ లో బలమైన పార్టీగా ఉండాలనే పార్టీ పెట్టానని, 2014 లో లోతుగా ఆలోచించి టీడీపీతో కలిశానని వివరించారు. ప్రతికూల పరిస్థితుల్లో 7 శాతం ఓట్లు సాధించాం అంటే మామూలు విషయం కాదన్నారు. మా గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా పొత్తులు ఉంటాయని, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పొత్తులు ఉంటాయన్నారు.