ఇండియా టుడే సంస్థ, ప్రతి ఏడాది మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో, బెస్ట్ సియం ఎవరు, కాబోయే ప్రధాని ఎవరూ అనే విధంగా ఒక సర్వే చేస్తూ వస్తుంది. ప్రతి ఏడాది చేసినట్టే, ఈ ఏడాది కూడా, ఇండియా టుడే ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో అన్ని రాష్ట్రాల సియంలకు, ప్రజల్లో ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయం చెప్పటానికి, అప్రూవల్ రేటింగ్స్ అనేవి కూడా ఇచ్చింది. ప్రజల అభిప్రాయాల సేకరణ చేసిన మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో, ఈ సర్వే నిన్న ఇండియా టుడే విడుదల చేసింది. ఇందులో ప్రకటించిన టాప్ 11 ముఖ్యమంత్రులలో జగన్ మోహన్ రెడ్డికి స్థానం లేకుండా పోయింది. ఏ స్థానం వచ్చిందో తెలియదు కానీ, టాప్ 11లో అయితే జగన్ లేరు. ఇండియాలో బెస్ట్ సియం ఎవరు అని మూడ్ అఫ్ ది నేషన్ పేరుతో వచ్చిన ఈ సర్వేలో జగన్ మోహన్ రెడ్డి స్థానం అమాంతం పడిపోయింది. జగన్ పాలన పైన కేలవం 19 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. అంటే 81 శాతం మంది ప్రజలు జగన్ పరిపాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవలే సియంగా ఎన్నికైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అందరి కంటే మొదటి స్థానంలో ఉన్నారు. ఆయనకు 42 శాతం మంది ప్రజల మద్దతు లభించింది. ఆ తరువాత స్థానంలో, అంటే రెండో స్థానంలో నవీన్ పట్నాయక్ ఉన్నారు.

indiatoday 17082021 2

ఇక మూడో స్థానంలో కేరళ ముఖ్యమంత్రి, తరువాత మహరాష్ట్ర ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ ఇలా వీరు అంతా ఉన్నారు. అయితే 30 శాతం నుంచి 19 శాతం వరకు రేటింగ్ తెచ్చుకున్న వారిలో కూడా చాలా మంది ఉన్నారు. వారిలో ఉత్తరప్రదేశ్, రాజాస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే ఇందులో జగన్ మోహన్ రెడ్డికి మాత్రం 19 శాతం ప్రజల మద్దతు మాత్రమే వచ్చింది. జగన్ ప్రజల మనసులు గెలవటంలో, పూర్తిగా వెనుకబడి పోయారని కూడా ఈ సర్వే ద్వారా అర్ధం అవుతుంది. ప్రజలు కోరుకున్న పాలన అందించటంలో జగన్ పూర్తిగా విఫలం అయ్యారునే విషయం ఈ మూడ్ అఫ్ ది నేషన్ పోల్ లో అర్ధం అవుతుంది. అయితే గత ఏడాది ఇదే సర్వేలో, జగన్ కు 11 శాతం మంది బెస్ట్ సియం అని చెప్పగా, ఈ ఏడాది మాత్రం కేవలం 6 శాతం మాత్రమే జగన్ బెస్ట్ సియం అని తమ అభిప్రాయం తెలిపారు. అయితే గతంలో ఇండియా టుడే ఇచ్చిన రేటింగ్ గురించి గొప్పగా చెప్పుకున్న వైసీపీ, వారి మీడియా, ఇప్పుడు రేటింగ్ పడిపోవటంతో సైలెంట్ అయిపోయారు.

వైసీపీ సోషల్ మీడియా ఎలాంటి పోస్టులు పెడుతుందో, ఎలాంటి రాతలు, ఎలాంటి ఫేక్ లు, ఎలాంటి మార్పింగ్లు చేస్తుందో అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత, వీరిని ఆపేవారు లేకుండా పోయారు. చివరకు జడ్జిలను, కోర్టులను కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు దిగజార్చే విధంగా పోస్టింగులు పెట్టే స్థాయికి వచ్చారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, ఏకంగా హైకోర్టు, తమ పై వైసీపీ పైడ్ బ్యాచ్ పెడుతున్న పోస్టులు గురించి సిబిఐ ఎంక్వయిరీ చేయమనే దాకా వెళ్ళింది. ఇప్పటికే సిబిఐ వీళ్ళ పని పట్టే పనిలో ఉంది. ఈ బ్యాచ్ విదేశాల్లో కూడా ఉంది. ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ అనే పశువులు డాక్టర్ కూడా ఉన్నాడు. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సభ్యుడు కూడా. ఇప్పుడు ఈ పంచ్ ప్రభాకర్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసారు. యుట్యూబ్ ఛానల్ లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వారి అందరి పైన, అసభ్య పదజాలంతో, వీడియోలు చేస్తున్నాడు అంటూ, ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పంచ్ ప్రభాకర్ అసభ్య పదజాలంతో, ప్రముఖుల పైన వీడియోలు చేస్తూ ఉంటారని, ముఖ్యంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై కూడా ఇటీవల బూతులతో అసభ్యంగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అంటూ, ఆ వీడియోల లింక్ లను ఢిల్లీ పోలీసులకు ఇచ్చారు.

pp 17082021 2

అలాగే చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాతో పాటుగా, ఇతర ప్రముఖులు పై కూడా, ఇలాగే అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలు చేసారని ఆ లింక్ లు కూడా ఇచ్చారు. వీటి అన్నిటినీ ఢిల్లీ పోలీసులకు ఎంపీ రఘురామరాజు ఇచ్చారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ప్రాధమిక విచారణ చేసి, అతని పై కేసు నమోదు చేసారు. అలాగే ఈ కేసు పై దర్యాప్తు కూడా చేయనున్నారు. ఇప్పటికే యుట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. పంచ్ ప్రభాకర్ వీడియోలకు సంబందించిన పూర్తి సమాచారాన్ని తమకు అందచేయాలని, యుట్యూబ్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. యుట్యూబ్ సంస్థ ఇచ్చే తదుపరి సమాచారం ఆధారంగా, విచారణ కొనసాగబోతుంది. ప్రస్తుతం ఇతను అమెరికాలో ఉంటున్నాడు. ఢిల్లీ పోలీసులు అతన్ని ఇక్కడకు పిలిపించే అవకాసం కూడా ఉంది. రఘురామరాజు కూడా ఆంధ్రప్రదేశ్ లో కాకుండా, వ్యూహాత్మకంగా ఢిల్లీలో ఈ కేసు పెట్టి, పంచ్ ప్రభాకర్ ని ఫిక్స్ చేసారనే చెప్పాలి.

గుంటూరులో రమ్య కుటుంబాన్ని పరామర్శించటానికి వచ్చిన నారా లోకేష్ ని, పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోకేష్ వచ్చిన సమయంలో, వైసీపీ నేతలు కూడా అక్కడకు చేరుకుని , లోకేష్ కార్యక్ర్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటంతో, అక్కడ వాగ్వివాదం మొదలైంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, అనూహ్యంగా లోకేష్ తో పాటుగా, నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ళ నరేంద్ర తదితర నేతలను ఆర్రేస్ట్ చేసారు. లోకేష్ ని అరెస్ట్ చేసి పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో మహిళా కార్యకర్తలు, టిడిపి శ్రేణులు భారీ ఎత్తున పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. గంట గంటకు అక్కడ కార్యకర్తలు పెరిగి పోయారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపుగా 5 గంటలకు పైగా లోకేష్ ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచిన పోలీసులు, సాయంత్రానికి వదిలేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ జనాలను చుసిన పోలీసులు, లోకేష్ ను బయటకు తీసుకుని వచ్చారు. దీంతో అందరూ లోకేష్ ని వదిలేస్తున్నారు అని అనుకున్నారు. అయితే అనూహ్యంగా పోలీసులు ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడ పోలీసులు కూడా వ్యూహాత్మికంగా వ్యవహరించారు. లోకేష్ ని తన వాహనంలో ఎక్కించటంతో, అందరూ వదిలేస్తున్నారని అనుకున్నారు.

ln arrest 16082021 2

అయితే లోకేష్ వాహనం మాత్రమే తీసుకుని, మిగతా వాహనాలు నిలిపివేశారు. ఉన్నాతాధికారుల ఆదేశం అని, వేరే స్టేషన్ కు తరలిస్తున్నాం అని అన్నారు. దీంతో అందరూ లోకేష్ ని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు తెసుకుని వెళ్తున్నారని అనుకున్నారు. అక్కడకి కాకుండా పెదనందిపాడు స్టేషన్ అన్నారు, ఇప్పుడు అది కూడా కాకుండా పొన్నూరు వైపు లోకేష్ ని తరలిస్తున్నారు. మొత్తంగా లోకేష్ ని స్టేషన్ ల చుట్టూ తిప్పుతున్నారు. అయితే ఇప్పటికీ ఎటు తీసుకుని వెళ్తున్నారు అనే దాని పై అయితే స్పష్టం లేదు. అయితే ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వేస్తారా, లేదా ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారా అనేది తెలియాల్సి ఉంది. చిన్న దానికి కూడా ఇంత హడావిడి ప్రభుత్వం ఎందుకు చేస్తుందో అర్ధం కావటం లేదని టిడిపి నేతలు అంటున్నారు. పరామర్శకు వెళ్తే, ఇలా అరెస్ట్ చేయటం, అలాగే ఇలా స్టేషన్ లు చుట్టూ తిప్పటం ఏమిటో అర్ధం కావటం లేదని అంటున్నారు. మరి లోకేష్ ని వదిలేస్తారా ? ఏమి చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు , 2012 నుంచి నడుస్తూనే ఉంది. జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండటం, తరువాత బెయిల్ మీద బయటకు రావటం, ముఖ్యమంత్రి అవ్వటం, ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలి అంటూ పిటీషన్లు, ఇవన్నీ ఒక పక్క నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఈ కేసులు ఇంకా ట్రైల్స్ కు రాలేదు. ఇంకా డిశ్చార్జ్ పిటీషన్ల దగ్గరే నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈ రోజు మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ రోజు మరో రెండు కొత్త చార్జ్ షీట్లతో, జగన్ పై అభియోగాలు మోపుతూ, కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేసింది. దీంతో అందరూ షాక్ తిన్నారు. ఒక పక్క 25వ తేది జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వస్తున్న నేపధ్యంలో, ఇప్పుడు కొత్తగా మరో రెండు చార్జ్ షీట్లు నమోదు చేయటం చర్చకు దారి తీసింది. సిబిఐ వేసిన చార్జ్ షీట్ల ఆధారంగా, ఈడీ ఈ అంశం పై నేరుగా విచారణ జరిపింది. సిబిఐ ఇప్పటికే జగన్ అక్రమ ఆస్తుల కేసులు పై, ఇప్పటికే 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అయితే వాటి ఆధారంగా దార్యప్టు చేసి, ఈడీ ఇప్పటి వరకు ఏడు చార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఇప్పటికే సిబిఐ వేసిన 11 చార్జ్ షీట్లను, అలాగే ఈడీ వేసిన మరో ఏడు చార్జ్ షీట్లను, పరిగణలోకి తీసుకున్న కోర్టు, వాటి పై విచారణ జరుపుతుంది.

ed 17082021 2

అయితే ఇప్పటికే దాఖలు చేసిన ఏడు చార్జ్ షీట్లతో పాటుగా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పుడు మరో రెండు కొత్త చార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఈ రోజు ఇవి కూడా కోర్టుకు సమర్పించింది. ఇందులో ముఖ్యంగా వాన్‌పిక్‌ తో పాటుగా, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ అనే రెండు అంశాలకు సంబంధించి, ఈ చార్జ్ షీట్లను సమర్పించింది. వీటికి సంబంధించి, గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వెయ్యి కోట్ల ఆస్తుల వరకు జప్తు కూడా చేసింది. వాన్‌పిక్‌ ఓడరేవు నిర్మాణానికి సంబంధించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో, అధికార దుర్వినియోగం జరిగింది అనే ఆరోపణతో, సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. వాటి ఆధారంగా, మనీ లాండరింగ్ ఆరోపణలతో, దర్యాప్తు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఈ కేసు విషయంలో చార్జ్ షీట్ నమోదు చేసారు. ఇక మరో కేసు అయిన లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ విషయంలో కూడా మనీ లాండరింగ్ ఆరోపణలతోనే చార్జ్ షీట్ నమోదు చేసారు. కోర్టు ఈ రెండు పరిగణలోకి తీసుకుంటే, దీని పై కూడా విచారణ మొదలు కానుంది.

Advertisements

Latest Articles

Most Read