తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసం వద్ద ఒక వ్యక్తి అక్కడక్కడే తచ్చాడుతూ ఉండటంతో, జుబ్లీ హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నించగా, అతను కడప జిల్లా, రాజంపేటకు చెందిన వ్యక్తిగా తేలింది. తన పేరు సుబ్బారెడ్డి అని, తాను చక్రంపేట ఊరుకి సంబంధించిన వ్యక్తిని అని, తన కుటుంబలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, తన తండ్రితో పాటుగా, సవతి తల్లి వారి కుమారుల నుంచి తనకు ప్రాణ హాని కూడా ఉందని, ఈ విషయాలు అన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకుని వచ్చి, తగిన న్యాయం చేస్తారని ఇక్కడకు వచ్చానని, రెండు రోజులుగా ఇక్కడే తిరుగుతున్నానని, సుబ్బారెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే, ఇవన్నీ నోట్ చేసుకున్న పోలీసులు, ఈ విషయం తాము చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తామని, ఆయన వివరాలు నమోదు చేసుకుని తన సొంత ఊరికి పంపించారు. అయితే, ఆస్తి తగాదా విషయం, చంద్రబాబుకి చెప్పటం ఏమిటో, ఈ లాజిక్ ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఆ వ్యక్తని మరింత లోతుగా విచారణ చేసి ఉండాల్సిందని, టిడిపి శ్రేణులు అంటున్నారు.

తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. రుయాలోని కో-వి-డ్ వార్డులో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం జరగటంతో, ఐసియిలో చికిత్స పొందుతున్న దాదాపు 10 మంది రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసే అమయంలో కంప్రెజర్ తగ్గటంతోనే, ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం జరిగిందని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆక్సిజన్ సరఫరా మళ్లీ మొదలయ్యిందని అధికారులు చెప్తున్నూర్. మరో పక్క రుయా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగిన తరువాత తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మా బంధవులకు వెంటనే ఆక్సిజన్ అందించాలి అంటూ ఐసీయూ వార్డులో ఉన్న రోగుల తరుపు బంధువుల ఆందోళన వ్యక్తం చేసారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవటంతో, ఐసీయూ వార్డులో ఉన్న వస్తువులను పగులగొట్టారు. మా వాళ్ళు చనిపోవటానికి మీ నిర్ల్యక్షమే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయటంతో, అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు పరుగులు తీసారు. దగ్గరలో ఉన్న గదుల్లో దాక్కుంటే, అక్కడకు కూడా వెళ్లి వారిని కొట్టే ప్రయత్నం చేసారు. సకాలంలో పోలీసులు రావటంతో, అక్కడ నుంచి వైద్య సిబ్బందిని తప్పించారు. అయితే లోపల పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ తెలియటం లేదని, ఎంత మంది చనిపోయారో అర్ధం కావటం లేదని రోగులు తరుపు బాంధవులు వాపోతున్నారు.

tirupati 10052021 2

మరో పక్క ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు స్పందించారు. "ప్రభుత్వం అక్రమ కేసుల మీద పెట్టిన శ్రద్ధ.. ఆక్సిజన్ సరఫరాలో చూపడం లేదు. ఆక్సిజన్ అందక వరుస సంఘటనలు జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తిరుపతి రూయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పది మందికి పైగా మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం యుద్ధప్రాతికన ఆక్సిజన్ అందించి కోవిడ్ రోగులను కాపాడాలి. ఆక్సిజన్ అందక రోజుకొక జిల్లాలో కరోనా రోగులు చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. 10 రోజుల్లో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదు.ప్రజల ప్రాణాలు పోతుంటే మీకు లెక్కలేదా? శవాల దిబ్బలపై రాజ్యామేలదామనుకుంటున్నారా?" అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

ఎక్కడైనా సరే ప్రజలకు ఆపద వస్తే ప్రభుత్వం స్పందించాలి. అది ప్రభుత్వానికి,కష్టమైన నష్టమైనా, అసాధ్యమైనా, ఎలాగైనా కిందా మీదా పది, ప్రజలకు మంచి చేయాలి. ముఖ్యంగా కో-ర-నా లాంటి విపత్కర సమయంలో, ప్రభుత్వాలు మరింత బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వాలు ఎప్పుడూ తాము కరెక్ట్ చేస్తున్నాం అనే అనుకుంటాయి. అలా కాకుండా ప్రజల బాధలు వినాలి, ప్రతిపక్షాల విమర్శలు స్వీకరించాలి. అలా చేయకుండా, ప్రతిపక్షాల పై ఎదురు దాడి చేసి, మేము చేయలేం, మీరు చేసిపెట్టండి అంటే, దాన్ని చేతులు ఎత్తేయటమే అని కదా అనేది ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతుంది. ముఖ్యంగా క-రో-నా ని ఎదుర్కోవటానికి, అత్యవసరంగా కావాల్సింది వ్యాక్సిన్లు. ప్రజలకు ఎంత తొందరగా వ్యాక్సిన్లు వేస్తే అంత మంచిది. కేంద్రం ఇప్పటికే తన వంతు సాయం చేస్తుంది. అయితే 15 రోజులు క్రితం, రాష్ట్రాలకు కూడా అవకాసం ఇస్తూ, మీరు కూడా వ్యాక్సిన్ లు ఆర్డర్ తెప్పించుకోవచ్చని, రాష్ట్రాలకు కూడా చెప్పింది. అన్ని రాష్ట్రాలు ఆర్డర్ ఇచ్చి, వ్యాక్సిన్ లు తెప్పించుకుని, తమ ప్రజలకు వేస్తున్నాయి. అయితే అనుహ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, లేఖ రాసి ఊరుకుంది. ఇప్పటికీ అడ్వాన్స్ ఇవ్వలేదు. కేవలం లేఖ రాసి, అది చూపించి, మేము వ్యాక్సిన్ ల కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తుంది.

cbn 10052021 2

దీని పైనే ప్రతిపక్షం తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. అన్ని రాష్ట్రాలు ఇప్పటికే వ్యాక్సిన్ తెప్పించాయని, ఏపి ప్రభుత్వం మాత్రం ఇంకా ఎందుకు తెప్పించలేదు అంటూ ప్రశ్నించాయి. అయితే దీనికి మొదట్లో తప్పు కేంద్రం మీదకు నెట్టే ప్రయత్నం చేసిన వైసిపీ, అది వర్క్ అవుట్ కాక పోవటంతో, మేము 1600 కోట్లు ఇస్తాం, ఎవరి ఎకౌంటు లో వేయమంటే వారి ఎకౌంటు లో వేస్తాం, చంద్రబాబు వ్యాక్సిన్ లు ఇప్పించాలి అంటూ, ఎదురు దాడి మొదలు పెట్టింది. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఈ ప్రచారం పై చంద్రబాబు ఈ రోజు స్పందించారు. నేను వ్యాక్సిన్ లు ఇప్పిస్తే, ఇక మీరు ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పిస్తే వ్యక్సిన్స్ వేస్తామని చెప్పటం, బాధ్యతల నుంచి పారిపోవటమే అని అన్నారు. మీరు ఇంకా ముఖ్యమంత్రిగా ఉండటం ఎందుకు, అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేని మీరు, ఆ పదవిలో కొనసాగే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల పై నేత్తకుండా, బాధ్యతలు తీసుకుని ప్రజలను కాపాడాలని అన్నారు.

కో-ర-నా మహమ్మారి, ఎవరినీ వదిలి పెట్టటం లేదు. ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా ప్రముఖ సినీ హీరో, జూనియర్ ఎన్టీఆర్ కి కూడా క-రో-నా సోకింది. ఆయన స్వయంగా తన ట్విట్టర్ లో తనకు కో-ర-నా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కుటుంబంతో కలిసి, హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. తనని ఇటీవల కలిసిన వారు, జాగ్రత్త పడాలని, పరీక్షలు చేపించుకోవాలని కోరారు. ఇది ఇలా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ కో-ర-నా బారిన పడ్డానని వేసిన ట్వీట్ కు, మాజీ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ కు మామయ్య అయిన చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని, తగు జాగ్రత్తలు తీసుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు ట్విట్టర్ లో తెలిపారు. పలువురు ఇతర సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read