ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన రామతీర్ధం దేవస్థానంలో, దేవస్థానం ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‍గజపతిరాజుకి తీవ్రమైన అవమానం కాదు, పరాభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. వారి పూర్వికులు నిర్మించిన ఆలయంలో, ఆయనకు అవమానం జరిగింది. బొడికొండపై రామతీర్థం ఆలయ పునఃనిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత ఏడాది కొంత మంది దుండగులు, ఆలయంలో రాముల వారి తల తీసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ మళ్ళీ నూతనంగా ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. అయితే ఆ శిలాఫలకం పైన, కనీసం ప్రోటోకాల్ పాటించ లేదు. ఆ శిలాఫలకం పైన ప్రముఖంగా ఉండాల్సిన ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‍గజపతిరాజు కానీ, సముచిత స్థానం కానీ, గుర్తింపు కానీ ఏమి లేకుండా ఆ బోర్డు ఉంది. ఉద్దేశ పూర్వకంగానే, అధికారులు, వైసీపీ నేతల్ ప్రమేయంతో, అశోక్ గజపతి రాజు పేరు అందులో పెట్టక పోవటాన్ని, అశోక్ గజపతి రాజు తీవ్రంగా విబేధించారు. ఇది అక్కడ ఉండటానికి వీలు లేదని అన్నారు. ఆయన ఆగ్రహించి, శిలాఫలకం పక్కకు నెట్టేసే ప్రయత్నం చేసారు. బోర్డును తొలగించే ప్రయత్నం చేయటంతో, అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు.

ashok 22122021 2

స్వల్ప తోపులాట జరగటం, అశోక్ గజపతి రాజుని పక్కకు నెట్టి వేయటంతో, ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారు. అశోక్ గజపతి రాజు, ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని, తమ పూర్వీకులు 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయంలో, ఆనవఇటీ అనేది లేకుండా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఆగ్రహించారు. ఆలయ ధర్మకర్తగా, కనీసం మర్యాద కూడా ఇక్కడ ఇవ్వటం లేదని అన్నారు. ఆలయ నిర్మాణానికి డబ్బులు ఇచ్చినా, చెక్కు వెనక్కు తిప్పి పంపించారని అన్నారు. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడే దేవాదాయ మంత్రి వేల్లంపల్లి ఉన్నా, ఆయానకు అంత అవమానం జరుగుతున్నా, చూస్తూ కూర్చున్నారు. మరో పక్క అశోక్ గజపతి రాజుని కనీసం కొబ్బరికాయ కూడా కొట్టనివ్వనక పోవటంతో, మంత్రి వెల్లంపల్లి పై అసహనం వ్యక్తం చేసారు అశోక్ గజపతిరాజు. కాసేపట్లో ఇక్కడకు మంత్రి బొత్సా కూడా రానున్నారు. ఇంకా ఎన్ని ఘటనలు జరుగుతాయో, అశోక్ గజపతి రాజుని ఇంకా ఎంత అవమానిస్తారో చూడాలి.

వైఎస్ వివేక కేసులో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇన్ని ట్విస్ట్ లు, ఇన్నేళ్ళు, ఇన్ని దర్యాప్తు సంస్థలు వచ్చినా, అసలైన పెద్దలను మాత్రం, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేదు. సిబిఐ దర్యాప్తు ముందుకు వెళ్తుంది, అసలైన వారు దొరికేస్తారు అనుకునే టైంలో, మరో ట్విస్ట్ చోటు చేసుకోవటం, మళ్ళీ మొదటికి రావటం జరిగిపోతుంది. అయితే ఈ మధ్య ఎంపీ అవినాష్ రెడ్డి, సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీలో కీలక వ్యక్తి, అలాగే వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడు. పులివెందులలో కీలక వ్యక్తి. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డికి, సన్నిహితుడుగా ఉంటారని అందరికీ తెలుసు. ఇలాంటి కీలక వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేయటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఇదే సమయంలో గత 15 రోజులు నుంచి, కొంత మంది వ్యక్తులు వైఎస్ సునీత, ఆమె భర్త టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. వివేక కేసులో, తమకు వివేక కూతురు, అల్లుడు పైన అనుమానం ఉందని చెప్తున్నారు. అయితే దీని పై ఎటువంటి ట్విస్ట్ చోటు చేసుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, తనను అన్యాయంగా అరెస్ట్ చేసారని, తమకు బెయిల్ ఇవ్వాలి అంటూ, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటీషన్ వేసారు.

devireddy 22122021 2

ఆలాగే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటుగా, ఉమాశంకర్‌రెడ్డి అనే మరో కీలక వ్యక్తి కూడా బెయిల్ పిటీషన్ వేసారు. అయితే వీరి ఇద్దరి బెయిల్ పిటీషన్ల ను కొట్టేస్తూ, ఇద్దరికీ షాక్ ఇచ్చింది కడప కోర్టు. ఇరువురూ వేసిన బెయిల్ పిటీషన్ పైన గత వారమే వాదనలు జరిగాయి. వాదనలు ముగియటంతో, తీర్పు రిజర్వ్ లో పెట్టిన కోర్టు, నిన్న నిర్ణయం ప్రకటిస్తూ, ఇద్దరి పిటీషన్లను కొట్టేసింది. అయితే మరో పక్క, సిబిఐ కూడా దూకుడు పెంచింది. పులివెందుల కోర్టులో సిబిఐ ఒక పిటీషన్ దాఖలు చేసింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి నార్కో పరీక్షలు చేయాలని, అనుమతి కావాలి అంటూ కోర్టులో పిటీషన్ వేసింది. సిబిఐ వేసిన ఈ పిటీషన్ ను, కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటీషన్ పైన, నార్కో పరీక్షల కోసం, శివశంకర్ రెడ్డి సమ్మతను కోర్టు కోరనుంది. మరి ఈ కేసులో కడిగిన ముత్యం లాగా బయటకు రావాలి అంటే, ఇంతకంటే మంచి అవకాసం ఉండదు. మరి శివశంకర్ రెడ్డి ఏమని సమాధానం చెప్తారో చూడాలి. మొత్తానికి, వివేక కేసు అనేక మలుపులు తిరుగుతుంది.

రోజు వారీ కేసులు విచారణలో భాగంగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుని సంబంధించి, పలు చార్జ్ షీట్ల పైన విచారణ జరిగింది. ఆరు చార్జ్ షీట్ల పైన విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ ఫర్మా, వాన్ పిక్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, హౌసింగ్ బోర్డు కు సంబంధించిన పిటీషన్లు వాటితో పాటు, వేసిన వివిధ డిశ్చార్జ్ పిటీషన్లకు సంబంధించిన విచారణ జరిగింది. అయితే, ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా వివిధ అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని, అందుకే విచారణకు హాజరు కాలేక పోతున్నా అని, నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేసారు. ఇది ప్రతి విచారణకు చేస్తున్న పనే. అయితే సిబిఐ ఈ సారి మాత్రం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి విచారణకు ఇదే సాకు చెప్తున్నారని, రోజు వారీ విచారణ జరుగుతున్నప్పుడు, రోజు విచారణకు మినహయింపు కోరుతున్నారని, సిబిఐ అభ్యంతరం చెప్పింది. ప్రతి రోజు ఇదే మినహాయింపు ఎలా ఇస్తారని, ఎంత కాలం ఇలా మినహాయింపు కోరతారని, సిబిఐ న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అయితే ప్రతి విచారణకు హాజరు కావాలని గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను, హైకోర్టులో తాము అపీల్ చేసామని జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

cbi jagan 21122021 2

అయితే హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ ఇటీవలే పూర్తయ్యిందని, త్వరలో దీనికి సంబంధించిన తీర్పు రాబోతుందని, జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాది, సిబిఐ కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అప్పటి వరకు, అంటే తీర్పు వచ్చే వారకు, ఈ విషయం సిబిఐ కోర్టు దృష్టికి తీసుకుని రావాలని, హైకోర్టు చెప్పిందని సిబిఐ కోర్టు చెప్పారు. అయితే సిబిఐ కోర్టు మాట్లాడుతూ, ఇవన్నీ తమ దృష్టిలో లేవని, ఈ విషయం మొత్తం రాత పూర్వకంగా, మెమో రూపంలో దాఖలు చేయాలని , జగన్ కు సిబిఐ కోర్టు ఆదేశించింది. సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు, జగన్ , సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసారు. విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో ఇవాల్టి విచారణకు సిబిఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది. అయితే ఉన్నట్టు ఉండి ఇప్పుడు సిబిఐ, జగన్ మినహాయింపుల పై అభ్యంతరా చెప్పటం చర్చనీయంసం అయ్యింది. సహజంగా సిబిఐ, ఢిల్లీలో హోం శాఖ ఏమి చెప్తే అదే చేస్తుంది. ఇప్పుడు ఈ పరిణామాలు, రాజకీయంగా కూడా గమనించాలి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో దుమారాన్ని రేపుతున్నాయి. ఈ రోజు విశాఖలో వైఎస్ఆర్ క్రికెట్ కప్ పోటీలను విజయసాయి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి కూడా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా, విజయసాయి రెడ్డి ఉపన్యాసం ఇచ్చారు. అయితే ఈ ఉపన్యాసంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, ఈ క్రికెట్ పోటీలు, గత ఏడాది చేసామని, ఈ ఏడాది చేసామని, భవిష్యత్తులో నేను ఉన్నా, లేకపోయినా కుడా, ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయని చెప్పటంతో, అందరూ షాక్ తిన్నారు. భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఒకటి జగన్ అక్రమ ఆస్తుల కేసులో శిక్ష పడే అవకాసం ఉండటం, రెండు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది, ఆయనకు మళ్ళీ రెన్యువల్ వచ్చే చాన్స్ లేదనే ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ లేకపోతే, ఇప్పుడు విజయసాయి రెడ్డికి పార్టీలో ఉండే విలువ ఉండక పోవచ్చు. ఏది ఏమైనా, విజయసాయి రెడ్డి, నేను ఉన్నా, లేకపోయినా అని వ్యఖ్యలు చేసారు అంటే, ఏదో ఉండే ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. ఆ వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/nz66uBcpEFc

Advertisements

Latest Articles

Most Read