నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుని రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి, ఆయనను మంగళగిరి సిఐడి ఆఫీస్ కు హైదరబాద్ నుంచి తీసుకు వచ్చి, ఆయనను కట్టేసి, కాళ్ళ పై కొ-ట్టా-రు అంటూ సిఐడి పోలీసులు పై, రఘురామరాజు అభియోగాలు మోపటం, ఈ విషయం పై ఆయన అనేక ఫోరమ్స్ లో పోరాటం చేస్తూ ఉండటం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసారు. ఇప్పుడు జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. రఘురామకృష్ణం రాజు ఘటన గురించి పూర్తి నివేదిక తమకు ఇవ్వాలి అంటూ, మే 21న జాతీయ మానవ హక్కుల కమిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. ఏపి ప్రభుత్వానికి సంబందించిన చీఫ్ సెక్రటరీ అదే విధంగా హోంశాఖ కార్యదర్శి, ఇతర శాఖలకు నోటీసులు పంపించి, వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి నాలుగు వారల సమయం కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మే 21న పంపించిన నోటీసుల్లో, నాలుగు వారాలు టైం ఇచ్చి, నాలుగు వారాలు లోగా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఈ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అనూహ్యంగా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన నోటీసులకు రిప్లై రాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆ నోటీసులు పట్టించుకోలేదు. కనీసం సమయం కావాలి అని కూడా అడగలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై అందరూ ఆశ్చర్య పోయారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కూడా లెక్క చేయకపోతే ఎలా అనే విధంగా మాట్లాడారు. ఈ రోజు విచారణకు రావటంతో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, సమన్లు జారీ చేసింది. ఆగష్టు 9 లోగా తాము అడిగిన నివేదిక ఇవ్వాలి అంటూ, హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి ఈ సమన్లు వెళ్ళాయి. ఒక వేళ అప్పటికి కూడా తమకు నివేదిక ఇవ్వకపోతే, తమ ముందు ఆగష్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని డీజీపీ, హోం శాఖ కార్యదర్శిని హెచ్చరించింది. తాము అడిగినా నివేదిక ఇవ్వరా ? అసలు ఎందుకు లేట్ అవుతుంది అంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక ఇవ్వటంలో ఆలస్యం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇదే రిపీట్ అయితే, డీజీపీ తమ ముందుకు రావాల్సి ఉంటుంది అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసింది హ్యూమన్ రైట్స్ కమిషన్...