ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన విభజన హామీలు సహా, ఇతర అంశాల పై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అంటూ, 2017 నుంచి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీ పై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు రావటమే కాకుండా, ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేసారు. తరువాత మోడీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుని లోకేష్ కీ పితా అంటూ సంబోధించటం, దానికి కౌంటర్ ఇస్తూ, నేను లోకేష్ తండ్రిని అని చెప్పుకోవటానికి గర్వ పడతాను, మీ ఫ్యామిలీ గురించి ఏమిటి అంటూ చంద్రబాబు అనటం, ఇలా ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి. తరువాత ఎన్నికల ఫలితాలు రావటం, ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోవటం ఇలా జరిగిపోయాయి. అప్పటి నుంచి మోడీ, చంద్రబాబు మధ్య మాటలు లేవు. అయితే కరోనా సమయంలో, చంద్రబాబు టీం తయారు చేసిన ఒక రిపోర్ట్ విషయంలో, చంద్రబాబు మోడీకి ఫోన్ చేయటం, తరువాత మోడీ చంద్రబాబుకి ఫోన్ చేయటం జరిగాయి. ఇక రాజకీయంగా కూడా, బీజేపీ నేతలు, అధికారంలో ఉన్న వైసిపీ కంటే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ని,, ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఉంటారు. వైసీపీ కూడా, మోడీతో సానుకూలంగా ఉన్నాట్టు సంకేతాలు ఇస్తూ వచ్చింది.

modi 06032021 2

తెలుగుదేశం, బీజేపీ మధ్య ఇంత గ్యాప్ ఉన్న నేపధ్యంలో, ప్రధాని మోడి నేతృత్వంలోని అత్యున్నత కమిటీలో చంద్రబాబుకి చోటు ఇవ్వటం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, చంద్రబాబు సీనియారిటీని పరిగణలోకి తీసుకుని, ఆయన ఆలోచనలు తెలుసుకోవటానికి, ఆయన్ను ఎంపిక చేసినట్టు చెప్తున్నారు. వచ్చే ఏడాది, మన దేశానికీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, ఆ రోజుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఘనంగా నిర్వహించాలి అనే అంశం పై, సూచనలు తీసుకోనున్నారు. మొత్తం దేశంలో 259 మంది ప్రముఖులతో, ప్రధాని అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం అవుతుంది. రాష్ట్రపతి నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అన్ని రంగాల నుంచి ప్రముఖులు ఈ కమిటీలో ఉండనున్నారు. ఈ కమిటీ మొదటి సమావేశం, ఈ నెల 8 వ తేదీన జరగనుంది. అయితే ఇప్పుడు చంద్రబాబుని, ప్రధాని ఉండే కమిటీలో చోటు ఇవ్వటం పై, రాజకీయంగా చర్చ జరుగుతుంది.

ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రసాద్ రెడ్డిని సెలవు పై వెళ్ళాలని ప్రభుత్వం ఆదేశించినట్టు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల పై, ఈ చర్యలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా విశాఖపట్నంలో జరుగుతున్న జీవీఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా, రెడ్డి కులం సదస్సు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశానికి విజయసాయి రెడ్డి హాజరు అయ్యారు. అయితే ఇలాంటి రాజకీయ సమావేశం, అందులోనూ రెడ్డి కుల సమావేశంలో, ఆంధ్రా యూనివర్సిటీ లాంటి ఒక ప్రముఖ యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ పాల్గునటంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ఆ సమావేశంలోనే ఓట్లుకు సంబంధించి అభ్యర్దించటం, కులాల ప్రస్తావన రావటం, ఒక పార్టీని తిట్టటం, మరో పార్టీని పొగడటం, ఇలా ఒక పార్టీ సమావేశానికి, ఒక యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ హోదాలో ఉన్నవారు, హాజరు కాకూడదు అని కూడా నిబంధన ఉంది. అలాగే దీనికి సంబంధించి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీ సమావేశాలు కానీ, లేదంటే ఏదైనా కులాలకు సంబందించిన సమావేశాలు కానీ, మతాలకు సంబందించిన అంశాల్లో పాల్గునకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. దానికి తోడు, ఎన్నికల ప్రచారానికి సంబంధించి, లేదంటే ఓట్లు అభ్యర్ధించే సమావేశంలో వీళ్ళు పాల్గున్నారు అంటే మాత్రం, దీని పైన, విశాఖ వచ్చిన ఎస్ఈసికి కొంత మంది రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయటం జరిగింది.

vs 06032021 2

దీనికి సంబందించిన ఆ వీడియోలు, ఇతర ఆధారాలు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఇచ్చారు. అలాగే గతంలో కూడా కొన్ని రాజకీయ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గున్న ఆధారాలు సమర్పించటం జరిగింది. దీని పైన విశాఖలో ఫిర్యాదులు రావటంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందిస్తూ, దీని పైన తాము ఈ విషయం పై సీరియస్ గా స్పందిస్తున్నామని, దీని పైన కలెక్టర్ తో విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పటం జరిగింది. దీని పైన గవర్నర్ కి కూడా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. దీంతో ప్రభుత్వం ఆయన్ను సెలవు పై వెళ్ళాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి ఆయన సెలవు పై వెళ్లినట్టు సమాచారం. అయితే దీని పై స్పందించిన వీసి, కేవలం విజయసాయి రెడ్డి పిలిస్తే వెళ్లానని, అది కుల పరమైన సమావేశం కావటంతోనే, వివాదం రేగింది అని, ఆయన చెప్పారు. అయితే ఇలాంటి సమావేశాల్లో ఒక హోదా ఉన్న వ్యక్తి పాల్గునటం, మాట పరమైన, కుల పరమైన సమావేశాల్లో పాల్గున్న ఆయన పై, చర్యలు తీసుకోవాలని ఈసి కోరటం, గవర్నర్ కూడా స్పందించటంతోనే, ఆయన పై ప్రభుత్వం చర్యలు తీసుకని ఉంటుందని భావిస్తున్నారు.

నామినేషన్ల ఉపసంహరణప్రక్రియను కూడా వైసీపీ అపహస్యం చేసిందని, చిత్తూరులో టీడీపీ అభ్యర్థులెవరూ అందుబాటులో లేకున్నా, 4, 14వార్డులకు చెందిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామి నేషన్లను వైసీపీవారే అధికారులను భయపెట్టి బలవంతంగా ఉపసంహరింపచేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నామినేషన్లు వేయడం, మొదలు ప్రతి చర్యను వీడియో రికార్డింగ్ చేయాలని తాము ఎస్ఈసీనికోరినా పట్టించుకోలేదన్నారు. ఎవర్ నామినేషన్లు వేశారు, ఎవరు వాటిని ఉపసంహరించుకున్నారో కూడా తెలియకుండా అధికారలసాయం తో వైసీపీవారు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించడం ఏమి టని అశోక్ బాబు వాపోయారు. ఎన్నికలఏజెంట్, అభ్యర్థితో సంబం ధంలేకుండా వైసీపీప్రోద్భలంతో జరిగే నామినేషన్ల ఉపసంహరణ కు ఎన్నికల కమిషనే బాధ్యతవహించాల్సి ఉంటుందని టీడీపీనేత స్పష్టంచేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికలకమిషన్ ప్రకటించాల్సిఉందని, ఈలోపే అభ్యర్థులు వారికివారే నామినేషన్లు ఉపసంహరించుకున్నా రా లేదా ఎవరైనా వాటిని ఉపసంహరింపచేశారా అనేదిశగా ఎస్ఈ సీ విచారణ జరపాలన్నారు.

sec 04032021 2

ఈ విధంగా జరిగిన మున్సిపాలిటీలపై ఎన్నికలకమిషనర్ ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. చిత్తూరుజిల్లాలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీసంతకాలతో అధికారులే బాహటంగా ఉపసంహరింపచేస్తున్నారని అశోక్ బాబు మండిపడ్డా రు. అభ్యర్థులను ప్రకటించేముందు ఎన్నికలకమిషన్ ఒకసారి నా మినేషన్లుఉపసంహరించుకున్నవారితో సంప్రదించాలని, వారికి వారే విత్ డ్రా చేసుకున్నారాలేక ఎవరైనా చేశారా అనేది తెలుసుకో వాలని అశోక్ బాబు సూచించారు. బలవంతంగా టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణజరిగినప్రాంతాలపై ఎన్నికల కమిషనర్ ప్రత్యేకదృష్టిపెట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులప్రమేయం లే కుండా జరిగిన నామినేషన్ల ఉపసంహరణప్రక్రియలపై టీడీపీ తరు పున ఎన్నికలకమిషనర్ కు ఫిర్యాదుచేయబోతున్నామన్నారు.

తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస రావు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన మాటల్లో "ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస రావు, సంఘం అధికారులు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ లేఖ రాయడం హాస్యాస్పదం. లేని పవిత్రను చాటుకునేందుకు సంఘం నేతలు ఆరాటపడి ప్రజలముందు భంగపడ్డారు. ఆ లేఖపై క్షేత్రస్థాయిలో పోలీసులు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. లేఖ రాయాడాన్ని పోలీసులు అవమానంగా భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రాగానే లేఖ రాసేస్తారా? డీజీపీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. టీడీపీ హయాంలో సవాంగ్ మంచి అధికారిగానే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరగలేదు, జనంతో ఛీ కొట్టించుకోలేదు. నాలుగుసార్లు డీజీపీ హైకోర్టుకు వెళ్లారు. కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ చేతులు కట్టుకుని నిలబడినందుకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇలాంటి అవమానం దేశంలో ఏ డీజీపీకి అయినా జరిగిందా ? పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను డీజీపీ సవాంగ్ దిగజార్చారు. ఇలాంటి వ్యక్తి డీజీపీగా ఉండటం దురదృష్టకరమని పోలీసు అధికారుల సంఘానికి అనిపించలేదా? మీరు చెప్పే అరాచకాలు చేయలేక క్షేత్రస్థాయిలో పోలీసులు మనసు చంపుకుంటున్నారు. గౌతమ్ సవాంగ్ డీజీపీ అయ్యాక దళితులపై దాడులు పెరిగాయి. శిరోముండనాలు జరిగితే మీకు సిగ్గనిపించలేదా? గౌరవప్రదమైన పోలీస్ స్టేషన్ ను బార్బర్ షాపుగా మార్చితే మీకు సిగ్గు అనిపించలేదా? ఆడబిడ్డలపై అత్యాచారం జరిగితే దోషులను శిక్షించమని కోరిన బాధితులపై పోలీస్ స్టేషన్ లో ఏం మాట్లాడారో గుర్తు లేదా? న్యాయం జరగడంలేదని బాధితురాలి తండ్రి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రాజు గారు, రెడ్డి గారి మెప్పు కోసం శాంతిభద్రతలను కాలరాస్తుంటే ప్రశ్నించకూడదా? గతంలో సంవాంగ్ ఎలా ఉండే వారో ఇప్పుడెలా తయారయ్యారో స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. "

"చంద్రబాబు ఏనాడు పోలీసులను అవమానించలేదు. జగన్మోహన్ రెడ్డితో స్నేహం బొగ్గుతో స్నేహం లాంటిదని పోలీసు సంఘాలు గుర్తించాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చేసిన అవినీతికి ఎందరో అధికారులు బలయ్యారని గుర్తు చేసుకోండి. ఏది మంచి ఏది చెడు అనేది పోలీసు సంఘాలు ఆలోచించుకోవాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మీరు హెచ్చరిస్తారా? బెదిరిస్తారా? పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తున్న వారిని హెచ్చరించండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమంటే హెచ్చరిస్తారా? వైసీపీ కార్యకర్త డీజీపీ స్థాయి అధికారిని నెట్టేస్తే ...నేనే జారిపడ్డానని చెప్పుకునే దుస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మీ స్థాయి పెంచారు. ఆనాడు పోలీసు సంఘం అధ్యక్షులుగా ఉన్న గోరంట్ల మాధవ్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అనంతపురం జిల్లాలోని ఆశ్రమంలో జరిగిన అవినీతిపై జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు గోరంట్ల ఎంత రగడ చేశారో ఎవరూ మర్చిపోలేదు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ...పోలీస్ అధికారిని ఎలా బెదిరించారో చూశాం. బొంగులో పోలీసులని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీసి పారేశాడు. తాడికొండ ఎమ్మెల్యే పోలీసులను పూచికపుల్లలా తీసిపడేసింది. మరో నేత ఆమంచి కృష్ణ మోహన్ ...కొజ్జా పోలీసులని మాట్లాడారు. వైసీపీ నేతల వల్ల పోలీస్ శాఖ గౌరవం పెరిగిందా? ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా పోలీసు సంఘం నోరు మెదపదేంటి? కప్పం రాదు, ఉన్న పోస్టు పోతుందని భయపడుతున్నారా? ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. తాడేపల్లి బాస్ లు ఇచ్చే ముడుపుల కోసం కక్తుర్తి పడి ఇలాంటి లేఖలు రాస్తున్నారు. చంద్రబాబు నాయుడుని హెచ్చరిస్తూ లేఖలు రాసే మొనగాళ్లా మీరు? 21 నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. ఏపీని మరో బీహార్ లా మార్చేశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు చేసినవారిని పోలీసులు పట్టుకోలేకపోయారు. పోలీస్ సంఘం నేతలు అధికార పార్టీకి చేస్తున్న ఊడిగం వల్ల నిజమైన పోలీసుల పరువు పోతోంది. మీ చర్యలు, తీరును చూసి క్షేత్రస్థాయిలో పోలీసులు అసహ్యించుకుంటున్నారని పోలీసు సంఘం నేతలు గుర్తించాలి" అని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read