ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు సాధించటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుంది. మెడలు వంచేస్తాం అని చెప్పిన వాళ్ళు, రాజ్యసభలో వైసిపీ అవసరం బీజేపీకి ఉన్నా, ఎలాంటి షరతులు ఇవ్వకుండా పూర్తిగా సహకారం ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆటలు ఆడుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు వల్లే నిధులు రావటం లేదని తేల్చేసారు. అయితే పోయిన వారం ఢిల్లీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ రెండో డీపీఆర్ 47 వేల కోట్లకు ఆమోదం త్వరలోనే వచ్చేస్తుందని, మరో వారం రోజుల్లో క్యాబినెట్ కూడా దీన్ని ఆమోదిస్తుంది అంటూ, విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఆ మాటలు అన్నీ వట్టి మాటలే అని తేలిపోయింది. అసలు విషయం ఇప్పుడు కేంద్రం చెప్పేసింది. అయితే ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చింది. పోలవరం పై కేంద్రం బాంబు పెల్చిందనే చెప్పవచ్చు. ఈ రోజు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా పెండింగ్ లో ఉందా, పెండింగ్ లో ఉంటే దానికి `సంబంధించిన అనుమతులు ఎప్పటి లోగా ఇస్తారు, అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్న వేసారు.

gajendra 02082021 2

ఈ ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి షకావత్ సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి సవరించిన డీపీఆర్ విషయం పై తమ దగ్గర ఎలాంటి అనుమతులు పెండింగ్ లో లేవని స్పష్టం చేసారు. అంతే కాకుండా, 2011-2019 మధ్య కాలంలోనే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, ఎటువంటి సవరించిన అదనపు డీపీఆర్ తమకు సమర్పించ లేదని, ఆయన చెప్పారు. అంతే కాకుండా, గతంలో డీపీఆర్ కు సంబంధించి, 2005 ధరల ప్రకారం, 2009 లో జరిగిన అప్పటి 95వ అడ్వైజరీ మీటింగ్ లో పది వేల కోట్ల చిల్లరకు ఈ డీపీఆర్ ని ఆమోదించామని, అయితే అప్పటి నుంచి కూడా తమ శాఖలో ఎటువంటి డీపీఆర్ పెండింగ్ లో లేదని మరో బాంబు పేల్చారు. సవరించిన అంచనాలు అయితే 2019కి ముందు రెండు సార్లు సవరించామని, అయితే డీపీఆర్ మాత్రం ఏమి తమ వద్ద పెండింగ్ లో లేదని చెప్పారు. మరి పోయిన వారం విజయసాయి రెడ్డి, 47 వేల కోట్లకు ఆమోదం వచ్చేస్తుందని ఎలా చెప్పారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, పారిశ్రామిక రంగం పడకేసింది అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. నిజానికి ఈ రెండేళ్ళలో ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు చేసింది లేదు. అన్నీ పేపర్ ప్రకటనలు తప్పితే, ఒక్క పరిశ్రమ రాకపోగా, లూలు, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు వెనక్కు వెళ్ళిపోయాయి. ప్రభుత్వం వైఖరి దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక పొతే కొంత మంది పారిశ్రామవేత్తలను టార్గెట్ చేయటం కూడా, ఈ పరిస్థితి కారణం కాకపోలేదు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సోలార్ పీపీఏలు రద్దు చేయటంతో, ఒక్కసారిగా పాశ్రామిక వర్గాల్లో మన పై నెగటివ్ ఇమేజ్ వచ్చింది. ముఖ్యంగా దావోస్ లాంటి చోట కూడా, ఇదే చర్చించారు. చివరకు మన దేశానికే పెట్టుబడులు పెట్టే ఉద్దేశం లేదని చెప్పారు అంటే, పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో పారిశ్రామిక రంగం పడేసింది. ఈ నేపెధ్యంలోనే, టిడిపి నేతలకు చెందిన కంపెనీలను కూడా జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. ఇదే కోవలో చిత్తూరు జిల్లాలో, అతి పెద్ద సంస్థగా ఉన్న అమరరాజా కంపెనీ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒకానొక సమయంలో ఫ్యాక్టరీని కూడా మూసివేయించింది. కోర్టు ద్వారా మళ్ళీ పరిశ్రమ తెరుచుకుంది.

amararaja 02082021 2

అమరరాజా కంపెనీ పర్యావరణానికి కీడు చేస్తుంది అంటూ, ఆ కంపెనీ పై ఏపి ప్రభుత్వం చర్యలకు పాల్పడింది. అయితే దాదాపుగా 6 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ, ఇప్పుడు ఏపి ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. ఇది ఏపి ప్రభుత్వానికి అనుకోవటం కంటే, ఏపి ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి నష్టం అని చెప్పుకోవచ్చు. అమరరాజా కంపెనీ విస్తరణ పేరుతో అతి భారీ పెట్టుబడి పెట్టటానికి సిద్ధం అయ్యింది. తమిళనాడు, తెలంగాణా, కర్ణాటక నుంచి కంపనీకి ఆహ్వానాలు అందగా, వారు తమిళనాడులో కొత్త ప్లాంట్ పెట్టటానికి నిర్ణయం తీసుకున్నారు. ఏపిలో కార్యకలాపాలు తగ్గించి, తమిళనాడు ప్లాంట్ ని ఆక్టివ్ చేయనున్నారు. మూడు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు రావటం, ముఖ్యంగా తమిళనాడు, ఇప్పుడున్న చిత్తూరు ప్లాంట్ కు దగ్గరగా ఉందటంతో, తమిళనాడు వెళ్ళిపోవటానికి సిద్ధం అయ్యారు. చిత్తూరులో ఉన్న ప్లాంట్ యధావిధిగా కొనసాగుతుందని చెప్తున్నా, ఇక్కడ ఉన్న పరిస్థితి చూసి, వారు ఇక్కడ తమ కార్యకలాపాలు తగ్గించుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, తనకు నచ్చని వాళ్ళని ఎలా టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారో, ఈ రెండేళ్ళలో చూస్తూనే ఉన్నాం. అవినీతి ఆరోపణలు చేసి చేసి, చివరకు ఏ ఆధారం దొరక్క పోవటంతో, ఎస్సీ, ఎస్టీ కేసులు, మీసం తిప్పారని కేసులు, కో-వి-డ్ కేసులు, ఇలా పెట్టుకుంటూ వస్తున్నారు. రాజకీయ నాయకులనే కాదు, తనని ఇబ్బంది పెట్టిన అధికారుల పై కూడా ఇలాగే టార్గెట్ పెట్టుకున్నారు. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర రావుని జగన్ ప్రభుత్వం ఇలాగే టార్గెట్ చేసింది. అధికారంలో వచ్చిన వెంటనే, ఆయన పై నిఘా పరికరాల స్కాం అంటూ అభియోగాలు మోపి, ఆయన్ను సస్పెండ్ చేసారు. దీని పై ఆయన ఇప్పటికే కోర్టుకు వెళ్ళారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం శాఖాపరమైన విచారణ జరిగింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సిసోడియా ఎదుట ఆయన విచారణకు కూడా హాజరు అయ్యారు. అయితే ఇది ఇంకా విచారణ దశలోనే ఉండగా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, నిన్న రాత్రి ఒక రహస్య జీవో ఇచ్చి, ఆయన పై అభియోగాలు అన్నీ ఫైల్ రూపంలో పెట్టి, ఆయన్ను డిస్మిస్ చేయాలి అంటూ, కేంద్రానికి పంపించటం సంచలనంగా మారింది. ఒక ఐపిఎస్ స్థాయి అధికారిని డిస్మిస్ చేయాలి అంటూ, మన రాష్ట్రం నుంచి ప్రతిపాదన వెళ్ళటం ఇదే మొదటి సారి అని చెప్తున్నారు.

abv 02082021 2

అయినా ఏబి వెంకటేశ్వర రావు అసలు ఏమి చేసారో, ఆయన పై ఉన్న అభియోగాలు నిజమో కాదో, విచారణ రిపోర్ట్ రాక ముందే, అలాగే సుప్రీం కోర్టులో తీర్పు రాకముందే, ప్రభుత్వం ఇలా ఎందుకు తొందర పడిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. కేంద్రం కూడా ఊరికే , డిస్మిస్ చేయటానికి వీలు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆధారాలు ఇవ్వకుండా, విచారణ పూర్తి కాక ముందే, రాష్ట్ర ప్రభుత్వం తొందర పడి ఎందుకు, డిస్మిస్ చేయమని కోరుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే కేంద్రం అంత తేలికగా నిర్ణయం తీసుకోదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరో వాదన, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విచారణ తరువాత, ఏబి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ, కొంత మంది అధికారులు తన పై కుట్ర చేసారని చెప్పారని, అలా మీడియాతో మాట్లాడటం సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా కాబట్టి, ఆ విషయంలో డిస్మిస్ చేయమని రాష్ట్రం కోరినట్టు చెప్తున్నారు. మరి ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా ఒక ఐపిఎస్ స్థాయి అధికారిని కేంద్రం డిస్మిస్ చేస్తుందా ? మరి కేంద్రం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటి జగడం వ్యవహరం సుప్రీం కోర్టుకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్ట్ లో విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్ళను తెలంగాణా వాడేస్తూ, ఆ నీటిని అనవసరంగా కిందకు పంపుతున్నారని, అవి సముద్రపు పాలు అవుతున్నాయి అంటూ, ఏపి ప్రభుత్వం అభ్యంతరం చెప్తూ, సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ఈ రోజు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందుకు వచ్చింది. తెలంగాణా ప్రభుత్వాన్ని వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని ఆదేశాలు ఇవ్వాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పిటీషన్ లో కోరింది. అయితే ఈ అంశం పై విచారణ మొదలు కాగానే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభ్యంతరం చెప్పారు. తాను న్యాయ పరమైన అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేసారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు, మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరుతున్నానని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదానికి పరిష్కారం అందించే అవకాశాలు ఉన్నాయి అంటూ, జస్టిస్ ఎన్వీ రమణ ఈ రెండు రాష్ట్రాలకు ఎన్వీ రమణ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల న్యాయవాదులు ఈ దిశగా ఆలోచించాలని సూచించారు.

nvramana 02082021 2

అయితే దీని పై విచారణ కొనసాగించాలని రెండు రాష్ట్రాలు భావిస్తే కనుక, తాను ఈ పిటీషన్ ను వాదించలేనని, ఈ పిటీషన్ ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తామని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. మరో పక్క మధ్యవర్తిత్వం ఇరు రాష్ట్రాలకు ఆమోదం అనుకుంటేనే, తాను ఈ విషయాన్ని చేపడతామని అన్నారు. అయితే ఎన్వీ రమణ ఈ విషయం చెప్పిన వెంటనే, చీఫ్ జస్టిస్ చెప్పిన అంశాన్ని, ఏపి ప్రభుత్వ తరుపు న్యాయవాది దవే స్పందిస్తూ, ఇది చాలా మంచి విషయం అని, దీన్ని ఏపి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. వారి అభిప్రాయం చెప్తామని కోర్టుకు చెప్పారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం తరుపు న్యాయవాది, అసలు ఇప్పుడు సమస్యే లేదని, కేంద్ర ప్రభుత్వం బోర్దులకు పెత్తనం ఇస్తూ గజెట్ ఇచ్చిందని, అంతే కాకుండా నీళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అయితే ఏపి ప్రభుత్వం లాయర్ మాత్రం,బోర్డుకు ఇంకా నాలుగు నెలల సమయం ఉందని, ఇప్పటికే ఈశాన్య రాష్ట్రంలో గొడవలు చూస్తున్నాం అన్నారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుని, అసలు కలలో కూడా అలాంటి ఆలోచన రానివ్వద్దు అంటూ, ఈ విషయం పై ఒక పెద్ద మనిషి తరహాలో చెప్తూ, మధ్యవర్తిత్వం గురించి ఆలోచించాలని, కేసు ఎల్లుండికి వాయిదా వేసారు.

Advertisements

Latest Articles

Most Read