అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రా-ణ-హా-ని ఉందంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. రామకృష్ణారెడ్డి ఎంతో క్రియాశీలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు.ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా అక్రమ మైనింగ్ ను కూడా అడ్డుకుంటున్న నాయకుడు. అందుచేతనే, మైనింగ్ మాఫియా రామకృష్ణారెడ్డి ని, అతని కుటుంబ సభ్యులను చం-పే-స్తా-మ-ని, వారి ఆస్తిపాస్తులను ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు. దీనికి సంబంధించి రామకృష్ణారెడ్డి గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రామకృష్ణారెడ్డి తనకు రక్షణ కల్పించాలని తూర్పుగోదావరి ఎస్పీకి ఇచ్చిన లేఖను తన లేఖకు జత చేసిన చంద్రబాబునాయుడు. డీజీపీ వెంటనే స్పందించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి, అతని కుటుంబ సభ్యులకు వెంటనే రక్షణ కల్పించాలని లేఖలో కోరిన చంద్రబాబు.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, రెండు రోజులు క్రితం, కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కు వెళ్లి, అక్కడ అక్రమ మైనింగ్ పరిశీలించి తిరిగి వస్తూ ఉండగా, దేవినేని ఉమ పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దా-డి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపిలో రివర్స్ పాలన ప్రకారం, దా-డి చేసిన వారి పై కాకుండా, బాధితుల పై కేసులు పెడుతున్నారు అంటూ టిడిపి ఆరోపించినట్టు, దేవినేని ఉమ పై 18 సెక్షన్లు ఉపయోగించి కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తరువాత అక్కడ నుంచి తీసుకుని వెళ్లి జడ్జి ముందు హాజరు ప్రచారం, జడ్జి 14 రోజులు రిమాండ్ విధించటం తెలిసిందే. 14 రోజులు రిమాండ్ విధించటంతో, దేవినేని ఉమ ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుని వెళ్ళారు. ఈ రోజు బెయిల్ పిటీషన్ వేయగా, అది మంగళవారానికి వాయిదా పడింది. అయితే ఇది ఇలా ఉండగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణలు చేస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఈ రోజు జరిగిన పరిణామాలు చూసి, ఏమైనా కుట్ర పన్నారా అనే కోణంలో తెలుగుదేశం పార్టీ, దేవినేని ఉమా భద్రత పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఒక సంచలన పత్రికా ప్రకటన విడుదల చేసారు.

jail 300720212

దేవినేని ఉమని అక్రమంగా అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన తరువాత, ఈ రోజు అకస్మాత్తుగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావును బదిలీ చేయటం పై, తెలుగుదేశం పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ రాజారావు స్థానంలో, కిషోర్ కుమార్ అనే మరో అధికారిని నియమించటం పై, టిడిపి అభ్యంతరం చెప్తుంది. ఇంత అకస్మాత్తుగా ఈ రోజుకి ఈ రోజు బదిలీ చేయటం వెనుక కుట్ర దాగి ఉందని, అచ్చేన్నాయుడు అంటున్నారు. దేవినేని ఉమకు ప్రాణ హా-ని ఉందని, అందుకే తమకు అనుకూలమైన అధికారులను అక్కడ అకస్మాత్తుగా నియమించారు అంటూ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ ప్రత్యర్థులు జైలులో ఉంటే, జైలులోనే వారిని చం-పిం-చే చరిత్ర ఉందని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆందోళన కలుగుతుందని అన్నారు. దేవినేని ఉమకు ఎలాంటి ప్రాణహా-ని జరిగినా, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా, ప్రభుత్వమే దీనికి సంపూర్ణ బాధ్యత వహించాల్సి ఉంటుందని, రాజారావు ఆకస్మిక బదిలీ వెనుక కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసారు.

జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ దాఖలు అయిన పిటీషన్ పైన, సిబిఐ కోర్టు విచారణ ఈ రోజు జరిగింది. ఈ రోజు సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే గత రెండు వారులుగా సిబిఐ కౌంటర్ దాఖలు చేయకుండా కొన్ని కారణాలతో వాయిదా వేయించింది. పోయిన వాయిదాలో, లాయర్లు ఇద్దరికీ జ్వరం వచ్చిందని చెప్పటంతో, సిబిఐ కోర్టు ఈ రోజుకి కేసుని వాయిదా వేసింది. అయితే ఈ రోజు సిబిఐ ఎలాంటి కౌంటర్ వేస్తుంది, జగన్ బెయిల్ రద్దు చేయమని అంటుందా ? వద్దని అంటుందా ? అనే చర్చ జరిగింది. అయితే ఈ రోజు విచారణలో కూడా సిబిఐ ఏమి చెప్పలేదు. ముందుగా తమకు పై నుంచి ఆదేశాలు రాలేదని , కౌంటర్ త్వరలోనే దాఖలు చేస్తామని, మళ్ళీ సాగదీసే ప్రయత్నం చేసింది. అయితే సిబిఐ వైఖరి పై రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కావాలని కాలయాపన చేస్తున్నారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇన్ని వాయిదాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని వాదించారు. తీర్పుని ప్రకటించాలని కోరారు. సిబిఐ ఎందుకు ఇలా చేస్తుందో , ఎవరైనా ఇట్టే అర్ధం చేసుకుంటారు అంటూ, వాదించారు. వెంటనే దీని పై ఒక నిర్ణయం తెసుకోవాలని, మరో వాయిదాకి ఆస్కారం ఇవ్వనవసరం లేదని సిబిఐ కోర్టుకి తెలిపారు.

cbi 30072021 2

దీంతో కోర్టు 30 నిమిషాలకు వాయిదా వేసింది. వాయిదా అనంతరం సిబిఐ తరుపు న్యాయవాదులు స్పందిస్తూ, తాము ఇది వరకు ఇచ్చిన మెమోని పరిగణలోకి తీసుకోవాలని, బెయిల్ రద్దు చేయాలా వద్దా అనేది కోర్టు విచక్షణాధికారానికి వదిలేసాం అని, కోర్టు ఏమి చెప్తే అది అంగీకరిస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే జగన్ తరుపు న్యాయవాదులు, రఘురామ తరుపు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించటం, సిబిఐ కూడా మీ ఇష్టం అని చెప్పటంతో, సిబిఐ కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 25వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఎవరి వాదనలు అవసరం లేకపోవటంతో, అదే రోజు సిబిఐ కోర్టు తమ తీర్పుని ప్రకటించే అవకాసం స్పష్టంగా కనిపిస్తుంది. గత వాదనల్లో కూడా, సిబిఐ న్యాయవాదులు తీరు విమర్శలకు దారి తీసింది. కావాలని వాయిదాలను అడగటం, సాగతీయటం, చివరకు కోర్టు ఇష్టం అని చెప్పటం, ఇది రెండో సారి ఇలా జరగటంతో, కేసుని సాగదీయటానికే సిబిఐ ఇలా వ్యవహరిస్తుంది అనే విమర్శలు వస్తున్నాయి. మరి 25వ తేదీ తీర్పు వస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ఏపిలో అధికార పార్టీకే చెందిన కీలక నేత కుమారుడు గత కొన్ని రోజులుగా సరుగుడు గ్రామ పంచాయతీ, నాతవరం మండలం, విశాఖకు సంబందించినటు వంటి పరిధిలో, అనుమతులు లేకుండా, ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆక్ట్ , ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్, చట్టాలు ఉల్లంఘించి, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లేటరైట్ మైనింగ్ పనులను అధికార పార్టీ నేతలు మొదలు పెట్టారు. తమకు సరైన అనుమతులు ఉన్నాయని వారు బయటకు చెప్తున్నా కూడా, సరైన అనుమతులు పొందకుండా మైనింగ్ చేస్తున్నారని టిడిపి ఆధారాలతో సహా, నిరసనలు తెలియ చేసింది. అంతే కాకుండా, అనుమతులు ఒక చోట పొంది, మైనింగ్ వేరే చోట చేస్తున్నారని, అదీ కాక లైటరైట్ కాకుండా, బాక్సైట్ మైనింగ్ చేస్తున్నారని ప్రధానంగా టిడిపి ఆరోపిస్తుంది. ఈ మైనింగ్ కోసం, నిబంధనలు తొంగలోకి తొక్కి, వెలది వృక్షాలను నరికి, రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ రోడ్డు కూడా నిర్మించారు అంటూ టిడిపి ఆరోపించింది. గిరిజనలు నివసించే ప్రాంతాల్లో రోడ్డులు అక్రమంగా వేస్తున్నారని, టిడిపి ఆరోపిస్తుంది. ఈ మొత్తం వ్యవహరం పై, స్థానిక నేతలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించి, వివరాలు మొత్తం పొందుపరిచారు. అక్రమ మైనింగ్ తో పాటుగా, అడువులు నరికివేయటం, అలాగే గిరిజనులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు అంటూ ఎన్జీటీ ముందు వాదనలు వినిపించారు.

bauxite 30072021 2

ఈ పిటీషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేసింది. జరుగుతున్న అక్రమాల పై ఎన్జీటీ తీవ్ర స్థాయిలో మండి పడింది. రెవిన్యూ రికార్డుల ప్రకారం ఇచ్చిన అనుమతులు, అనుమతులు లేకుండా రోడ్డు నిర్మాణం, పరిధి దాటి జరిగిన అక్రమ మైనింగ్ పై రిపోర్ట్ ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర అటవీ శాఖ సీనియర్ అధికారి, విశాఖకు చెందిన కలెక్టర్, పీసీబీ నుంచి సీనియర్ అధికారితో, ఒక జాయింగ్ కమిటీ ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. అక్కడ జరుగుతున్న అక్రమాల పై, మణ్యం ప్రాంతంలో పర్యటించి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని అక్రమాల పై విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కమిటీకి ఏపి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. జరిగిన నష్టానికి, అధికారుల నుంచి కూడా నష్టపరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. అయితే ఈ మధ్య కాలంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ స్థాయిలో ఆదేశాలు ఇవ్వలేదని, సీరియస్ గా ఉందని తెలుసుకుని అక్రమ మైనింగ్ పాత్రదారులు ఇప్పుడు కంగారు పడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read