ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా షాక్ ఇచ్చింది. నిజానికి ఇది కేంద్రం షాక్ కాదు, మన రాష్ట్రం చేసుకున్నదే. రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను, అంటే కాపిటల్ expenditure లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరుకోలేక పోయింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న రాష్ట్రాలకు, కేంద్రం ఎఫ్ఆర్‌బీఎంకు అదనంగా రూ.16,691 కోట్లు రుణం ఇచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక శాఖా ఆయా రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. అదనపు రుణం అర్హత పొందే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్ తో పాటుగా, మన పక్కన ఉన్న తెలంగాణ కూడా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చోటు దక్కలేదు. దీంతో ఇక అదనపు రుణం పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. ఏపి మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవటంలో, ఈ సెకండ్ క్వార్టర్ లో బాగా వెనుకపడింది. అయితే మొదటి క్వార్టర్ లో మాత్రం, ఏపి ఈ లక్ష్యాలను చేరుకుంది. అప్పట్లో దాదాపుగా రూ.3 వేల కోట్లు అదనపు రుణం ఏపి పొంద గలిగింది. కానీ రెండో క్వార్టర్ లో మాత్రం, ఏపి వెనుక బడింది. దీంతో ఈ అదనపు రుణం పొందాలి, ఎక్కువ అప్పు చేయలని అనుకున్న ఏపి, ఈ సారి ఆ అర్హత కోల్పోయింది.

jaggan 12112021 2

అయితే మన పక్కన ఉన్న తెలంగాణా మాత్రం, మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవటంతో, వారికి ఎఫ్ఆర్‌బీఎంకు అదనంగా రూ.5 వేల కోట్లు అదనంగా అప్పు తీసుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఈ అపవాదు ఉంది. తెస్తున్న అప్పును ఆస్తులు సృష్టించటంలో వెనుకబడుతూ, కేవలం వాటిని పప్పు బెల్లాలు లాగా పంచేస్తున్నారని, దీని వల్ల అప్పు తీసుకున్న పర్పస్ నెరవేరటం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు పై విమర్శలు వస్తున్నా, ఈ సారి కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అయితే ఇలాంటి రాష్ట్రాల కోసమే కేంద్రం గత ఏడాది, మూలధనం వ్యయం కోసం, ఎక్కువ ఖర్చు పెడితే, అదనంగా రుణం పొందే అవకాసం ఇస్తామని చెప్పింది. అయితే ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో, అసలు జీతాలు ఇవ్వటానికే దిక్కు లేదు, ఇక మూలధనం వ్యయం పై ఏమి ఖర్చు పెడతారు ? అందుకే ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో వెనుక బడింది.

ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. ఇప్పటికే అప్పులు విషయంలో, రాష్ట్ర పరువు దేశ వ్యాప్తంగా పోయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారుతూ ఉండటంతో, అన్ని ఫైనాన్స్ సంస్థలు మనల్ని పక్కన పెట్టినట్టు చూస్తున్నాయి. ఇక పొతే, ఈ మధ్య ప్రపంచ బ్యాంక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం నేపధ్యంలో, ఇప్పుడు మరో సంస్థ కూడా ఏపి ప్రభుత్వాన్ని దూరం పెట్టింది. ఇక నుంచి ఏపి ప్రభుత్వానికి ఎలాంటి మెడికల్ డివైజస్ సరఫరా చేయవద్దు అంటూ, ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ ఇండస్ట్రీ, రెడ్ నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు సంబంధించిన రెడ్ నోటీసులను తన వెబ్సైటులో ఉంచింది. దాదాపుగా మూడు ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి బిల్లులు చెల్లించక పోవటం, ప్రభుత్వం తీసుకున్న ఆర్డర్లుకు ఏవైతే టెండర్లు దక్కించుకుని వాళ్ళు, మెడికల్ దివైజస్ సరఫరా చేసారో, వాటి అన్నిటికీ నేటి వరకు, నయా పైసా బిల్లు ఇవ్వక పోవటంతో, అనేక సార్లు సంప్రదింపులు జరిపినా కూడా ఫలితం లేకపోవటంతో, ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ ఇండస్ట్రీ ఈ రోజు రెడ్ నోటీస్ జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెడ్ నోటీస్ జారీ చేస్తూ, తమ వెబ్సైటులో పెట్టింది.

amed 12112021 2

తమ ఆధ్వర్యంలో ఉండే ఆ ఇండస్ట్రీ సమాఖ్యలో ఉండే 500 కంపెనీలను ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబందించిన టెండర్ లో పాల్గునవద్దని, ఎటువంటి ఉపకరణాలు సరఫరా చేయవద్దు అని కూడా ఆ రెడ్ నోటీసు లో పేర్కొంది. అదే విధంగా ఎవరైనా సరఫరా చేయాలి అనుకుంటే, అది మీ ఓన్ రిస్క్ అని, అది తమకు సంబంధం లేదని తెలిపింది. అయితే ఒక వేళ ఎవరైనా సరఫారా చేయాలి అనుకుంటే మాత్రం, వంద శాతం డబ్బు అడ్వాన్స్ గా చెల్లించిన తరువాత మాత్రమే, ఆయా టెండర్లకు సంబంధించిన సరుకు సరఫరా చేయాలని సూచించింది. దాదాపుగా వేల కోట్ల రూపాయల బిల్లింగులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. ఎవరు అయితే సరఫరా చేసారో, ఆ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపినా ఉపయోగం లేకపోవటంతో, ఇండియన్‌ మెడికల్‌ డివైసెస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారం, మొత్తం తమ సమాఖ్యకు ఈ మేరకు తమ వెబ్సైటులో ఉంచుతూ, ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇది ఏపి ప్రభుత్వానికి పరువు పోయే విషయం అనే చెప్పాలి. మరి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

అధికారం మాదే కదా అని, ఇష్టం వచ్చినట్టు కేసులు తీసివేస్తే రాజ్యాంగ వ్యవస్థలు చూస్తూ కూర్చుంటాయా ? సరిగ్గా అదే జరిగింది ఈ రోజు హైకోర్టులో. కృష్ణా జిల్లా జగ్గయపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో ఈ రోజు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పైన ఉన్న పది కేసులు ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల పై హైకోర్ట్ లో సవాల్ చేసారు. ఏపీజేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు వేసిన ఈ పిటీషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ కేసులో పిటీషనర్ తరుపున న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. ఒక జీవోతో ప్రభుత్వం, పది కేసులు ఉపసంహరించుకోవటం ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటూ, ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. సీరియస్ నేచర్ ఉన్న ఈ కేసుల్లో ఉపసంహరణ అనేది సాధ్యం కాదని చెప్పి, వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని, ఈ కేసులు ఉపసంహరణకు సంబంధించి, ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యుటర్ నిర్ణయం తీసుకోవాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వటం ఏమిటి అంటూ, హైకోర్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో పాటుగా, ఇంత సీరియస్ నేచర్ ఉన్న కేసులని ఉపసంహరించుకోవటానికి గల కారణాలు, ప్రభుత్వం అనుసరించిన విధివిధానాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

hc udyabhanu 12112021 2

దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రధానంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, అదే విధంగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాష్ట్ర డీజీపీకి, హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి ఒకే వ్యక్తి పైన, పది కేసులు ఉపసంహరించుకోవటం ఏమిటి అంటూ కోర్టులో వాదనలు జరిగాయి. ఏ విధమైన రూల్స్ పాటించి, ఈ కేసులు తీసి వేసారో చెప్పాలి అంటూ హైకోర్ట్ ముందు వాదనలు వినిపించారు. ఇది చట్ట విరుద్ధం అని వాదించారు. హైకోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించి నోటీసులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఇలా అనేక మంది ప్రజాప్రతినిధుల పై కేసులు ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాక్ష్యాత్తు జగన్ మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు కూడా, ఆధారాలు లేవని, సమాచారం లేదని ఇలా రకరకాల కారణాలతో కేసులు ఉపసంహరించుకున్నారు. దీని పైన కూడా ఇప్పటికే కోర్టులో కేసులు ఉన్నాయి. అధికారం ఉంది కదా అని, ఏది పడితే అది చేస్తే, కోర్టులు చూస్తూ ఊరుకోవు అని మరోసారి రుజువు అయ్యింది.

గత కొంత కాలంగా అటు ఉద్యోగ సంఘలాకు, ఇటు ప్రభుత్వానికి మధ్య పీఆర్సి విషయంలో కోల్డ్ వార్ జరుగుతుంది. పీఆర్సి నివేదిక ఇప్పటికే 34 నెలల పాటు ఆలస్యం అయ్యింది. ఇప్పటి వరకు పీఆర్సి నివేదిక ఉద్యోగ సంఘాల చేతికి రాలేదు. అయితే పీఆర్సి నివేదిక ఒక వారం రోజుల్లో ఇస్తామని గత నెల 29వ తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో హామీ ఇచ్చారు. అయితే వారం దాటినా ఇవ్వకపోవటంతో, ఉద్యోగ సంఘాలు వచ్చి సచివాలయంలో ఆరు గంటల పాటు నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. అటు చీఫ్ సెక్రటరీ నుంచి కానీ, సియం ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి సమాచారం లేకపోవటంతో, చివరకు వాళ్ళు వెనుతిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఈ రోజు ఆర్ధిక అంశాల పై పెట్టారు కాబట్టి, ఇందులో ఉద్యోగులకు సంబంధించిన ఆర్ధిక అంశాలు అయిన పీఆర్సి చాలా ముఖ్యం అని, అటు ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు గట్టిగా ఈ విషయం పై అడిగాయి. మొత్తం 13 ఉద్యోగ సంఘాలలో, పది సంఘాలు ఈ రెండు సంఘల్లోనే ఉన్నాయి. దీంతో పీఆర్సి గురించి సమావేశంలో ఈ సంఘాలు పట్టుబట్టాయి. అయితే పీఆర్సి విషయం, ఈ సమావేశంలో సరైన చర్చ జరగకపోవటంతో, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి.

employees 12112021 2

ప్రభుత్వ తీరుకి నిరసనగా, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి మధ్యలోనే బయటకు వచ్చాయి ఉద్యోగ సంఘాలు. ఏపీజేఏసీ నేత బొప్పరాజు మాట్లాడుతూ, అక్టోబర్ 29 నాటి భేటీలో ఇస్తామన్న నివేదిక ఇంకా ఇవ్వలేదని అన్నారు. కనీసం ఇవాళ్టి సమావేశంలో అయినా ఇస్తారని ఆశించాం అని, అయితే అధికారులు మాత్రం పీఆర్సీ నివేదిక ఊసే ఎత్తడం లేదని అన్నారు. అధికారుల కమిటీ మళ్లీ అధ్యయనం చేయడం ఏమిటీ? మేం అడిగిన అంశాలకు స్పష్టంగా సమాధానం ఇవ్వలేదని, ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తాం అని బొప్పరాజు డిమాండ్ చేసారు. ఇక ఏపీఎన్జీఓ నేత బండి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదో అర్ధం కావటం లేదని అన్నారు. రిపోర్ట్ ఇచ్చి మూడేళ్లయ్యిందని, మాముందు పెట్టటానికి ఎందుకు ఇబ్బంది అంటూ ప్రభుత్వాన్ని నిలదీసారు. ఇక జిల్లా స్థాయి ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఏపీఎన్జీఓ నేత బండి శ్రీనివాస్ తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read