శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. గత రెండేళ్లుగా క-రో-నా కారణంతో, పరిమిత సంఖ్యలోనే భక్తులకు దర్శన అనుమతులు ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. క-రో-నా కారణంతో, సర్వ దర్శనం నిలిపి వేసి, కేవలం 300 రూపాయల దర్శనం అమలు చేసింది. కేవలం ఆన్లైన్ లోనే టికెట్లు అమ్మకాలు పెట్టిన సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా సర్వ దర్శనం టికెట్లు కూడా టిడిపి కొద్ది మేరకు అనుమతి ఇచ్చింది. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం, క-రో-నా కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుముఖం పట్టాయి కాబట్టి, శ్రీవారి దర్శన టికెట్లు దశల వారీగా పెంచుకుంటూ వెళ్తామని టిటిడి చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దశల వారీగా పెంచుకుంటూ వెళ్తామని, అలాగే నడకదారిన వెళ్ళే భక్తులకు కూడా టికెట్లు జారీ చేసే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. ఆర్జిత సేవలకు కూడా, శ్రీవారి భాకులను అనుమతి ఇచ్చే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నామని, త్వరలోనే ఈ అంశం పై స్పష్టత ఇస్తామని చెప్పారు. 

కుప్పంలో వైసీపీ అరాచకాలు మొదలు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నట్టే, ఇక్కడ వైసీపీ అరాచకాలు మొదలు పెట్టింది. తమ ప్లాన్ అమలు చేస్తుంది. ఇవి పసిగట్టిన తెలుగుదేశం పార్టీ, పక్కా ఆధారాలతో, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మరి ఎలక్షన్ కమిషన్ ఏమి చేస్తుందో కానీ, ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలు ఇచ్చింది. కుప్పం మున్సిపాలిటీలోకి బయట వ్యక్తులు వచ్చారు అంటూ టీడీపీ ఫిర్యాదు చేసింది. కుప్పం నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కుప్పంలో తిష్ఠవేశారని వారి పై చర్యలు తీసుకుని, వారిని పంపించి వేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ నేత అశోక్‍బాబు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. కుప్పంలో ఇప్పటికే ప్రచార పర్వం ముగిసిందని, అయినా కూడా కుప్పంలో బయట వ్యక్తులు ఇక్కడే ఉన్నారని, వారిని వెంటనే బయటకు పంపించి వేయాలని కోరారు. ముఖ్యంగా పక్క నియోజకవర్గాలు అయిన, పుంగనూరు, తంబాలపల్లి నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చారని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇప్పటికే వీళ్ళు అందరూ, కుప్పంలో తిష్ట వేసుకుని కూర్చున్నారని, వారి పై చర్యలు తీసుకోవాలని, వారు ఎక్కడ తిష్ట వేసింది కూడా ఆధారాలు ఇస్తున్నాం అంటూ, ఆ వివరాలు కూడా ఇచ్చారు.

kuppam 14112021 2

ఇప్పటికే కుప్పం ప్రాంతానికి,15 కిలోమీటర్ల దూరంలో 300 మందికి అన్ని ఏర్పాట్లు చేసి, వారిని అక్కడ ఉంచారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపుగా 300 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర స్థానిక సంస్థల నేతలు వచ్చేసారని తెలిపారు. వాళ్ళు వచ్చిన కారు నంబర్లతో సహా ఫిర్యాదు చేసారు. అలాగే ఓట్లకు డబ్బులు పంచుతున్న వీడియోలు కూడా తమ ఫిర్యాదుకు జత పరిచారు. ఇక కుప్పంలోని రాజా పార్కులో ఉన్న కమ్యూనిటీ హాలులో 60 మందిని ఉంచారని, వాటి ఆధారాలు కూడా ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చారు. అలాగే తంబాలపల్లి నుంచి 500 మంది మహిళలు వచ్చారని, వారికి కూడా కుప్పంలో వసతి కల్పించారని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చారు. కుప్పం వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా వైసీపీ శ్రేణులకు వసతి కల్పించారని, అన్నారు. ఇక దాదపుగా వందమంది డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా రంగంలోకి దింపారని, వారికి సీఎల్‍ఆర్‍సీ భవనంలో వసతి కల్పించారని చెప్తూ, వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇస్తూ, వారి పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరారు.

ఆదివారం విశాఖలో ఒక్కసారిగా ప్రజలకు ఉలిక్కి పడ్డారు. విశాఖలో పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు చెప్పారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసారు. సుమారుగా 7.14 నిమిషాలకు భూమి కంపించింది. భూప్రకంపనలతో పాటుగా, భారీ శబ్దం కూడా వినిపించటంతో, భాయందోళనకు గురయ్యారు. అక్కయ్యపాలెం, మధురానగర్,  తాటిచెట్లపాలెం, సీతమ్మధార, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 3.6 గా నమోదు అయ్యిందని, అధికారులు చెప్తున్నారు. గాజువాక సమీపంలో ఇది కేంద్రీకృతం అయ్యిందని తెలుస్తుంది. గతంలో ఏడు రోజులు క్రితం కూడా విశాఖలో ప్రకంపనలు వచ్చాయని, కానీ సిటీకి వెలుపల రావటం వల్ల, అది రికార్డుల్లో రాలేదని చెప్తున్నారు. అయితే ప్రకంపనలతో పాటుగా, పెద్ద శబ్దం కూడా రావటంతో, ఒక్కసారిగా విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. అధికారులు మాత్రం ఎలాంటి భయం లేదని చెప్తున్నా, వరుసగా వస్తున్న ఈ ప్రకంపనల పై అయితే, ప్రజల్లో ఆందోళన ఉంది.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని చోట్ల జరుగుతున్నట్టే ఇక్కడ కూడా, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, టిడిపిని ఇబ్బంది పెడుతున్నారు వైసీపీ నేతలు. నెల్లూరు కార్పొరేషన్ 4వ డివిజన్ అభ్యర్థి భర్త మామిడాల మధుని పోలీసులు అరెస్టు చేసారు. నిన్న అర్ధరాత్రి మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, నవాబ్‍పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. జేబులో రూ.2 వేలు ఉన్నాయనే కారణం చెప్పి, నిర్బంధించారని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళన చేస్తున్నాయి. అరెస్ట్ సమాచారం అందుకున్న టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసుల తీరుకు నిరసనగా, నిన్న అర్ధరాత్రి నుంచి పోలీసు స్టేషన్ ఆవరణలో కోటంరెడ్డి బైఠాయించారు. తమ పార్టీకి చెందిన మధును అకారణంగా అరెస్ట్ చేసారని, విడుదల చేయాలని ఆందోళన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చేస్తున్నారు. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పోలీసుల తీరుకి నిరసన తెలుపుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read