గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో, రాయలసీమలో ఉద్యోగాలు ఇవ్వాలని, యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో, తిరుపతిలో ఎలక్ట్రానిక్ హాబ్ ప్రణాళికలు రచించారు చంద్రబాబు. అనేక కంపెనీలు కూడా ఇక్కడకు వచ్చాయి. అనేక మొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఇందులో భాగంగా రిలయన్స్ అంబానీని, అమరావతి తీసుకుని వచ్చారు. తిరుపతిలో పెట్టుబడి పెటించేలా ఒప్పించారు. మొత్తం 15 వేల కోట్లు పెట్టుబడితో, 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా అప్పట్లో చంద్రబాబు ఒప్పందం కుదిర్చారు. ఇది వస్తే అనేక కంపెనీలు కూడా వస్తాయనే ఉద్దేశంతో, వారికి ఇక్కడ 150 ఎకరాలు కేటాయించారు. అయితే గత ప్రభుత్వం కేటాయించిన భూములకు, గతంలోనే రిలయన్స్ సంస్థ చెల్లింపులు కూడా చేసింది. ఎకరాకు నాలుగు కోట్ల తరుపున, అడ్వాన్స్ కూడా చెల్లించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, జగన్ మోహన్ రెడ్డి రావటంతో, సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలో పరిస్థితి చూసిన రెలియన్స్ `సంస్థ ఇక్కడ పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. డబ్బులు వెనక్కు ఇచ్చేయాలని, తాము ఇక్కడ పరిశ్రమను నెలకొల్పటం లేదని, ప్రభుత్వానికి, అలాగే ఏపీఐఐసికి కూడా తేల్చి చెప్పటంతో, అందరూ షాక్ తిన్నారు.
ఈ పరిణామాన్ని ఏపీఐఐసి కూడా ధృవీకరించింది. రిలయన్స్ భూములు వెనక్కు ఇచ్చేసిందని, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని కోరినట్టు చెప్తున్నారు. దీంతో మరో పరిశ్రమ తరలి వేల్లిపోయినట్టు అయ్యింది. దీంతో రాయలసీమలో రావాల్సిన భారీ పరిశ్రమ వెళ్ళిపోయింది. రాయలసీమ యువతకు 25 వేల ఉద్యోగాల వరకు పోయినట్టే అయ్యింది. ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా, గతంలో చంద్రబాబు కష్టపడి తెచ్చిన పరిశ్రమలు అన్నీ వెనక్కు వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. అయితే అంబానీ సన్నిహితుడుకి వైసీపీ కోటాలో రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. ఏకంగా అంబానీకి శాలువా కూడా కప్పారు. అయితే రాజశేఖర్ రెడ్డి మృతికి అంబానీ కారణం అని గతంలో చెప్పి, ఇప్పుడు ఎలా చేస్తారు అంటూ గతంలో ప్రతిపక్షాలు ప్రశ్నించగా, పెట్టుబడులు కోసం అని చెప్పారు. ఇప్పుడు కొత్త పెట్టుబడి రాకపోగా, ఉన్న పరిశ్రమలు కూడా వెన్నక్కు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.