ఒంగోలులో సుబ్బారావు గుప్తా పైన, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక విధంగా చెప్పాలి అంటే, వైసీపీ మార్క్ ఏమిటో చూపించారు. తమకు అడ్డు వస్తే, ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదనే సిగ్నల్ ఇచ్చారు. ఒంగోలులో రెండు రోజుల క్రితం జరిగిన సభలో, సుబ్బారావు గుప్తా అనే వైసీపీ నేత, వైసీపీ పార్టీలో బూతులు మాట్లాడే నేతల పైన, వారి వల్ల పార్టీకి జరుగుతున్న నష్టం చెప్తూ, బాధ పడ్డారు. ఈ క్రమంలోనే వంశీ, నాని, అంబటి, ద్వారంపూడిలను ఎదవలుగా సంబోధించాడు. వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, అలంటి వారి వల్ల పార్టీ ఓటు బ్యాంక్ పడిపోతుందని, రేపు మనం ఓడిపోతే టిడిపి వాళ్ళు ఉరికించి రోడ్డుల మీద కొడతారని, మీరందరూ బాగానే ఉంటారని, రేపు మా లాంటి వారు ఇబ్బంది పడాలని, పద్దతి మార్చుకోవాలని అన్నారు. అంతే ఇంకేముంది, వైసీపీలో బీపీ బ్యాచ్ కి, బీపీ పెరిగిపోయింది. ముందుగా సుబ్బారావు గుప్తా ఇంటి మీద పడ్డారు. ఆయన భార్య ఒక్కటే ఉంటే, ఆమెను బెదిరించారు. ఇంట్లో వస్తువులు చెల్లా చెదురుగా పడేసి, సుబ్బారావు గుప్తా బండి కూడా ధ్వంసం చేసారు. దీంతో సుబ్బారావు గుప్తా భయపడి పోయి, ఇంటికి రాకుండా, ఒక లాడ్జిలో తల దాచుకున్నాడు. వీరి బారి నుంచి కాపాడుకోవచ్చు అని అనుకున్నాడు.

subbarao 2112021 2

అయితే అతను ఉంటున్న లాడ్జిని పసిగట్టిన బీపీ బ్యాచ్, సుబ్బారావు గుప్తాని పట్టుకున్నారు. వీడియో తీసి మరీ, పిచ్చి కొట్టుడు కొట్టారు. మా అన్ననే ఎదిరిస్తావురా అంటూ, పిచ్చి కొట్టుడు కొట్టారు. అతను కొట్టవద్దు అని ఎంత వేడుకున్నా, పీకుతూనే ఉన్నారు. అక్కడితో ఆగిందా అంటే లేదు. ఈ కొట్టుడు మొత్తం వీడియో తీసి, వాళ్ళే బయటకు వదిలారు. ఇది మా నైజం, మా జోలికి వస్తే తాట తీస్తాం అని, బెదిరించారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ అంశం పైన మంత్రి బాలినేని స్పందించారు. అతన్ని కొడుతున్నారు అని తెలిసి , నేనే మా వాళ్ళని ఆపమన్నానని అన్నారు. అలాగే సుబ్బారావు గుప్తా మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇదే విషయం ఆయన భార్య తమకు చెప్పిందని, ఇంట్లో కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని చెప్పిందని బాలినేని అనటంతో, అందరూ షాక్ అయ్యారు. వెంటనే డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కడ కూడా, ఇలాగే కొట్టి, పిచ్చి వాడిని చేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది మరి. ముగింపు మాత్రం అలా ఉండ కూడదని కోరుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు గురించి అందరికీ తెలిసిందే. అన్ని రూల్స్ బ్రేక్ చేస్తూ, ఏపి ప్రభుత్వం చేస్తున్న అప్పుల పై, కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. గత రెండేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి, అంటే కేంద్ర ఆర్ధిక శాఖ, రాష్ట్రాలకు మధ్య జరిగిన ఒప్పందాలు చూసుకుంటే, దాన్ని దాటి, ఏపి ప్రభుత్వం దాదపుగా రూ.17,924 కోట్ల వరకు, ఎక్కువగా అప్పులు చేసిందని కేంద్రం తేల్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, తన అప్పు పరిమితికి మించి రూ.17,924 కోట్ల వరకు ఎక్కువగా ఇప్పటి వరకు అప్పు చేసినట్టు కేంద్రం చెప్పింది. లోకసభలో, రాష్ట్రానికి చెందిన ఎంపీలు అయిన, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, అదే విధంగా వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఇరువురూ అడిగిన ప్రశ్నలకు, కేంద్రం ఆర్ధిక శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితులు , ఇవన్నీ అంచనా వేసుకుని, జీడీపీలో, 4శాతం వరకు అప్పులు చేసుకోవటానికి నిర్ణయం తీసుకోబడిందని, దీని ప్రకారమే అప్పులు చేయాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, వీటి అన్నిటికీ మించి అప్పులు చేసింది కాబట్టి, రాబోయే మూడేళ్ళలో చేసే అప్పుల్లో, ఎఫ్ఆర్‌బీఎం పరిధి దాటకుండా, అప్పులు చేయకుండా, పరిమితి విధిస్తామని చెప్పింది.

debts 20122021 2

అదే విధంగా, ఇప్పుడు చేసిన రూ.17,924 కోట్ల అధిక అప్పుని, వచ్చే మూడేళ్ళలో సర్దుబాటు చేస్తామని షాక్ ఇచ్చింది. అంటే వచ్చే మూడేళ్ళలో తీసుకునే రుణాలను, ఈ రూ.17,924 కోట్లలో మినాయిస్తారు. ఆర్దిక పరమైన విషయాలు అన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించి, ఆర్ధిక పరమైన క్రమశిక్షణ పాటించాలని ఆశిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాకుండా, ఇలా ఏ రాష్ట్రం చేసినా, వారికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పులను తమ పరిధికి లోబడే తీసుకోవాల్సి ఉంటుందని, కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు విషయంలో, ఇంకా ఎన్ని ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో అని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వచ్చే ప్రభుత్వాలకు పెద్ద గుడిబండ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడే పరిమితులు విధించి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపిన అంశం, అసెంబ్లీలో కూడా రాజకీయాల్లో లేని ఆడవాళ్ళ క్యారక్టర్ పై వ్యాఖ్యలు చేస్తూ, రాజకీయాన్ని దిగజార్చటం. కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచి, చంద్రబాబుని చూడాలని ఉంది అంటూ, మొదలైన వైసీపీ రాక్షసత్వం, చివరకు ఇక్కడ వరకు వెళ్ళింది. కుప్పంలో చంద్రబాబుని ఓడించాం, ఇక మాకు తిరులేదు చంద్రబాబు కుంగిపోయి ఉంటాడు అని అనుకున్న వైసీపీకి చంద్రబాబు షాక్ ఇస్తూ, అసెంబ్లీకి వచ్చి, ధీటుగా నిలబడి, ఎక్కడ నుంచి మొదలు పెడదాం అంటూ వ్యాఖ్యలు చేయటంతో, వైసీపీ తట్టుకోలేక పోయింది. చంద్రబాబు సతీమణి పై దూషణలకు దిగారు. ముఖ్యంగా కొడాలి నాని, ద్వారంపూడి, అంబటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే దీని పై చంద్రబాబు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోవటం, అందరినీ కలిచి వేసింది. నారా భువనేశ్వరి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, సంఘీభావం ప్రకటించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ ఘటనతో పరువు పోగొట్టుకున్న వైసీపీ, నారా భువనేశ్వరికి క్షమాపణ నాటకాలు చెప్పించింది. ఈ అంశం ఇక్కడితో ముగిసిపోయిందని సంతోషించింది. అయితే నారా భువనేశ్వరి ఈ రోజు తిరుపతి వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయాన్ని సందర్శించి, వరద వల్ల మృతి చెందిన కుటుంబాలకు లక్ష రుపాయల సాయం అందించారు.

nara 20122021 2

ఈ సందర్భంగా ఆమె, అసెంబ్లీ ఘటన గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నోటికి వచ్చినట్టు ఆడవాళ్ళ పై మాట్లాడటం మంచిది కాదని అన్నారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని, సమాజానికి ఉపయోగ పడే విమర్శలు చేయాలని, పనిలేని విమర్శలు ఎందుకు అని అన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలకు బాధ పడ్డానని, తన భర్త కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. ఒక పెద్ద రాష్ట్రానికి నా భర్త అందించిన సేవలు, చేసిన అభివృద్ధి తనకు తెలుసనీ, రాత్రి పగలు, నిద్ర లేకుండా ఆయన పని చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసారని అన్నారు. తన భర్త గురించి ప్రజలకు తెలుసని అన్నారు. వైసీపీ విమర్శలు తాను పట్టించుకోనని, తన పై వ్యాఖ్యలు చేసిన వారు, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని అన్నారు. తనకు వాళ్ళ క్షమాపణలు అవసరం లేదని అన్నారు. ఇలాంటి వాటిని పట్టించుకుని టైం వెస్ట్ చేసుకోనాని, సమాజ సేవ గురించి తాము ఆలోచిస్తామని అన్నారు. హెరిటేజ్ గురించి మాట్లాడుతూ, హెరిటేజ్ ని ఎవరూ టచ్ కూడా చేయలేరని అన్నారు.

మాజీ ఐఏఎస్ అధికారి, అలాగే జగన్ మోహన్ రెడ్డి దగ్గర మొన్నటి వరకు సిఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పని చేసిన పీవీ రమేష్ ఇంటికి ఏపి సిఐడి అధికారులు వెళ్ళటం సంచలనం కలిగించింది. జగన్ మోహన్ రెడ్డి దగ్గర పీవీ రమేష్ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన సమయంలో, చివరలో ఆయనను పక్కన పెట్టారు. తరువాత ఆయనను పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు. తాజాగా ఆయన హైదరబాద్ ఇంటికి సిఐడి అధికారులు వెళ్ళటం చూస్తుంటే, ఏదో కేసులో ఆయన్ను అరెస్ట్ చేయటానికి చూస్తున్నట్టు అర్ధం అవుతుంది. పీవీ రమేష్ గత చంద్రబాబు ప్రభుత్వంలో ఫైనాన్సు డిపార్టుమెంటు కు ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పని చేసారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ముఖ్య కార్యదర్శిగా జగన్ , ఆయన్ను ఏరి కోరి నియమించారు. తరువాత ఏమి అయ్యిందో ఏమిటో తెలియదు కానీ, ఆయన్ను అక్కడ నుంచి పీకేసారు. ఇప్పుడు ఆయన ఇంటికి సిఐడి పోలీసులు రావటం అనేది చర్చనీయంసం అయ్యింది. కొద్ది రోజుల క్రిందటే, హైదరాబాద్ లో మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారయణ ఇంటికి, సిఐడి అధికారులు వెళ్లి, నానా రచ్చ చేయటం చూసాం. ఇది చివరకు హైకోర్టుకు వెళ్లి, అరెస్ట్ చేయవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది.

ramesh 2022021 2

ఇప్పటికే అనేక మందిని సిఐడి అధికారులు వేధిస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు సిఐడి అధికారులు పీవీ రమేష్ ఇంటికి వెళ్ళటం అంటే, ఏదో స్కెచ్ ఉందనే అనుకుంటున్నారు. పీవీ రమేష్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసే యత్నం తెలుసుకుని పీవీ రమేష్ కూడా విస్మయం వ్యక్తం చేసారు. స్థానికంగా ఉన్న హైదరాబాద్ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏపి సిఐడి పోలీసులు వచ్చినట్టు తెలుస్తుంది. పీవీ రమేష్ ఇంట్లో, రిపేర్ లు జరుగుతూ ఉండటంతో, ఆయన అక్కడ ఉండటం లేదని తెలుస్తుంది. దీంతో సిఐడి అధికారులు వెళ్ళిపోయారు. స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, పోలీసులు వెళ్ళటం పై విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా లక్ష్మీనారాయణ ఇంటికి కూడా ఇలాగే వెళ్లారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములా ఉపయోగించారు. తరువాత విషయం తెలుసుకుని, హైదరాబాద్ పోలీసులు, అక్కడకు వచ్చి పరిస్థితి గమనించి వెళ్లారు. అయితే అసలు ఎందుకు పీవీ రమేష్ ను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారో తెలియాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read