ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి శ్రీ విజయానంద్ ఈ రోజు వెలగపూడి సచివాలయంలో అఖిలపార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఓటరు లిస్టుపై చర్చించారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చర్చలో పాల్గొని ఈ కింది సూచనలు చేశారు. 1. ఓటరు జాబితా రూపకల్పనలోని లోపాలను సవరించాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన వర్ల రామయ్య. 2. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఉన్న తప్పిదాలు కొనసాగితే ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదు. 3. ప్రజాస్వామ్య విలువలకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. 4.ఒకే కుటుంబంలోని సభ్యుల ఓట్లు అనేక బూత్ లలో నమోదైతే ఇంట్లో వాళ్లను చీల్చి బజారుకొకళ్లను పంపిస్తారా.? 5. ఒకే చిరునాతో ఉన్న ఓట్లు వివిధ బూత్‌లలో ఉన్నాయి. 6. ఒకే ఇంట్లో 144 ఓట్లు ఉండే అవకాశం ఉందా.? ఆ ఓట్ల జాబితా ప్రభుత్వం బయటపెట్టాలి.? 7. మరణించిన వ్యక్తుల ఓట్లు ఇప్పటికీ ఓటరు జాబితాలో కొనసాగుతున్నాయి. 8. చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించాలని స్థానిక ఎన్నికల అధికారులను కోరినప్పుడు ఆ పేర్లను తొలగించడానికి తమకు ఆదేశాలు లేవని సమాధానం వచ్చింది. 9. ఓటర్ల జాబితా మదింపు కోసం ఏర్పాటు చేసిన బూత్ లెవల్ ఏజెంట్ కమిటీలు నిరంతరాయంగా ఉన్నాయా లేదా తాత్కాలికంగా ఉన్నాయా? 10. ఓటర్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడంలో బూత్ లెవల్ ఏజెంట్లు తమ స్వామిభక్తి చూపిస్తూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

ec 06012022 2

11. వలస వచ్చిన వారి ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయి. 12.ఒక వ్యక్తి అనేక నియోజకవర్గాలల్లో ఓటు కలిగి ఉన్నారు. 13.గ్రామ రెవెన్యూ అధికారులు అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లు మాత్రమే చేర్చి ఇతర పార్టీల ఓట్లను తొలగిస్తున్నారు. 14. తటస్థ ఓటర్లను, ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను బెదిరించి ఓట్ల నమోదులో జోక్యం చేసుకుంటున్నారు. టీడీపీ అని అనుమానించి జాబితా నుండి తొలగిస్తున్నారు. 15. ఇదే తరహా విధులను అంగన్‌వాడీ వర్కర్లు కూడా నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిని తొలగించాలి. 16.ఆధార్ తో ఒటరు లిస్టు అనుసంధానం చేసిన రీతిలో బయో మెట్రిక్ ను కూడా పోలింగ్ బూత్ వద్ద ఏర్పాటు చేస్తే దొంగఓట్లు పూర్తిగా నిరోధించవచ్చని సూచన. 17. పైన పొందుపరిచిన సమస్యలను పరిశీలించి, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా దిద్దుబాట్లు చేయాలి. 18. వీటిపై కలెక్టర్లు, ఎన్నికల అధికారులు కిందిస్థాయి అధికారులను ఆదేశించాలని వర్ల రామయ్య రిప్రంజంటేషన్ ఎన్నికల అధికారికి అందించారు.

జగన్ కు విజయసాయిరెడ్డికి మధ్య దూరంరోజు రోజుకి పెరుగుతుంది అంటూ ఈ రోజు మీడియాలో వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ పర్యటనలో ఈ దూరం స్పష్టంగా కనిపించిందని ఆ కధనాల సారంశం. ఢిల్లీ పర్యటనలో జగన్ , విజయసాయి రెడ్డికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడలేదు. కనీసం వీరిద్దరూ ముఖాముఖీ ఎక్కడ మాట్లాడుకోలేదు. జగన్, సింధియాతో మీటింగు జరిగిన సందర్భంలో కూడా విజయసాయిరెడ్డిని వద్దని బయటకు పంపివేసినట్లు మీడియాలో కధనాలు వచ్చాయి. కనీసం ఢిల్లీలో ఆ రోజు రాత్రి జరిగిని డిన్నర్ కి కూడా విజయసాయి ని పిలవలేదట. కాని జగన్ సడన్ గా విజయసాయిరెడ్డిని ఎందుకు ఇంత దూరం పెడుతున్నారనేది వైసిపి వర్గాల్లో ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. మరో వైపు విజయసాయి ఢిల్లీ లో అపాయింట్మెంట్లు కూడా సరిగ్గా ఇప్పించలేక పోయారని అందుకే జగన్, విజయసాయి రెడ్డి పై కోపంగా ఉన్నట్లు వార్తలోస్తున్నాయి. ఢిల్లీ లో జరిగిన వ్యవహారాలన్నీ రాజసభ సభ్యులు వేమిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి దగ్గరుండి చుసుకున్నారట. వారిద్దరికే జగన్ ఈ భాద్యతలు అప్పచెప్పి విజయసాయిని పక్కన పెట్టటం పై , కేవలం అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేయక పోవటం వల్లే ఇంత దూరం పెడుతున్నారా లేదా ఇంకేమైనా కారణం ఉందా అనేది సొంత పార్టీ నేతలలోనే చర్చ నడుస్తుంది.

jagan vsreddy 06012022 2

అయితే మరో వైపు AP లో ఉత్తరాంధ్ర వ్యవహారాలను కూడా సజ్జలకే అప్పచెప్పారు. ఉద్యోగ సంఘాలతో మీటింగు లైనా, ప్రెస్ మీట్ లైనా అన్నీ సజ్జలే ముందు ఉంటున్నారు. ఇది వరకు అన్నిట్లో ముందు ఉండే విజయసాయి నెమ్మదిగా సైడ్ అయిపోతున్నారు. ఇటు రాష్ట్రం లోను , అటు కేంద్రంలోను విజయసాయిరెడ్డికి ప్రాముఖ్యత జగన్ రెడ్డి పూర్తిగా తగ్గించేసారు. దానికి సరైన కారణం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఈ దూరం ఇంకా దేనికి దారి తీస్తుందో చూడాలి. ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో తాను ఉన్నా లేకున్నా అనే మాటలు మాట్లాడటం అందరినీ షాక్ కు గురి చేసింది. క్రికెట్ పోటీలు, తాను ఉన్నా, లేకపోయినా జరుగుతాయని ప్రకటించారు. త్వరలోనే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియబోతుంది. అయితే ఈ సారి విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం మళ్ళీ ఇచ్చేది లేదని వైసీపీలో గట్టిగా టాక్ నడుస్తుంది. అసలు ఇద్దరి మధ్య ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందో మరి.

తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి నేతల పేర్లు చెప్పి కొంతమంది కింద స్థాయి నేతలు ఎక్కడికక్కడ రెచ్చి పోతున్నారు. అందులో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గానికి సంభందించి ఆయన ప్రధాన అనుచరుడు గణపతి కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది .ఈ నెల జనవరి 1 వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణి జరుగుతున్న నేపద్యంలో రేషన్ వాహనాలు ఇంటింటికి వెళుతూ బియ్యం పంపిణి  చేస్తున్నాయి. అదే సమయంలో స్థానికంగా వేణు అనుచరుడైన గణపతి కనుసన్నల్లో వైసిపి నేతలు ఈ బియ్యం వాహనం దగ్గర వచ్చి ఎవరైతే రేషన్ తీసుకుంటారోవారి  దగ్గర  సంక్రాంతి మామూలు పేరుతో  100 నుంచి 400 రూపాయల వరకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సంక్రాంతి లోపు తమకు టార్గెట్ ఇచ్చారని తప్పకుండా అందరు డబ్బులు ఇవ్వవలిసిందేనని అందరి మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆ నియోజక వర్గంలో ప్రతి చోట ఎక్కడైతే రేషన్ ఇస్తారో అన్ని చోట్ల కుడా ఇదే దందా కొనసాగితుంది . ఈ విషయం మంత్రి దగ్గరకు వెళ్ళినా కూడా తన అనుచరులకే డబ్బులు వస్తున్నాయి కనుక ఆయన చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. మరోపక్క దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకుందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఇళ్ళ స్థలాల పేరుతో కూడా ఇలాగే 20000 ,30000 కూడా డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూసాం. ఆ తరువాత ఇంటింటికి రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసారని మళ్ళి ఇప్పుడు సంక్రాంతి మామూలు పేరుతో  డబ్బులు కట్టమంటన్నారని, ఇలా అయితే పేద ,మధ్య తరగతి వాళ్లు ఎలా బ్రతకాలని  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి

మన రాష్ట్రంలో మోస్ట్ పవర్ ఫుల్ స్వామి విశాఖ స్వరూపానంద స్వామి. మన రాష్ట్రంలోనే కాదు, పక్కునున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఈయన చాలా కావాల్సిన వారు. ఇక జగన్ మోహన్ రెడ్డి గారికి, స్వరూపానంద అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన కోసం మూడు నాలుగు సార్లు, ముఖ్యమంత్రి హోదాలోనే ఆశ్రమానికి వెళ్లి కలిసారు. ఇక విశాఖ స్వరూపానంద స్వామి వారు అయితే, తాను జగన్ మోహన్ రెడ్డి గెలవటం కోసం, పూజలు చేసాను అని చెప్పేంత సానిహిత్యం ఉండి. ఇంకేముంది, విశాఖ స్వరూపానంద స్వామి వారు అడిగినా, అడగక పోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఏది కావాలి అంటే అది చేసి పెడుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ జీవో చూసి, అందరూ షాక్ అయ్యారు. విశాఖ స్వరూపానంద స్వామికి చెందిన ఒక చిన్న ఓమ్ని బస్‌ కోసం మూడేళ్ళ పాటు పన్ను మినహాయంపు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. మాములుగా అయితే, ప్రజా రవాణా వాహనాలకు సంబంధించి, అందులోని సీట్ల సంఖ్యను బట్టి, ముందు నెలలకు ఒకసారి పన్నులు కట్టాల్సి ఉంటుంది. సీటుకి ఇంత అని టాక్స్ కాట్టాలి. అయితే ఈ పన్నును స్వరూపానంద స్వామికి చెందిన ఒక ఓమ్ని బస్‌కు మూడేళ్ళ పాటు మినహాయింపు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అందరినీ షాక్ కు గురి చేసింది.

swarop 06012022 2

స్వరూపానంద ఆశ్రమం అంటే, బాగా రిచ్ ఆశ్రమం అని పేరు. పెద్ద పెద్ద నాయకులు, ఏకంగా ముఖ్యమంత్రులు వెళ్లి ఆశీర్వాదం తీసుకునే స్వామి వారికి, వాహనానికి పన్ను మినహాయింపు ఇవ్వటం పై అందరూ షాక్ తిన్నారు. కనీసం ఒక చిన్న మినీ వ్యాన్ కు, పన్ను కూడా కట్టుకోలేరా అని పలువురు వాపోతున్నారు. అయితే ఇందులో పండిట్లను మాత్రమే రవాణా చేస్తారాని, అందుకే మినహయింపు ఇచ్చినట్టు చెప్తున్నారు. విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో కూడా ఇదే విషయం స్పష్టం చేసారు. పండిట్లను మాత్రమే తిప్పాలని, అందులో షరతు పెట్టారు. అయితే స్వరూపానంద ఆశ్రామం ఈ మినాహయింపు కోరిందా ? లేక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఇది ఇచ్చిందో తెలియదు కానీ, మొత్తానికి ఈ ఉత్తర్వులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో కూడా ఇలాంటి అనేక ఉత్తర్వులు స్వరూపానంద విషయంలో వివాదాస్పదం అయ్యాయి. తాజాగా వచ్చిన ఈ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.

Advertisements

Latest Articles

Most Read