దేశ వ్యాప్తంగా క-రో-నా కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోందని, ఒక్కరోజుకి 4లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి నానాటికీ ఎంతలా దిగజారిపోతోందో ప్రతిఒక్కరూ ఆలోచనచేయాలని, ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా భారత్ లోనే నమోదవుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వివరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "మన రాష్ట్రంలో నిన్న దాదాపు 21వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. టెస్టింగ్ ప్రక్రియను పెంచితే కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పాజిటివిటీ రేట్ ను కచ్చితంగా తెలుసుకునే అవకాశ ముంటుంది. 18 నుంచి 45ఏళ్ల వయస్సువారికి సెప్టెంబర్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెడతామన్న రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనను, కేంద్ర ప్రభుత్వం తాజాగా తోసిపుచ్చడం జరిగింది. విధిగా 18 – 45ఏళ్ల మధ్య వయస్సు వారికి క-రో-నా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయడం జరిగింది. నిన్న క-రో-నా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆక్రమంలో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోకూడా మాట్లాడారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి , కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేశారు? వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సరఫరా గురించి తమకు ఇంత కావాల్సిందేనని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఏమైనా అడిగారా? లేదా? వందలాదిమంది ఆక్సిజన్ లేక చనిపోతుంటే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తాపీగా, ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని చెప్పడం చాలా బాధగా ఉంది. రెండోపక్కన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, ప్రభుత్వం కేవలం 13లక్షల వ్యాక్సిన్ల కొనుగోలుకు మాత్రమే ఆర్డర్ పెట్టడమేంటి? అనేక రాష్ట్రాలు కోట్లసంఖ్యలో వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్ పెడుతుంటే, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నిందలేస్తోంది.

వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రం అనుమతివ్వట్లేదని, సహకరించడం లేదని జగన్ రెడ్డి సర్కారు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం. వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి నేరుగా రాష్ట్రాలే వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్రప్రభుత్వం 13లక్షల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టిందా అని నిన్న ప్రభుత్వాన్ని తాను ప్రశ్నించడం జరిగింది. దానిపై దొంగపత్రిక సాక్షిలో కేంద్ర ప్రభుత్వమేదో రాష్ట్రానికి లేఖ రాసిందని చెబుతూ దాన్ని ప్రచురించారు. ఆ లేఖను ఒక్కసారి పరిశీలిస్తే, రాష్ట్రప్రభుత్వం ఎక్కడా వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రాన్ని అనుమతి కోరినట్లుగానీ, కేంద్రం ఎక్కడా అనుమతి ఇస్తున్నట్టు గానీ లేదు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, మంత్రులకు, సాక్షి పత్రిక వారికి ఇంగ్లీష్ భాష తెలియనట్టు ఉంది. మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం.. ఇంగ్లీష్ మీడియం అంటుంటారు కదా? ఇంగ్లీషు లోఉన్న లేఖలోని సారాంశం ఏమిటో తెలుసుకోకుండా, ఏది పడితే అది దొరికింది కదా అని పత్రికలో ప్రచురిస్తే ఎలా? మీకు ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీష్ బోధించే మాస్టార్ దగ్గరకి వెళ్లి నేర్చుకోండి. సాక్షిలోప్రచురించిన లేఖలో ఏముందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలుచేయవచ్చని స్పష్టంగా ఉంది.

ఆ విషయం దొంగపత్రికైన సాక్షి యాజమాన్యానికి అర్థమైనట్లులేదు. రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రుల వారికి పెద్దఎత్తున వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు తాము వెసులుబాటు కల్పిస్తున్నట్లు సదరు లేఖలో కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. కేంద్రం వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాలకు స్వేఛ్ఛఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయేసరికి, ఇప్పటివరకు వ్యాక్సిన్ల కొనుగోలుకు ఎటువంటి ఆర్డర్లు పెట్టకపోయేసరికి కేంద్రప్రభుత్వం స్పందించి, తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పనికిమాలిన ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలు దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోయేసరికి, కేంద్ర ప్రభుత్వమే మానవత్వంతో స్పందించి, ఈ ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తుచేస్తూ లేఖ రాసింది. రాష్ట్రప్రభుత్వాలే నేరుగా వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలుచేయవచ్చని సదరు లేఖలో కేంద్రప్రభుత్వం పేర్కొంది.

సంగం డెయిరీ విషయంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సంగం డెయిరీ స్వాధీనం చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని సస్పెండ్ చేసింది. సంగం డెయిరీని, ఏపి డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జీవో 19 జారీ చేసింది. అయితే ఇది చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం అంటూ, సంగం డెయిరీ డైరెక్టర్లు హైకోర్టులో ఈ జీవోని సవాల్ చేసారు. దీని పై రాష్ట్ర హైకోర్టు స్పందిస్తూ, కొద్ది సేపటి క్రితం తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో చెల్లదని స్పష్టం చేసింది. పైగా సంగం డెయిరీ రోజు వారీ కార్యకలాపాలు బయట వారికి ఇవ్వొద్దు అని, రోజు వారీ కార్యకలాపాలు సంగం డెయిరీ డైరెక్టర్లే పర్యవేక్షించాలని సంగం డెయిరీ సూచించింది. డైరెక్టర్ లు అందరూ కూడా, పాల సంఘాలతో ఎన్నుకో బడిన వారు కావటంతో, వారి అందరినీ కూడా సంగం డెయిరీ కార్యకలాపాలు పర్యవేక్షించే హక్కు ఉంటుందని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు, సంగం డెయిరీకి సంబంధించిన ఆస్తులు ఏమైనా కూడా అమ్మకాలు చేయాలి అంటే మాత్రం, హైకోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు, సంగం డెయిరీకి సంబంధించి, ఏదైతే రాష్ట్ర ఏసిబి కేసు నమోదు చేసిందో, ఆ కేసు కొట్టివేయాలని చెప్పి, నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై కూడా, ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏసిబి విచారణ పై స్టే ఇవ్వాలని నరేంద్ర తరుపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అయితే దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఏదైతే విచారణ జరుపుందో, ఆ విచారణకు సంబంధించి కొన్ని అంశాల పై, అంటే ప్రస్తుతం ఏసిబి ఇష్టం వచ్చినట్టు చేస్తున్న తనిఖీల పై కూడా, వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.

sangam 07052021 2

సంగం డెయిరీలో పాల సేకరణ, మార్కెటింగ్ , అమ్మకాలు సంబంధించి కూడా ఏసిబి రికార్డులు తీసుకుంటుందని, దీని వల్ల తమ సంగం డెయిరీకి సంబంధించిన కీలకా సమాచారం, బయటకు వెళ్తుందనే భయం ఉందనే సమాచారం కూడా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ లో నమోదు అయిన అంశాలు కాకుండా, వేరే ఇతర అంశాలు కానీ, ఇతర విభాగాల్లో కానీ, ఏసిబి తనిఖీ చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా సంగం డెయిరీలో జరుగుతున్నపాల సేకరణ, అమ్మకాలు, మార్కెటింగ్, వీటికి సంబంధించిన సమాచారం కూడా ఏది సేకరించ కూడదు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితం, హైకోర్టులోని మరో బెంచ్ లో విచారణ జరగటం, అక్కడ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోనే సస్పెండ్ కావటంతో, ఈ రోజు నుంచి సంగం డెయిరీ అంతా కూడా, డైరెక్టర్ల ఆధీనంలోకి వెళ్లనుంది.

అమరరాజా కంపెనీ మూసివేతకు సంబంధించి, ఈ రోజు హైకోర్టులో ఊరట లభించింది. అమరరాజా బ్యాటరీస్ కి సంబంధించిన, సంస్థలు మూడింటిని మూసివేయాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మూడు రోజులు క్రితం, అమరరాజా సంస్థలకు నోటీసులు ఇవ్వటమే కాకుండా, ఏకంగా కరెంటు సరఫరా కూడా నిలిపివేశారు. ఈ నేపధ్యంలోనే, అమరరాజా సంస్థ హైకోర్టులో పిటీషన్ వేసి, హైకోర్టుని ఆశ్రయించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసారు. దీని పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై ఈ రోజు హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ, ఆదేశాలు ఇచ్చింది. వెంటనే విద్యుత్ ని పునరుద్ధించాలని కూడా ఆదేశాలు జారీ చేయటమే కాకుండా, జూన్ 17వ తేదీ లోపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచనలు అమలు చేయాలని చెప్పి, అమరరాజా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమైతే సూచనలు చేసిందో, వాటి అన్నిటినీ కూడా, తాము అమలు చేస్తున్నామని, ఇంకేమైనా వారు సూచించినా కూడా, వాటిని అమలు చేస్తామని, అమరరాజా సంస్థ హైకోర్టుకు తెలిపింది. అమరరాజా సంస్థకు కార్పొరేట్ నిబంధనలు పాటించటంలో గుర్తింపు ఉందని కోర్టుకు తెలిపారు.

amaraja 06052021 2

అలాగే ఉద్యోగుల, కార్మికల శ్రేయస్సు గురించి పాటించటంలో కూడా, పొల్యూషన్ నిబంధనలు పాటించటంలో కూడా గతంలో అనేక అవార్డులు వచ్చిన చరిత్ర ఉందని తెలిపారు. అయితే ఇంత చరిత్ర ఉన్న కంపెనీని మూసివేయాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. నిన్న కడప జిల్లాలో జువారి సిమెంట్స్ మూసివేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు అమరరాజా సంస్థలను కూడా మూసివేయాలని కూడా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడా, రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను, జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది. మళ్ళీ రిపోర్ట్ ఫైల్ చేయాలని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు, ఏపి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే జూన్ 17 లోపు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని, అమరరాజా సంస్థకు హైకోర్ట్ సూచనలు ఇచ్చింది.

ఇంత ప్యాండమిక్ లో కూడా, ఈ రోజు ఇంటర్నెట్ లో ఒక పొలిటికల్ వీడియో సెన్సేషనల్ అయ్యింది. వైసీపీ నేతలు, ఎంపీలు, ఉన్న వీడియోలో, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఏమి చేసాడు బొక్క, అంటూ, ఇలా అనేక విధాలుగా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని క-రో-నా కట్టడిలో ఫెయిల్ అయ్యారు అనే విధంగా మాట్లాడారు అంటూ, తెలుగుదేశం పార్టీతో పాటు, ఇంటర్నెట్ లో కూడా ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇది ఒక సునామీలో ఇంటర్నెట్ మొత్తాన్ని చుట్టేసింది. అయితే ఈ వీడియో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పోస్ట్ చేసారు. ఇది వైరల్ అయిన తరువాత, ఆ వీడియోని ఆయన తీసి వేసారు. ఇది ఇలా ఉంటే, ఈ వీడియో పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురు దాడి ప్రారంభించారు. ముఖ్యంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఆ వీడియోలో ఏముందో, ఎవరు ఏమన్నారో, ఎవరు ఏమి మాట్లాడుకున్నారో అవి వాళ్ళ వ్యక్తిగతం అని, అయితే అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో పై చర్చ జరగాలి అంటూ, ఎదురు దాడి చేసారు. అయితే అది ఎప్పుడో అయిపొయింది, దాన్ని వైరల్ చేసారు. ఏప్రిల్ 17 దాటిపోయింది, ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ వైరల్ చేసిన వీడియోకి సమాధానం చెప్పకుండా, మా జగన్ ధీరుడు సూరుడు, మా అంతరాత్మకు తెలుసు, మీరు ఎంత, మీ బ్రతుకులు ఎంత అనే విధంగా మంత్రి పేర్ని నాని మాట్లాడారు.

bose 06052021 2

అయితే ఎంపీలు శుభాష్ చంద్ర బోస్, మార్గాని భారత్, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యన్నారాయణ మాట్లాడిన మాటలపై మాత్రం, ఏమి చెప్పలేక, వాళ్ళ వ్యక్తిగతం అంటూ, మాట దాట వేసారు. అయితే ఇప్పుడు ఈ వైరల్ వీడియోపై, ఆ వీడియోలో, ఏమి చేసాడు బొక్క అంటూ, మాట్లాడిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. తనకు జగన్ మోహన్ రెడ్డి అంటే, ఎంతో అపారమైన గౌరవం ఉందని అన్నారు. కో-వి-డ్ వచ్చి చనిపోతున్న వారి మృతదేహాలు తరలించటానికి 12000 తీసుకుంటున్నారని, ప్రభుత్వం మాత్రం ఏమి చేయగలదు అనే ఉద్దేశంతోనే, మామూలుగా అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. ఏదైనా లోటు పాట్లు ఉంటే, డైరెక్ట్ గా జగన్ తోనే మాట్లాడతానని అన్నారు. ప్రభుత్వం గురించి తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తన పై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పుకొచ్చారు. మొత్తానికి, ఆ వైరల్ వీడియో పై, ఇలా కౌంటర్ ఇస్తుంది వైసీపీ.

Advertisements

Latest Articles

Most Read