నేడు తాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) యోగానంద్ గారిని కలిసి, తిరుపతి ఉపఎన్నికలో జరుగుతున్న విధానాలు, కేంద్రఎన్నికల సంఘం చేయాల్సిన కొన్నిఏర్పాట్లు, అధికారపార్టీ స్థానిక ఎన్నికల్లో అనుసరించినట్లుగానే తిరుపతి ఉపఎన్నికలో కూడా వెళ్లాలని చూస్తోందని, దౌ-ర్జ-న్యం-గా, అప్రజాస్వామికంగా గెలుపుపొందాలని చూస్తోందని, కొన్నికారణాలతో సీఈవోకి ఫిర్యాదుచేయడం జరిగిం దని, ఆయన తామిచ్చిన ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలిం చారని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలుఆయన మాటల్లో... "తిరుపతి ఉపఎన్నికలో స్థానికసంస్థల్లో అనుసరించినట్టే వైసీపీ అనుసరిస్తున్న విధానాలపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశాం. చంద్రబాబునాయుడి సభలో రాళ్లేమీ పడలేదని డీఐజీ అంటున్నాడు. అలాంటప్పుడురాళ్లు ఆకాశం నుంచి పడ్డాయా? లేక మాయలఫకీర్ గానీ, పాతాళభైరవి మాంత్రికుడేమైనా విసిరాడా? అల్లాఉద్దీన్ అద్భుతదీపం నుంచి ఏమైనా వచ్చాయా? ఎలావచ్చాయో డీజీపీచెప్పాలిగా. దర్యాప్తు పూర్తికాకుండా, ఏమిజరిగిందో తెలుసుకోకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే డీఐజీ ఉటంకించడం అభ్యంతరకరం. డీఐజీకంటే ఒక ఎస్సైకి చెప్పి ఉంటే, అతను రాళ్లు ఎక్కడినుంచి వచ్చాయో బాగా దర్యాప్తు చేసేవాడు. డీఐజీ తనవ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, రాళ్లు విసిరిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. రాళ్ల దా-డి ఘటనపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకోవాలని సీఈవోని కోరాం. ఉపఎన్నికకోసం 23 కంపెనీల కేంద్రబలగాలు రాబోతున్నాయని తెలిసింది. సున్నితమైన పోలింగ్ బూతుల్లో లోకల్ పోలీసుల ప్రమేయం లేకుండా, కేంద్రబలగాలను నియమించాలని సీఈవోని కోరాం. దానిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఈవో చెప్పారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు, వెబ్ స్ట్రీమింగ్ (లైవ్) ఏర్పాట్లుచేయమని సీఈవోని కోరాము. తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓటర్ ఐడీకార్డులు 2లక్షలున్నాయని తెలిసింది. వైసీపీ ఎన్నికల్లో పోటీచేయడం మొదలెట్టాకే ఇటువంటి కొత్తకొత్త వింతలన్నీ చూస్తున్నాం. దొంగఓటర్ కార్డుతో పాటు, మరో గుర్తింపుకార్డుని కూడా పరిశీలించాలని కోరాం. బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఇలాంటివి ఏవైనా పర్వాలేదని చెప్పాము. దానిపై కేంద్రఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తామని సీఈవోచెప్పారు. సున్నితమైన బూత్ లలో మైక్రో అబ్జర్వర్స్ ని నియమించాలని సీఈవోకి విజ్ఞప్తిచేశాము. అందుకో సం కేంద్రసర్వీసుల్లో పనిచేసిన కొంతమందిని నియమించడం జరిగిందని సీఈవో తమతో చెప్పారు. అలానే రూట్ అబ్జర్వర్లను కూడా కట్టుదిట్టంగా నియమించాలని కూడా కోరాము. తాముచేసిన విజ్ఞప్తులపై సీఈవో సానుకూలంగా స్పందించారు. కలెక్టర్లు, ఎస్పీల మీటింగులో ఈ అంశాలపై చర్చిస్తామని చెప్పారు. రోగులను తరలించాల్సిన అంబులెన్సులను ఎన్నికలడబ్బు రవాణాకు అధికారపార్టీ వాడుకుంటోందని తెలియచేశాము. దొంగతనాలు ఎన్నిరకాలుగా చేయొచ్చో, ఎన్ని కొత్తవిధానాలు అమలు చేయొచ్చో వైసీపీవారుచేసి చూపిస్తున్నా రు. అంబులెన్సులనేవి రోగులకోసం ఉపయోగిస్తారు సంఘవ్యతిరేకవ్యవహారాల్లో బాగా అనుభవం గడించిన వారు చేసేది మీకు చెబుతున్నా. వైసీపీవ్యక్తే అంబులెన్స్ లో పేషెంట్ గాఉండి, ఆ వాహనాలద్వారానే కోట్లకుకోట్ల సొమ్ముని తరలిస్తున్నారని సీఈవోకి చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. సిన్సియర్ పోలీసులు ఎవరైనా చెక్ చేస్తే, రోగిఉన్నట్లు భ్రమింపచేస్తారు. ప్రభుత్వానికి ఇటువంటి సలహాలు ఎవరిస్తున్నారో తెలియడంలేదు. సలహాదారులా లేక... ఖిలాడీకింగ్ విజయ సాయిరెడ్డి చెబుతున్నాడా? వాహానాల్లో చేరాల్సిన సొమ్ము చేరాల్సిన చోటికి చేరుతుంది. పడాల్సిన ఓట్లు పడతాయి. వైసీపీకి కరుడుగట్టిన అభిమానంతో ఉన్న కొందరు పోలీస్ అధికారుల కార్లలో (వాహానాల్లో) కూడా డబ్బు తరలిస్తున్నారని తెలిసింది.
అలాజరగడం లేదు.. జరిగితే సదరుపోలీస్ అధికారులను తక్షణమే తొలగించి, కస్టడీలోకి తీసుకుంటామని డీజీపీ స్టేట్ మెంట్ ఇవ్వగలరా అని అడుగు తున్నాను. పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరురాకుండా నిజంగా అలాంటివి జరిగితేచర్యలు తీసుకోవాలని సీఈవోని కోరాము. కేంద్రబలగాలను సద్వినియోగం చేసేలా నియమించాలని, లోకల్ పోలీసుల అజమా యిషీ, డైరెక్షన్ లేకుండా చూడాలని కోరాము. ఎన్నికలకోడ్ అమల్లో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టీటీడీ) ప్రధానార్చకుడిగా రమణదీక్షితుల్ని నియమించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలియచేశాం. గతంలో తొలగించబడిన వ్యక్తిని కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలా నియమించారు? ఆయన వ్యాఖ్యలన్నీ అధికా పార్టీకి అనుకూలంగా, ప్రధాన ప్రతిపక్షనేతకు వ్యతి రేకంగా ఉంటాయికదా? అటువంటివ్యక్తిని ప్రధాన అర్చకుడిగా నియమించడం నేరంకాదా? ఆయననియామకం ఒకవర్గంవారిని సంతోష పెడుతుందికదా? కాబట్టి ఆ నియామకాన్ని వెంటనే రద్దుచేయాలని సీఈవోకి తెలియచేశాం. రమణదీక్షితులు ముఖ్యమంత్రిని విష్ణుమూర్తితో పోల్చడం చాలా అభ్యంతరకరం. ఎన్నోకేసుల్లో ముద్దాయిని, 16నెలలు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీని, ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తినిభగవంతుడైన విష్ణుమూర్తితో పోల్చడం, రమణదీక్షితులు దిగజారుడుతనానికి నిదర్శనం. రమణదీక్షితులి వ్యాఖ్యలపై మతపెద్దలు, ధార్మికసంస్థలు, జీయర్ స్వాములు, పెద్దపెద్దమఠాధిపతులు ఎందుకు స్పందించడంలేదో అర్థంకావడం లేదు." అని వర్ల రామయ్య అన్నారు..