ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం, రేపు సిబిఐ కోర్టు ఏమి తీర్పు ఇస్తుందా అనే టెన్షన్ లో ఉంది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. మొన్న ఎన్నికల్లో అయన ప్రభుత్వంలోకి వచ్చారు. అయితే ఆయన పై కేసులు విచారణ నెమ్మదిగా సాగుతుంది. దాదాపుగా 9 ఏళ్ళు ఆయన బెయిల్ పై ఉన్నారు. వీటి అన్నిటి నేపధ్యంలో, రఘురామకృష్ణం రాజు, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసారు. జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, తన సహా నిందితులకు పదవులు ఇస్తున్నారని, ఇలా అనేక కారాణాలు కోర్టు ముందు వాదించారు. ఇక ఇదే సమయంలో సిబిఐ వైఖరి కూడా అందరినీ ఆశ్చర్య పరిచింది. తాము విచారణ చేస్తున్న నిందితుడికి బెయిల్ ఇవ్వాలో, వద్దో చెప్పలేని స్థితిలో సిబిఐ ఉండి పోయింది. కోర్టుకు బెయిల్ రద్దు చేయమని, వద్దు అని చెప్పకుండా, ఉండి పోయింది. వీటి అన్నిటి నేపధ్యంలో, రేపు ఆగష్టు 25 తారీఖు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు రానుంది. దీంతో రాష్ట్రం మొత్తం ఏమి జరుగుతుందా అని టెన్షన్ పడుతుంది. వైసీపీ పార్టీలో కూడా ఈ టెన్షన్ ఉంది. అయితే అనూహ్యంగా ఈ రోజు సుప్రీం కోర్టు నుంచి బెయిల్ రద్దు చేసే విషయంలో, ఒక సంచలన తీర్పు వచ్చింది.

case 24082021 2

ఒక హ-త్య కేసు విషయంలో, అలహాబాద్, ఉత్తరాఖండ్‌ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఉదహరిస్తూ, వారు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తీర్పులో కొన్ని కీలక విషయాలు పేర్కొంది. బెయిల్ ఇవ్వటానికి ఏమి అయితే పరిగణలోకి తీసుకుంటారో, బెయిల్ రద్దు చేయటానికి కూడా అవే పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. అందులో ముఖ్యంగా, నేరాన్ని మళ్ళీ రిపీట్ చేసే అవకాసం ఉంటే కానీ, సాక్ష్యులను ప్రభావితం చేసే ఆవకాశం ఉంటే కానీ, బెయిల్ ఇస్తే, దాని ప్రభావం తీర్పు మీద ఉండే అవకాసం ఉంటే కానీ, అతని క్యారక్టర్, బిహేవియర్, అతని నేపధ్యం ఇలా అనేక విషయాలు సుప్రీం ఉదహరించింది. అంతే కాకుండా, తన బెయిల్ రద్దు చేయాలని అపీల్ చేసిన వ్యక్తికి హాని జరుగుతుంది అనుకుంటే కూడా వర్తిస్తుందని చెప్పింది. అయితే ఇవే అంశాలు రఘురామకృష్ణం రాజు వాదించారు. రేపు జగన్ బెయిల్ రద్దు పై తీర్పు వస్తున్న నేపధ్యంలో, ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, ఆసక్తి రేపుతుంది. మరి రేపు ఏమి జరుగుతుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో జాతీయ ఉపాధి హామీ పధకంలో చేపట్టిన పనులకు సంబందించిన, బిల్లులు చెల్లింపు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో, ఈ రోజు చీఫ్ జస్టిస్ ముందు జరిగిన విచారణకు, రాష్ట్ర ఉన్నాతాధికారులు హాజరు అయ్యారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ ఈ రోజు ధర్మాసనం ముందుకు హాజరు అయ్యారు. ఇప్పటికే 400 కోట్లు రూపాయలు, అయుదు లక్షల బిల్లులు లోపు ఉన్న కాంట్రాక్టర్లకు చెల్లించామని, మరో 1100 కోట్ల రూపాయాలు ఏడు రోజుల్లో చెల్లిస్తామని ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా రావాల్సి ఉంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు చెప్పగా, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ వద్ద నుంచి ఇవ్వాల్సిన నిధులు అన్నీ ఇచ్చేసామని, కేంద్ర ప్రభుత్వం తరుపు నుంచి కోర్టుకు తెలిపారు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం 400 కోట్లను పంచాయతీల ఎకౌంటులో వేసాం అంటూ చెప్పటం పై, పిటీషనర్ తరుపు న్యాయవాదులు వీరారెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్, నర్రా శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు.

dvivdei 24082021 2

ఈ పనులు ఎవరు అయితే చేసారో, వారి ఎకౌంటు లో మాత్రమే డబ్బులు వేయాలని కోర్టుకు తెలిపారు. అలాగే కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు అంటూ, కోర్టుకు తెలిపారు. అయితే దీని పై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎకౌంటులో మీరు నిధులు వేస్తే, అవి లబ్దిదారులకు ఎలా వెళ్తాయి అంటూ అధికారులను ప్రశ్నించింది. వెంటనే ఈ నిధులను ఎవరు అయితే పనులు చేసారో, వారికి నేరుగా చెల్లించాలని, ఈ చెల్లింపులకు సంబంధించి, పూర్తి వివరాలు కూడా వచ్చే వాయిదా నాటికి తమకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పూర్తి స్థాయి అఫిడవిట్ తమకు ఇవ్వాలని, కోర్టు ఆదేశించింది. ఇక ఉన్నతాధికారులు అయిన పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ తాము గత రెండు వాయిదాల నుంచి కోర్టుకు వస్తున్నాం అని, వచ్చే వాయిదాకు తమకు మినహాయింపులు ఇవ్వాలని కోరగా, దానికి హైకోర్టు ఒప్పుకోలేదు, ఈ కేసు విచారణ అయ్యేంత వరకు అధికారులు కోర్టుకు రావాల్సిందే అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది..

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఇప్పుడు ఒక కొత్త రకం టెన్షన్ పట్టుకుంది. దేశ వ్యాప్తంగా క్రిమినల్ కేసులు ఎదుర్కుంటున్న ప్రజా ప్రతినిధుల జాబితాను ఏడీఆర్‌ అనే ఒక సంస్థ అధ్యయనం చేసి, ఆ రిపోర్ట్ ను విడుదల చేసింది. 2019 నుంచి 2021 వరకు జరిగిన అనేక ఎన్నికలను పరిగణలోకి తీసుకుని, ఈ రిపోర్ట్ తయారు చేసారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు వేసిన అఫిడవిట్లు ఆధారంగానే, ఈ రిపోర్ట్ ని క్రోడీకరించారు. అంటే, ఈ రిపోర్ట్ లో ఉన్న విషయాలు, వందకు వంద శాతం వాస్తవం. అయితే ఈ రిపోర్ట్ లో ముఖ్యంగా తీవ్రమైన నేరాలు చేసిన వారి జాబితాను మాత్రమే ప్రచురించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(1),(2),(3)లో ఏ నేరాలు అయితే వస్తాయో, వాటి ఆధారంగా నమోదు చేసిన కేసులు, వారి వివరాలను ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ఈ సెక్షన్ ల ప్రకారం నమోదు అయిన కేసులు విషయంలో, కేసు విచారణలో ఈ అభియోగాలు నిజం అని కోర్టు నమ్మి, శిక్ష వేస్తే, ఆ ప్రజాప్రతినిధి అనర్హతకు గురి అవుతారు. మరో పక్క ఈ కేసుల విషయంలో త్వరగా తేల్చేయాలి అంటూ, సుప్రీం కోర్టు కూడా ఈ మధ్య ఉత్తర్వులు ఇవ్వటం, ఆక్టివ్ గా ఆ కేసు ని ముందుకు తీసుకుని వెళ్ళటం అందరూ చూస్తూనే ఉన్నారు.

adr 24082021 2

అయితే ఈ రిపోర్ట్ ప్రకారం, మొత్తంగా దేశంలో 67 మంది ఎంపీలు, 296 మంది ఎమ్మెల్యేల పై తీవ్రమైన అభియోగాలతో కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే, సహజంగా ఈ లిస్టు లో పెద్ద పార్టీలు అయినా బీజేపీ, కాంగ్రెస్, టిఎంసి తరువాత, మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాలుగో స్థానం పొందింది. ఈ లిస్టు లో మొత్తం నలుగురు ఎంపీలు ఉండగా, 18 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఉన్నారు. నిజానికి మరో ఇద్దరు అంటే వాసుపల్లి గణేష్, కరణం పేర్లు కుడా ఉన్నాయి. ప్రస్తుతం వీరు వైసీపీతో ఉన్నారు కాబట్టి, ఈ లిస్టు 20 అనే చెప్పాలి. వీరిలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ కేసులు ఈ మధ్య, వైసీపీ ప్రభుత్వం ఉప సంహరించుకున్న సంగతి తెలిసిందే. దీని పై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా ఈ ఎంపీలు, ఎమ్మెల్యేల పై ఉన్న కేసులు రుజువు అయితే మాత్రం, వారు అనర్హత వేటుకి గురి అవుతారు. ఏది ఏమైనా, ఏపి ఇలాంటి వాటిల్లో ముందు ఉండటం మాత్రం విచారకరం.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విచారణ నిన్న హైకోర్టులో జరిగిన విషయం తెలిసిందే. అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళారు. ఈ కేసు విషయం పై, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ నియమించింది. ఈ కేసు గతంలోనే విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, సెకండ్ వేవ్ కారణంగా, ఈ కేసు విచారణ ఆగష్టు 23కు కోర్టు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే, నిన్న కేసు విచారణ ప్రారంభం కాగానే, రైతుల తరుపున వాదిస్తున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు, తమకు ఈ వారం వేరే కేసులు ఉన్నాయని, ఒక వారం పాటు వాయిదా వేయాలని కోరారు. అలాగే మరి కొంత మంది, ఇది ఆన్లైన్ లో విచారణ అయ్యేది కాదని, బౌతికంగా విచారణ జరపాలని కోరారు. అలాగే ప్రభుత్వం తరుపు ఆలోచన చెప్పాలని కోర్టు కోరటంతో, అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేసారు. దీంతో ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవటం, పిటీషనర్ తరుపు న్యాయవాదులు వాయిదా కోరటంతో, కోర్టు కూడా దీనికి అంగీకరిస్తూ, కేసు విచారణను వాయిదా వేసింది. ఈ కేసుని మళ్ళీ నవంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. నిజానికి ఇది కోర్టు నిర్ణయం కాదు, అందరూ ఒప్పుకున్నారు కాబట్టి, కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

botsa 24082021 2

అయితే కేసు వాయిదా వేయటం, అలాగే పిటీషనర్ లు వాయిదా కోరటం పై, మంత్రి బొత్సా ఆగ్రహం వ్యక్తం చేసారు. రోజు వారీ విచారణ చేస్తామని కోర్టు చెప్పిందని, ఇప్పుడు పిటీషనర్లు వాయిదా కోరటం ఏమిటి అంటూ ప్రశ్నించారు. దీని వెనుక పిటీషనర్లకు ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయి ఏమో అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే బొత్సా వ్యాఖ్యల పై ఘాటుగా బదులు ఇచ్చారు రాజధాని ప్రాంత రైతులు. నిజానికి నిన్న కోర్టులో, తాము వారం రోజులు వాయిదా వేయమని కోరామని, అయితే ఈ సందర్భంలో కల్పించుకున్న అడ్వకేట్ జనరల్ మాత్రం నవంబర్ వరకు వాయిదా కోరారని, అసలు విషయం చెప్పారు. ఇప్పుడు క-రో-నా నడుస్తుందని, అక్టోబర్ లో కోర్టుకు సెలవలు ఉంటాయి కాబట్టి, నవంబర్ నుంచి అయితే రోజు వారీ విచారణకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అడ్వకేట్ జనరల్ కోరారని అసలు విషయం చెప్పారు. విచారణ తొందరగా అయితే మాకే మంచిదని, బొత్సా తమ పై చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read