గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల, అలాగే జగన్ మోహన్ రెడ్డి మధ్య మాటలు లేవు అంటూ వార్తలు వచ్చాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు ఊతమిచ్చాయి. ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా, ఇదుపులులపయాలో, వైఎస్ సమాధి వద్దు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, షర్మిల, జగన్ పక్క పక్కనే కూర్చున్నా, జగన్, అటు షర్మిలతో కానీ, ఇటు విజయమ్మతో కానీ మాట్లాడ లేదు. పక్కనే షర్మిల ఉన్న ఎడమొఖం పెడమోఖంగానే ఇద్దరూ ఉన్నారు. ఇతరులతో బాగానే మాట్లాడుకున్నా, ఇరువురు మాత్రం మాట్లాడుకోలేదు. అయితే ఈ రోజు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇద్దరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి, ఇద్దరూ కలిసి పోతారని అందరూ అనుకున్నా, బయటకు కలిసి కూర్చున్నా, ఎక్కాడా మాటలు అయితే లేవు. దీంతో వైఎస్ అభిమానులు నిరాశ చెందారు. అయితే ఇదే సందర్భంలో షర్మిల చేసిన ట్వీట్ చూస్తే ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగిందని అర్ధం అవుతుంది. నేను ఒంటరిని అంటూ షర్మిల ట్వీట్ చేసారు. రాజశేఖర్ రెడ్డి ఆశీసులు కావలని కోరారు. ఏడుపు ఆగటం లేదు అంటూ ట్వీట్ చేసారు. ఒంటరిని అంటూ షర్మిల ట్వీట్ చేయటంతో, ఆమెకు అన్నగా జగన్ నుంచి సహకారం లేదనే అర్ధం అవుతుంది.

abn 02092021 2

గతంలో వైఎస్ పుట్టిన రోజు సందర్భంగా, ఇద్దరూ వేరు వేరుగా నివాళులు అర్పించారు. ఇప్పుడు కలిసి ఉన్నా, మాట్లాడుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ ఉందనే అర్ధం అవుతుంది. గతంలో కూడా సాక్షి తమకు కవరేజ్ ఇవ్వదు అంటూ షర్మిల బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే షర్మిలని పార్టీ పెట్టవద్దు అని కోరినట్టు సజ్జల కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు వైఎయస్ విజయమ్మ పాత నాయకులు అందరితో కలవ బోతున్నారు. షర్మిల రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ భేటీ ఉండ బోతుందని తెలుస్తుంది. అయితే కొంత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా పిలుపు వచ్చినా, అధిష్టానం ఎవరిని వెళ్ళవద్దు అని ఆదేశించినట్టు తెలుస్తుంది. అలాగే మరో ప్రచారం ప్రకారం, విజయమ్మ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఇన్నాళ్ళు తమ ప్రత్యర్ధి పార్టీల కుటుంబాల్లో ఉన్న గొడవలు పెద్దది చేసి చూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తమ అధినేత కుటుంబలోనే ఇలా ఇబ్బందులు ఉండటంతో, డిఫెన్స్ లో పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్, హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సహా ఇతరులు పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇన్సైడర్ త్రాదింగ దే విధంగా, అవినీతి నిరోధిక చట్టం కింద పెట్టిన కేసులు అన్నిటినీ హైకోర్టు కొట్టి వేసింది. కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్ట్, ఈ మేరకు తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు అడ్వొకేట్ జనరల్ గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని అవినీతి నిరోధక చట్టం కింద, ఆయన పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అదే విధంగా మరి కొంత మంది పైన కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరందరూ కూడా రాజధాని అమరావతి వస్తుందని ముందుగానే తెలుసుకుని, అక్కడ భూములు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున సంపాదించారని, దీని పైన ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు అంటూ కూడా ఏపి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీని పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, స్టే ఇవ్వటంతో, ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఇటీవల సుర్పీం కోర్టులో ఈ కేసు విచారణకు రాగా, అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదు అని గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో, ఆ తీర్పుని సుప్రీం కోర్టు సమర్ధించటమే కాకుండా, ఈ కేసుని నెల రోజులు లోపు విచారణ చేయాలని ఏపి హైకోర్టుని ఆదేశించింది.

jagan 02092021 2

దీంతో, దీని పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా విచారణ జరిగింది. అప్పట్లో సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అపీల్ కు వెళ్లిందో, ఆ అప్పీల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే ఈ అంశం పై తేల్చుకుంటాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటంతో, నెల రోజుల లోపు విచారణ జరపాలని ఏపి హైకోర్టుని ఆదేశిస్తూ, సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గత నెల రోజులుగా వాదనలు జరిగాయి, వాదనలు అనంతరం, మొత్తం 14 కేసులు ఇందులో ఉండటంతో, జడ్జిమెంట్ రిజర్వ్ చేసారు. కొద్ది సేపటి క్రితం హైకోర్టు దీని పై తీర్పు ఇచ్చింది. వీరి పైన ప్రభుత్వం చేసిన ఆరోపణలు అన్నీ కూడా నిరాధారం అని, వీటి పై ఎక్కడా రుజువులు ఇవ్వలేక పోయారని స్పష్టం చేసింది. దమ్మాలపాటి శ్రీనివాస్ ని కావాలని టార్గెట్ చేసారు కాబట్టి, అతన్ని మానసికంగా క్షోభ పెట్టినందుకు, ఏమైనా చట్ట చర్యలు తీసుకోవచ్చు అని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల పై మరోసారి న్యాయస్థానాలలో క్లీన్ చిట్ లభించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టు ముందు దోషులుగా నుంచోవటం జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో చూసాం. ఇప్పటికీ కొంత మంది అధికారులు ఈ కేసులో విచారణకు హాజరు కూడా అవుతున్నారు. ఇదే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి హోదా ఉన్న అధికారులు కూడా కోర్టు ముందు నిలబడే పరిస్థితి వచ్చింది. సహజంగా ఎవరైనా అధికారిని కోర్టు పిలిచింది అంటే తప్పుగా భావిస్తారు. తమకు బ్లాక్ మార్క్ గా భావిస్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, అధికారుల తీరు మారుతున్నట్టు కనిపించటం లేదు. ఇప్పటికీ కొంత మంది అధికారులు కోర్టు ముందు హాజరు అవుతూనే ఉన్నారు. అయితే నిన్న కోర్టులో మాత్రం ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా, ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టు ముందు హాజరు కావటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. రాష్ట్రంలో పరిపాలనకు, జరుగుతున్న పరిస్థితులకు ఇది ఒక ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల్లో, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల నిర్మాణాల పై దాఖలైన పిటీషన్ల పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ గట్టు దేవానంద్ బెంచ్ పైన, ఈ పిటీషన్ విచారణకువ్ అచ్చింది.

hc 0100092021 2

గతంలో ఇదే వ్యాజ్యం పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పాఠశాలల స్థలాల్లో, ప్లే గ్రౌండ్స్ లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ నిర్మాణాలు నిలిపివేయకుండా, కొనసాగించటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మొత్తం నివేదిక కోరుతూ, దీనికి సంబందించిన ఐఏఎస్ అధికారులు అందరూ హాజరు కావలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో మొత్తం ఏడుగురు అధికారులు కోర్టుకు హాజరు అయ్యారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, విద్యా శాఖ కమీషనర్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, గతంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్, ఇలా మొత్తం ఏడుగురు కోర్టు ముందు హాజరు అయ్యారు. అయితే ఇప్పటికే జరుగుతున్న నిర్మాణాలు ఆపేసి, వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని చెప్పటంతో, నాలుగు వారాల్లో ప్రక్రియ మొత్తం పూర్తి కావలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ ఒకటవ తేదీకి వాయిదా వేసింది.

1వ తేదీనాడు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు జగన్ ప్రభుత్వం తీవ్రమైన నిరాశ మిగిల్చిందని, ఈ నెలకు సంబంధించి లక్షా25 వేల పింఛన్లను తొలగించిందని, వృద్ధులు, వికలాంగులకు అండగా ఉంటామని గతంలో, పాదయాత్రలో ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు వారినోట్లో మట్టికొట్టడం ఎంతవరకు న్యాయమని టీడీపీ శాసన సభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! ఈ ముఖ్యమంత్రి ఈ నెలలో లక్షా 25వేల సామాజిక పింఛన్లు తొలగించాడు. ప్రకాశం జిల్లాలో మొత్తం 9,600 పింఛన్లు ప్రభుత్వం తొలగిస్తే, వాటిలో కొండెపి నియోజకవర్గంలోనే 8,600 వరకు పింఛన్లు తీసేశారు. గడచిన మూడు నెలల నుంచీ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 28వేల పింఛన్లను ప్రభుత్వం తొలగించింది. ఈ విధంగా ప్రభుత్వం కావాలనే ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడుతోంది. రాజశేఖర్ రెడ్డి వర్థంతిని సామాజిక భద్రతా విద్రోహ దినంగా జరుపు కోవాల్సిన దుస్థితిని జగన్ కల్పించాడు. ఈనెలలో చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో బోరుమంటున్నారు. అనుభవలేమి, అవగాహానా రాహిత్యంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలవిగానీ హామీలిచ్చిన జగన్, ముఖ్యమంత్రై మూడేళ్లవుతున్నా రూ.3 వేల పింఛన్ ఇవ్వలేక పోయాడు. గతంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి, రూ.200గా ఉన్న పింఛన్ ను రూ.2వేలకు పెంచారు. అర్హులైన ప్రతి ఒక్కరకీ ఠంఛన్ గా ఒకటో తేదీనే పింఛన్లు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేసి, చెల్లింపులకు వచ్చే సరికి అర్హులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు. ఇస్తామన్న రూ.3వేలు ఇవ్వకుండా ఉన్న వాటిని తొలగించడం ముఖ్యమంత్రి చేతగానితనం కాదా? గతంలో రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతి ఏటా పింఛన్ రూ.250 చొప్పున పెంచుతామని చెప్పాడు. అలా చెప్పాక రూ.2,250 లు చేశారు.. తరువాత దాన్ని, రూ.2,500లు చేస్తానన్నాడు.

తండ్రి జయంతి పోయి, రేపు వర్థంతి వచ్చినా, కొడుకు ప్రభుత్వంలో అది నెరవేరలేదు. అదీ ఈ ముఖ్యమంత్రి పనితనం. పింఛన్లు పెంచకపోగా లబ్ధిదారులకు కోత పెడుతున్నారు. ఒక నెల పింఛన్ మరో నెలలో ఇవ్వ మని చెప్పడం దుర్మార్గం. రకరకాల కారణాల వల్ల కొందరు వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ తీసుకోలేకపోవచ్చు. మరోనెలలో పింఛన్ తీసుకునే అవకాశం వారికిలేకుండా చేయడం ముమ్మాటికీ దుర్మార్గమే. అత్తాకోడళ్లు, తల్లీకూతుళ్లు ఒకేరేషన్ కార్డులోఉండి, వారిలో ఒకరు విధి వక్రీకరించి విధవగా ఉండి, మరొకరు వృద్ధులైతే వారిద్దరికీ పింఛన్లు తీసేశారు. ఈకేవైసీ పేరుతో మరిన్ని పింఛన్లకు ముఖ్యమంత్రి ఎసరు పెట్టారు. దివ్యాంగులు, కిడ్నీరోగులకు ఇవ్వాల్సిన పింఛన్లలోనూ కోతపెట్టారు. ఆవుచేలో మేస్తుంటే, దూడగట్టున మేస్తుందా అన్నట్లుగా వాలంటీర్లు పింఛన్ల చెల్లింపులో చేతివాటం ప్రదర్శిస్తూ, లబ్ధిదారులపై జులుం ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లోకివెళ్లి పింఛన్లు తీసుకునేవారెవరో, వారి పరిస్థితేమిటో ప్రభుత్వం ఎందుకు తెలుసుకోలేక పోతోంది? కొన్ని గ్రామాల్లో వయస్సు, అర్హతలతో పనిలేకుండా వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులన్న ఒకేఒక్క కారణంతో పింఛన్లు ఇస్తున్నారు. దానిపై వాలంటీర్లు, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అనేవి వాలంటీర్లు చేయాల్సిన పని. వారే ఆ పనిచేస్తారని ప్రభుత్వమే చెప్పింది. రేషన్ కార్డుల్లో పెళ్లై వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, మరణించిన వారి పేర్లను ప్రభుత్వం తీసేయకుండా, దాన్ని సాకుగా చూపి, అర్హులైన వారిపింఛన్లు తొలగించడమేంటని తాము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా సామాజిక పింఛన్ల పంపిణీలో మానవత్వంతో వ్యవహరించి, తొలగించిన పింఛన్లన్నింటినీ పున రుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం.

Advertisements

Latest Articles

Most Read