రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అడ్డగోలుగా వ్యవహరిస్తుందనే వార్తలు గత వారం రోజులుగా వస్తున్నాయి. అయితే నిన్న విశాఖలో కొత్త రకమైన మాయాజాలానికి ఆర్వో వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. జీవీఎంసి ఉప ఎన్నికల్లో 31 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్ధిగా బిపిన్ కుమార్ జైన్ అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసారు. ఈ నెల 5వ తేదీన ఆర్వో బిపిన్ కుమార్ జైన్ ని కాంగ్రెస్ అభ్యర్ధిగా ధృవీకరించారు. అయితే, నిన్న గడవు లోగా అతను కాంగ్రెస్ అభ్యర్ధిగా, కాంగ్రెస్ పార్టీ బీ-ఫారం ఇవ్వక పోవటంతో, అతన్ని నిన్న మధ్యానం 3.30 గంటలకు స్వతంత్ర అభ్యర్ధిగా డిక్లేర్ చేసారు. అయితే మధ్యానం 3.30 తరువాత, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చక్రం తిప్పి, అక్కడ 31వ వార్డులో అప్పటికే అయుదు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా నామినేషన్ వేసిన వారు అందరూ కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎందుకు ఇలా చేసారో తెలియదు. అయితే స్వతంత్ర అభ్యర్ధి అని బిపిన్ కుమార్ జైన్ కు బీరువా గుర్తును కేటాయించిన ఆర్వో, సాయంత్రం 6.30కు రిలీజ్ చేసిన లిస్టులో, బిపిన్ కుమార్ జైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అని, ఆయనకు ఫ్యాన్ గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

vizag 09112021 2

ఎన్నికల నిబంధనలు ప్రకారం 3.30 తరువాత, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యర్ధిని, వైఎస్ఆర్ కాంగ్రస్ అభ్యర్ధిగా ప్రకటిస్తూ చేయటం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి వ్యవహారం అయితే ఎక్కడా చోటు చేసుకోదు కానీ, ఈ వింతలు, మాయలు అన్నీ ఆంధ్రప్రదేశ్ లో అయితే చోటు చేసుకుంటాయి. అధికార పార్టీ నేతలు, ఆర్వో పై ఒత్తిడి తెచ్చి, బిపిన్ కుమార్ జైన్ అనే వ్యక్తిని , ఇండిపెండెంట్ అభ్యర్ధి అని బీరువా గుర్తు కూడా ఇచ్చి, తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అని ఫ్యాన్ గుర్తు ఇచ్చారు. అంటే బిపిన్ కుమార్ జైన్ ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ అభ్యర్ధిగా, నిన్న మధ్యానం 3.30 గంటల వరకు కాంగ్రెస్ బీ-ఫారం ఇవ్వక పోవటం, స్వతంత్ర అభ్యర్ధిగా మారి, చివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చక్రం తిప్పటంతో, సాయంత్రం 6.30కు అదే బిపిన్ కుమార్ జైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అయ్యారు. ఈ వింత పరిస్థితి చూసి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆందోళనకు పిలుపు ఇచ్చాయి. ఇంకా ఎన్ని ఎన్ని వింతలు చూడాలో.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు నిన్న తారా స్థాయికి వెళ్ళాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత టిడిపి నుంచి నామినేషన్లు వేయకుండా చూసారు. అయితే ఈ సారి టిడిపి అభ్యర్ధులు ధైర్యం చేసి వేయాటంతో, వారిని కిడ్నాప్ చేయటం, నామినేషన్ కాగితాలు చింపివేయటం ఇలాంటి అరాచకాలు చేసారు. అయితే టిడిపి వ్యూహత్మకంగా డమ్మీ అభ్యర్ధులను కూడా నిలబెట్టింది. తరువాత నామినేషన్లు చెల్లకుండా చూడాలి అనే వైసీపీ ఎత్తుగడను కూడా చేదించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ వచ్చింది. ఇక్కడ కూడా టిడిపి అభ్యర్ధులు లొంగ లేదు. దీంతో కొన్ని చోట్ల వారి సంతకాలు ఫోర్జరీ చేసి, పోటీలో లేనట్టు నిన్న అధికారులు ప్రకటించిన తీరు చూసి, ఇది ప్రజాస్వామ్యమేనా అనిపించింది. ముఖ్యంగా కుప్పంలో అరాచకాలు తారా స్థాయికి చేరాయి. చంద్రబాబుని ఓడించి, పరువు తీయాలనే ఉద్దేశంతో, దిగజారి ప్రవర్తిస్తున్నారు. నిన్న 5 గంటలు లోపు తుది జాబితా ఇవ్వాల్సి ఉన్నా, నిన్న ఎనిమిది గంటల వరకు తుది జాబితా ప్రకటించ లేదు. దీంతో టిడిపి ఆందోళన చేయటంతో, చివరకు కుప్పం 14వ వార్డు టిడిపి అభ్యర్ధి ఉపసంహరించుకున్నట్టు అధికారులు తెలపటంతో, తెలుగుదేశం నేతలు, చివరకు ఆ అభ్యర్ధి కూడా షాక్ అయ్యారు.

kuppam 09112021 2

ఇక్కడ అధికారుల వింతతో, వింతల్లో వింత చోటు చేసుకుంది. కుప్పం 14వ వార్డు అభ్యర్ధి ప్రకాష్ నామినేషన్ వేసిన తరువాత సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. ఆయన దాదాపుగా కుప్పం నుంచి 300 కిమీ దూరంలో ఉన్నారు. అయితే నిన్న అతను సంతకం పెట్టి, నామినేషన్ ఉపసంహరించుకున్నారు అంటూ అధికారులు చెప్పటంతో, అసలు కుట్ర బయట పడింది. అతని సంతకం ఫోర్జరీ చేసినట్టు టిడిపి నేతలు చెప్తున్నారు. నిన్న రాత్రి ప్రకాష్ కూడా వీడియో విడుదల చేస్తూ, తాను కుప్పం నుంచి 300 కిమీ దూరంలో ఉంటే, ఎలా ఉపసంహరించుకుంటాను అంటూ ప్రశ్నించింది. దీంతో ఒక్కసారిగా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డుపై బైఠాయించి టీడీపీ శ్రేణుల ఆందోళన చేసాయి. కుప్పం మున్సిపల్ కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. టిడిపి శ్రేణులు, పోలీసులు మధ్య జరిగిన తోపులాటలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చొక్కా చిరిగింది. మొత్తం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ అరాచకాలు చేస్తున్నారని, టిడిపి ఆరోపిస్తుంది.

ఈ రోజు అనంతపురం జిల్లాలో ఎస్ఎస్‌బిఎన్ కళాశాలలో విద్యార్ధుల పై విరిగిన లాఠీల పై, అన్ని వైపుల నుంచి ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్టంలోన అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఎయిడ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ విద్యా సంస్థలు మూసివేయటమో లేక, ప్రైవేట్ వాళ్లకి అమ్ముకోవటమో చేయాలి. ఇలా చేస్తే, ఇక్కడ చదువుకునే వారి ఫీజులు అధికం అవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అనేక ఎయిడెడ్ విద్యా సంస్థలకు గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాలు కొంత మేర ఆదుకుంటూ కొంత ఎయిడ్ ఇస్తాయి. వాటితో నిర్వహణ తేలిక అవుతుంది కాబట్టి, ఇక్కడ ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. అందుకే ఎక్కువ మంది పేద, మధ్య తరగతి విద్యార్దులు ఇక్కడ చదువుకుంటారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ నిర్ణయం పై అనేక ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పుడు తాజాగా అనంతపురం ఎస్ఎస్‌బిఎన్ కళాశాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు ఆందోళన చేసారు. విద్యార్ధి సంఘాలతో కలిసి విద్యార్ధులు చేసిన ఈ ఆందోళన, ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసే దాకా వెళ్ళింది.

atp police 08112021 2

ఆ వీడియోలు, ఫోటోలు చూసిన చాలా మంది, పోలీసులు, ప్రభుత్వం తీరుని తప్పుబట్టారు. దీని పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ లో స్పందిస్తూ, ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. అయితే దీని పై అనంతపురం పోలీసులు చంద్రబాబు ట్వీట్ కు రిప్లై ఇస్తూ, అసత్య ప్రచారం అని కొట్టి పారేసారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదని, విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తోపులాట జరిగిందని, అసత్య ప్రచారాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ, చంద్రబాబు ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. అయితే పోలీసుల తీరు పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనేక వీడియోలు, ఫోటోలలో విద్యార్ధుల పై పోలీసుల వ్యవహరించిన తీరు కనిపిస్తుంటే, కేవలం తోపులాట అని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎలా అంటారు అంటూ, ఆ ఫోటోలు, వీడియోలు పెట్టి అనంతపురం పోలీసులకు కౌంటర్ ఇచ్చారు. మరి అనంతపురం పోలీసులు ఏమని రిప్లై ఇస్తారో చూడాలి.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల పై, ఆమె దృష్టికి తీసుకొచ్చారు. నెల్లూరులో, కుప్పంలో, దర్శిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాల పై  రాష్ట్ర ఎన్నికల కమీషనర్ దృష్టికి తెచ్చారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. అక్కడ సకాలంలో అభ్యర్ధుల జాబితాను ప్రకటించికుండా ఫోర్జరీ సంతకాలు పెట్టి, తెలుగుదేశం అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరించారని ఆమెకు ఫిర్యాదు చేసారు. ఎక్కడైతే అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించకుండా ఎకాగ్రీవాలు చెప్తున్నారో, అక్కడ వెంటనే ఎన్నికలు ఆపాలని, వెంటనే విచారణ జరిపి, బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని నీలం సాహనీని చంద్రబాబు కోరారు.

Advertisements

Latest Articles

Most Read