రేషన్ కోసం పేదలను రోడ్ల మీదకు తెచ్చి వైసీపీ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా మార్చింది. ఇంటింటికీ రేషన్ అంటూ వీధుల్లో మహిళలను నిలబెట్టడం దుర్మార్గం .రేషన్ వ్యవస్థను వైసీపీ భ్రష్టుపట్టిస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు శ్రీ నారాచంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం నాడు రేషన్ డీలర్ల సంఘం నేతలు కలిసి తమ సమస్యలపై చంద్రబాబు నాయుడికి వినతిపత్రం అందించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.... గతంలో వారంలోనే అందరికీ బియ్యం అందితే ఇప్పుడు నెలకు పది శాతం మందికి కూడా రేషన్ ఇవ్వలేకపోతున్నారు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ గోనెసంచులు కూడా వదలడం లేదు. జే-టాక్స్ కోసం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేశారు. కమీషన్ల కోసం వాహనాలను కొని ప్రజలను ఇక్కట్లు పెట్టారు. అదే రూ.1000 కోట్లతో రంజాన్ తోపా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలు ఇవ్వొచ్చు. అన్నా క్యాంటీన్లు కొనసాగించి పేదల కడుపు నింపవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా పేదలకు రేషన్ సరిగా అందడం లేదు.

ration 07032021 2

గతంలో వీలు కుదిరినప్పుడు రేషన్ షాపులకు వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకునే వారు. కానీ ఇప్పుడు ఒక నిర్ధిష్ట సమయంలో మాత్రమే తీసుకునేలా చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కేజీకి 20 పైసలు ఉన్న కమిషన్ ను టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూపాయికి పెంచింది. వైసీపీ వచ్చాక డీలర్లను స్టాకిస్టులుగా మార్చింది. జగన్ రెడ్డి వచ్చాక వారికి చెల్లించాల్సిన బకాయిలు అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. ప్రజలకు రేషన్ ఇవ్వడానికి గతంలో ఒక్కో షాపునకు ఏడు వేలు ఖర్చు అయితే తుగ్లక్ పాలనలో రూ.28 వేలు ఖర్చు అవుతోంది. రేషన్ డీలర్లకు పెండింగ్ కమీషన్ ను వెంటనే అందించాలి, కరోనా సమయంలో రేషన్ అందిస్తూ కరోనా భారినపడి చనిపోయిన రేషన్ డీలర్లకు రూ.50 లక్షలు పరిహారం అందించాలని, రేషన్ వ్యవస్థను పటిష్టం చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లను కొనసాగిస్తామన్నారు

టీడీజీ జాతీయ అధ్యక్షుడు , రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం విజయవాడ నగరంలో పర్యటిస్తున్నారు. కార్పోరేషన్ ఎన్నికలలో టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ పశ్చిమ, మధ్య, తూర్పు అసెంబ్లీ నియోజక వర్గాలలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటున్నారు. అయితే శనివారం విజయవాడలో పార్టీకి సంబందించి కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. దీంతో రూట్ మ్యాప్లో మార్పులు చోటు చేసు కున్నాయి. చంద్రబాబు నాయుడి రోడ్ షోలో ఆయా నియోజకవర్గాల ఇన్ ఛార్జులు. కార్పోరేషన్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులు, మేయర్ అభ్యర్థి పాల్గొన్నారు. ఆయనకు ఉండే సమయం వెసులుబాటును బట్టి రూటు తాజాగా ఖరారు చేశారు. ముందుగా చంద్రబాబు షాహిద్ దర్గా నుంచి ప్రచారం మొదలు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాల పై ప్రజలకు అవగాహన కలిగించారు. ముఖ్యంగా జగన్ రెడ్డి వేస్తున్న పన్నుల బాదుడు పై ప్రజలకు అవగాహన కలిగించారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే నిన్న విజయవాడ టిడిపిలో జరిగిన పరిణామాల పై ఘాటుగా స్పందించారు. జగన్ రెడ్డి పార్టీలో ఎవరూ మాట్లాడరు, బంట్రోతులులా కూర్చంటారు. మన పార్టీలో ఫ్రీడం ఎక్కువ అయింది, దాన్ని నేను కంట్రోల్ చేస్తా, మీకు నేను అభయం ఇస్తున్నా, ఇప్పుడు చెప్పకపోతే నేను భయపడ్డాను అనుకుంటారు అంటూ చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

cbn 07032021 2

చంద్రబాబు రోడ్ షో లో రూట్ ఇలా సాగనుంది.... షాహిద్ దర్గా, స్వాతి సెంటర్, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్తంభాల సెంటర్. సితారా సర్కిల్, సొరంగం రోడు, చిట్టినగర్ సెంటర్, కే బీ ఎన్ కాలేజీ రోడు, నె హ్రూ చౌక్, పంజా సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, లో బ్రిడ్పీ రైల్వే స్టేషన్, పాత ఆంధ్ర ప్రభ ఆఫీసు. కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్, ఎర్రకట్ట, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపే ట, సింగ్ నగర్ పెట్రోల్ బంక్, పైపుల రోడు, నున్న పోలీసు స్టేషన్, ప్రకాష్ నగర్ మెయిన్ రోడులలో రోడ్ షో ముగించుకుని మరల సింగ్ నగర్ పై ఓవర్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి బుడమేరువంతెన, ముత్యాలం పాడు ప్రభుత్వ ప్రెస్, బీ ఆర్ టీ ఎస్ రోడ్ను మోడర్న్ సూపర్‌మార్కెట్, చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ సెంటర్, మె ట్రో, సిదార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి , అమ్మకల్యాణ మండపం, ఎగ్జిక్యూటివ్ క్లబ్ సర్కిల్, గురునానక్ కాలనీ రోడు, పటమట రైతుబజారు రోడ్డు, ఆటోనగర్ గేట్ యుటర్న్, ఎన్ టీ ఆర్ సర్కిల్, బెంజి సర్కిల్, స్క్రూ బ్రిడ్జి కృష్ణలంక హైవే ఫీడర్ రోడ్డు, బాలా జీనగర్, రాణిగారి తోట, ఎం హోటల్, సత్యంగారి హోటల వరకు రోడ్ షో సాగుతుంది. అక్కడ రోడ్ షో ముగుస్తుంది.

ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు వార్డు వలంటీర్లు తమ ఫోన్లను మునిసిపల్ కమిషనర్ల వద్ద డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొబైల్ ను పూర్తి స్థాయిలో నియంత్రించటం వల్ల విధులకు విఘాతం కలుగుతుందని భావిస్తూ అధికారుల అనుమతి మేరకు మాత్రమే వాటిని వినియోగించాలని సూచించింది. అప్పటికీ ఎవరైనా వాటిని దుర్వినియోగం చేశారని భావిస్తే సంబంధిత వలంటీర్లపై చర్యలకు ఎన్నికల కమిషన్ సిఫార్సు చేయాలని దిశానిర్దేశం చేసింది. వలంటీర్ల మొబైల్ ఫోన్ల విషయంలో ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ గత కొద్ది రోజుల క్రితం సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సవరించింది. మునిసిపల్ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు భాగస్వామ్యం కాకుండా చర్యలే తీసుకోవాలని వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని గత నెల 28న ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏక పక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వాదిస్తూ ప్రభుత్వం తరుపున వార్డు, గ్రామ సచివాలయాల విభాగం ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ నెల 3న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లను సీజ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి శుక్రవారం అత్యవసర విచారణ నిమిత్తం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

hc 06032021 2

దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని అయితే వలంటీర్లు కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయటం పట్ల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని తేల్చి చెప్పింది. లబ్దిదారులతో మమేకమై వారికి ప్రభుత్వ పథకాలను చేరవేయటమే వలంటీర్ల బాధ్యతగా గుర్తించాలని అదే సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తారనే కమిషన్ వాదనను అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ తరుపు సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టుకు వివరించారు. వలంటీర్ల విధులపై కమిషన్ ఆంక్షలు విధించటం లేదని ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు మాత్రమే మొబైల్ను స్వాధీనం చేయాలని కమిషన్ ఆదేశించినట్లు చెప్పారు. ఏ పని కోసం ఎవరితో మాట్లాడారో వారినే వివరణ కోరేలా ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం చేసిన సూచనపై న్యాయవాది ఆదినారాయణ రావు స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రక్రియ ముగిసేంత వరకే అని, ఆ పై ఆదేశాలు అమల్లో ఉండ బోవన్నారు.. అవసరమైన మేరకు ఫోన్లను వినియోగించాలని ఓ అధికారి పర్యవేక్షణలో వాటిని డిపాజిట్ చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది..

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అకడ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో అత్యవసర హౌస్‍మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. చిత్తూరు కార్పొరేషన్ లో ఉన్న, 18 డివిజన్లలో, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీ చేసి, విత్ డ్రా చేశారని హైకోర్టులో పిటీషన్ వేసారు. అయితే ఈ హౌస్‍మోషన్ పిటీషన్ ను,18 మంది టీడీపీ అభ్యర్థులు దాఖలు చేయటం మరో కొసమెరుపు. హైకోర్టు కూడా ఈ కేసుని అడ్మిట్ చేసుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణ జరుగనుంది. ఇక తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ వివాదానికి వేదికవుతోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పోటీ నుంచి తప్పుకున్నట్టు దరఖాస్తు చేశారని తెలుగుదేశం అభ్యర్థి రచ్చకెక్కడంతో వివాదం వెలుగుచూసింది. ఆయన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల సంఘం 7వ డివిజన్ ఎన్నికను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఆక్షేపిస్తూ 7వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ నివేదిక సిద్ధం కావాల్సి ఉన్నందున కేసును సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ 13 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. దీనికి ఏడాది క్రితం మొదలై వాయిదా పడిన ఎన్నికలు ఈ నెల 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణతో మొదలైంది. ఈ నెల 3వ తేదీన కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన దశలోనే ప్రత్యర్థులందరూ పోటీ నుంచి తప్పుకోవడంతో 23 డివిజన్లలో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలేకుండా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మిగిలిన 27 డివిజన్లలో మాత్రం ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

hc 07032021 2

అయితే 7వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన విజయలక్ష్మి తాను పోటీలో నుంచి తప్పుకోలేదని, ఫోర్జరీ సంతకంతో పోటీ నుంచి విరమించుకున్నట్టుధరఖాస్తు సమర్పించారని ఫిర్యాదు చేశారు. దానిపై సానిక అధికారులు ఆమె ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించారు. స్పందించిన ఎన్నికల సంఘం కమిషనర్ 7వ డివిజన్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ సమగ్ర విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా పంపించాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషాను ఆదేశించారు. ఈ వివాదంపై అవసరమైన సమాచారంతో నివేదిక పంపడంతో పాటు సంతకం అభ్యర్థి విజయలక్ష్మిదేనా కాదా అనే అంశం తేల్చడానికి ఫోరెన్సిక్ విభాగానికి కమిషనర్ గిరీషా పంపించారు. ఇదిలావుండగా ఎన్నికల సంఘం ఎన్నికను నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ 1వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్.సుజాత 5వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. సమగ్ర విచారణ నివేదిక వచ్చిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అభ్యర్థించడంతో ఈ నెల 8వ తేదీ సోమవారానికి కేసు విచారణను వాయిదా వేసింది. ఎన్నికల చట్టం ప్రకారం దాఖలు చేసిననామినేషనను ఉపసంహరించుకునే విషయంలో అభ్యర్థి స్వయంగా కానీ, ఆ అభ్యర్ధిని ప్రతిపాదించినవారు కానీ, ఆ అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ కానీ ఎన్నికల అధికారిని కలిసి నిర్ణీత పద్దతిలో లేఖను సమర్పించాల్సి ఉంటుంది. 7వ డివిజన్ విషయంలో శేఖర్ అనే వ్యక్తి తనను తెలుగుదేశం అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ గా పేర్కొంటూ ఉపసంహరణ లేఖను సమర్పించినట్టు తెలుస్తోంది. దాంతో ఆమె ఉపసంహరించుకున్నట్టు అధికారులు నిర్ధారించుకున్నారు.

hc 07032021 3

ఆ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న అభ్యర్థి విజయలక్ష్మి తమకెవరూ ఏజెంట్ లేరని, అసలు ఉపసంహరించుకుంటున్నట్టు సమర్పించిన లేఖలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించడంతో సమస్య మొదలైంది. వాస్తవానికి ఎన్నికల చట్టం ప్రకారం పోటీ చేసే ప్రతి అభ్యర్థి నామినేషన్ల దశలోనే తనకు ఎవరూ ఏజెంట్లు లేరని ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంది. ఈ మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో 22 మంది అభ్యర్థులు లిఖితపూర్వకంగా తమకెవరూ ఏజెంట్లు లేరని తెలియచేశారని కమిషనర్ గిరీషా చెబుతున్నారు. 7వ డివిజన్ అభ్యర్థి ఆటువంటి లేఖను సమర్పించకపోవడం కూడా సమస్యకు కారణమవుతోంది. పైగా ఉపసంహరించుకున్నట్లు సమర్పించే లేఖల్లోని అభ్యరుల సంతకాలను తమ వద్ద సంతకాలతో పోల్చిచూసి నిర్ధారించడంతో ఎన్నికల అధికారుల బాధ్యత ముగుస్తుంది. ఆసంతకం అసలైనదా, ఫోర్జరీదా తేలాలంటే 7వడివిజన్ విషయంలో జరిగినట్టు అభ్యర్థులెవరైనా అనుమానం వ్యక్తం చేసినప్పుడు చేపట్టే ప్రాథమిక పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కోణంలో చూసినప్పుడు 7వ డివిజన్ ఎన్నికల అధికారి చట్టపరంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఆ లేఖ సమర్పించిన వ్యక్తిని విచారించినప్పుడు కానీ మొత్తం వివాదం వెనుక ఉన్న అంశాలన్నీ వెలుగుచూసే అవకాశం లేదనిపిస్తోంది. మరోవైపు ఈ వివాదంలో ఉన్నతాధికారులు చేపట్టిన విచారణ నివేదిక కీలకం కానున్నది. మొత్తంమీద అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిలుపుదలచర్య నిగ్గుతేలాలంటే ఈ నెల 8వ తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పుకోసం వేచి ఉండాల్సిందేనని స్పష్టమవుతోంది.

Advertisements

Latest Articles

Most Read