రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోనెంబర్ 316 విషయంలో తదనంతర చర్యలు అన్నీ నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధానిలోని 29 గ్రామాల్లో భూములు సమీకరించేందుకు, భూసమీకరణ విధానాన్ని తీసుకుని వచ్చి, అందులో ఎవరు అయితే అసైన్డ్ రైతులు ఉన్నారో ఆ అసైన్డ్ రైతులకు కూడా ప్రత్యెక ప్యాకేజి ఇవ్వాలని, దళితులకు న్యాయం చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసైన్డ్ రైతులు, తమ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి, రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, ఆ భూమి కోసం ఒక ప్రత్యెక ప్యాకేజి ఇస్తూ, జీవో నెంబర్ 41ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ జీవో నెంబర్ 41 మేరకు, ఎవరు అయితే భూములు ఇచ్చారో అసైన్డ్ రైతులు ఆ భూములు ఇచ్చిన రైతులు అందరికీ కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రిటర్నబుల్ ప్లాట్స్ ని కూడా అసైన్డ్ రైతులకు అప్పట్లో సిఆర్డీఏ కేటాయించింది. అయితే ఈ జీవో నెంబర్ 41ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాద్ధాంతం చేసింది.

hc 010920021 2

దళితులకు న్యాయం చేకూర్చే ఈ జీవో నెంబర్ 41ని చట్ట విరుద్ధం అని, అసైన్డ్ రైతులకు ఏవైతే భూములు ఇచ్చారో, ఆ భూములను అసైన్డ్ చట్టం ప్రకారం, ఇతర చట్టాల ప్రకారం, అనుభవించే హక్కు ఉంది కానీ అమ్ముకునే హక్కు లేదు అని చెప్పి, జగన్ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జీవో నెంబర్ 41ని నిబంధనలకు విరుద్ధం అని చెప్పి, ఇది కేవలం దళారుల కోసం చేసిన జీవో అని, అప్పటి ముఖ్యమంత్రి, నారయణ పై కూడా కేసులు కూడా నమోదు చేసింది. అయితే జగన్ ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చి, భూములు వెనక్కు ఇవ్వాలని కోరింది. అయితే ఆ భూములు తిరిగి ఇవ్వాలి అంటూ ప్రభుత్వం కోరటంతో, రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది. రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, తమను అన్యాయం చేస్తున్నారని వాపోయారు. పిటీషనర్ తరుపు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి చర్యలు అన్నీ నిలిపివేయాలి అంటూ, ఆదేశాలు ఇవ్వటంతో, అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది.

సంగం డయిరీలో అవకతవకలు జరిగాయి అని, ప్రభుత్వ ఆస్తులు ఉన్నప్పటికీ వాటిని సంగం డయిరీ ఉపయోగించుకుని వ్యాపారం చేసుకుంటుంది అంటూ, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సంగం డయిరీని తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగిస్తూ యాజమాన్యాన్ని ఇందుకు సహకరించాలని, సబ్ కలెక్టర్ ని బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. దీని పై సంగం డయిరీ గతంలో హైకోర్టు సింగల్ బెంచ్ లో, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేసింది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం తమ వైపు వాదనలు వినిపించినా, ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేక పోవటంతో, ప్రభుత్వం ఇచ్చిన జీవో హైకోర్టు సింగల్ బెంచ్ కొట్టేసింది. ఈ జీవోని కొట్టివేయటం పై, రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచ్ లో అపీల్ చేసింది. దీని పై పిటీషన్ దాఖలు చేసింది. ఈ డివిజనల్ బెంచ్ లో చీఫ్ జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ జయసూర్య ఉన్నారు. ఈ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అపీల్ పై విచారణ జరిపింది. ఈ విచారణ దాదపుగా అయుదు నెలలు నుంచి జరిగింది. ఈ విచారణ సందర్భంగా అటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, ఇటు సంగం డయిరీ వైపు నుంచి కూడా వాదనలు వినిపించారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు ఈ విషయం పై తమ తీర్పుని వెల్లడించింది.

hc 01092021 2

ఈ తీర్పులో ప్రధానంగా ప్రభుత్వం, సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. సింగెల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏది అయితే ఉందొ, ఆ తీర్పుని హైకోర్టు డివిజనల్ బెంచ్ సమర్ధించింది. హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుంది అంటూ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అపీల్ ను, హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అదే విధంగా ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతాం అంటూ, కొంత మంది వేసిన ఇంప్లీడ్ పిటీషన్లు కూడా హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి. హైకోర్టు తీర్పు పై సంగం డెయిరీ వర్గాలు సంతోషం వ్యక్తం చేసింది. నరేంద్ర కూడా ఈ తీర్పు పై హర్షం వ్యక్తం చేసారు. మరి ప్రభుత్వం దీని పై సుప్రీం కోర్టుకు వెళ్తుందా, లేదా ఏమి చేస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే డివిజనల్ బెంచ్, సింగల్ బెంచ్ ఈ నిర్ణయాన్ని కొట్టివేయటంతో, ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి.

క-రో-నా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కేసులు పెరగడంతో హైకోర్టు ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్‌పై హైకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సెప్టెంబర్ 8 నాటికి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 45 ఏళ్లు నిండిన వారిలో 90 శాతం మందికి టీకాలు వేశామని  ప్రభుత్వం చెప్పింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతోందని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 18 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయ్యిందని కేంద్రం తరపున అఫిడవిట్ దాఖలు చేసారు.  28 ప్లాంట్లకుగాను 18 పూర్తయినట్లు కేంద్రం తరపున అఫిడవిట్ దాఖలు చేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య గానే కాకుండా, జగన్ పార్టీ పెట్టిన తరువాత, జగన్ కు అండగా చేసిన యాత్రలు కూడా వైఎస్ విజయమ్మ అంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో వైఎస్ విజయమ్మ, జగన్ మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండటం లేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. అటు షర్మిల కూడా అన్నతో విబేధించి తెలంగాణాలో పార్టీ కూడా పెట్టారు. ఈ మధ్య కాలంలో వైఎస్ విజయమ్మ ఎక్కడా జగన్ తో ఉండటం లేదు, ఆమె ఎక్కువగా షర్మిలతోనే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా షర్మిల పార్టీలోని అన్ని ముఖ్యమైన మీటింగ్లకు ఆమె అటెండ్ అవుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె పై విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అద్యక్షురాలుగా ఉంటూ,మరో పార్టీ సమావేశంలో ఆమె ఎలా పాల్గుంటుంది అంటూ, విమర్శలు వచ్చాయి. ఇలా అనేక విమర్శలు, మరో పక్క జగన్ తో పోసగటం లేదనే ప్రచారం మధ్య, విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ ఈ రోజు వార్తలు వస్తున్నాయి. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అద్యక్షురాలు పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆమె పూర్తిగా కూతురు షర్మిల పార్టీలోనే ఆక్టివ్ రోల్ ప్లే చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె త్వరలోనే ప్రకటన చేస్తారని తెలుస్తుంది.

vijayamma 31082021 2

సెప్టెంబర్ రెండవ తేది, వైఎస్ పోయిన రోజు. ఆ రోజు విజయమ్మ ప్రకటన ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. ఎప్పుడూ లేనిది వైఎస్ విజయమ్మ ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసారు. హైదరబాద్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. వైఎస్ క్యాబినెట్ లో పని చేసిన అనేక మంది మంత్రులకు, సన్నిహితులకు విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి, ఆ రోజు లోటు పాండ్ రావలసిందిగా కోరారు. అయితే ఇది రాజకీయ సమావేశం కాదని చెప్తున్నారు. అన్ని పార్టీల్లో ఉన్న వైఎస్ సన్నిహితులకు పిలుపు వెళ్ళింది. మరి ఎంత మంది వస్తారో తెలియదు కానీ, పిలుపు అయితే వెళ్ళింది. ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఇలాంటి సమావేశం నిర్వహించని విజయమ్మ ఇప్పుడు ఎందుకు ఈ సమావేశం పెట్టారు అనేది అర్ధం కావటం లేదు. అయితే జరుగుతున్న ప్రచారం మాత్రం, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం షర్మిల పార్టీ బలోపేతంగా చెప్తున్నారు. మరి ఈ పరిణామాలు అన్నీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్ ఎలా తీసుకొంటారో, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read