మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ చైర్మెన్ అశోక్‍గజపతిరాజుకు వరుస షాకులు ఇస్తుంది ప్రభుత్వం. నిన్న జరిగిన సంఘటన పై, రాత్రి హడావిడిగా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో, అశోక్ గజపతి రాజు పైన కేసు నమోదు చేయటం, విస్మయానికి గురి చేస్తుంది. పోలీసుల కేసు కంటే ముందే, దేవస్థానంకు చెందిన అధికారులకు, మంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని, ప్రచారం జరుగుతుంది. నిన్న రామతీర్ధంలో పనులు ప్రక్రియ జరిగే అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఊగిపోతూ ఒక విషయం చెప్పారు. ఇక పై అశోక్‍గజపతిరాజు ఇలాగే వ్యవహరిస్తే, తాము ఆయన పై చట్ట పరమైన చర్యలకు వెనుకాడమని చెప్పి, రాత్రి ఒక అడుగు ముందుకు వేసి, రామతీర్ధం దేవస్థానం అధికారులు, ఈవోతో పాటు, పోలీస్ స్టేషన్ కు పంపి ఫిర్యాదు చేపించారని ప్రచారం జరుగుతుంది. అశోక్‍గజపతిరాజు తమ విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, తమ ఫిర్యాదులో పేర్కుని నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలోనే, ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు, పోలీసులు మాత్రం ఎక్కడా కేసు నమోదు చేసినట్టు బయటకు చెప్పలేదు కానీ, ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేసేసారు. 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

case 23122021 2

అశోక్‍గజపతిరాజుతో పాటుగా, మరికొంత మంది పైన కేసులు నమోదు చేసారు. వైసీపీ నేతలు అశోక్‍గజపతిరాజు పైన దూకుడుగా ప్రవర్తిస్తున్న నేపధ్యంలో, అడ్డుకున్న టిడిపి నేతల పైన కూడా కేసులు నమోదు చేసారు. పూజలు చేస్తున్న సమయంలో అశోక్‍గజపతిరాజు తీరు ఇబ్బందిగా మారిందని, పూజా కార్యక్రమాలకు ఇబ్బంది కలిగిందని, శిలాఫలకం కూడా పడేసారని ఫిర్యాదు చేసారు. అయితే ఈ మొత్తం అంశం పైన ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఈ రోజు అశోక్‍గజపతిరాజు కూడా పదకొండు గంటలకు మీడియా ముందుకు వచ్చి, జరిగిన విషయం పై స్పందించనున్నారు. నిన్న రామతీర్ధంలో శంకుస్థాపన సమయంలో, ధర్మకర్త అయిన అశోక్‍గజపతిరాజుని అడుగడుగునా అవమానించారు. శిలాఫలకం పైన ధర్మకర్త పేరు పెట్టలేదు. అలాగే అశోక్‍గజపతిరాజుని అవమానించారు. దీని పై నిరసన తెలిపిన అశోక్‍గజపతిరాజు పై, ఇప్పుడు కేసులు పెట్టి, ఆయన్ను మరింతగా అవమానపరుస్తూ, తమ కక్ష తీర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రక్షాళన పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా, వివిధ నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చటం, కొంత మందికి కొత్త బాధ్యతులు ఇవ్వటం చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పై స్పష్టత ఇచ్చారు. విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానికే ఇప్పుడు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా కేశినేని నానిని నియమించారు. అయతే విజయవాడ వెస్ట్ బాధ్యతలను, బుద్దా వెంకన్న, అలాగే నాగుల్ మీరా ఆశించారు. అయితే ఇద్దరికీ ఇప్పటికే పార్టీలో వేరే బాధ్యతలు ఉండటంతో, కేశినేని నానికి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కేశినేని నాని కూడా ఎంపీగా ఉండటం, ఆయనకు అదనపు బాధ్యతులు ఇవ్వటం చర్చనీయాంశం అయ్యింది. ఇక విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో, కమిటీల నియామకానికి కూడా కేశినేని నానికి స్వేఛ్చ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న బుద్ధా, నాగుల్ మీరా వేసిన కమిటీలు పక్కన పెట్టనున్నారు. మొత్తానికి, ఇది ఆసక్తికర పరిణామం అనే చెప్పాలి.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వెబ్సైటులో జీవోలు పెట్టక పోవటం పై, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన పలువురు పిటీషన్లు దాఖలు చేసారు. దాని పైన ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో భాగంగా, ప్రభుత్వం ప్రస్తుతం జీవోలు పెడుతున్న ఈ-గజిట్ లో కూడా పూర్తి స్థాయిలో జీవోలను ఉంచటం లేదని, కేవలం నాలుగు నుంచి అయుదు శాతం మాత్రమే జీవోలను అక్కడ ఉంచుతున్నారని, పిటీషనర్ తరుపు న్యాయవాది ఎలమంజుల బాలాజీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని, నిబంధనలకు విరుద్ధంగా, చాలా జీవోలు అందులో ఉంచకుండా వ్యవహరిస్తుందని వాదించారు. ప్రభుత్వ తీరు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మాత్రం, సీక్రెట్, టాప్ సీక్రెట్ అని కొన్ని జీవోలు ఉంటాయని, అలాంటి జీవోలను మత్రమే తాము వెబ్సైటులో ఉంచటం లేదని, మామూలు జీవోలు అన్నీ కూడా వెబ్సైటులో పెట్టామని, ప్రభుత్వం తరుపు న్యాయవాది, హైకోర్టుకు తెలిపారు. కేవలం రహస్య జీవొలనే బయట పెట్టలేదని తెలిపారు.

hc 22122021 2

దీని పైన స్పందించిన హైకోర్టు, అసలు సీక్రెట్, టాప్ సీక్రెట్ అని ఏ ప్రాతిపదికిన దాన్ని విభాజిస్తారని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే ప్రస్తుతం అసలు ఎన్ని జీవోలను విడుదల చేసారని, ఎన్ని రహస్యంగా ఉంచరాని, ఈ విషయాలు అన్నీ పూర్తి వివరాలతో తమకు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. అసలు సాఫీగా జరిగే ప్రక్రియకు ఎందుకు ఆటంకం కల్పించారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తీ వివరాలు తమకు ఇవ్వాలని హైకోర్టు తెలుపుతూ, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసు వివరాలు చూస్తే, ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు జీవోల రూపంలో ఇస్తారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఎవరికైనా పని అప్పగించినా, ఎవరికైనా రూపాయి ఖర్చు పెట్టినా సరే, అది జీవో రూపంలో వస్తుంది. ఇవన్నీ మొన్నటి వరకు ప్రజలకు అందుబాటులో ఉండేవి. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం, ఈ జీవోలను ఇక పెట్టం అని, ఏది అయినా ఆఫ్ లైన్ లోనే ఇస్తామని చెప్పింది. తరువాత గజెట్ రూపంలో ఇస్తామని చెప్పినా, అన్నీ బయటకు రావటం లేదు.

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. కొండపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు వినియోగానికి సంబంధించి, హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్లో విచారణ జరుగుతుంది. ఈ విచారణ సందర్భంగా నిన్న కూడా ఈ కేసు పై వాదనలు జరిగాయి. ఈ రోజు మళ్ళీ విచారణ ప్రారంభం అయిన సమయంలో, ఈ రోజు మధ్యానం లంచ్ కు ముందు, ఎంపీ కేశినేని నాని తరుపున, హైకోర్ట్ న్యాయవాది అశ్వనీ కుమార్, అలాగే వైసీపీ కౌన్సిలర్ల తరుపన సీతారం వాదనలు వినిపించారు. ఈ వాదనలు సందర్భంగా, కౌన్సిలర్ల తరుపు న్యాయవాది హైకోర్టు బెంచ్ తో, వాదనకు దిగారు. తనకు అవకాసం కల్పిస్తామని చెప్పినా కూడా, ఆయన వాదనకు దిగటంతో, న్యాయమూర్తి ఆగ్రహించి, బెంచ్ పైన నుంచి లెగిసి లంచ్ కు వెళ్ళిపోయారు. లంచ్ నుంచి వచ్చిన తరువాత జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, వైసీపీ కౌన్సిలర్ల తరుపు న్యాయవాది పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ కేసు వాదనలు తాను వినబోనని, ఈ కేసు నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేసారు. ఈ సమయంలో ఎంపీ కేశినేని తరుపు న్యాయవాది అశ్వనీ కుమార్ జోక్యం చేసుకుని, మీరు ఎందుకు వినను అంటున్నారో ఆ రీజన్ కూడా రాయాలని కోరారు.

justice 22122021 2

ఆ కారణం కూడా రికార్డు చేయాలని అభ్యర్ధించారు. ఆ తరువాత కేసు నుంచి మీరు తప్పుకోవచ్చని సూచించారు. దీంతో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తాను ఎందుకు ఈ వాదన వినబోను, ఎందుకు ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను అనే విషయంకు సంబంధించి, ఆయన తన అభిప్రాయాన్ని రికార్డు చేస్తానని చెప్పారు. రికార్డు చేస్తానని చెప్పిన తరువాత, తాను ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పటంతో పాటుగా, ఈ సమాచారాన్ని ప్రధాన న్యాయమూర్తి కి పంపించి, ఈ కేసుని వేరే బెంచ్ కు బదిలీ చేయాలని చెప్పి, కోరారు. దీంతో దాదాపుగా వారం రోజులుగా జరుగుతున్న విచారణ అర్ధాంతరంగా వాయిదా పడింది. మరో వైపు రెండు రోజుల తరువాత, ఈ కేసు పైన చీఫ్ జస్టిస్ ఒక నిర్ణయం తీసుకుని, వేరే బెంచ్ కు ఈ కేసుని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా ఈ కేసు విచారణ జరిగే అవకాసం లేదు. అయితే వైసీపీ కౌన్సిలర్ల తరుపన న్యాయవాది, ఎందుకు అలా వ్యవహరించారు, ఆయన పైన చర్యలు ఏమైనా ఉంటాయా అనేది చూడాలి.

Advertisements

Latest Articles

Most Read