ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన పన్నులు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి చెత్త పన్ను. చెత్తకు కూడా పన్ను వేయటం పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అయితే దీని పైన వైసీపీ నేతలు దబాయిస్తున్నారు. ఈ రోజు వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ మాట్లాడుతూ, వంద రూపాయలు చెత్త పన్ను కోసం వసూలు చేస్తుంటే, దాని పైన వాదనలు ఎందుకు అని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ "చెత్త పన్ను దేని కోసం అయ్యా ? ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తుంది కదా, ఇందులో పెద్ద విషయం ఏమి ఉంది ? 12 నెలకు, రూ.1500 నువ్వు వేసే చెత్త అంతా తీసుకెళ్ళి ప్రాసెస్ చేస్తే, దాని కోసం వందల మంది పని చేస్తుంటే, డబ్బులు ఇవ్వరా ? అది కట్టమని గట్టిగా చెప్పండి. సచివాలయ సిబ్బంది గట్టిగా పని చేయండి. లేకపోతే చెత్త తీసుకుని వెళ్ళకండి. వాళ్ళ ఇంటి ముందే పోసేయండి. ప్రభుత్వ పధకాలు అయితే కావాలి, ఇలాంటి వాటికి డబ్బులు ఇవ్వం అంటే ఎలా ? చెత్త పన్ను మాత్రం కట్టాల్సిందే" అంటూ ధర్నాన చెత్త పన్ను పై ఈ వ్యాఖ్యలు చేసారు.
news
ఆ స్కెచ్ వైసీపీదే... కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య కీలక ప్రకటన...
ఇటీవల కాలంలో కాపు కులంలోని ప్రముఖులు అందరూ హైదరాబాద్ వెళ్లి, అక్కడ సమావేశం అయ్యి, కాపు కులం నుంచే ముఖ్యమంత్రి కావాలని, దీనికి ఏమి చేయాలి అంటూ, సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. టిడిపి నుంచి గంటా, బీజేపీ నంచి కాన్నా లక్ష్మీ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఇలా ప్రముఖ కాపు నేతలు అందరూ కలిసి సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో జనసేన నుంచి ఎవరూ వెళ్ళలేదు. అయితే ఈ కాపు ప్రముఖల మీటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు, కాపు సంక్షేమ సేన ఫౌండర్ చేగొండి హరిరామ జోగయ్య. అక్కడ సమావేశం అయిన కాపుల్లో జేడీ లక్ష్మీ నారయణ లాంటి నేతలు తప్ప, అసలు ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకులే లేరని హరిరామ జోగయ్య అన్నారు. అక్కడ సమావేశం అయిన వారిలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి, నడిపే శక్తి ఎవరికీ లేదని అన్నారు. ఇక్కడ సమావేశం అయిన వారిని చూస్తూ, వీరు కనుక రాజకీయ పార్టీ పెడితే, ఓట్లు చీల్చి, ఒక పార్టీకి ఉపయోగ పడటం తప్ప, వీళ్ళు చేసే రాజకీయంతో, ఎక్కడా కాపులకు రాజ్యాధికారం వచ్చే అవకసామే లేదని, అక్కడ ఉన్న నేతలు ఎవరికీ కూడా, ఒక పార్టీ పెట్టి, నడిపి, ముందుకు తీసుకుని వెళ్ళేంత శక్తి ఎవరికీ లేదని హరిరామ జోగయ్య అన్నారు.
అయితే అక్కడ సమావేశం అయిన నేతలకు చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇందుకు పనికి రారు అనే విధంగా వారి వాదన ఉందని, అది తప్పు అని అన్నారు. కాపు కులస్తులలో పార్టీ నడుపుతుంది, ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఆయన అన్నారు. కులాల ఐక్యతతో పాటు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేవి పవన్ కళ్యాణ్ నినాదాలని అన్నారు. అయితే కాపులకు, బీసీలు, మైనారిటీలు తోడు అయితే, కాపులకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందని అన్నారు. ఎవరికి వారు పార్టీ పెట్టుకుంటే, ఓట్లు చీల్చుకుంటానికి ఉపయోగ పడుతుంది కానీ, కాపులకు రాజ్యాధికారం అయితే రాదు అని అన్నారు. ఇక్కడ సమావేశం అయిన వారి ఆలోచన చూస్తే, కాపుల ఓట్లు చీల్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకురాలి అనే విధంగా ఉందని అన్నారు. కాపుల ఓట్లు చీల్చటానికి వైసీపీ ఆడిన వ్యూహంలో భాగంగానే వీళ్ళు ఈ ఆట ఆడుతున్నారని హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలు పన్నే మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ చేస్తున్నారని అన్నారు.
ఉదయం నుంచి జరిగిన ప్రచారం పై, కీలక వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు కుమార్తె....
ఈ రోజు సోము వీర్రాజు అల్లుడు పై కేసు పెట్టరు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై సోము వీర్రాజు కుమార్తె స్పందించారు. సోము వీర్రాజు కుమార్తె సూర్యకుమారి మాట్లాడుతూ, సోము వీర్రాజుకి తమకు అసలు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు అనేవి లేవని అన్నారు. కేవలం ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోవటానికి, ఆయన రాజకీయ ఎదుగుదల చూసి కుట్రతోనే, ఇలా చేసారని అన్నారు. జరిగిన విషయం తమకు సంబంధించినది అని, దానికి వీర్రాజు గారి అల్లుడు అని చెప్పటం కరెక్ట్ కాదని అన్నారు. ఆర్ధిక లావాదేవాలు అయితే ఉన్నాయని, అవి వ్యాపార లావాదేవీలు అని అన్నారు. మా భర్తకు జరిగిన వ్యాపార లావాదేవీలు అని, ఈ విషయంలో కేసు పెట్టారని కూడా తమకు ఇప్పుడే తెలిసిందని అన్నారు. అయితే ఇందులో సోము వీర్రాజు పేరుని తేవటం పై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. తన తండ్రికి తమకు అసలు సంబంధం లేదని, పెళ్లి అయిన దగ్గర నుంచి, ఆయన మా ఇంటికి కూడా రాలేదని అన్నారు. మా తండ్రికి, ఈ వ్యవహారానికి అసలు సంబంధం లేదని అన్నారు. సోము వీర్రాజు కూతురుగా చెప్తారు కానీ, అసలు తమకు, ఆయనకు సంబంధాలు లేవని అని అన్నారు. ఇది కేవలం రాజకీయంగా జరిగిన విషయం అని అన్నారు. పోయిన నెలలో కేసు నమోదు చేస్తే, ఇప్పుడు బయటకు తేవటం, సోము వీర్రాజు పేరుని తేవటం, రాజకీయ కుట్రే అని ఆమె అన్నారు.
హైకోర్టు ప్రశ్నలతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి... సవాల్ చేసిన పిటీషన్ ని వెనక్కు తీసుకున్న ప్రభుత్వం...
జీవో నెంబర్ 2ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెకేట్ చేయాలని వేసిన పిటీషన్ ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం, రాష్ట్ర హైకోర్టులో ఉపసమహరించుకుంది. ముఖ్యంగా పంచాయతీ సర్పంచ్, కార్యదర్శుల అధికారులను వీఆర్ఓలకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 2 ను సవాల్ చేస్తూ, అనేక మంది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే గతంలో రాష్ట్ర హైకోర్టు ఈ జీవో నెంబర్ రెండు ని సస్పెండ్ చేస్తూ, నిర్ణయం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, హైకోర్టులో ప్రభుత్వం వేసిన పిటీషన్, ఈ రోజు హైకోర్టులో జస్టిస్ గట్టు దేవానంద్ ధర్మసనం ముందు, విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ గట్టు దేవానంద్, పలు కీలక ప్రశ్నలు సంధించారు. గతంలో ప్రభుత్వం వేసిన కౌంటర్ లో, సమంధిత మంత్రి జీవో నెంబర్ 2 లో పలు లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేసి మళ్ళీ ఫ్రెష్ గా జీవో ఇచ్చే లోపు, కొంత మంది కోర్టుకు వెళ్ళారు అంటూ, ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించారు. మీరు కౌంటర్ లో ఈ విధంగా వ్యాఖ్యలు చేసి, ఆ వ్యాఖ్యలను ప్రస్తావించి, ఇప్పుడు మళ్ళీ జీవో నెంబర్ 2 ని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని ప్రభుత్వం ఎలా పిటీషన్ వేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.
గతంలో వేసిన కౌంటర్ కు భిన్నంగా ఇప్పుడు పిటీషన్ వేయటం ఏమిటి అని హైకోర్టు ప్రశ్నించింది. రెండు కూడా కౌంటర్, పిటీషన్ రెండూ తేడాగా ఉన్నాయన్ పేర్కొంది. జీవో నెంబర్ రెండుని సస్పెండ్ చేసినప్పుడు అప్పట్లోనే, ప్రభుత్వం సంబంధిత శాఖా మంత్రి ఇచ్చిన వివరణను పత్రికల్లో వచ్చిన విషయాన్ని, అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయియన్ క్లిప్పింగ్ ని కూడా, కౌంటర్ లో మీరకు పేర్కొన్న విషయం నిజం కాదా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ న్యాయవాదులు, తాము ఏదైతే వెకేట్ చేయాలని పితీషన్ వేసామో, ఆ పిటీషన్ ను ఉపసంహరించుకుంటున్నామని అని నాయయముర్తి ముందు చెప్పారు. పిటీషన్ ను ఉపసమహరించుకుంటునట్టు కూడా అయన అక్కడే ప్రకటించారు. దీంతో కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీంతో హైకోర్టు చేతిలో మరోసారి మొట్టికయాలు తినకుండా, ప్రభుత్వం తప్పించుకుంది అనే చెప్పాలి.