రాజమండ్రిలో వైసీపీ నేతల వీడియో సంభాషణ వైరల్ అవుతుంది. రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యన్నారాయణ ఇంట్లో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి శుభాష్ చంద్రబోస్, ఎంపీ మార్గాని భారత్ తో పాటు, వైసీపీకి చెందిన ఇతర నేతలు సమావేశం అయ్యారు. ఈ నెల 3వ తేదీన, చివరి ప్రయాణం పేరుతో ఒక వాహనాన్ని, ఏర్పాటు చేసారు. తూర్పు గోదావరి జిల్లాలో క-రో-నా విలయతాండవం సృష్టిస్తున్న నేపధ్యంలో, కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేయటం చాలా భారంగా మారిన నేపధ్యంలో, మృతి దేహాలను స్మశానాలకు తీసుకు వెళ్ళటం భారంగా మారింది. ఈ వాహనాలకు భారీగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. సుమారుగా 12 వేల నుంచి, 30 వేల వరకు దహన సంస్కారాలకు చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపధ్యంలోనే ఈ వాహనాలు ఏర్పాటు చేసారు. ఈ వాహనాలు ప్రరంభించటానికి, వచ్చిన వైసీపీ నేతలు, ఆకుల నివాసంలో జరిగిన ఆసక్తికర వీడియో సంబాషణ ఇప్పుడు బయట పడింది. ఈ వీడియో సంభాషణలో కో-వి-డ్ ని రాష్ట్రంలో నియంత్రించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని అన్నారు.

video 06052021 2

చేతులు ఎత్తేసింది అంటూ, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, క-వి-డ్ క్రైసిస్ లో, చనిపోయిన బాడీని షిఫ్ట్ చేయటానికి 30 వేల నుంచి 50 వేలు తీసుకుంటున్నారు, దహన సంస్కారాలకు 13 వేల నుంచి 15 వేలు, 16 వేలు నోటికి ఏది వస్తే అది తీసుకుంటున్నారు, మరీ అన్యాయం అయిపొయింది. ఆకుల ఈ సంభాషణ చేయగానే, అటు వైపు నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏమి చేసాడు బొక్క అంటూ సంబోధించారు. అయితే ఇదంతా జగన్ అసమర్ధ పాలన పై, సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు అంటూ, సొంత పార్టీ నేతలే మాట్లాడుకోవటం పై, ఇప్పుడు సెన్సేషన్ అయ్యింది. దీంతో వైసిపీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన మార్గాని భారత్ ఫేస్బుక్ పేజి నుంచి ఈ వీడియో తీయించారు. అసలు ఈ సంభాషణ ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రభుత్వాన్ని ఎందుకు కించ పరిచారో చెప్పాలి అంటూ, నేతలను ఆదేశించినట్టు తెలుస్తుంది. దీని పై వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, సరైన వివరణ ఇవ్వాలని చెప్పినట్టు తెలుస్తుంది.

అందరూ అనుకున్నట్టే జరిగింది. గతంలో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తరువాత క-రో-నా రావటం, ఆ తరువాత నలంద కిషోర్ అనే మరో టిడిపి నాయకుడిని విచారణ పేరుతో తీసుకుని వెళ్లి, తరువాత క-రో-నా సోకి , ఆయన చనిపోవటం తెలిసిందే. ఇప్పుడు మరో టిడిపి నేత, సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకి కూడా క-రో-నా సోకోంది. ఆయన పై సంగం డైరీ కేసులో ఆరోపణలు మోపి గత పది రోజులుగా జైల్లో ఉంచారు. ఎవరైనా విచారణ చేసి అరెస్ట్ చేస్తారు కానీ, ఇక్కడ మాత్రం ఆరోపణలు మోపి , అరెస్ట్ చేయటం ఆనవాయితీ అయిపొయింది. కోర్టులో పిటీషన్ వేసి, బెయిల్ తెచ్చుకోవటానికి సమయం పడుతూ ఉండటం, చివరకు కోర్టులో ఆధారాలు ఏమి చూపలేక పోవటం వారికి బెయిల్ రావటం, నిత్య కృత్యం అయిపొయింది. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్ర క-రో-నా బారిన పడ్డారు. ఆయనకు క-రో-నా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా ధూళిపాళ్ల నరేంద్ర క-రో-నా లక్ష్యణాలతో బాధ పడుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, ఏసిబి కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. వెంటనే ఆయనకు చికిత్స అందించాలని కోరారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధ పడుతున్నారని, ఆయనను ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందించాలని కోరారు.

dhulipalla 05052021 2

అయితే ఏసిబి కోర్టులో, ఏసిబి తరుపు లాయర్ అడ్డుపడ్డారు. అవసరం లేదు అని చెప్పటంతో, అఫిడవిట్ రూపంలో ఇవ్వమని ఏసిబి కోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు ధూళిపాళ్ల నరేంద్ర వేసిన క్వాష్ పిటీషన్ హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భంలో, ఆయనకు ఆరోగ్యం బాగోలేదు అనే విషయం హైకోర్టు దృష్టికి తెచ్చారు. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు పాజిటివ్ వచ్చిందని, ధూళిపాళ్ల నరేంద్రకు లక్ష్యనాలు ఉన్నాయని, వెంటనే వారిని ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ధూళిపాళ్ల నరేంద్రకు లక్ష్యానాలు ఉంటే, ఆయన్ను వెంటనే ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకోపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయాని హెచ్చరించింది. అయితే సాయంత్రానికి ఆయనకు పాజిటివ్ అని తేలటంతో, ఆయన్ను ఇప్పుడు ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకు వెళ్ళటానికి పోలీసులు సిద్ధం అయ్యారు. ఏది ఏమైనా, చేయని నేరానికి, కేవలం ఆరోపణలు చేసి, ఇలా ఆయన్ను ఇబ్బందులు గురి చేయటం పై, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక పక్క రాష్ట్రంలో క-రో-నా విలయతాండవం చేస్తుంది. అంతం అనేది లేకుండా, కరోనా పాకుతుంది. రోజు మన కళ్ళ ఎదుటే అనేక ఘోరాలు చూస్తున్నాం. అనేక విధాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు లేక, ఆక్సిజన్ లేక, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఉన్నా, అది అందరికీ అందుబాటులోకి రాలేదు. దీనికి నివారణ తప్ప, ప్రస్తుతానికి మందు అయితే లేదు. ఈ పరిస్థితిలో అందరూ చెప్పేది ఒక్కటే. మాస్కు పెట్టుకోమని. మాస్కు ధరించి, కాపాడుకోమని, ఇతరులను కాపాడమని. ప్రభుత్వాలు కూడా, మాస్కు ఆవస్యకత గ్రహించి, మాస్కు వేసుకోవటం పై అవగాహన కలిగిస్తున్నాయి. మాస్కు వేసుకుంటేనే బయటకు రావాలని, మాస్కు లేని వారికి జరిమానా కూడా విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టే బయటకు మాస్కు లేకుండా వస్తే చాలు, వారి పై ప్రభుత్వం విరుచుకు పడుతుంది. ఎక్కడికక్కడ ఫైన్స్ వేస్తుంది. ప్రజలు కూడా దారిలో పడ్డారు. అయితే ప్రభుత్వాధి నేత అయిన జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం, ఆయన పంధాలోనే ఆయన వెళ్తున్నారు. మొదటి నుంచి మాస్కు అతి తక్కువగా పెట్టుకునే జగన్ గారు, ఇప్పుడు కూడా, ఈ విపత్కర పరిస్థతిలో కూడా, మాస్కు లేకుండానే, రివ్యూ మీటింగ్లకు, క్యాబినెట్ మీటింగ్ లకు అటెండ్ అవుతున్నారు.

perni 05052021 2

పోనీ ఈ మీటింగ్స్ ఏమైనా, ఆన్లైన్ లోనా, లేదా అతి తక్కువ మంది ఉండే మీటింగా అంటే కాదు. ఏకంగా 20, 30 మందికి పైగా ఉండే మీటింగ్. వీరందరూ వ్యాక్సిన్ లు వేసుకుని ఉండవచ్చు, పోనీ అందరికీ టెస్ట్ చేసి జగన్ గారి దగ్గరకు పంపించి ఉండవచ్చు కానీ, ఇలా ఒక ముఖ్యమంత్రి , ఈ సమయంలో మాస్కులు లేకుండా కనిపించి ఏమి సందేశం ఇస్తున్నారు ? ఇదే నిన్న ఒక విలేఖరి, మంత్రి పేర్ని నానిని అడిగారు. క్యాబినెట్ బ్రీఫింగ్ గురించి పేర్ని నాని,మీడియా ముందుకు రాగా, ఆయన్ను ఇదే విషయం అడిగారు. దానికి మంత్రి గారు స్పందిస్తూ, జగన్ గారు మాస్కు ఎందుకు పెట్టుకోవటం లేదు అంటే, ఆయన మాట్లాడే మాటలు వినిపించవు కాబట్టి పెట్టుకోలేదు అంట. మిగతా అందరూ మాస్కు పెట్టుకోక పొతే ఇబ్బంది కానీ, ముఖ్యమంత్రి గారు మాట్లాడే సమయంలో, మాస్కు పెట్టుకుంటే వినపడదు అని, మాస్కు పెట్టుకోలేదు అంటూ కవరింగ్ ఇచ్చారు. అసలు ఇదేమీ సమాధానమో అర్ధం కాలేదు. ఆయన మాట్లాడే సమయంలో తీస్తే అది వేరే విషయం కానీ, అసలు ఆయన మాస్కే పెట్టుకోకుండా కనిపిస్తున్నా, మంత్రి గారు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసారు.

జస్టిస్ ఎన్వీ రమణ. మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు బిడ్డ, ఈ దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో చీఫ్ జస్టిస్ గా నియామకం అయ్యారు. అయితే ఈయన చీఫ్ జస్టిస్ అవ్వకుండా, మన తెలుగు వాళ్ళే పన్నిన కుట్రలు దేశమంతా అందరికీ తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే, ఈ వివాదాల జోలికి వెళ్ళకుండా, ఆయన అనుకున్నది, ఆయన ఆశయం ప్రకారం నడుచుకుంటూ, తనదైన ముద్ర వేస్తూ, జస్టిస్ ఎన్వీ రమణ, పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కీర్తిస్తున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వచ్చిన తరువాత, సుప్రీం కోర్టులో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుందని, పలువురు వాపోతున్నారు. మొదటి నుంచి జస్టిస్ ఎన్వీ రమణ బడుగు బలహీన వర్గాలకు సత్వర న్యాయం కోసం పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయిన తరువాత, దాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్నారు. గత వారం రోజుల్లో ఆయన ఇచ్చిన చారిత్రాత్మిక తీర్పులు ఇందుకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్‌ కప్పన్‌ ను వెంటనే హాస్పటల్ కు తరలించే విషయం కానీ, దేశంలో అనేక ప్రాంతాల్లో వస్తున్న ఆక్సిజన్ కొరత కానీ, అలాగే క-రో-నా సెకండ్ వేవ్ విషయంలో, కేంద్రం పని తీరు పై కానీ, సుప్రీం కోర్టు ఇస్తున్న తీర్పులు పై చర్చ జరుగుతుంది.

nvramana 05052021 2

హత్రాస్ కేసులో, అక్కడకు కవర్ చేయటానికి వెళ్ళిన కేరళ జర్నలిస్ట్ ని, యోగి ప్రభుత్వం నిర్బందించింది. ట్రయిల్ ఖైదీగా ఆయనను అక్కడ పోలీసులు టార్చర్ పెట్టారు. అయితే ఈ కేసు కొన్ని నెలలుగా సుప్రీంలో నలుగుతుంది. జస్టిస్ ఎన్వీ రమణ రాగానే, పిటీషన్ ను విచారించి, ఆయనను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి, వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కేసు తీర్పు ఒక పెను సంచలనం అయ్యింది. ఎందుకుంటే, ఈ కేసుని యోగి ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టగా తీసుకుంది. ఇది మరో పక్క ఆక్సిజన్ కొరత, దేశంలో విలయతాండవం చేస్తున్న సెకండ్ వేవ్ పైనా దాఖలు అయిన పిటీషన్ పై, ఎన్వీ రమణ నేతృత్వంలో సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ విషయం పై, కేంద్రానికి కీల సూచనలు ఇచ్చింది. వైరస్ ని ఎదుర్కోవటానికి ఒక జాతీయ విధానం తయారు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే న్యాయస్థానాల్లో కోర్టులో చేసిన మోఖిక ఆదేశాలు, మీడియాలో రాకుండా చేయటం కుదరదు అని కూడా మరో తీర్పు ఇచ్చింది. ఇక దేశ ద్రోహం చట్టం, చట్టబద్ధత ఉన్న చట్టమా కాదని విచారణ జరపటానికి కూడా సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. ఇలా అనేక కేసుల్లో సుప్రీం కోర్టు, తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది.

Advertisements

Latest Articles

Most Read