టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన వివరాలు. రాష్ట్రంలో అరాచక, దుర్మార్గ పాలన నడుస్తోంది. దీపావళిని హిందువులంతా ఆనందంగా జరుపుకుంటారు. అలాంటి పండుగ రోజున ఎన్నికలు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తున్నారా? పలానా రోజులో ఎలక్షన్ అయిపోవాలని ముఖ్యంత్రి కేబినెట్ మీటింగ్ లో చెప్తే.. ఎస్ఈసీ దానికి తానాతందానా అంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏం కొంపలు మునిగిపోయాయని పండగ రోజు ఎన్నికలు పెడుతున్నారు. మీ నెత్తినేమైనా క-త్తి వుందా..ఎస్ఈసీ.? మీ ఇష్టానుసారంగా ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా పండగరోజు నామినేషన్ వేయాలా.? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అభ్యర్థులు, పార్టీ నాయకులకు 16 సూచనలు పంపుతున్నా. వైసీపీ నేతలు ఎన్నికలను ప్రహసనంగా తయారు చేశారు. నీచాతి నీచంగా తయారు చేశారు. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు జరిగిన తీరును నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. పోలీసులు వచ్చి నామినేషన్లు వేయకుండా బెదిరించారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. అయినా ముందుకు వెళ్లిన వారిని తరిమికొట్టారు. ఒకవేళ నామినేషన్ వేసినా రక్షణ కల్పించాల్సిన పోలీసులే వెంటాడారు. అధికార పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులు నామినేషన్ పత్రాలు చించేశారు. మరికొన్ని పరిశీలనలో సరిగా లేవని అకారణంగా తొలగించారు. అన్నీ అధికమించి పోటీలో నిలబడితే లైట్లు ఆపి ఫలితాలను ప్రకటించుకున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం, ఎగతాలి చేయడం కాదా.? ఉ-న్మా-దు-లు, పిచ్చోళ్లు ఇలాంటి పని చేస్తారు. ఎన్నికలు సజావుగా జరగాలని కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. అక్కడి నుండి కొన్ని ఆదేశాలు వచ్చాయి.

cbn 04112021 2

గత ఎన్నికల్లో పుంగనూరు మున్సిపాలిటీలో కమిషనర్ లోకేశ్వర్ వర్మపై ఎన్నికల సంఘానికి గతంలో ఫిర్యాదు ఇచ్చాం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి, కింద అధికారులను లోబరుచుకుని, పోలీసులు కూడా వైసీపీకి అనుకూలించి ఏకపక్షంగా చేసుకునేలా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వాటిన్నింటికీ ఈ లోకేశ్వర్ వర్మ లోగుట్టు ఆదేశాలు ఇచ్చారు. గతంలో పుంగనూరులో జరిగినవన్నీ ఆధారాలతో సహా చూపించాం. పుంగనూరులో 24 మంది అభ్యర్థులు ధైర్యంగా టీడీపీ తరపున నామినేషన్ వేశారు. నామినేషన్లు అన్నీ చించేసి 24 నామినేషన్లు ఏకగ్రీవం చేశారు. 8,9, 14,15 వార్డులకు కొత్త నామినేషన్ వేసే అవకాశం అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చారు. ఫోటోలు చూపిస్తూ.... పెద్దిరెడ్డ రామచంద్రారెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో కమిషనర్ లోకేశ్వర వర్మ పాల్గొన్నారు. మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన కూడా పుంగనూరు వ్యక్తే. ఇప్పుడు అతన్ని కుప్పంలో వేశారు. పెద్దిరెడ్డికి చెంచా. పెద్దిరెడ్డి ఇంట్లో పెట్టుకో. పోలీసులను, అవినీతి పరులను పెట్టుకుని అక్రమాలు చేస్తున్నారు. వెలుగు సిబ్బంది, సంఘమిత్రులతో సమావేశాలు పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలని చెప్తున్నారు. కింది అధికారులను పిలిచి ఏకగ్రీవం చేయాలని చెప్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఏకైక పార్టీ టీడీపీ. ఆగస్టు సంక్షోభంలోనూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే 30 రోజులు పోరాడి తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్లి ప్రజలు, కార్యకర్తలు పడుకున్నారు. మిమ్మల్ని చరిత్ర హీనులుగా నిలబెడతాం. మీకు ఎన్నికల అధికారులు సహకరించవచ్చు. ఉన్నాద పాలన పెట్టుకుని చేస్తామంటే కుదరదు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి. ఏం చేస్తోంది ఎన్నికల కమిషన్.? ఫిర్యాదులు ఉన్న అధికారులను ఎన్నికల్లో వేస్తారా.? ఏం చేసినా అడిగేవారు లేరని, ముఖ్యమంత్రి తుగ్లక్ ఉన్నాడు, అడిగింది చేస్తాడని అనుకుంటున్నారు. మీ అంతం ప్రారంభం అవుతుంది గుర్తుంచుకోవాలి.

ఇలాంటి వింతలు ఎప్పుడైనా చూశామా? ప్రజలు ఆలోచించాలి. ఎన్నికలంటే ఊరికొక ఆంబోతు , రౌడీలు తయారై ప్రజల్ని బెదిరిస్తున్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకోండి. రేపు అనే ఒక రోజు ఒకటి ఉంది. మీకు అంత భరోసా వుంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి ప్రజలు మీ బట్టలూడదీస్తారు? మీలాగా మేం మాట్లాడలేమా? మేం దా-డు-లు చేయలేమా? కానీ మా సంస్కారం అది కాదు. నెల్లూరు, గురజాల, బేతంచెర్ల ఎన్నికలపై లేఖ రాస్తే ఒక కాగితం మాత్రం చూశారు. కోడ్ వచ్చాక అందరూ దాని పరిధిలో ఉండాలి. ముఖ్యమంత్రి, మంత్రులు, సాక్షి గుమాస్తా ఇష్టమెచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదు. నా జీవితంలో కుప్పంలో మొన్నిటి సభకు వచ్చినంతమంది జనం ఎప్పుడూ రాలేదు. కుప్పంలో ఏం చేయాలో చేసి చూపిస్తాం. కొందరు కల్చర్ లేకుండా మాట్లాడుతున్నారు. విద్యుత్ పై ట్రూ అప్ చార్జీలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. సొంత బ్రాండ్లతో నాసిరకం మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. ప్రాణాలకు రక్షణ లేదు. పేదోడు కడుపునిండా తినే అన్నా క్యాంటీన్ తీసేశారు. అక్రమాలు జరిగితే నేనే ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్తా, కింది స్థాయి వరకూ వెళ్తా. దౌర్జన్యంగా ఓట్లేయించుకుంటామంటే మీ ఆటలు సాగవు. పట్టాభి మీద ఇంతక ముందు కూడా దా-డి చేశారు. ఎవర్ని అరెస్టు చేశారు. పార్టీ కార్యాలయంపైనా దా-డి చేశారు.. ఎవర్ని పట్టుకున్నారు.? వివేకానే చం-పి-తే-నే దిక్కులేదు..ఇవేం పెద్ద లెక్కకాదు అనుకుంటున్నారు. ప్రజలు వెంటాడితే రాష్ట్రం నుండి బయటకు పోలేవు..ఇంటి నుండి బయటకు కూడా రాలేరు. ఎవరు నేరంలో భాగస్వామ్యం అయ్యారో కమిషన్ పెట్టి బయటకు తీసుకొస్తాం. కోర్టు నిర్ణయాలు కూడా లెక్క చేయని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో కోర్టులో చిన్న కామెంట్లు వస్తే మంత్రులు రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఐఎఎస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కొందరు ఇంకా నిజాయితీగా వున్నారు. తుగ్లక్ జగన్ తో కోర్టు చుట్టూ తిరగటానికి అధికారులు సిద్ధపడొద్దు.

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మొదటి సారిగా యాంకర్ అవతారం ఎత్తారు. ఇన్నాళ్ళు బాలయ్య కేవలం సినిమాలకే పరిమితం అయ్యారు. ఇతర అగ్ర హీరోలు లాగా ఎప్పుడూ ప్రకటనలు ఇవ్వటం కానీ, బుల్లి తెర మీదకు రావటం కానీ జరగలేదు. అలాంటిది బాలయ్య మొదటి సారి ఆహా ఓటిటి ప్లాట్ఫారం ద్వారా అన్ స్టాపబులు విత్ NBK అనే కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆహా ప్లాట్ఫారం అల్లు అర్జున్ ది. అలాంటిది వాళ్ళు బాలయ్యని అడగటం, బాలయ్య అంగీకరించటం జరిగిపోయాయి. ఇది నిజంగా శుభ పరిణామం. ఒక పక్క ఫ్యాన్స్ కులాల మధ్య కొట్టుకు చస్తుంటే, బాలయ్య ఇలా ముందుకు రావటం చూసి అయినా, ఫ్యాన్స్ కుల పిచ్చ ఆపితే, అది సమాజానికి కూడా మంచిదే. ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమం ఈ రోజు మొదటి సారిగా రిలీజ్ అయ్యింది. ఈ రోజు మొదటి అతిధిగా, సినీ హీరో మోహన్ బాబు వచ్చారు. మోహన్ బాబు సీనియర్ హీరో కావటం, బాలయ్య కూడా ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండటంతో, కార్యక్రమం మంచిగా జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, మోహన్ బాబు ఈ షోలో కూడా, టిడిపి అధినేత చంద్రబాబు మీద తనకున్న ద్వేషాన్ని చూపించారు. అయితే బాలయ్య మాత్రం, వెంటనే కౌంటర్ ఇచ్చి, మోహన్ బాబుకు పంచ్ ఇచ్చారు.

balayya 044112021 2

ఈ ఇంటర్వ్యూ లో మోహన్ బాబు, అన్న ఎన్టీఆర్ గురించి ఓ గొప్పగా చెప్తూ ఉన్న సందర్భంగా, బాలయ్య మోహన్ బాబుని ఉద్దేశించి, మీరు అన్నగారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, అసలు ఎందుకు మీరు అన్నగారి పెట్టిన పార్టీ, అలాగే మిమ్మల్ని రాజ్యసభకు పంపించిన పార్టీని వదిలి బయటకు వెళ్ళారు అంటూ ప్రశ్నించారు. దీనికి మోహన్ బాబు యధావిధిగా చంద్రబాబు ద్రోహం చేసారు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మోహన్ బాబు కూడా అన్నగారి పార్టీ మీరు తీసుకోకుండా, చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారు అంటూ, ప్రశ్న వేసి, చంద్రబాబుని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయగా, బాలయ్య సరిగ్గా సమాధానం ఇచ్చారు. మా పార్టీ పుట్టిందే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అని, అలాంటిది తాము ఎలా తీసుకుంటాం అని, చంద్రబాబు గారు ముందు నుంచి పంచాయతీ మెంబెర్ నుంచి, ఈ స్థాయికి వచ్చారని, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పటంతో, మోహన్ బాబు కూడా అవును చంద్రబాబు పనితనం గురించి, ఆయన అభివృద్ధి చేయటం గురించి నేను కూడా ఒప్పుకుంటాను అని, నాకు సమాధానం మాత్రం రాలేదు అంటూ ఆ టాపిక్ ఆపేసారు. మొత్తానికి మోహన్ బాబుకి, బాలయ్య సరైన పంచ్ ఇచ్చారని, సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

ప్రత్యేక హోదా అనేది ఇప్పటికే ఒక పెద్ద రాజకీయ అంశం. గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి మొదటి అస్త్రం ఇదే. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పై జగన్ మోహన్ రెడ్డి పలికిన ప్రగల్భాలు అందరం చూసాం. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యువ భేరీ సభలు పెట్టి, యువతను ప్రత్యేక హోదా పై రెచ్చ గొట్టిన విధానం, ఇవన్నీ చూసాం. ప్రజలు కూడా ఇదే నమ్మి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇక పొతే రాజ్యసభలో, 6 గురు వైసీపీ సభ్యులు ఉన్నారు. అక్కడ గట్టిగా ఉంటే, ఏ బిల్లు కూడా కేంద్రానికి పాస్ కాదు. అయినా ఎక్కడా షరతులు పెట్టకుండా, ప్రత్యేక హోదా అడగకుండా, వైసీపీ ఎంపీలు భేషరతుగా మద్దతు ఇస్తున్నారు. హోదా ఏమైంది అని అడిగితే, వాళ్ళు బలంగా ఉన్నారు ప్లీజ్ సార్ ప్లీజ్ అని అనటం తప్ప మనం ఏమి చేయలేం అని జగన్ మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఇలా ప్రత్యేక హోదాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీరు గార్చేసింది. జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతి సందర్భంలో, అధికారిక ప్రకటన అయితే రాదు కానీ, సొంత మీడియాలో మాత్రం ప్రత్యేక హోదా అడిగినట్టు వార్తలు వస్తాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. రాజకీయం ఆడుతున్నారని అనుకోవచ్చు, ఇప్పుడు మరోసారి ఈ రోజు సాక్షి తప్ప, అన్ని పత్రికల్లో ప్రత్యేక హోదా గురించి వార్తలు వచ్చాయి.

cmo 04112021 2

తిరుపతిలో, ఈ నెల 14న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దక్షినాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గుంటారు. నిజానికి ఈ సమావేశం, దక్షినాది రాష్ట్రాల మధ్య సమన్వయం, రాష్ట్రాల మధ్య సమస్యలు చర్చిస్తారు. అంటే పోలవరం ప్రాజెక్ట్, విద్యుత్ బకాయలు, నీటి పంపకాలు, ఇలా అనేక అంతరాష్ట్ర సమస్యలు వస్తాయి. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి అమిత్ షా సమక్షంలో ప్రత్యేక హోదా అడుగుతారు అంటూ, సియంఓ నుంచి లీక్ వచ్చింది. అన్ని పేపర్లు ఈ వార్త ప్రముఖంగా రాసాయి. అయితే జగన్ సొంత పత్రిక సాక్షి మాత్రం, అసలు ప్రత్యేక హోదా అనే వ్యాఖ్య ఎక్కడా రాయలేదు. ఆరు ముఖ్యమైన అంశాలు అంటూ, కొన్ని అంశాలు రాసారు. ఇవి మత్రమే చర్చిస్తారని ఉంది. ప్రత్యేక హోదా లాంటి ముఖ్యమైన అంశం ఎందుకు సాక్షిలో రాయలేదో అర్ధం కావటం లేదు. ప్రజలను మభ్య పెట్టటానికి మీడియాకు లీక్ ఇచ్చి, తమ పత్రికలో మాత్రం సేఫ్ గేమ్ ఆడరా అనే చర్చ జరుగుతుంది. మరి ఇంతకీ ఆ రోజు ప్రత్యేక హోదా అడుగుతారా ? మెడలు వంచక పోయినా, కనీసం ప్లీజ్ సార్ ప్లీజ్ అని టోన్ లో అడిగినా చాలు. చూద్దాం..

మన దేశంలో ప్రస్తుతం పీడిస్తున్న ప్రధాన సమస్య, పెట్రోల్‌, డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం. కేంద్ర ప్రభుత్వ పన్నులు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులతో కలిసి తడిసి మోపెడు అవుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్ ధరల పెరుగుదల, ఇతర నిత్యావసరాల మీద కూడా పడింది. దీంతో ప్రజలు విసిగెత్తి పోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వానికి సెగ అర్ధం అయ్యింది. దీంతో వారు కిందకు దిగి రాక తప్పలేదు. పెట్రోల్‌, డీజిల్ ధరల విషయంలో, ప్రజలకు కొంత ఉపసమనం ఇచ్చారు. పెట్రోల్‍పై రూ.5, డీజిల్‍పై రూ.10 వరకు పన్నులు తగ్గించారు. దీంతో కొంత వరకు ఉపసమనం అనే చెప్పాలి. రవాణా ఖర్చులు కొంత మేర తగ్గుతాయి కాబట్టి, ఇతర రేట్లు కూడా దిగి వచ్చే అవకాసం ఉంది. ఈ సవరించిన రేట్లు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. కేంద్రం పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గించటంతో, ఇతర రాష్ట్రాలు కూడా వారి వైపు ఉన్న పన్నులు తగ్గిస్తూ, నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఇది నిజంగా ప్రజలకు దీపావళి కానుక అనే చెప్పాలి. చాలా రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్ ధరల పై రాష్ట్ర పన్నులు తగ్గిస్తూ నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నులు కూడా తగ్గటంతో, ప్రజలకు ఉపసమనం లభించింది.

modi 04112021 2

అస్సాం రాష్ట్రం అయితే, ఏకంగా రూ.7 తమ రాష్ట్ర పన్నులు తగ్గించింది. అలాగే గోవా కూడా రూ.7 తగ్గించింది. గుజరాత్ తగ్గిస్తాం అని చెప్పింది కానీ, ఎంతో చెప్పలేదు. ఇక త్రిపురా రాష్ట్రం కూడా రూ.7 తగ్గించింది. మణిపూర్ రాష్ట్రం కూడా రూ.7 తగ్గించింది. ఢిల్లీ ప్రభుత్వం, పెట్రోల్ పై రూ.6.07 , డీజిల్ పై రూ.11.75 తగ్గించి ప్రజలకు ఉపసమనం కలిగించింది. మన పక్కన ఉన్న కర్ణాటక కూడా రూ.7 తగ్గించింది. త్వరలో ఎన్నికలు జరగబోయే ఉత్తర ప్రదేశ్, రూ.12 తగ్గించింది. ఇక హర్యానా రాష్ట్రం కూడా రూ.12 తగ్గించింది. ఇలా అన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర వాటా కూడా తగ్గించటంతో, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు పెట్రోల్ 90 రూపాయలకు వచ్చింది అనే చెప్పాలి. మరి అందరి కంటే ఎక్కువ పన్నులు బాదుతున్న జగన్ మోహన్ రెడ్డి, ఎప్పుడు ధరలు తగ్గిస్తారు అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు ? పెట్రోల్ పై దాదాపుగా 30 రూపాయాల పన్ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. అలాగే డీజిల్ పై కూడా 22 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు నిద్ర లెగుస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read