తిరుపతిలోని రుయాఆసుపత్రిలో సంభవించిన మరణాలన్నీ ప్రభుత్వనిర్లక్ష్యం వల్ల జరిగిన హ-త్య-లే-న-ని, వాటికి ముఖ్య మంత్రే బాధ్యుడని ఆయనపై తక్షణమే హ-త్యా-య-త్నం కేసులు పెట్టాలని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ రుయాఘటనపై తీవ్ర విచారం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచో ట మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం దేశంలోనే 28వ స్థానంలో నిలిచిందన్నారు. వ్యాక్సిన్ల నిల్వలో మరీహీనంగా ఆంధ్రప్రదేశ్ సున్నాకు పడిపో యిందని పట్టాభిరామ్ కేంద్రప్రభుత్వ గణాంకాలతో సహా ప్రజలముందుంచారు. ఆయన విలేకరుల సమావేశం వివరాలు "తొలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేవలం 10.86శాతం మాత్రమే వ్యాక్సినేషన్ అందించారు. వ్యాక్సిన్ల పంపిణీలో రాష్ట్రం 28వస్థానంలో ఉండటానికి ఈ ముఖ్యమంత్రి కారకుడు కాడా? 5కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో నిన్నఒక్కరోజు కేవలం 2003 మందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తారా? నిన్న ఉదయానికి రాష్ట్రంలో 73లక్షల8వేల217 వ్యాక్సిన్లు పూర్తిచేస్తే, ఈరోజు ఉదయానికి 73లక్షల10వేల220.. అంటే కేవలం 2003 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేశారు. ఈ మాట మేం చెప్పడంకాదు.. కేంద్ర ప్రభుత్త్వ లెక్కలే చెబుతున్నాయి. మీకులాగా దొంగలెక్కలు చెప్పడంలేదు. జగన్ రెడ్డి జీతగాడేమో రోజుకి 6లక్షల వ్యాక్సిన్లు ఇస్తున్నట్టు, దేశంలో జగన్మోహన్ రెడ్డే వ్యాక్సిన్ పంపిణీలో టాప్ లోఉన్నట్లు కబుర్లు చెబుతున్నాడు. వాస్తవాలు ఎవరికీ తెలియవనుకుంటున్నావా సజ్జలా? నిన్న ఒక్కరోజే వ్యాక్సిన్ పంపిణీలో పొరుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ఎలాఉన్నాయో చూడండి. తెలంగాణ 93వేలమందికి, తమిళనాడు 87వేలు, కర్ణాటక లక్షా03వేలు, కేరళ లక్షా07వేలమందికి, మహారాష్ట్ర 2లక్షల94 వేలమందికి, రాజస్థాన్ లక్షా83వేలు, ఉత్తరప్రదేశ్ లక్షా66వేలమందికి, గుజరాత్ 2లక్షల34వేలమందికి వ్యాక్సిన్లు ఇచ్చింది. ఏరాష్ట్రం చూసినా రోజుకి లక్షా, 2లక్షలవ్యాక్సిన్లు ఇస్తుంటే, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం నిన్నటికి నిన్న కేవలం 2003మందికి ఇస్తుందా?
సిగ్గుందా మీకుఅసలు? ప్రజల ప్రాణాలు వందల్లో పోతుంటే, వ్యాక్సిన్లు 2వేలమందికి ఇస్తారా? ఇంకా తగుదనమ్మా అంటూ ప్రతిపక్షాలపై కేసులు పెట్టమంటారా? ఈ చేతగాని, దద్దమ్మ ప్రభుత్వ పని తీరు ఎలాఉందో ప్రజలుకూడా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ మై.జీవోవీ.ఇన్ ట్విట్టర్ అకౌంట్ లో చూస్తే నిన్న ఉదయానికి ఏపీలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు (0.11.) ఆల్ మోస్ట్ గుండుసున్నా. వ్యాక్సిన్లు రాష్ట్రంలో ఎక్కడా ఏంలేవు. నిన్న ఉదయానికి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సున్నా. అదే పొరుగురాష్ట్రాలనుచూస్తే, తెలంగాణలో 4లక్షల12వేలు, తమిళనాడు 8లక్షల70వేలు, కర్ణాటక 4లక్షల12వేలు, మహారాష్ట్ర 8లక్షల32వేలు, ఒడిశా 4లక్షల06వేలు, మధ్యప్రదేశ్ 6లక్షల60వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకున్నాయి. ఆఖరికి చిన్నరాష్ట్రాలైన ఈశాన్యరాష్ట్రాలు మనకంటే ముందు న్నాయి. నాగాలాండ్ లక్ష డోసులు నిల్వచేసుకుంది. మణిపూర్ లక్షా45వేలడోసులు, మిజోరం కూడా 63వేల డోసుల వ్యాక్సిన్లు, అస్సాం 2లక్షల78వేల వ్యాక్సిన్లు అందుబాటులో పెట్టుకున్నాయి. ఏపీలో మాత్రం వ్యాక్సిన్ నిల్వలుసున్నా మాత్రమే. ఇదేనా ఈముఖ్యమంత్రి ముందుచూపు? ప్రతిదానికి కేంద్రంపై నిందలేసే జగన్ రెడ్డి ఈ వాస్తవాలపై ఏంసమాధానం చెబుతాడు? పొరుగురాష్ట్రాల్లో లక్షలకొద్దీ వ్యాక్సిన్లు నిల్వఉంటే, ఏపీలో ఎందుకు లేవు? వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆర్డర్లు పెట్టలేదు కాబట్టే, రాష్ట్రంలోఉన్న వ్యాక్సిన్లు గుండుసున్నా. జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడానికి కారకులుఎవరు? ఇన్ని వాస్తవాలు బయటపడ్డాక కూడా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి జగన్ రెడ్డికి ఏం అర్హతఉంది? ఏఏ రాష్ట్రంలోఎన్ని వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయో కేంద్రప్రభుత్వ ట్విట్టర్ అకౌంట్ చాలాస్పష్టంగా చెబుతోంది.
నేనేమీ గాలిపోగేసి గాలికబుర్లు చెప్పడం లేదు సజ్జల లాగా. వాస్తవంగా రాష్ట్రపరిస్థితి ఏమిటో కేంద్రప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. నిన్నఅనేకరాష్ట్రాలు లక్షల్లో వ్యాక్సిన్లు పంపిణీచేస్తే, మనరాష్ట్రంలో కేవలం రెండువేలు మాత్రమే ఇచ్చారు. అనేకచోట్ల నిన్న నో వ్యాక్సిన్ బోర్డులే దర్శనమిచ్చాయి. తొలిదశవ్యాక్సిన్ల పంపిణీలో జనాభానిష్పత్తిప్రకారం చూస్తే రాష్ట్రం 28వస్థానంలో ఉంది. అదీ ఈముఖ్యమంత్రి పనితీరు. వ్యాక్సిన్లు కొనుగోలు చేయడు.. వాటికి ఆర్డర్ పెట్టడు.. కొనడానికి నిధులివ్వడు. ప్రతిపక్షనేతలపై దాడులు చేయడం..కేసులుపెట్టడం... వారిని జైళ్లకుపంపడం మాత్రం కచ్చితంగాచేస్తాడు. ఆక్సిజన్ లేక ప్రజలంతా అకారణంగా చనిపోతుంటే, కేసులతో బెదిరిస్తారా? రుయా ఆసుపత్రిలో సంభవించిన మరణాలకు పూర్తిబాధ్యత ముఖ్యమంత్రే వహించాలి. గతంలో అనేకఘటనలు జరిగినా తన నిర్లక్ష్యాన్ని వీడకుండా, ప్రజలను మాయమాటలతో మోసగించాడు. ముఖ్యమంత్రి తనపదవికి రాజీనామాచేస్తే, కేంద్రం మొత్తం వ్యవస్థలను తనఅధీనంలోకి తీసుకొని ప్రజలప్రాణాలు కాపాడుతుంది. ప్రజలకు మాయ మాటలు చెబుతూ, వారిప్రాణాలు తీస్తున్న జగన్ రెడ్డిపై తక్షణమే హత్యాయత్నం కేసుపెట్టాలి. మహారాష్ట్ర ముందస్తు చర్యలు తీసుకొని, వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తోంది. దేశంలో వ్యాక్సిన్లన్నీ అయిపోయాక ముఖ్యమంత్రి ఇప్పుడు గ్లోబల్ టెండర్లు పిలుస్తామంటున్నాడు. రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసే అవకాకాశాన్ని కేంద్రం ఏప్రియల్ 26న ఇచ్చిందే. అంతర్జాతీయంగా కూడా వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది వాస్తవంకాదా? అలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆదిశగా ఎందుకు ఆలోచించలేదు? వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయాక గ్లోబల్ టెండర్లు గుర్తొచ్చాయా ఈ ముఖ్యమంత్రికి? ఇప్పటివరకు ఈ ముఖ్యమంత్రి గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదు?