ఒక పక్క క-రో-నా తో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయ్యింది. మరో పక్క లాక్ డౌన్. ఇక మన అప్పులు సంగతి సరే సరి. ఇక ఈ పరిస్థతిలో మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. వేస్‌ అండ్ మీన్స్‌ పద్దు ద్వారా అదనంగా రూ.2,146 కోట్లు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి సౌకర్యం ఇచ్చింది. అయితే ఈ డబ్బుని మొత్తం కో-వి-డ్ చర్యల కోసం, వ్యాక్సిన్ ల కోసం వాడాలని టిడిపి అంటుంది. టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, "వేస్‌ అండ్ మీన్స్‌ పద్దు ద్వారా అదనంగా రూ.2,146 కోట్లు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి సౌకర్యం పొడిగించిందని వార్తలు వచ్చాయి. ఈ నిధులైనా కమిషన్‌ వచ్చే వాటికి కాకుండా క-రో-నా వ్యాక్సిన్‌ కొనుగోళ్లు, కరోనా బాధితుల కోసం ఖర్చు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆరోగ్య విపత్తు నిర్వహణకు నిధులు వెచ్చించాలని డిమాండ్ చేస్తున్నాను. రెండేళ్లలో సంక్షేమానికి రూ.87 వేల కోట్లు ఖర్చు చేశామని సీయం మరియు మంత్రులు పదేపదే చెబుతున్నారు. సెంటు పట్టా పేరుతో రూ.6,500 కోట్లు దోపిడీ చేశారు. దళిత, బడుగు వర్గాలకు చెందిన 10 వేల ఎకరాలు అసైన్‌మెంటు భూములు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్సు కొనుగోళ్లలో రూ.307 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. ఇలా స్కీములన్నీ స్కాముల మయం చేశారు. అమ్మ ఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డి ద్వారా రూ.36 వేలు గుంజుకున్నారు. వాహనమిత్రకు రూ.10 వేలు ఇచ్చి జరిమానాలు, డీజిల్‌ రేట్లు పెంచి డ్రైవర్ల దగ్గర రూ.30 వేలు లాక్కుంటున్నారు. "

rbi 12052021 2

"రైతు భరోసాకు రూ.7,500 కోట్లు ఇచ్చి, అన్నదాత సుఖీభవలో వచ్చే రూ.15 వేలు రద్దు చేశారు. రైతు రుణమాఫీ రద్దు చేశారు. రెండున్నర లక్షల మందిని వాంటీర్లుగా నియమించి, 6 లక్షల మందికి ఇచ్చే నిరుద్యోగభృతి రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్లు నిర్వీర్యం చేశారు. 56 బీసీ కార్పొరేషన్లు అని ఆశ పెట్టి, బీసీ రిజర్వేషన్లు కోతకోసి 6,800 పదవులు బీసీలకు దూరం చేశారు. ఇలా పావలా ఇచ్చి ముప్పావలా లాక్కొన్నారు. రెండేళ్లలోనే వేసిన పన్నుల ద్వారా, పెంచిన ధరల ద్వారా, తెచ్చిన అప్పుల ద్వారా ప్రతి కుటుంబంపై రూ.2.5 లక్షల భారం మోపారు. మీది మోసకారి సంక్షేమమేగానీ నిజమైన సంక్షేమం కాదు. తెలుగుదేశం రెండేళ్లలో సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు చేసింది. పన్నులు పెంచలేదు. పైగా అభివృద్ధి చేసింది. రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం. విపత్తులో వేగంగా స్పందించి ప్రజల్ని ఆదుకున్నది. ఇప్పటికైనా జగన్‌రెడ్డి సోది కట్టిపెట్టి వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌పై దృష్టి కేంద్రీకరించి పనిచేయాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి." అని యనమల రామకృష్ణుడు అన్నారు

కో-వి-డ్ ను కట్టడిచేయాల్సిన ముఖ్యమంత్రి, ఆ దిశగా ఆలోచించకుండా, ప్రతిపక్షనేతలను వేధించడంపై దృష్టి పెట్టడం అత్యంత బాధాకరమని, ఎటువంటి ముందస్తు ప్రణా ళికా లేకుండా, వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయకుండా ముఖ్యమంత్రి వ్యవహరించబట్టే, రాష్ట్రం కో-వి-డ్ ప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసన సభ్యులు నిమ్మలరామానాయుడు స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...! "రాష్ట్రప్రజలు తమఆయువుని (ప్రాణాలను) నిలుపుకోవడా నికి, ప్రాణవాయువు (ఆక్సిజన్) కోసం నిస్సహాయతతో ఎదురుచూస్తున్నారు. ఏ ఆసుపత్రిలో చూసినా అటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆక్సిజన్ అందక రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 180 మందివరకు చనిపోయారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారినిచూస్తే, ఎవరికైనాసరే జలియన్ వాలా బాగ్ ఉదంతం గుర్తుకొస్తుంది. రుయాలో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలను, ప్రభుత్వం తన అవినీతి మీడియాలో తక్కవు చేసి చూపుతూ, వాటి సంఖ్యను తగ్గించాలని చూస్తోంది. మాకున్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి సంఖ్య దాదాపు 29 మంది దాకా ఉంది. ఇంకా 10, 15 మంది వరకు మృతుల వివరాలున్నట్లు తెలు స్తోంది. మృతుల సంఖ్యను దాచిపెట్టడం ద్వారా ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. మృతులపేర్లు, ఇంటిపేర్లు, చిరునామాలతోసహా పూర్తి వివరాలు తమవద్ద ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్త వాలు వెల్లడించాలని, నిజాలు ప్రజలముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దానితోపాటు రుయా ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని కోరడాని కి తమకు కొన్ని అనుమానాలున్నాయి.

సంఘటన ఏదైతే జరిగిందో, ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి ,మంత్రులు, అధికారులు ఎవరికి తోచిన విధంగావారు మాట్లాడుతున్నారు. కొందరేమో 5 నిమిషాలు మాత్రమేఆక్సిజన్ సరఫరా నిలిచిపోయందని, మరికొందరేమో దాదాపు 35నిమిషాలపాటు ఆగిపోయిందని అంటున్నారు. కొందరేమో 40నిమిషాలపాటు అంటున్నా రు. ఈ విధంగా పొంతనలేని సమాధానాలుకాకుండా కచ్చి తంగా ఆక్సిజన్ సరఫరా ఎంతసేపు నిలిచిపోయిందో తెలియాలంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించడమొక్కటే మార్గం. రుయాఘటన 10వతేదీన జరిగితే, ప్రభుత్వం 11వతేదీన విడుదలచేసిన కోవిడ్ బులెటిన్ లో, రుయా ఘటనతో కలిపి, చిత్తూరుజిల్లాలో 18మంది చనిపోయినట్లు చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా కేవలం రుయాఆసుపత్రిలోనే దాదాపు 50 మంది వరకు చనిపోయారని ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారంలో ఉంది. జిల్లా అంతాకలిపి 18 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ లోఉంటే, ఆసుపత్రి వర్గాలేమో 50మంది వరక చనిపోయారంటున్నాయి. ఇందులో ఏది వాస్తవం? ఆక్సిజన్ అందక రుయాఆసుపత్రిలో మరణాలు సంభవించిన రోజునే, ఆ ఆసుపత్రి సూపరిండెంట్ అదేరోజు ఉదయం అం తా తనిఖీ చేసినట్లు, అంతా పర్ ఫెక్ట్ గాఉన్నట్లు నివేదిక ఇచ్చారు.

నివేదిక ఇచ్చిన 12 గంటలతర్వాత ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 50మంది వరకుచనిపోయార ని ఆసుపత్రి నివేదిక చెబుతోంది. దానిపై కూడా పూర్తిస్థాయి లో విచారణ జరగాలి. ఆసుపత్రిలో తమవారిని పోగోట్టుకున్నవారు చెప్పే వివరాలు మరోలా ఉన్నాయి. మృతుల బంధువులు, వారి కుటుంబ సభ్యులు వారం, పదిరోజులుగా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫ రా అప్పుడప్పుడు నిలిచిపోతూనేఉందని చెప్పారు. కానీ అదృష్టవశాత్తూ అప్పుడుఎవరూ చనిపోలేదని కూడా చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం తలెత్తుతున్నా అక్కడున్న సిబ్బంది ఎందుకుస్పందించలేదు? పూర్తిగా ఆక్సిజన్ నిలిచిపోయి, ప్రాణాలుపోయేవరకు ఏంచేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆక్సిజన్ సరఫరాకోసం వినియోగించే ట్యాంకర్లకు జీపీఎస్ విధానాన్ని ఎందుకు ఏర్పాటుచేయలేదు? ప్రభుత్వం వాటి రాకపోకలపై ఎందుకు నిఘా ఉంచలేదు? ఆక్సిజన్ ట్యాంకర్ల రాకపోకలకు అవసరమైన గ్రీన్ ఛానల్ ను ఫ్రభుత్వం ఎందుకు ఏర్పాటుచేయలేకపోయింది. తమిళనాడులోని శ్రీ పెరంబుదూరునుంచి ఆక్సిజన్ ట్యాంకర్ బయలుదేరగానే, తిరుపతి వచ్చేవరకు ట్యాంకర్ కి ఎందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేయలేకపోయారు?

తిరుపతిలోని రుయాఆసుపత్రిలోజరిగిన ఘటనకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, నిన్న ఘటన జరిగే సమయానికి ఎందరు రోగులుఆసుపత్రిలోఉన్నారు... అక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఎందరు రోగులున్నారు...వారిలో ఎందరు చనిపోయారనే పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...! ఘటనపై ముఖ్యమంత్రి ఏదో ఆరాతీశాడన్నట్లు రాత్రి ప్రసార మాథ్యమాల్లో వచ్చింది. రాష్ట్రం అల్లకల్లోలమవుతుంటే తనకేదో అనారోగ్యం ఉన్నట్లు ఆరోగ్యశాఖా మంత్రి నటిస్తున్నాడు. ఆయనేమో రుయా ఆసుపత్రి సూపరింటెండ్ కి ఫోన్ చేసి మాట్లాడినట్టు చెబుతున్నారు. నిన్న ఉదయమే ఆసుపత్రిలో ఎంతవరకు ఆక్సిజన్ నిల్వలున్నాయి... ఎందరు రోగులున్నారు..ఉన్నవారికి ఆక్సిజన్ సరిపోతుందా లేదా అనేదానిపై రుయా ఆసుపత్రి సిబ్బంది ఎందుకు దృష్టిసారించలేదు? ప్రభుత్వం మొద్దునిద్ర పోవడంవల్లే ఇంతటి దారుణ ఘటన జరిగింది. రాత్రే కలెక్టర్ ఘటనా స్థలికి వెళ్లి, 11మంది చనిపోయారని చెప్పాడు. కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లవారేమో రాత్రంతా అక్కడే ఉండి దాదాపు 22మంది చనిపోయినట్టు చెప్పారు. ఇటువంటి అనేక సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతప్రభుత్వంపై ఉందా లేదా? జరిగిన హ-త్య-ల-కు ప్రభుత్వం కారణమా...కాదా? ఇంతవరకు రాష్ట్రంలో అనేక ఘటనలు ఇదేమాదరి జరిగాయి. విజయనగరంలో తొలి ఘటన జరిగినప్పుడే, ప్రభుత్వం మేల్కొని ఉంటే, నిన్న రుయా ఘటనజరిగేదా? ప్రభుత్వ మొద్దునిద్ర, పాలకులు నిర్లక్ష్యం వల్లే నిన్న రుయా ఆసుపత్రిలో మరణాలు సంభవించాయి. నిన్నేమో ప్రభుత్వ ప్రత్యేకసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదేదో చెబుతున్నాడు. ప్రజలప్రాణాలు కాపాడమని ప్రతిపక్షం మొత్తుకుంటుంటే, ప్రతిపక్షనేతలపై కేసులుపెట్టండి..చంద్రబాబుపై కేసులు పెట్టండంటూ, తీవ్రమైన నిరాశానిస్పృహలతో సజ్జల మాట్లాడుతున్నాడు.

ప్రతిపక్షనేతలపై, పత్రిలకవారిపై రాజద్రోహం కింద కేసులు పెడతారా? సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా నియమించి 24నెలలు అవుతోంది. ఈ 24నెలల్లో ఆయనిచ్చిన సలహాలు ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి. ఆయనగానీ, ముఖ్యమంత్రి గానీ ప్రజల ఆరోగ్యంపై తొలినుంచీ శ్రద్ధ పెట్టిఉంటే, నిన్న రుయా ఘటన జరిగేదా? విజయనగరం ఘటన జరిగినప్పుడే, సజ్జల మంచి సలహాలు ఇచ్చిఉంటే, నిన్న అంతమంది చనిపోయేవారా? ప్రతిపక్షనేతలపై, పత్రికలపై కేసులు పెట్టాలంటున్న సజ్జల, నిన్న జరిగిన ఘటనపై ఎవరిమీద కేసులు పెడతాడో సమాధానం చెప్పాలి. ప్రజల చావులకు కారణమవుతున్న ముఖ్యమంత్రిపై కేసులుపెట్టాలా? లేక ఆయనకు సలహాలిస్తున్న సజ్జలపై పెట్టాలా? తనకేమీ సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తున్న ఆరోగ్యశాఖామంత్రిపై కేసు పెట్టాలా? లేక రుయాఆసుపత్రి సిబ్బందిపై పెట్టాలో సజ్జ లే చెప్పాలి. వ్యాక్సిన్లకోసం ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సజ్జల ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజుకి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షమందికి రెండోవిడత వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి... రోజుకి ఎందరికి వ్యాక్సిన్లు వేస్తున్నారనే సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడంలేదని ప్రశ్నిస్తున్నా. క-రో-నా రెండోదశ ఆరంభమైనప్పటినుంచీ ఆక్సిజన్ లేక, పడకలు దొరక్క, వెంటిలేటర్లు లేక చెట్లకింద, రోడ్లపైన, బస్టాండ్ లలో రోగులు చనిపోతున్నారు. అటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వంకాదా?

క-రో-నా రెండోదశ మొదలైనప్పటినుంచీ సంభవించిన మరణాలకు ముఖ్యమంత్రిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆరోగ్యశాఖామంత్రిని బాధ్యులను చేసి, వారిపైనే హ-త్యా-య-త్నం కేసులుపెట్టాలి. రుయా ఘటనలో సంభవించిన మరణాలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వపెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూకూడా స్పైడర్ సినిమాలో విలన్ పాత్రధారిలా చావులను చూసి ఆనందిస్తున్నారు. ప్రజలు చస్తే ఛస్తారులే తమకేం సంబంధమన్నట్లు ముఖ్యమంత్రి, ప్రభుత్వపెద్దలు వ్యవహరిస్తున్నారు. రుయా ఆసుపత్రి రికార్డులు ప్రకారం నిన్న ఆసుపత్రిలో 135 మంది రోగులున్నారు. వారిలో ఎందరు చనిపోయారు...ఎందరు అస్వస్థతకు గురై, చావుబతుకులమధ్యన కొట్లాడుతున్నారు... మరణించిన వారి పేర్లేమిటనే వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నా. రుయా ఘటనకు నైతికబాధ్యత వహిస్తూ, ఇంతటి అసమర్థ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా? లేక ఆయనకు సరైన సలహాలు ఇవ్వని సజ్జల రాజీనామా చేస్తాడా? ఆరోగ్యశాఖా మంత్రి రాజీనామా చేస్తాడో చెప్పాలి. ఆసుపత్రి సిబ్బంది వల్లే ఘటన జరిగిందని చెప్పి, చివరకు ఈప్రభుత్వం వారిని బలిచేస్తుందేమో చూడాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షలు, రూ.10లక్షలిచ్చి చేతులు దులుపుకోవడం ఈప్రభుత్వానికి అలవాటుగా మారింది. మరణాలు సంభవించకుండా చూడాల్సిన ప్రభుత్వం, వాటికి రేట్లు కట్టడమేంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా, భారత దేశాన్ని క-రో-నా మహమ్మారి చిన్నాభిన్నం చేస్తుంది. ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయాని, సొంత పార్టీ నేతలే మాట్లాడుకునే పరిస్థితి. వాస్తవ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆక్సిజన్ అందక సంభవిస్తున్న మరణాలు, ప్రభుత్వాల పని తీరుకు అద్దం పడుతున్నాయి. ఒక పక్క బెడ్స్ కూడా దొరకని పరిస్థితి. ప్రజలు కళ్ళ ముందే పిట్టల్లా రాలి పోతున్నారు. అయిన వారికి దూరం అవుతున్నారు. చివరి చూపు కూడా దక్కటం లేదు. ఇలాంటి ఎన్నో దౌర్భాగ్యమైన పరిస్థితితులు మాన్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వాలు ఇంతకంటే ఏమి చేయలేవ్ అని డిసైడ్ అయిన ప్రజలు, ఇప్పుడు వ్యాక్సిన్ పైనే ఆధార పడుతున్నారు. వ్యాక్సిన్ ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్రం పంపించే టీకాలు తప్పితే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదు. అదేమంటే మేము వ్యాక్సిన్ కంపెనీలకు లేఖలు రాశామని, లేఖలు చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చి, టీకాలు తీప్పించుకుంటున్నాయి. అడ్వాన్స్ ఇచ్చిన కేరళ లాంటి రాష్ట్రాలకు, ఇప్పటికే డెలివర్ కూడా చేసారు. ఇదే విషయం పై జగన్ మోహన్ రెడ్డిని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే, ఎప్పటి లాగానే, దీనికి కూడా చంద్రబాబు నాయుడు కారణం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసారు.

bb 12052021 2

ఏకంగా నిన్న జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, భారత్ బయోటెక్ చంద్రబాబు బంధువుది అని, రామోజు వియ్యంకుడిది అని, అక్కడ ఏమి జరుగుతుందో వారికి తెలవదా అంటూ, చంద్రబాబు వల్లే వ్యాక్సిన్ లు లేట్ అవుతున్నాయి అనే విధంగా స్పందించారు. నిన్న జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడుతారని ఎవరూ ఊహించలేదు. అయితే ఇన్నాళ్ళు తమ పై విమర్శలు చేస్తున్నా, కేవలం వ్యాక్సిన్ ఉత్పత్తి పైనే ఫోకస్ పెట్టిన భారత్ బయోటెక్, ఇప్పుడు తమ పై వస్తున్న ఆరోపణల పై స్పందించింది. డైరెక్ట్ గా జగన్ పేరు పెట్టి కాకుండా, పరోక్షంగా స్పందిస్తూ, సుచిత్ర ఎల్లా ట్వీట్ చేసారు. ఇప్పటికే తమ టీకాను 18 రాష్ట్రాలకు పంపామని అన్నారు. తమ సంస్థకు సంబంధించి 50 మంది వైరస్ బారిన పడినా కూడా, ఈ లాక్ డౌన్ సమయంలో కూడా, 24 గంటలు కష్టపడి వ్యాక్సిన్ ఉత్పత్తికి ప్రయత్నం చేస్తున్నామని, ఇంత చేస్తున్నా, తమ పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దురుద్దేశాలు ఆపాదించటం దురదృష్ట కరం అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read