ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏంటో అర్ధం కాక ప్రజలు తలలు బాదుకుంటున్నారు. మొన్నటి దాకా చక్కగా అమరావతి రాజధాని అని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, రాజధాని మూడు ముక్కలు అయ్యింది. మూడు ముక్కల రాజధానిలో ఏది రాజధానో, ఏది ఏంటో అర్ధం కాక, ప్రజలు బుర్రలు బాదుకుంటుంటే, మంత్రులు ప్రకటనలు మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి మంత్రి బొత్సా, అవంతి చేస్తున్న ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మరో రాజధాని తెర పైకి వచ్చింది. పరిశ్రమల శాఖా మంత్రి గౌతంరెడ్డి ఈ రోజు రాజధానుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అదే సచివాలయం, అదే రాజధాని అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. పులివెందులలో ఉంటే పులివెందులే రాజధాని, ఆయన ఎక్కడ ఉంటే అదే రాజధాని, ఏ ప్రాంతంలో ఉంటే అదే రాజధాని అంటూ, వ్యాఖ్యానించారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు ఈ అంశం కోర్టులో ఉందని అన్నారు. అయితే మంత్రి మాట్లాడుతూ, ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెప్పటం, పులివెందుల గురించి చెప్తూ ఉండటంతో, ఇప్పుడు పులివెందుల పైకి తెస్తారా ఏమిటి అని సోషల్ మీడియాలో సెటైర్ లు పేలుతున్నాయి.

పోలవరం నిర్వాసితుల బాధలు వినేందుకు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు రోజులు పాటు పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భగంగా నారా లోకేష్ ముందుగా, భ‌ద్రాచ‌లంలో శ్రీ సీతారామ‌చంద్ర‌మూర్తి దర్శనానికి వెళ్ళారు. ఆలయం వేలుపుల మీడియా ప్రతినిధులు లోకేష్ ను కొన్ని రాజకీయ ప్రశ్నలు అడగగా, తాను ఇక్కడకు సీతారామ‌చంద్ర‌మూర్తి దర్శనానికి వచ్చానని, ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని, తరువాత రాజకీయాల గురించి మాట్లాడతానని చెప్పారు. స్వామి వారిని ఏమి మొక్కుకున్నారని మీడియా వారు అడగగా, క-రో-నా థర్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో, క-రో-నా కష్టాలు తొలగిపోయి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉండాలని, రెండు రాష్ట్రాలు ప్రగతి పధంలో ముందుకు వెళ్ళాలని అన్నారు. అలాగే   పోల‌వ‌రం నిర్వాసితుల బాధలు తీరిపోవాలని, మొక్కుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు, పోలవరం ప్రాజెక్ట్ వల్ల, ఇరు రాష్ట్రాల సరిహద్దులో, ఉన్న అయుదు గ్రామాల ఇబ్బందులు గురించి అడగగా, ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి స్నేహితులు అని, ఇద్దరూ కూర్చుని మాట్లాడకుంటే నిమిషాల్లో సమస్య పరిష్కారం అయిపోతుందని అన్నారు.

ఒక పెద్ద కుదుపు కుదిపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఈడీ చేతిలోకి వెళ్ళింది. ఈ రోజు నుంచి డ్రగ్స్ కేసు పై ఈడీ విచారణ ప్రారంభం అయ్యినిడ్. ఈ రోజు ఈడీ విచారణకు దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరు అయ్యారు. విచారణకు రావాలని ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారణ చేయనుంది. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 20 వరకు  ఈడీ విచారణ కొనసాగనుంది. ఇప్పటికే దీని పై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసారు. డ్రగ్స్ కేసులో  ఆబ్కారీ శాఖ సిట్, 12 మంది పై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. అలాగే 11 చార్జ్ షీట్లు కూడా సిట్ అధికారులు దాఖలు చేసారు. డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని ఇప్పటికే సిట్ విచారణ చేసింది. గతంలో చిత్ర పరిశ్రమకు చెందిన 12 మందిని  సిట్ ప్రశ్నించింది. అయితే సిట్ విచారణ నేమ్మదించటం వెనుక రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ కేసు ఈడీ చేతిలోకి వెళ్ళటంతో, టాలీవుడ్ ప్రముఖులకు దడ మొదలయ్యింది అనే చెప్పాలి. ఎంత మంది బయట పడతారో, ఎంత మంది బుక్ అవుతారో చూడాలి.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలు బయటకు వస్తే చాలు కేసులు, అరెస్ట్ లు, హంగామా హంగామా చేసి పడేస్తున్నారు. మొన్నటి వరకు అయితే, అసలు బయటకు కూడా రాకుండా హౌస్ అరెస్ట్ లు అంటే చేసిన పోలీసులు, ఇప్పుడు బయటకు వచ్చి నిరసన తెలిపే అవకాసం ఇచ్చి, వివిధ సాకులు చూపి కేసులు పెడుతున్నారు. శనివారం పెట్రోల్, డీజిల్ ధరల పై టిడిపి రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేసింది. ఆ నిరసనల్లో తమ విధులకు ఆటంకం కలిగించారని నిన్న చింతమనేనిని అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఒక రోజు తిరగకుండానే, అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పై కేసు నమోదు చేసారు. పెట్రోల్ నిరసనల సందర్భంలో కో-వి-డ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ అభియోగాలు మోపి కేసు నమోదు చేసారు. ఆయనతో పాటుగా మరో 78 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేసారు. బొమ్మనహల్ ఎస్ ఐ రమణారెడ్డి ఈ కేసుని సుమోటోగా తీసుకుని నమోదు చేసారు. అయితే తాము పాదయాత్రకు అనుమతి కోరితే, అనుమతి ఇవ్వలేదని, తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, కావలని తమను నిర్బంధం చేసి, అక్రమ కేసులు పెట్టారని కాల్వ శ్రీనివాసులు అంటున్నారు. ఇక పులివెందులలో కూడా బీటెక్ రవి పై కేసు నమోదు చేసారు.

Advertisements

Latest Articles

Most Read