రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించారు అంటూ, సిబిఐ జగన్ మోహన్ రెడ్డి పైన 11 కేసులు పెట్టింది. అలాగే ఈడీ కూడా 5 కేసులు పెట్టింది. ఈ కేసులు 2012లో పెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసులు ఒక కొలిక్కి కూడా రాలేదు. ఈ కేసులు ఇంకా ట్రయల్స్ వరకు రాలేదు. ప్రతి వారం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు రావాలని అన్నారు. తరువాత రోజు వారీ విచారణ అని అన్నారు. అయినా కూడా కేసులు ముందుకు వెళ్ళటం లేదు. ఇందుకు నిందితులు రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. ఎలాగైనా కేసులు మరింత లేట్ చేయాలని, డిశ్చార్జ్ పిటీషన్ లు, క్వాష్ పిటీషన్ లు వేస్తూ, ఎప్పటికప్పుడు కేసు సాగతీసేలా చేస్తున్నారు. అయితే ఈ పిటీషన్ లు కూడా ఒక్కోటి వీగిపోతూ వస్తున్నాయి. దీంతో మరో ఎత్తుగడకు తెర లేపారు. ఈ క్వాష్ పిటీషన్ లు విచారణ దశలో ఉన్నవి ఉపసంహరించుకోవటం మొదలు పెట్టారు. ఈ ఎత్తుగడలు గమనించిన సిబిఐ తీవ్ర అభ్యంతరం చెప్తుంది. ఎప్పుడో అయిదేళ్ల క్రితం, తమ పేర్లను జగన్ కేసుల నుంచి తప్పించాలి అంటూ వేసిన పిటీషన్లు, ఇప్పుడు మరో ఇద్దరు నిందితులు ఉపసంహరిమ్చుకున్నారు. ఈ మధ్య కాలంలోనే, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా ఇలాగే ఉపసంహరించుకున్నారు.

cbi 21122021 2

ఇది వరకు వేసిన క్వాష్ పిటీషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు నిందితులు, ఇలాగే ఉపసంరించుకున్నారు. వారిలో, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, మాజీ అధికారి బీపీ ఆచార్య ఉన్నారు. ఇద్దరూ కూడా, గతంలో వేసిన క్వాష్ పిటీషన్ ను వెనక్కు తీసుకున్నారు. ఈ పిటీషన్ లు అయిదేళ్ల క్రితం వేయగా , నిన్న విచారణకు రాగానే, వీరి ఇద్దరి తరుపున న్యాయవాదులు వచ్చి, ఈ కేసులు వెనక్కు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీనికి కోర్టు అనుమతి కావాలని, కోర్టుని కోరారు. అయితే ఈ ఎత్తుగడను పసిగట్టిన సిబిఐ అభ్యంతరం తెలిపింది. ఎప్పుడో అయిదేళ్ల పాటు ఈ కేసు పై స్టే తీసుకుని, ఇప్పుడు విచారణ రాగానే, వెనక్కు తీసుకోవటం పట్ల సిబిఐ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఇక్కడ వెనక్కు తీసుకుని, మళ్ళీ కింద కోర్టుకు వెళ్లి, అక్కడ ఏదో ఒక వివాదం మళ్ళీ రేపి, మళ్ళీ కేసులు లేట్ చేసే వ్యూహం ఇందులో ఉందని కోర్టుకు తెలిపారు. వీటికి అనుమతి ఇవ్వకూడదని అన్నారు. అయితే దీనికి కోర్టు ఒప్పుకోలేదు. వెనక్కు తీసుకునే హక్కు వారికి ఉందని, మళ్ళీ పిటీషన్ వేస్తే మాత్రం, వెంటనే విచారణ జరపాలని ఆదేశించింది.

ముద్రగడ పద్మనాభం గురించి తెలియని వారు ఈ రాష్ట్రంలో ఉండరు. రాజశేఖర్ రెడ్డి వీర విధేయుడుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే మాత్రం ఎందుకో కానీ ఆయన తట్టుకోలేరు. వెంటనే ఆయనకు కాపు ఉద్యమం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు అధికారంలో లేకపోతే మాత్రం, అసలు ఆ ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టకుండా, చక్కగా ఇంట్లో ఉంటారు. మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా ట్రైన్ తగల బెట్టే దాకా రెచ్చ గొట్టి వదిలి పెట్టారు. మాట్లాడితే, పళ్ళెం, గెరిటా పట్టుకుని వాయించే వారు. నిజంగా ఆయనకు కాపు ఉద్యమం పై చిత్తశుద్ధి ఉండి, ఇలా చేస్తే, ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందే. అందులో సందేహమే లేదు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెట్టారు, కాపు రిజర్వేషన్ ఇచ్చారు, ఎన్నో కాపులకు చేసినా, అవేమీ పట్టించుకోని ముద్రగడ, చంద్రబాబుని రాజకీయం బాగా ఇబ్బంది పెట్టారు. దానికి తోడుగా, కులాల మధ్య కుంపట్లు పెట్టే సైకో బ్యాచ్ ఉండటంతో, ముద్రగడ లాంటి వారి అవసరం వారికి చాలా ఉపయోగ పడింది. పోనీ ముద్రగడలో ఉద్యమం పై ఆ నిజాయతీ ఉందా అంటే, అసలు సమస్య ఇక్కడే వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ఆయన ఉద్యమం లేదు, ఏమి లేదు, నా వల్ల కాదని చెప్పేసారు.

mudragada 21122021 2

జగన్ మోహన్ రెడ్డి, కాపు రిజర్వేషన్ ఎత్తివేసినా సౌండ్ లేదు. జగన్ మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోయినా ముద్రగడ అడ్డ్రెస్ లేరు. అయితే గతంలో చంద్రబాబుని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ముద్రగడ, ఈ మధ్య రాస్తున్న ఉత్తరాలు చూస్తుంటే, గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని తలుచుకుని జాలి పడటం తప్ప ఏమి చేయలేం. తాజగా ముద్రగడ జగన్ కు రాసిన లేఖ చూస్తే, షాక్ అవ్వాల్సిందే. కోడి పందేల కోసం, ముద్రగడ జగన్ కు లేఖ రాసారు. సంక్రాంతి పండుగలో కోడి పందేలు వేసుకోవాలని, అందుకు పర్మిషన్ ఇవ్వాలని లేఖ రాసారు. పోలీసులు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని కోరారు. 5 రోజులు పాటు, పర్మిషన్ ఆర్డర్ ఇప్పించాలని కోరుతున్నానని ఆ లేఖలో తెలిపారు. ఆడుకునే వారిని ఆడుకోనివ్వాలని, జైలుకి పంపించ వద్దని కోరారు. అయితే ముద్రగడ లేఖ పై, సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. ఎలాంటి ఆయన, ఎలాంటి ఉత్తరాలు రాస్తున్నాడు అంటూ, సెటైర్ లు పేలుతున్నాయి.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కి అప్పట్లో ఎండీగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమ్ చంద్రారెడ్డికి, అదే విధంగా అప్పట్లో ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన పీవీ రమేష్, ఇద్దరికీ కూడా ఈ రోజు సిఐడి నోటీసులు జారీ చేసింది. వీళ్ళకు సిఆర్పీసిలోని సెక్షన్ 160, అంటే సాక్షిగా, అలాగే సెక్షన్ 91, అంటే డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే సమర్పించాలని వీళ్ళకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇందులో ప్రేమ్ చంద్రారెడ్డికి మొత్తం, 37 ప్రశ్నలను సంధిస్తూ, సిఐడి నోటీసులు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి, ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసారని, నిధులు విడుదల చేయటం వంటి వాటి పైన ప్రశ్నించారు. ఆ నాడు ఈ ఫైల్ పైన, నిధులు విడుదల చేసే సమయంలో, ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి సంతకాలు లేకుండా, నోట్ ఫైల్ ఎలా సర్క్యులేట్ అయ్యింది అనే విషయం కూడా ప్రశ్నించారు. క్యాబినెట్ నిర్ణయం తరువాత ఈ ఫైల్ వెళ్ళిందని చెప్పినా, సంతకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. దీంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి ఆర్ధిక మంత్రి యనమల, అప్పటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు, వీరి ముగ్గిరి పాత్ర పైన కూడా ప్రశ్నలు సంధించారు. అదే విధంగా ఈ ఫైల్ వెళ్ళిన విధానంలో, అనేక లోపాలు ఉన్నాయని, అధికారులు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

iyr 21122021 2

చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు ఇచ్చిన ఆదేశాలు ఏమిటో చెప్పాలని కూడా కోరారు. దీంతో పాటుగా, ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన పీవీ రమేష్, ఎవరి దగ్గర నుంచి ఆదేశాలు తీసుకున్నారని ఆయనకు కూడా ప్రశ్నలు సందించారు. అప్పటి ఆర్ధిక మంత్రి యనమల పాత్ర, ఈ అంశంలో ఆయన పాత్ర ఏమిటో చెప్పాలని కోరారు. వీటికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఇవ్వాలని కోరారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి, కేవలం సాక్షిగానే వారిని పిలిచినట్టు సిఐడి చెప్తుంది. అయితే ఇక్కడ ఒక కీలక అంశం గమనించాల్సి ఉంటుంది. ఇంత ప్రాధాన పాత్ర ఉన్న అధికారులకు ఏమో నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పమని, లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావు లాంటి వాళ్ళ విషయంలో, వాళ్ళ పాత్ర నిధుల విడుదలలో ఏమి లేకపోయినా, వారిని మాత్రం ఎందుకు డైరెక్ట్ గా వెళ్లి , గందరగోళం సృష్టించి అరెస్ట్ చేసారు అనే విషయం పైన మాత్రం, సిఐడి పైన విమర్శలు వస్తున్నాయి. వీరి వద్ద నుంచి కూడా ఇలాగే నోటీసులు ఇచ్చి సమాధానాలు తీసుకోవచ్చు కదా ?

స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో, సిఐడి డొల్లతనం మరోసారి బట్టబయలు అయ్యింది. నిన్న ఘంటా సుబ్బారావు బెయిల్ పిటీషన్ సందర్భంగా, స్పందించిన హైకోర్టు, సిఐడి తీరుని తప్పుబట్టింది. రెండు నెలల వ్యవహారంలో ఏమి తేల్చారని, కొందరిని మాత్రమే ఎందుకు కేసుల్లో పెట్టారని ప్రశ్నించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాష్ట్ర హైకోర్టు నిన్న కొన్ని కీలకమైన, మౌళికమైన ప్రశ్నలు లేవనెత్తింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అప్పట్లో ఎవరు అయితే నిధులు విడుదల చేసారో, ఆ నిధులు విడుదల చేసిన అధికారులకు నోటీసులు ఇవ్వకుండా, సెలెక్ట్ అండ్ పిక్ అప్ అనే విధానం కింద, మీరు కొంత మంది అధికారులనే సెలెక్ట్ చేసి, నోటీసులు ఎందుకు ఇచ్చారు అని హైకోర్టు ప్రశ్నించింది. అదే విధంగా ఎవరు అయితే, ఈ రోజు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుని, షరతులతో కూడిన బెయిల్ పొందిన ఘంటా సుబ్బారావు, ఆయన విషయంలో నిధులు దుర్వినియోగం చేసినట్టు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అని, ఆ ఆధారాలు కూడా అంద చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపధ్యంలోనే, ఆ రోజు స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీలో ఎవరు అయితే పర్చేజేస్ కి, మానిటరింగ్ కి రెండు కమిటీలు ఏర్పాటు చేసారో, కమిటీలో ఐఏఎస్ అధికారులు అందరికీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.

hc 211122021 2

సెలెక్ట్ చేసిన కొంత మందికి మాత్రమే నోటీసులు ఇవ్వటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తమకు వివరించాలని చెప్పి, హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే , దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు, నిన్న అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రేమ్ చంద్రారెడ్డికి, అలాగే అప్పటి ఫైనాన్సు అధికారి పీవీ రమేష్ కు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే నిన్న హడావిడిగా కదిలిన సిఐడి ఇద్దరికీ కేవలం సాక్షిగా నోతీసులు ఇచ్చి చేతులు దులుపేసుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, కోర్టు ప్రశ్నించిన తరువాతే, వీరికి నోటీసులు ఇవ్వాటం పైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ వారిని అరెస్ట్ చేసి ,నానా భీబత్సం సృష్టించి, ఇక్కడ వీరికి మాత్రం కేవలం నోటీసులు ఇవ్వటం కూడా గమనించాల్సిన అంశం. మొత్తం మీద కోర్టులో చీవాట్లు పడకుండా, ఇలా నోటీసులు ఇచ్చి, మమా అనిపించారు. హైకోర్టు వేసిన ప్రశ్నలకు సిఐడి, రెండు వారాల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరో పక్క ఘంటా సుబ్బారావుకు బెయిల్ లభించింది.

Advertisements

Latest Articles

Most Read