రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళాల్సిన, జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దు అయ్యింది. కొద్ది సేపటి క్రిందట దీనికి సంబంధించిన సమాచారం మీడియాలో వస్తుంది. ఈ రోజు ఉదయం జగన్ కు కాలు బెణకటంతో, కాలుకి గాయం అయ్యింది. అయితే ఈ రోజు సాయంత్రానికి ఆ గాయం తీవ్రం అవ్వటంతో, డాక్టర్లు మరింత రెస్ట్ అవసరం అని చెప్పటంతో, రేపటి ఢిల్లీ టూర్ రద్దు అయినట్టు తెలుస్తుంది. ఎల్లుండి కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో, నిర్వహించే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సియంల సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ సమావేశానికి కేసిఆర్ వస్తున్నారు. దాదపుగా ఏది తరువాత కేసిఆర్, జగన్ ఒకే వేదిక పైన ఉంటారని అందరూ భావించారు. జల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయని అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా జగన్ ఢిల్లీ టూర్ రద్దు అయ్యింది. జగన్ కు బదులుగా, ఈ సమావేశానికి హోం మంత్రి సుచరిత వెళ్లనున్నారు.
news
రిటైర్డ్ అయ్యే ముందు కూడా కోర్టుకు చీఫ్ సెక్రటరీ...
రిటైర్డ్ అయ్యే ముందు కూడా, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ కూడా కష్టాలు తప్పటం లేదు. మరో వారంలో ఆయన తన సర్వీస్ కు రిటైర్డ్ అవ్వనున్నారు. ఇప్పటికే కొత్త చీఫ్ సెక్రటరీ కూడా వచ్చారు. అయితే రిటైర్డ్ అయ్యే ముందు కూడా ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి వచ్చింది. నరేగా పనులకు నిధులు చెల్లించటం లేదని ఈ రోజు హైకోర్టులో దాఖలు అయిన పిటీషన్ ల పై విచారణ జరిగింది. మొత్తం 500 పిటీషన్లు దాఖలు అయ్యాయి. దీని పై ఈ రోజులో జస్టిస్ గట్టు దేవానంద్ బెంచ్ ముందు విచారణ జరిగింది. ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్ హాజరు అయ్యారు. అయితే ఈ పనులు పై విజిలేన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుందని, గతంలో అధికారులు చెప్పారని, అటువంటి విచారణ ఏదైనా జరుగుతుందా అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఏమి ఈ పనులు పై జరగటం లేదని, చెప్పి చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాద్ దాస్ చెప్పారు. అయితే చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాద్ దాస్ చెప్పిన దాన్ని రికార్డు చేయాలని హైకోర్టు స్పష్టం చేయటంతో, ఆయన స్టేట్మెంట్ ని రికార్డు చేసారు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా తాము ఏపిలో చేసిన నరేగా పనులకు సంబంధించి బిల్లులు మొత్తం చెల్లించామని, కోర్టుకు స్పష్టం చేసింది. అదే విధంగా, నరేగా పనులు పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పి, స్పష్టం చేసింది. పిటీషనర్ తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస రావు, వాదనలు వినిపించారు. ఆయన వాదనలు వినిపిస్తూ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతున్నా కూడా, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కు పంపించి, ఆ తరువాత CMSFకి బిల్లులు పంపారని చెప్పి, ప్రస్తుతం మళ్ళీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ఏమి జరగటం లేదని చెప్పటం పై కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ నెల 29వ తేదీన ఈ కేసుకు సంబంధించి తుది ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేస్తూ, కేసు విచారణను ఈ నెల 29వ తేదికి వాయిదా వేసింది. దీంతో చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయ్యే ముందు రోజు, ఈ కీలక కేసు విచారణకు రానుంది. మరి ఆ రోజు ఏమి జరుగుతుందో, ఏమి అవుతుందో చూడాల్సి ఉంది.
అయ్యన్నపాత్రుడు స్పీచ్ ఇచ్చిన వారం తరువాత, వైసీపీ మార్క్ షాక్... ఏమైనా చేసుకోండి అంటున్న అయ్యన్న...
తెలుగుదేశం నేతల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. టిడిపి నేతలు మాట్లాడితే కేసు, బయట కాలు పెడితే కేసు, నుంచుంటే కేసు, కూర్చుంటే కేసు పెడుతూ టిడిపి నేతలను ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. వైసిపీ వచ్చి, టిడిపి వారిని కొట్టినా, ఎదురు టిడిపి పైనే కేసులు పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యం, టిడిపి నేతలదే తప్పు అని, పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా ప్రతిపక్షం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఎక్కడైనా పోలేసులకు అధికార, ప్రతిపక్షాలు అనే తేడా ఉంటుందా ? అయితే వైసిపీ నేతలు బూతులు తిట్టినా, ఫేక్ చేసినా కేసులు మాత్రం ఉండవు. ఇలా ఉంది మన రాష్ట్రంలో రూల్ అఫ్ లా. పలు మార్లు హైకోర్టు ప్రశ్నించినా మార్పు రావటం లేదు. తాజాగా టిడిపి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు పై, వైసీపీ మార్కు కేసులు దెబ్బ చూపించారు. అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వారం రోజులు క్రిందట కోడెల సభలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు కేసు పెట్టారు. కోడెల వర్ధంతి సభలో మాట్లాడిన అయ్యన్న, రాష్ట్రంలో జరుగుతున్న అధ్వాన పాలన, ఇష్టం వచ్చినట్టు చెత్త పై పన్ను, కరెంటు పన్ను, మటన్ షాపులు, సినిమా టికెట్ల పై ఆయన ప్రసంగిస్తూ, వైసీపీ నేతల పైన, జగన్ పైన విమర్శలు చేసారు.
ఈ స్పీచ్ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపింది. ఏకంగా చంద్రబాబు ఇంటి పై రాళ్ల దా-డి వరకు వెళ్ళింది. అయిన వైసీపీ నేతల కచ్చి తీరలేదు. ఇప్పుడు అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. హోం మంత్రి దిశ చట్టం ఉంది, శిక్షలు వేసాం అని అబద్ధాలు ఆడుతున్నారని, ఆడపిల్లల పై ఎక్కడ చూసినా దా-డు-లు జరుగుతున్నయాని, సిగ్గు ఉంటే హోం మంత్రి రాజీనామా చేయాలని అన్నారు. ఈ హోంమంత్రికి ఒక కానిస్టేబుల్ కూడా సెల్యూట్ చేయరని అన్నారు. దీని పైనే అయ్యన్న పై ఫిర్యాదు చేయగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వేముల ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు, పోలీసులు అయ్యన్న పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే అయ్యన్న మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ప్రజా సమస్యలు లేవనెత్తుతూనే ఉంటానాని, ఎక్కడ అదిరేది బెదిరేది లేదని, ఎన్ని కేసులు పెట్టినా, జగన్ అసమర్ధత పాలన పై మాట్లాడుతూనే ఉంటానని, ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ, అయ్యన్న ప్రకటన చేసారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.
హెరాయిన్ వ్యవహారంలో, ఏపి బోర్డర్స్ విషయంలో తెలంగాణను డీఆర్ఐ హెచ్చరించిందా ? టిడిపి సంచలన ఆరోపణలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెరాయిన్ వ్యవహారం, కుదిపేస్తుంది. గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లో, హెరాయిన్ పట్టుబడటం, అది విజయవాడ అడ్డ్రెస్ తో ఉన్న కంపెనీకి రావటంతో, మొత్తం వ్యవహారం మలుపు తిరిగింది. ఆఫ్ఘన్ నుంచి విజయవాడకు ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ రావటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే డీజీపీ కూడా స్పందిస్తూ, కేవలం అడ్డ్రెస్ మాత్రమే విజయవాడ అని ఉందని, అంతకు మించి ఏపితో సంబంధం లేదని అన్నారు. అయితే దీని పై జాతీయ మీడియాలో వస్తున్న కధనాలతో, ప్రతిపక్ష టిడిపి పార్టీ మాత్రం, విమర్శలు గుప్పిస్తుంది. ఈ రోజు ఒక ప్రముఖ జాతీయ దినపత్రికలో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, తెలంగాణా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు, ప్రచురించింది. ఏపి నుంచి వచ్చే వాహనాల పై, తెలంగాణ బోర్డర్ లో నిఘా పెంచాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.
ఇదే విషయన్ని టిడిపి లేవనెత్తింది. ఒక పక్క ప్రభుత్వం కాని, డీజీపీ కాని, తమకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నారని, అయితే కేంద్రం అధికారులు మాత్రం, తెలంగాణా రాష్ట్రాన్ని అలెర్ట్ చేయటం ఏ విధంగా చూడాలి అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. అలాగే అసలు ఏపి పోలీసులు ఏమి దర్యాప్తు చేసారని, అసలు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. ఒక పక్క విజయవాడ అడ్డ్రెస్ తో సరుకు వచ్చినట్టు ఉందని, ఇక్కడ కంపెనీ ఉండని, ఇక్కడ వ్యక్తులను కేంద్ర నిఘా సంస్థలు అరెస్ట్ చేసాయని, ఇన్ని అధరాలు ఏపితో లింక్ అయి ఉన్నా, పోలీసులు మాత్రం, ఎలా క్లీన్ చిట్ ఇస్తారు అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. దీని పై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ వచ్చింది అంటే, దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. మరి దీని పై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.