ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ గడ్డు పరిస్థితిలోకి జారి పోతుంది. ప్రతి రోజు డబ్బులు వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. బయట అప్పులు తెస్తున్నా, అవి ఏ మాత్రం సరిపోవటం లేదు. లెక్కలు అడుగుతుంటే, సరైన లెక్కలు ఉండటం లేదు. మొన్నటి వరకు పత్రికల్లో కధనాలు వస్తే, అది కాదు ఇది అని చెప్పే వారు. ఇప్పుడు అది కూడా లేదు. పత్రికల్లో వచ్చే వాటికి క్లారిటీ ఇచ్చే వాళ్ళు లేకపోవటంతో, అదే నిజం అని నమ్మే పరిస్థితి. అయినా ప్రభుత్వం లెక్క చేయటం లేదు. ప్రస్తుతం ఒక నెల రోజులు నుంచి, మరో కొత్త ఎత్తుగడకు ప్రభుత్వం తెర లేపింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కార్పొరేషన్ల సొమ్ములు అన్నీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సు కార్పొరేషన్ కు బదిలీ చేసి అందులో డిపాజిట్ చేయాలని కోరుతుంది. ఇప్పటికే పంచాయతీ నిధులు లాగేసారు. తరువాత విద్యా సంస్థల నిధులు లాగేసారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన 400 కోట్ల రూపాయాలు లాగేసారు. తాజాగా ప్రభుత్వం కన్ను ఆర్టీసి పైన పడింది. ఇప్పటికే ఆర్టీసిని ప్రభుత్వ పరం చేయటంతో, వాటి ఆస్తుల పైన ప్రభుత్వం కన్ను పడిందని, గతంలోనే అనేక కధనాలు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తుల జోలికి వెళ్ళే సాహసం అయితే ఇప్పటి వరకు చేయలేదు.

rtc 20122021 2

తాజాగా ఆర్టీసి పీఎఫ్ ట్రస్ట్ లో ఉన్న దాదాపుగా రూ.1,600 కోట్లకు టెండర్ పెట్టింది. ఆ సొమ్ము మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సు సర్వీసెస్ కార్పొరేషన్ లోకి డిపాజిట్ చేయాలని ఆర్టీసిని కోరింది. అయితే దానికి ఆర్టీసి యాజమాన్యం ఒప్పుకోవటం లేదు. ఉద్యోగుల పీఎఫ్ సొమ్ము కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసామని, ఆ ట్రస్ట్ లో నుంచి డబ్బులు తీయటం కుదరదని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని పధకాలు, అలాగే సంస్థల్లో మాత్రమే, ఈ డబ్బు పెట్టుబడి పెట్టాలని, అలాంటి వాటికే ఇవి ఉపయోగించాల్సి ఉంటుంది, రూల్స్ చెప్తున్నాయని, ప్రభుత్వానికి చెప్పారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆ డబ్బులు ఎలా లాగేయాలి అనేది ఆలోచన చేస్తుంది. అయితే ప్రభుత్వం ఇలా మొత్తం అన్ని కార్పొరేషన్ల నుంచి ఊడ్చి పడేస్తూ, డబ్బులు లాక్కోవటం పై విమర్శలు వస్తున్నాయి. ఆయా సంస్థల్లో ఉద్యోగులు గత కొన్నేళ్లుగా దాచుకున్న సొమ్ము పై ప్రభుత్వం కన్ను పడటం దారుణం అని అంటున్నారు.

ఈ మధ్య కాలంలో, ఎన్నికలు అంటే కామెడీ అయిపోయాయి. మొన్నటి వరకు రిగ్గింగ్ లాంటివి చూసే వాళ్ళం. తరువాత కాలంలో, ఈవీయంలు రావటంతో, రిగ్గింగ్ సంస్కృతీ చాలా వరకు తగ్గింది. తరువాత ఈవీఏం ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ జరిగినా, ఏదో ఒక చిన్న స్థాయిలో, ఎవరికి చేతనైనట్టు వాళ్ళు చేసే వాళ్ళు. ఇప్పుడు తాజాగా ట్రెండ్ మారింది. మొన్న తిరుపతి ఉప ఎన్నికలో, కుప్పం ఎన్నికలో జరిగిన దొంగ ఓట్ల దండయాత్రను చూసి, దేశం కూడా షాక్ అయ్యింది. ఈ దొంగ ఓట్ల దందా ఎలా జరుగుతుందో తెలిస్తే షాక్ అవ్వక మానదు. ముందుగా వాలంటీర్లు ఇంటి ఇంటికీ తిరుగుతారు. చనిపోయిన వారి వివరాలు, అలాగే అక్కడ నుంచి వెళ్ళిపోయిన వివరాలు సేకరిస్తారు. వాళ్ళ పేర్లతో దొంగ ఓటర్ ఐడి కార్డులు సృస్టిస్తారు. అలాగే మరి కొంత మంది ఉంటారు. తమ ప్రత్యర్ధి పార్టీ అనుకునే వారి వివరాలు తీసుకుంటారు. వాళ్ళ పేర్లతో కూడా దొంగ ఓటర్ ఐడి కార్డులు సృష్టిస్తారు. ఓటింగ్ రోజు, ఈ ఓట్ల అన్నీ పక్క ఊళ్ళ నుంచి, ఓటర్లను తీసుకు రావటంతో మొదలు అవుతుంది. తీర్దయాత్రలకు అని బస్సుల్లో వేసుకుని వస్తారు. ముందు రోజు రాత్రి కళ్యాణమండపాల్లో ఉంచుతారు. ఎన్నికల రోజున, ఈ ఓటర్లను మొదటి గంటలోనే ఓట్లు వేయించేలా ప్లాన్ చేస్తారు.

voter 20122021 2

నిజమైన ఓటర్ వచ్చే సరికే, ఓటు నమోదు అయి ఉంటుంది. అలాగే చనిపోయిన వారి ఓట్లు అయితే ఆడిగే వారే ఉండరు. మరి అక్కడ ఉండే ప్రత్యర్ధి పార్టీ ఏజెంట్లు ఏమి చేస్తున్నారు అంటే ? వారిని బెదిరిస్తారు, లొంగ దీసుకుంటారు, ఎదిరిస్తే పోలీసులు వచ్చి ఏదో ఒక పేరు చెప్పి తీసుకుపోతారు. ఇలా దొంగ ఓట్లు గుద్దుకుంటూ ఎన్నికలు గెలవటం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో, ఈ దొంగ ఓటర్లకు చెక్ పడింది అనే చెప్పాలి. కనీసం ఈ దొంగ ఓటర్ ఐడి కార్డులు అయినా తగ్గుతాయి. నేడు లోక్ సభ ముందుకు ఎన్నికల చట్టాల బిల్లు-2021ని కేంద్రం ప్రవేశ పెడుతుంది. ఈ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో భగంగా, ఓటరు జాబితాలో డుప్లికేషన్ నివారించే దిశగా కీలక నిర్ణయం తీసుకుని. కొత్త ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ వినియోగం పరిగణలోకి తీసుకోనున్నారు. ఓటర్ కార్డుని, ఆధార్ తో అనుసంధానం చేస్తారు. అయితే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు, దొంగ ఓట్ల బ్యాచ్, దీన్ని ఏమి చేస్తుందో చూడాలి మరి.

చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా, ఎన్వీ రమణ, తాను చీఫ్ జస్టిస్ అయిన తరువాత, మొదటి సారి అమరావతిలో పర్యటించనున్నారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు. ఇప్పటికే చీఫ్ జస్టిస్ అయిన తరువాత, ఆయన తిరుమల రెండు మూడు సార్లు వచ్చారు. తరువాత డాలర్ శేషాద్రి మరణం అప్పుడు వచ్చారు. అయితే చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తరుచూ తెలంగాణాలో పర్యటిస్తూ, అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గుంటున్నారు. మొదటి సారి తెలంగాణాలో చీఫ్ జస్టిస్ హోదాలో అడుగు పెట్టిన సమయంలో, ఆయనకు కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. మన ఏపిలో మాత్రం, ప్రభుత్వం అలాంటివి ఏమి చేయలేదు. జగన్ మోహన్ రెడ్డి, ఆయన చీఫ్ జస్టిస్ అవ్వకుండా, అప్పట్లో ఉత్తరాలు రాసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొంత మంది చేత, కోర్టులు టార్గెట్ గా చేస్తున్న క్యాంపైన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఇప్పుడు మొదటి సారిగా మూడు రోజుల పాటు, చీఫ్ జస్టిస్ ఏపిఓ ఉండటంతో, ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుందో చూడాలి. ప్రోటోకాల్ ప్రకారం చెయ్యల్సినవి ఎలాగూ చేస్తారు కానీ, మన ఏపి బిడ్డ, ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యారు కాబట్టి, ప్రభుత్వం తరుపున ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయో చూడాలి.

cji 19122021 2

ఇక చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు ఏపిలో పర్యటిస్తారు. డిసెంబర్ 24 నుంచి, తన సొంత గ్రామం పొన్నవరంలో పర్యటిస్తారు. మొదటి సారి చీఫ్ జస్టిస్ అయిన తరువాత సొంత గ్రామానికి వెళ్తూ ఉండటంతో, అక్కడ ప్రాజలు ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ నెల 26న నాగార్జునా యూనివర్సిటీలో హైకోర్టు న్రివహిస్తున్న సదస్సులో కూడా హాజరు అవుతారు. జస్టిస్ ఎన్వీ రమణ, నాగార్జున యూనివర్సిటీ నుంచే డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇక అదే రోజున ఆయన అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, హైకోర్టు ప్రారంభోత్సవానికి కూడా వచ్చారు. అంతకు ముందు అమరావతి శంకుస్థాపనకు కూడా ఆయన వచ్చారు. మళ్ళీ ఇన్నేళ్ళకు, ఆయన అమరావతిలో అడుగు పెట్టనున్నారు. మొత్తం మీద చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, మూడు రోజుల పాటు, ఆంధ్రప్రదేశ్ లో, అదీ కాక, అమరావతిలో కూడా పర్యటించటం ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఆయన ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.

యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తనను సిఐడి అధికారులు ఎలా టార్చర్ పెట్టింది వివరిస్తూ, నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన వ్యాఖ్యలే చేసారు. రఘురామరాజు విషయంలో సిఐడి వ్యవహరించిన తీరు పై ప్రశ్నించగా, మొన్న లక్ష్మీనారాయణ గారి ఇంటి పైకి అర్ధరాత్రి ఎలా వచ్చి ఆయన్ను తీసుకుని వెళ్ళటానికి ట్రై చేసారో, అలాగే నా ఇంటి మీదకు వచ్చారని అన్నారు. 30 మంది వరకు వచ్చి, నన్ను ఎత్తి వ్యాన్ లో పడేసి, అక్కడకు తీసుకుపోయారని అన్నారు. నన్ను చాలా చిత్ర హింసలు పెట్టారని, స్వతంత్ర భారత దేశంలో, ఒక ఎంపీని ఇలా థర్డ్ డిగ్రీ చేయటం మొదటి సారి అని రఘురామరాజు అన్నారు. ఇక తనను హింసించిన అధికారి ఎవరో తనకు బాగా తెలుసనీ, ఎంక్వయిరీ వచ్చినప్పుడు వాడి పేరు అన్నీ చెప్తానని అన్నారు. ఆ అధికారి, వాడి ఫోన్ లో, వాడి పై వాడికి చూపించటంతో, ఆ పై వాడు స్పైడర్ సినిమాలో, ఒక సాడిస్ట్ విలన్ లాగా ఆనందించి, ఇంకా వాయించండి అన్నాడని తెలిసింది. ఫోన్ పెట్టటం అదీ, మొత్తం నేను చూశానని తెలిపారు. అప్పటి వరకు జీవితంలో దెబ్బలు తినలేదని అన్నారు. తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, ఎప్పుడూ ఆ అవసరం రాలేదని అన్నారు. మొదటి దెబ్బే, పోలీస్ దెబ్బ అని అన్నారు. ఎంపీ అయ్యిండి, కొట్టించుకోవటం, నేను రికార్డుల్లో నిలిచిపోయానని అన్నారు. అది మామూలు కొట్టుడు కాదని రఘురామ రాజు అన్నారు.

rrr 20122021 2

జగన్ తో అసలు ఎక్కడ చెడింది అని అడగగా, ముందుగా మాతృభాష పైన బోధనా ఉండాని, రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని లేవనేత్తానని, ఆ సమయంలో మిథున్ రెడ్డికి శభాష్ అన్నాడని, తరువాత సాయంత్రానికే జగన్ నీ పైన కోపంగా ఉన్నాడని చెప్పారని వాళ్ళు చెప్పారని అన్నారు. తరువాత నేషనల్ మీడియాలో క్రీస్టియానిటీ పైన మాట్లాడానని, ఆ తరువాత ఒక రోజు ఎంపీల సమావేశంలో, ఢిల్లీలో మన ఎంపీలు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, అలా కలవటానికి వీలు లేదని , నన్ను ఉద్దేశించి కాకపోయినా, నాకు తగిలేలా జగన్ వ్యాఖ్యలు చేసారని అన్నారు. పార్లమెంటు లెజిస్లేషన్‌ సబార్డినేట్‌ కమిటీకి అధ్యక్షుడిగా నియమించటంతో, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, ఒక పెద్ద బోకే చేపించి, జగన్ దగ్గరకు వచ్చానని, అయతే అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి, నన్ను కలవటానికి ఇష్ట పడక పోవటంతో, ఇంత పెద్ద బోకే ఏమి చేయాలో తెలియక, ఇంతకంటే పెద్ద వ్యక్తికీ ఇది ఇవ్వాలని, అప్పటికప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని, ఆ బోకే ఆయనకు ఇచ్చానని, తనకు జరిగిన అవమానం గురించి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read