జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క-రోనా బారిన పడ్డారు. ఆయనకు క-రో-నా పాజిటివ్ వచ్చిందని అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. హోం ఐసోలేషన్‍లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనకు ఛాతీ భాగంలో అసౌకర్యంగా ఉండటంతో, నిన్న హాస్పిటల్ కు కూడా వెళ్లినట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 11వ తేదీన, జనసేన నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి క-రో-నా వచ్చిందని, ఒక్కొక్కరూ, క-రో-నా బారిన పడుతున్నారని, అందుకే పవన్ కళ్యాణ్ స్వీయ నియంత్రణలో, ఉన్నారని తెలిపారు. 12వ తేదీన, జేపీ నడ్డాతో కలిసి ఎన్నికల సభలో పాల్గునవలసి ఉండగా పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో కూడా పాల్గునలేదు. పవన్ సన్నిహితులు అందరికీ క-రో-నా రావటంతో, ఆయన జాగ్రత్త పడ్డారు. అయినా నిన్న అసౌకర్యంగా ఉండటంతో, పవన్ కళ్యాణ్ హాస్పిటల్ కు వెళ్లి టెస్ట్ లు చేపించుకోగా, ఆయనకు క-రో-నా పోజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరగా కోలుకోవాలని అభిమానాలు కోరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. ఐఏఎస్, ఐపీఎస్ ల వార్షిక నివేదిక ఆమోదించే బాధ్యత జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటారు అంటూ, జీవో జారీ చేసారు. మొన్నటి వరకు కేవలం డీజీపీ, ప్రినిసిపల్ సెక్రటరీ స్థాయి అధికారుల వార్షిక నివేదికలు మాత్రమే సియం ఆమోదంలో ఉండేవి. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, అందరి అధికారుల వార్షిక నివేదికలు ఆయనే ఆమోదిస్తారు. ఈ నిర్ణయంతో, అధికారుల పై ఒత్తిడి పెరిగి, ప్రభుత్వానికి అనుకూలంగా, అధికార పార్టీ నేతలు ఏమి చెప్తే అదే చేయాలి అనే ఒత్తిడిలోకి వెళ్లిపోతారని, ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి అంటూ, అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్షిక నివేదిక ఆధారంగా, వారికి ప్రమోషన్ లు కానీ, కేంద్ర క్యాడర్ కు వెళ్ళటం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో ఎవరికైనా ఈ నివేదిక అనేది చాలా ముఖ్యం. సహజంగా ఇవి చీఫ్ సెక్రటరీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ఈ రిపోర్ట్ ఆమోదిస్తారు అంటూ, ఒక జీవో విడుదల అయ్యింది. ఈ జీవో పై , అధికారులు లోలోపల మదనపడుతున్నా, ఎవరూ బహిరంగంగా తమ ఆవేదన చెప్పలేదు. అయితే ఈ విషయం పై వైసీపీ ఎంపీ స్పందించారు.

rrr 16042021 2

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామరాజు స్పందిస్తూ, ఈ విషయం పై ప్రధాని మోడికి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారుల వార్షిక నివేదిక ఆమోదించే బాధ్యత జగన్ మోహన్ రెడ్డి చేతుల్లో పెట్టటం పై ఫిర్యాదు చేసారు. ఐఏఎస్ లకు వార్షిక నివేదికలు అనేవి, వారి కెరీర్ లో భవిష్యత్తుని నిర్ణయించేవి అని, ఇలాంటి కీలకమైన బాధ్యతను, ఒక రాజకీయ నేత చేతిలో ఎలా పెడతారు అంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని కూడా జత పరిచారు. ఆ జీవో పై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. ఈ నిర్ణయంతో నిజాయతీ పరులైన అధికారులకు అన్యాయం చేసినట్టు అవుతుందని, వారు స్వేచ్చగా సమాజం కోసం పని చేసే వీలు ఉండదని తన ఫిర్యాదులో తెలిపారు. తమ భవితవ్యం పలానా వ్యక్తి చేతిలో ఉందని తెలిస్తే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా వారు సమర్ధించాలా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో పై జోక్యం చేసుకోవాలని, తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాల పై, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు , కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి, ఇక్కడ జరుగుతున్న అరాచకాల పై ఫిర్యాదు చేసారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్ లోనే, ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో, వాలంటీర్లని ఉపయోగిస్తున్నారు అంటూ, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఎన్నికల కమిషన్ కు ఇచ్చారు. వారు ఎన్నికల ప్రచారం చేయకుండా తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కేంద్ర బలగాలతోనే ఎన్నికలు నిర్వహించాలి అంటూ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు కోరారు. ఇక చంద్రబాబు పై జరిగిన రాళ్ళ దాడి ఘటన పై కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ, ఈ కేసు విషయంలో డిఐజి వ్యవహరించిన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క రాళ్ళ దా-డి జరిగితే, అలా ఏమి జరగలేదని ఏకంగా డీఐజి ప్రెస్ మీట్ లో చెప్పారని, ఆధారాలు ఉంటే ఇవ్వాలని, అప్పుడు విచారణ మరింతగా చేస్తామని అంటున్నారని, ఆయన పై చర్యలు తీసుకోవాలి అంటూ టిడిపి నేతలు ఫిర్యాదు చేసారు.

ec 15042021 2

అయితే తెలుగుదేశం నేతలు ఫిర్యాదు పై, కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసిన లేఖకు బదులు ఇస్తూ, మరో లేఖ రాసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎక్కువ శాతం పోలింగ్ బుతుల్లో, కేంద్రం ఎన్నికల బలగాలను దించామని సమాధానం ఇచ్చింది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలను పంపించమని, ఎక్కువ చోట్ల వారే ఉంటారని కేంద్ర ఎన్నికల సంఘం తమ లేఖలో తెలిపింది. అలాగే వాలంటీర్ల విషయంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు ఎక్కడా ప్రచారం చెయకూడదు అని, వాలంటీర్లు ఎక్కడా కూడా ఎన్నికల ఏజెంట్లు గా ఉండ కూడదు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుగుదేశం ఎంపీలకు రాసిన లేఖలో తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో, ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు, అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్నాం అంటూ, తెలుగుదేశం ఎంపీలకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

మాజీ మంత్రి వివేక కేసుకు సంబంధించి, సిబిఐకి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది. ఈ లేఖలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ సంచలన విషయాలు పేర్కొన్నారు. అందులో ఆయన చెప్పిన విషయం ఏమిటి అంటే, వివేక హ-త్య కు సంబంధించి, అనేక వివరాలు తన వద్ద ఉన్నాయని, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న సింగ్ కు ఫోన్ చేసి, రెండు మూడు సార్లు ఈ విషయం పై, చెప్పినప్పటికీ కూడా ఆయన స్పందించలేదని చెప్పారు. సిబిఐ అధికారులను తన వద్దకు పంపుతానని చెప్తారని, అయితే ఇప్పటి వరకు పంపలేదని, ఆయన తెలిపారు. ఈ విషయాలు అన్నీ సిబిఐ డైరెక్టర్ కు రాసిన లేఖలో తెలిపారు. అయితే ఇప్పుడు ఈ లేఖ రాయటం సంచలనం సృష్టిస్తుంది. ఈ లేఖ ఉగాది నాడే సిబిఐకి రాసినా, ఇప్పుడు ఈ లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో చాలా స్పష్టంగా, వివేక హ-త్య ఘటన చోటు చేసుకున్నప్పటి పరిణామాలు అన్నీ కూడా, ఆయన ఈ లేఖలో వివరించారు. సిబిఐ విచారణ మొదలై ఏడాది గడుస్తున్నా కూడా, కేసు విచారణలో ఏ మాత్రం ముందడుగు లేదు అనే విషయాన్ని కూడా ఏబీ వెంకటేశ్వరరావు, సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసోకోచ్చారు. ఈ మ-ర్డ-ర్ కు సంబంధించి, సిబిఐకి అందించాల్సిన సమాచారం తన వద్ద ఉందని, రెండు సార్లు పైగా ఫోన్ చేసి చెప్పినా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి ఏ మాత్రం స్పందన లేదు అని చెప్పారు.

cbi 16042021 2

ఏ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి, ఆ అధికారితో మాట్లాడింది కూడా, ఆయన తన లేఖలో తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో, ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ విభాగానికి చీఫ్ గా ఉన్నారు. అయితే డీజీపీ స్థాయి అధికారి సమాచారం ఇస్తాను అంటున్నా కూడా సిబిఐ పట్టించుకోక పోవటంతో, సర్వత్రా విస్మయాన్ని గురి చేస్తుంది. హ-త్య జరిగితే ఒక ఎంపీ, దీన్ని గుండె పోటుగా ప్రచారం చేసారని ఏబీ వెంకటేశ్వరరావు ఆ లేఖలో స్పష్టంగా తెలిపారు. ఈ కోణంలో ఎందుకు విచారణ చేయటం లేదు అనేది కూడా ప్రశ్నగా మారింది. మరో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన బంధువులు, ఇల్లు అంతా కడిగి, ర-క్తం లేకుండా చేసి, ఆధారాలు చెరిపేసి, శవానికి కుట్లు వేసి, మొత్తం దగ్గర ఉండి చూసుకున్నారని కూడా, ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేసారు. వారు ఘటనా స్థలాన్ని మొత్తం అదుపులో ఉంచుకున్నారని, ఆ సమయంలో మీడియాని కానీ, ఇంటలిజెన్స్ సిబ్బందిని కానీ, లోపలకు రానివ్వలేదని చెప్పారు. అయితే ఆధారాలు ఉన్నాయని ఒక డీజీపీ స్థాయి అధికారి చెప్తున్నా, సిబిఐ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో అర్ధం కావటం లేదు...

Advertisements

Latest Articles

Most Read