జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ సారి కోర్టు కేసుల్లో కాదు, ఇష్టం వాచినట్టు చేసిన నియామకాల విషయంలో. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ శాఖ కార్యదర్శిగా ఉంటూ, ప్రస్తుతం కాకినాడలో జిల్లా జడ్జిగా ఉంటున్న మనోహర్‌ రెడ్డిని హైకోర్టు సస్పెండ్ చేస్తూ, సంచలనానికి తెర లేపింది. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయశాఖ కార్యదర్శిగా ఉండగా, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించే విషయంలో భారీగా అవకతవకలకు పాల్పడినట్టు హైకోర్టు గుర్తిస్తూ, మనోహర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుంది. ఇలాంటి పనులు వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలగరాదనే ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, మనోహర్ రెడ్డిని తెచ్చుకుని న్యాయశాఖ కార్యదర్శి పదవి ఇచ్చారు. పదవి వచ్చిన తరువాత మనోహర్ రెడ్డి, చాలా మంది స్పెషల్ పీపీలను నియమించారు. అయితే ఇక్కడ ఎలాంటి నిబంధనలు పాటించలేదు. అప్పట్లోనే ఈయన పై ఆరోపణలు వచ్చాయి. కేవలం అధికార పార్టీ నేతల సిఫారుసుతో నియామకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశం పై హైకోర్టుకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. న్యాయవాదులు కూడా ఫిర్యాదులు చేసారు.

hc 25112021 2

ప్రతి నియామకం పై స్పష్టమైన సమాచారం హైకోర్టుకు వెళ్ళింది. ఎవరి సిఫారుసుతో ఎవరిని నియమించారు అనే విషయం పై, పూర్తి స్థాయిలో నివేదిక కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు ప్రాధమిక విచారణ చేసి, అవకతవకలు ఉన్నట్టు నిర్ధారించింది. దీంతో ఆయన్ను న్యాయశాఖ కార్యదర్శి పదవి నుంచి గత ఏడాది హైకోర్టు తొలగించింది. తరువాత జిల్లా జడ్జి అయ్యారు. అయితే ఇలాంటి అవకతవకలు బయట పడితే, న్యాయశాఖ కార్యదర్శి కాబట్టి, ప్రభుత్వమే తొలగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ లో జరిగింది. ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో, హైకోర్టు ఎంటర్ అయ్యింది. అయితే అప్పటికీ ప్రభుత్వమం మళ్ళీ ఆయనే కావాలని కోరినా, హైకోర్టు ఒప్పుకోలేదు. అయితే న్యాయశాఖ పదవికి మరో పేరు ప్రభుత్వం ప్రతిపాదించినా హైకోర్టు ఒప్పుకోలేదు. తాజాగా ఆయన అవకతవకలకు పాల్పడినట్టు నిర్ధారించిన హైకోర్టు, ఆయన జిల్లా జడ్జిగా కూడా ఉండకూడదు అని, సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది ప్రభుత్వ పదవి కావటం, ప్రభుత్వం ఈ నియామకాలకు ఆమోదం ఇవ్వటం వెనుక కూడా ఏమి జరిగింది అనేది, ప్రభుత్వ పెద్దలు విచారణ చేస్తారో లేదో తెలియాలి.

జగన్ మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటే, ఎవరు ఏమై పోయినా, ఎవరికి ఎంత నష్టం జరిగినా, అతను పట్టించుకోడు అనే అభిప్రాయం అందరిలో ఉంది. అది మొండితనం అని కొందరు అంటే, చాలా మంది మూర్ఖత్వం అని కూడా అంటారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకున్న అనేక నిర్ణయాలు ఇందుకు బలం చేకూరుస్తాయి. అయితే ఏమైందే ఏమో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డి వరుస పెట్టి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డికి అమరావతి అనే పేరు అంటేనే, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అసహ్యం. అందుకే అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసి పడేసారు. రెండేళ్లుగా అక్కడ రైతులు, మహిళలు రోదిస్తున్నా, కనీసం మీ బాధ ఏంటి అని అడిగిన పాపాన పోలేదు. పైగా వారి పై కేసులు, ఆంక్షలు, అవమానాలు అదనం. రైతులను పైడ్ ఆర్టిస్ట్ లు అనేంత గొప్ప సంస్కారం. అలాంటి జగన్ మోహన్ రెడ్డి, అమరావతి బిల్లులు వెనక్కు తీసుకోవటం వెనుక ఉన్న కారణం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇప్పుడిప్పుడే కారణాలు బయటకు తెలుస్తున్నాయి. ఒక ప్రముఖ పత్రికలో ఆసక్తికర వార్త ప్రచురితం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి అమరావతి విషయంలో, తన నిర్ణయం వెనక్కు తీసుకోవటం వెనుక ఢిల్లీ నుంచి ఒక ప్రముఖ వ్యక్తి ఫోన్ చేయటమే అని అంటున్నారు.

phone 24112021 2

ఆ వ్యక్తి ఫోన్ చేసి, అమరావతి విషయంలో చాలా నష్టపోతావ్, ఏమి జరుగుతుందో ఒకసారి అలోచించుకుని, నిర్ణయం వెనక్కు తీసుకుంటే మీకే మంచిది అంటూ ఢిల్లీ నుంచి ఒక ప్రముఖ వ్యక్తి ఫోన్ రావటంతోనే, హడావిడిగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి, నిర్ణయం వెనక్కు తీసుకున్నారు. అయితే అంతకు ముందు రోజే, ఢిల్లీలో రైతు చట్టాలను మోడీ వెనక్కు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆ ఢిల్లీ వ్యక్తి ఎవరూ అంటే, అమిత్ షా అనే అభిప్రాయం అనేక మందికి వ్యక్తం అవుతుంది. అమిత్ షా తిరుపతి వచ్చిన సమయంలోనే, అమరావతి రైతుల పై లాఠీ చార్జ్ జరిగింది. అదే సమయంలో అమిత్ షా నెల్లూరులో ఉన్నారు, సారిగ్గా ఆక్కడే ఈ సంఘటన జరిగింది. అప్పటికే కేంద్ర ఐబి వర్గాలు అమిత్ షా రాక సందర్భంగా అక్కడే ఉండటంతో, లాఠీ చార్జ్ విషయం అమిత్ షా కి నివేదించారు. ఆ తరువాత రోజే, బీజేపీ నేతలకు అక్షింతలు పాడ్డాయి. అమరావతి ఉద్యమంలో పాల్గునాలని ఆదేశాలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఢిల్లీ నుంచి ఒక ప్రముఖుడు ఫోన్ చేసి, అమరావతి విషయంలో న్యాయ పరంగానే కాక, ప్రజల్లో కూడా మీకు ఇబ్బందులు తప్పవని, వెంటనే మూడు రాజధానులు సమీక్ష చేయాలని చెప్పటంనే, ఎవరికీ లొంగని జగన్ మోహన్ రెడ్డి, తప్పని సరి పరిస్థితిలో ఆ ఢిల్లీ ప్రముఖుడి మాటలకు తలోగ్గాల్సి వచ్చిందని ఆ వార్త సారంశం.

వరద ప్రభావిత ప్రారంటల్లో పర్యటన చేస్తున్న చంద్రబాబు, రెండో రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రాయలచెరువుకు చంద్రబాబు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రగిరి దగ్గర పోలీసులు, చిత్తూరు టిడిపి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నానికి, చంద్రబాబుకు ఇవ్వమని నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో చంద్రబాబు రాయలచెరువుకు వెళ్ళవద్దు అంటూ నోటీసుల్లో తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం ఆ నోటీసులు పట్టించుకోలేదు. రాయలచెరువుకు వెళ్లి తీరాలని, ముందుకు వెళ్ళాలని చెప్పారు. రాయలచెరువు దగ్గర పరిస్థితి ఎలా ఉందో సమీక్ష చేయాల్సిందే అని చంద్రబాబు తెలిపారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ రాయలచెరువుకు చేరుకుంది. రాయలచెరువు కట్ట తెగిన దగ్గరకు చంద్రబాబు చేరుకున్నారు. రాయలచెరువు పరిస్థితి, అక్కడ చేస్తున్న పని వివరాలు, అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఎప్పటి లోగా గండి పూడ్చుతారో వివరాలు అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. అయితే చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం, చంద్రబాబు ఆ నోటీసులు పట్టించుకోక పోవటంతో, ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతవరణం నెలకొంది. పోలీసులు ఆయన్ను అడ్డుకుంటారు ఏమో అని అందరూ భావించారు. కానీ అలాంటి ప్రయత్నం చేయలేదు.

cbnrayalacheruvu 24112021 2

అంతకు ముందు తిరుపతిలో మాట్లాడిన చంద్రబాబు, ప్రధానంగా పలు అంశాలు ప్రస్తావించారు. తాను పరిపాలనలో ఉన్నప్పుడు వచ్చిన హూద్ హూద్ తుఫాను తాను ఎలా పని చేసింది చెప్తూ, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎలా పని చేస్తుందో వివరించారు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో వివరించారు. మేము ఉన్నామని మనోధైర్యం ఇచ్చేందుకు వచ్చానని చంద్రబాబు అన్నారు.పెద్దఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే తెలిపినా ప్రభుత్వం ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. ఈ సీఎం గాలిలో తిగుగుతున్నారని అన్నారు. వరదతో ప్రజలు అల్లాడుతుంటే అసెంబ్లీ వాయిదా వేసుకుని సీఎం రావాలి కదా అని అన్నారు. వరద సమస్యలపై నిర్ధిష్టమైన డిమాండ్లు పెడదాం అని, సమస్యలు పరిష్కరించేవరకు పోరాడతాం అని చంద్రబాబు తెలిపారు. నిన్న చంద్రబాబ కడపలో పర్యటించారు. ఈ రోజు చిత్తూరులో చంద్రబాబు పర్యటిస్తున్నారు. రేపు చంద్రబాబు నెల్లూరులో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకుని సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వారు ఎవరూ, ఈ నిర్ణయం ఊరుకే తీసుకుని ఉండరు అంటూ అభిప్రాయ పడుతున్నారు. దీని వెనుక ఏదో స్కెచ్ ఉండే ఉంటుందని అంటున్నారు. తరువాత కొత్త బిల్లు వస్తుందని చెప్తున్నా, అది జరిగే పనిలా అనిపించటం లేదు. అయితే ఇప్పుడు మరో సంచలన విషయం బయట పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజధాని అభివృద్ధి పేరిట ఏకంగా రూ.50 వేల కోట్ల రుణాలకు టెండర్ పెట్టింది. గతంలో రాజధాని నిర్మాణం కోసం డబ్బులు వద్దు అని చెప్పిన ప్రపంచ బ్యాంక్ వద్దకే ఏపి ప్రభుత్వం మళ్ళీ రుణం కోసం పరుగులు తీస్తుంది. ప్రధానంగా, ప్రపంచ బ్యాంక్ రుణం తీసుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించటంతో, ఏ రాజధాని అభివృద్ధి కోసం ఈ రూ.50 వేల కోట్ల రుణం తీసుకున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రాజధాని రుణం పేరిట ఈ రూ.50 వేల కోట్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతంలో ప్రపంచ బ్యాంక్ రుణాలను మంజూరు చేసేందుకు అప్పట్లో, అంటే చంద్రబాబు ప్రభుత్వం ఉండగా, ప్రపంచ బ్యాంక్ ముందుకు వచ్చింది.

amaravati 24112021 2

అప్పట్లో వైసీపీకి చెందిన కొంత మంది ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసారు. అయితే ప్రపంచ బ్యాంక్ మాత్రం, అంతా సక్రమంగానే ఉన్నాయని, రుణం ఇస్తామని ముందుకు వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. మూడు రాజధానులకు వెళ్తున్నామని చెప్పి, అప్పట్లో ప్రపంచ బ్యాంక్ రుణం వద్దని చెప్పింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ రూ.50 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పటికే మూడు రాజధానులు బిల్లు ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇక్కడ ప్రపంచ బ్యాంక్ తో వ్యవహారం కాబట్టి, ఇంత పెద్ద మొత్తంలో రూ.50 వేల కోట్ల రుణం ఇవ్వాలి అంటే అంతా పక్కాగా ఉండాలి. అందుకే ఎలాగూ మూడు రాజధానులు కోర్టులో కొట్టేస్తారు కాబట్టి, ఆ బిల్లు వెనక్కు తీసుకుని, ఇప్పుడు అమరావతే రాజధానిగా చూపిస్తి, భారిగా రూ.50 వేల కోట్ల రుణం తీసుకునేందుకు, ప్రభుత్వం స్కెచ్ వేసినట్టు స్పష్టం అవుతుంది. మరి ఇది ఎన్ని ములుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read