బెదిరించి గెలిచినా, డబ్బుతో గెలిచినా, అధికారంతో గెలిచినా, గెలుపు గెలుపే. తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇవి కారణాలుగా చెప్పటం కంటే, ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవలో సమీక్ష చేసుకుని, అవి సరి చేసుకుని ముందుకు వెళ్తే, జనరల్ ఎలక్షన్స్ నాటికి, తెలుగుదేశం పార్టీ ధీటుగా నిబలడుతుంది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే చరిత్ర అదే చెప్తుంది. ఎక్కడో 30 ఏళ్ళ నాటి సంగతి కాదు, గత తెలుగుదేశం హయాంలో లెక్కలు తీస్తేనే ఈ విషయం అర్ధం అవుతుంది. 2014 నుంచి 2019 వరకు జరిగిన వివిధ ఎన్నికలు, అందులో వైసీపీ పని తనం చూసి, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన తీరు చూస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో నేర్చుకోవచ్చు. ఓటమికి కుంగిపోకుండా, ఎదుటి వారి బలాన్ని చూసి భయపడితే, అదే టిడిపికి పెద్ద బలహీనత అవుతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, కొన్ని నెలలకే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ చనిపతే, అక్కడ ఉప ఎన్నిక వస్తే, ఆ ఉప ఎన్నికలో పోటీ చేసే సాహసం కూడా వైసీపీ చేయలేదు. ఇక 2015 లో కృష్ణ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే, ఆ ఎన్నికలో కూడా వైసీపీ పోటీ చేయటానికి వెనకడుగు వేసింది. ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు టిడిపి కనీసం పోటీ అయినా చేసింది, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి కూడా వెనకాడింది.

votes 15032021 2

ఇక అలాగే 2017లో తొమ్మిది స్థానాలకు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మూడు స్థానాలు కర్నూల్, మూడు స్థానాలు కడప, మూడు స్థానాలు నెల్లూరుకు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం అన్ని స్థానాల్లో టిడిపి గెలిచింది. ఇంకా చెప్పాలి అంటే, జగన్ సొంత బాబాయ్ వివేకను, పులివెందులలో కూడా టిడిపి ఓడించింది. ఓటమి ఎరుగని వైఎస్ ఫ్యామిలీకి ఓటమి రుచి చూపించింది టిడిపి. ఇక 2017 లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్. టిడిపిలో ఉన్న శిల్పాని లాక్కుని మరీ పోటీ పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి ఇది సెమి ఫైనల్స్ అన్నారు. ఎనిమిది రోజులు అక్కడే ప్రచారం చేసారు. కట్ చేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ 30 వేల మెజారిటీతో గెలిచింది. తరువాత 2017 లో జరిగిన, కాకినాడ మునిసిపాలిటీ ఎన్నికల్లో 49 వార్డ్స్ లో 10 వార్డులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014-19 మధ్య జరిగిన ప్రతి ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ఓడిపోయింది. కానీ 2019కి వచ్చే సరికి, ప్రభంజనం సృష్టించింది. అధికారం అనేది చేతిలో ఉంటే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అధికార పార్టీకే వస్తాయి అని చెప్పే లెక్కలు ఇవి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలు అవటం పై, చంద్రబాబు స్పందించారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఒక సందేశం పోస్ట్ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడి పని చేసారని, కొన్ని చోట్ల ప్రాణాలకు తెగించి పోరాడి, పార్టీకి అండగా నిలిచారని కొనియాడుతూ, వారి పోరాట స్పూర్తికి వందనాలు తెలిపారు. ఇక ఫలితాల పై స్పందిస్తూ, ఈ ఫలితాల పై నిరుత్సాహ పడనవసరం లేదని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడినా, గట్టిగా పోరాడం అని అన్నారు. రాబోయే కాలంలో, ప్రజా సమస్యల పై పోరాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లటంతో కృషి చేద్దామని, ఇదే స్పూర్తితో పోరాడితే, విజయం వరుస్తుంది అంటూ, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు సందేశం పోస్ట్ చేసారు. ఇక ఎన్నికల ఫలితాల పై టిడిపి అధికారికంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి స్పందించింది. వర్ల రామయ్య మాట్లాడుతూ, "సీఎంగా తనఉనికిని కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి అనేక అంశాలను మేనిప్లేట్ చేశాడు. రాష్ట్రంలో ఏం జరుగు తుందో, ప్రజలుఏ పరిస్థితుల్లో ఓట్లువేశారో వారికైవారే ఒకసా రి సింహావలోకనంచేసుకోవాలి. 90శాతం స్థానాలు గెలవకుం టే మంత్రిపదవికట్, వచ్చేఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వ ను..నా వద్దనుంచి ఎటువంటి ఫేవర్ నీకురాదని ఒక ముఖ్య మంత్రి తనపార్టీ నాయకులతో అంటే, ఎన్నికలు సజావుగా జరుగుతాయా? ఆ విధంగా ముఖ్యమంత్రి చెప్పడం మేనిప్లేష న్ కాదా? నూటికినూరుశాతం పురపాలక ఎన్నికల్లో గెలవా లని చెప్పడం మేనిప్లేషన్ కిందకురాదా? ప్రజలతీర్పుని తాను తప్పపట్టడంలేదు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాను. గతంలో పోలింగ్ శాతం 73 గా ఉంటే, ఇప్పుడు 62శాతానికి పడిపోయింది. ఆ 11శాతం పోలింగ్ ఏమైందనేదానిపై ముఖ్యమంత్రి ఆలోచనచేయరా? ముఖ్యమంత్రి మేనిప్లేషన్ విజయవంతంగా పూర్తైంది. "

"ఎన్ని కల ఫలితాలపై, మంత్రులు, కలెక్టర్లు, జిల్లాఎస్పీల పనితీరుపై ఆయన ఆలోచించరనే విషయం నాకుతెలుసు. ఏవిధమైన సరుకులేకుండా బ్రహ్మండంగా చలామణీ అవుతున్నసజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు, లోకేశ్ లు హైదరాబాద్ కి పారిపో యారంటున్నారు. చంద్రబాబునాయుడు చూసినన్నీ ఎన్నికలు ఆయన చూశాడా? ఆ విషయం ఆయన తనత లపై చేయిపెట్టుకొని చెప్పాలి. ఈ ఎన్నికలు, ఈ గెలుపు శాశ్వ తమా? గతంలో నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ భారీగా విజ యంసాధించింది. కాకినాడ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలపడానికే భయపడింది. 2014లో టీడీపీఅధికారంలోకి రాకముందు అన్నిఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీనే గెలిచింది కదా? ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అర్థంచేసుకోవాలి. వ్యవస్థలు, పోలీస్ శాఖ, ఎన్నికలఅధికారులు, ప్రభుత్వంఎంతలా ఇబ్బందిపెట్టినా మొ క్కవోని ధైర్యంతో పోరాడి, టీడీపీ గెలుపేలక్ష్యంగా పనిచేసిన తెలుగుదేశంశ్రేణులకు పార్టీతరుపున నమోవాకాలు (సెల్యూట్) చేస్తోంది. పురఫలితాలపై ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, పట్టుదల తో పోరాడిన టీడీపీ కేడర్ కు అభివాదం చేస్తున్నాను. ముఖ్యంగా మైదుకూరు, తాడపత్రి టీడీపీశ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను." అని అన్నారు.

విజయవాడ టిడిపి తరుపున మేయర్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కేశినేని శ్వేత, 11వ డివిజన్ లో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనని గెలిపించిన 11వ డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ తనను, ఇంట్లో ఆడ పిల్లలాగ ఆదరించి, ఈ రోజు గెలిపించారని చెప్పారు. తన డివిజన్ లోనే కాకుండా, విజయవాడలో మొత్తం డోర్ టు డోర్ తిరిగానని, ఇది మొదటి సారి కాదని, ఇప్పటికి మూడు సార్లు తాను విజయవాడ మొత్తం తిరిగానని, 2014లో, 2019లో నాని గారి ఎన్నికల కోసం తిరిగితే, ఇప్పుడు తన కోసమే తాను తిరిగానని చెప్పారు. విజయవాడలో అభివృద్ధి మొత్తం టిడిపి హయాంలోనే జరిగిందని, డ్రైనేజి వ్యవస్థ కానీ, ట్రాఫిక్ రద్దీ నియంత్రించటం కానీ, ఇలా ఏ అభివృద్ధి అయినా టిడిపి హయాంలోనే జరిగిందని శ్వేత అన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఈ రెండేళ్ళలో విజయవాడకు ఏమి చేయలేదని, విజయవాడ రోడ్డులు చూస్తుంటేనే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ఇక విజయవాడలో ఓటిమి పై, పూర్తి వివరాలు వచ్చిన తరువాత స్పందిస్తామని చెప్పారు.

2019 ఎన్నికల తరువాత, బీజేపీ పార్టీతో కలిసి పని చేస్తున్న జనసేనకు, ముందు నుంచి బీజేపీ వైఖరి నచ్చనట్టే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణాలో కానీ, బీజేపీ నేతలతో పవన్ ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా కేంద్రంలో బీజేపీ నేతలతో మాత్రం సఖ్యతగానే ఉంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో, జనసేన పార్టీకి తగిన గౌరవం ఇవ్వలేదని, మొదటి నుంచి జనసేన నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. బహిరంగంగానే బీజేపీ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఈ విషయం పై స్పందించటం, స్థానిక బీజేపీ నేతల పై ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఈ రోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే, "మేము తెలంగాణాలో 40కు పైగా స్థానాలు బీజేపీకి వదిలేస్తే, బీజేపీ మనకి సరైన గౌరవం ఇవ్వలేదు, ఆ ఇబ్బంది మనకు ఉంది. మన కార్యకర్తలు మాట్లాడుతూ, ప్రతి సారి మనలని వాడుకుని వదిలేస్తున్నారని అంటే, మరి మనం ఏమి చేయగలం అని అన్నాను. వారు ఒకటే అన్నారు, మా మనోభావాలకు వ్యతిరేకంగా మీరు వెళ్తే, మీ మీద గౌరవంతో మేము కాంగా ఉంటాం కానీ, మా మనోభావాలు మాత్రం కించ పరచవద్దు అని తెలంగాణాలో ఉన్న జన సైనికులు అన్నారు. "

janasena 14032021 2

"వారి అభిప్రాయాలు నా దృష్టికి తెచ్చారు, ఇలా అనుకుంటున్నారు అని. మాములుగా ఎన్నికల్లో , ఒక్క ఓటు ఉంటే కూడా, ఒక కుటుంబంలో అయుదు ఓట్లు ఉంటే కూడా మనం గౌరవిస్తాం. మీ మద్దతు మాకు కావలి, మాకు మద్దతు తెలపండి అని అడుగుతాం. ఇన్ని లక్షల మంది జనసేన ఓట్లు తెలంగాణాలో ఉంటే , దానికి గౌరవం ఇవ్వకపోవటం మాకు మనస్తాపానికి కలిగించిందని, జన సైనికులు నాకు చెప్పినప్పుడు నేను అర్ధం చేసుకున్నాను. ఎటు వైపు వెళ్ళమంటారని వాళ్ళు అడిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయమంటారు అని అడిగితే, నేను వారిని ఎటు వైపు వెళ్ళాలని ఉందని, వారినే అడిగాను. వారు చెప్తూ, మాకు మా తెలంగాణా బిడ్డ, ప్రధాన మంత్రిగా చేసి, ఆర్ధిక సంస్కరణలు పెట్టిన వ్యక్తి, అభివృద్ధికి రాజ మార్గం వేసిన వ్యక్తీ, పీవీ నరసింహరావు గారి బిడ్డ పోటీలో ఉన్నారు, వారికి మద్దతు ఇవ్వాలి అనుకుంటున్నామని వారు అంటే, వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, వారికి మద్దతు తెలిపాను. కేంద్రంలో బీజేపీ పెద్దలు మాతో ఉన్నా, తెలంగాణాలో బీజేపీ మాత్రం, కుట్ర చేసింది అనే అభిప్రాయం ఉంది" అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read