విశాఖ స్టీల్‍ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న కేంద్రం ప్రకటనతో, కార్మికుల నిరసన తెలిపారు. ప్లాంట్ ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్‍ను కార్మికులు దిగ్బంధించారు. వేణుగోపాల్ కారుకు అడ్డంగా కూర్చుని కార్మికుల నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై నినాదాలు చేసారు. చేతాకాని సియం అంటూ, జగన్ మోహన్ రెడ్డి పై నినాదాలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు, విజయసాయి రెడ్డి ఫోటోలు తగలబెడుతూ, నిరసన తెలుపుతున్నారు. ఇంత మంది ఎంపీలు ఉండి అధికార పార్టీ నేతలు ఏమి చేస్తున్నారు అంటూ, ఆందోళన వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు, కింజారపు అచ్చెన్నాయుడు జగన్ మోహన్ రెడ్డి పై ధ్వజమెత్తారు. "ముఖ్యమంత్రి జగన్ తన కేసుల మాఫీ కోసం, స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ర్టానికి చేస్తున్న అన్యాయం నేడు పార్లమొంట్ సాక్షిగా బట్టబయలైంది. వైసీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాకే స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రే స్వయంగా చెప్పారు? ఇన్నాళ్లు డ్రామాలాడిన వైసీపీ నేతలు ఇప్పుడు రాష్ర్ట ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రి మాట్లాడేటపుడు కనీసం ఒక్క ఎంపీ అయినా ఎందుకు అడ్డుకోలేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై పోరాడుతాం, కేంద్రాన్ని నిలదీస్తామంటూ గల్లీలో ప్రగల్భాలు పలికిన వైసీపీ ఎంపీలు నేడు పార్లమెంట్ లో ఎందుకు మౌనంగా ఉన్నారు?"

vizag 09032021 2

"మీ మౌనం రహస్య ఒప్పందానికి నిదర్శనం కాదా? 32 మంది బలిదానాలతో వేలాది మంది రైతుల త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రవేట్ పరం చేసి... కార్మికుల జీవితాలను రోడ్డున పడేసి, విశాఖ జిల్లా ప్రజల భవిష్యత్ పై దెబ్బగొడుతున్నారు. అమరుల త్యాగాలంటే వైసీపీకి లెక్కలేదా? గల్లీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పాదయాత్రలు చేసిన వైసీపీ ఎంపీలు ఇప్పుడెందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారో ప్రజలకు చెప్పాలి. రాష్ర్ట ప్రయోజనాలు కాపాడలేని మీకు మంత్రి పదవులు ఎందుకు? సిగ్గుంటే వెంటనే మీ పదవులకు రాజీనామా చేయాలి. మీ చేతకానితనంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి సిగ్గనిపించటం లేదా? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినపుడే జగన్ పిక్సయ్యారు, అధికారంలోకి వచ్చాక అర్ధరాత్రుళ్లు పోస్కో కంపెనీ ప్రతినిధులతో సమావేశాలు జరిపి వాటాలు పంచుకున్నారు. ఇప్పుడేమీ తెలియనట్లు జగన్ డ్రామాలాడుతున్నారు, 25 మంది ఎంపీలిస్తే ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్ ప్రత్యేకహోదా తేకపోగా తన చేతకానితనంతో ఉన్న పరిశ్రమలు, కంపెనీలు అమ్మేస్తున్నారు.

వైసీపీప్రభుత్వ వైఫల్యాలను కేంద్రప్రభుత్వమే తేటతెల్లం చేసిందని, వైసీపీకిచెందిన విశాఖపట్నంఎంపీ ఎంవీ.సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖఉక్కుఫ్యాక్టరీని నూటికినూరుశాతం ప్రైవేటీకరించబోతున్నామని కేంద్రమంత్ర్రి నిర్మలాసీతారామన్ తేల్చి చెప్పినా, ఉభయసభల్లోని 28మంది వైసీపీఎంపీలు నోరెత్తినపాపాన పోలేదని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. సోమవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విశాఖఉక్కు ప్రైవేటీకర ణ జరక్కుండా వైసీపీఎంపీలు 28 మంది, ఏంచేస్తున్నారని జగన్ రాసిన లేఖ ఏమైందని రఫీ టీడీపీతరుపున ప్రశ్నించారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణతోపాటు, రామాయపట్నం పోర్టు నిర్మాణా నికి నిధులివ్వమని కేంద్రంతేల్చిచెప్పినా, వైసీపీఎంపీల్లో చలనం లే కపోవడానికి కారణం, ముమ్మాటికీ జగన్ పై ఉన్నకేసులేనని రఫీ తేల్చిచెప్పారు. తనపై ఉన్నకేసులభయంతోనే ముఖ్యమంత్రి, తన పార్టీఎంపీల నోళ్లుకట్టేశాడన్నారు. ఎంపీలంతా మూకుమ్మడిగా సం తకాలు పెట్టి, కేంద్రాన్నిడిమాండ్ చేసిన సందర్భం నిమ్మగడ్డప్రసాద్ ను సెర్బియా పోలీసులనుంచి విడిపించేందుకు జరిగిందితప్ప, రాష్ట్ర ప్రయోజనాలకోసం వారుఏనాడూ నోరుతెరవలేదన్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ కోసం నెలనుంచీ దీక్షలుజరుగుతూ, కార్మికులంతా రోడ్డునపడి ధర్నాలుచేస్తున్నా ముఖ్యమంత్రి తనకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడన్నారు. పోస్కో కంపెనీతో లోపాయికారీఒప్పం దంచేసుకున్న ముఖ్యమంత్రి, ఎప్పుడు స్టీల్ ప్లాంట్ పరిధిలోని 7 వేలఎకరాలుకొట్టేద్దామా అని ఎదురుచూస్తుంటే, విజయసాయి రెడ్డే మో ఉక్కుఫ్యాక్టరీని రక్షించేపేరుతో దొంగనాటకాలు ఆడుతున్నా డని టీడీపీనేత స్పష్టంచేశారు. 22నెలల వైసీపీప్రభుత్వపాలనలో కేంద్రంనుంచి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏంసాధించాడన్నారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సహా, అన్నింటినీ తాకట్టుపెట్టిన జగన్, ఇప్పుడు పోర్టులు, రహదారులను కూడా కేంద్రానికి ధారాధత్తం చేశాడన్నారు కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, మోసాలపై నోరుతెరిచి మా ట్లాడని ముఖ్యమంత్రి, ఎంతసేపూ రాజధాని మహిళలు, రైతులపై కక్షసాధింపుచర్యలకే పరిమితమయ్యాడన్నారు. అమరావతి ప్రాం తానికి కనెక్ట్ అయ్యేలా చంద్రబాబునాయుడు మూడురైల్వేమార్గాల ను కేంద్రంనుంచి తీసుకొస్తే, జగన్ వాటిని గురించి ఏనాడూ పట్టిం చుకోలేదన్నారు.

రాజీనామాలుచేస్తే, ఏమైనాసాధించవచ్చు, ఎంత టి త్యాగాలైనా చేయవచ్చని ప్రతిపక్షంలోఉన్నప్పడు గప్పాలు పలి కిన జగన్, ఇప్పుడు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తన పార్టీఎంపీలతో ఎందుకు రాజీనామాచేయించడని రఫీ నిలదీశారు. తెలుగుప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, ఎందరి ప్రాణత్యాగాల ఫలిత మో అయిన ఉక్కుఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేట్ వారికి ధారాధత్తం చేస్తు న్నామని తెగేసిచెప్పినా వైసీపీఎంపీల్లో రోషం, పౌరుషంలేకుండా పోయాయన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికిచేస్తున్న అన్యాయంపై జగన్ తక్షణమే తనపార్టీఎంపీలతో రాజీనామాచేయించాలని, ఆయ న అందుకు సిద్ధమైతే, టీడీపీఎంపీలుకూడా రాజీనామాలుచేసి, జగన్ తో కలిసి ప్రజల్లోకివెళ్లి పోరాటంచేయడానికి సిద్ధంగా ఉన్నారని రఫీ తేల్చి చెప్పారు. తనపై ఉన్న కేసులను తొలగించు కోవడానికి ముఖ్యమంత్రి రాష్ట్రప్రయోజనాలను, హక్కులను, ఏపీకి రావాల్సిన నిధులను కేంద్రానికి వదిలేస్తానంటే ప్రజలుచూస్తూ ఊ రుకోరని ఆయన హెచ్చరిచాంరు. పోలీసులతో ప్రతిపక్షాలు, ప్రశ్నించేవారిపై దాడులుచేయించడం, అప్పులుతీసుకొచ్చి సంక్షేమ పథకాలపేరుతో అయినకాడికి దోచుకోవడం తప్ప, జగన్ రాష్ట్రానికి చేసిందేమీలేదన్నారు. జగన్ పాలనతో విసిగివేసారిపోయిన ప్రజలు , మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుప్రచారానికి భారీగా తరలివచ్చి, తమమద్ధతు తెలియచేస్తున్నారన్నారు. కేంద్రం రాష్ట్రానికి అన్నింటి లో మొండిచెయ్యిచూపి, ఏంచేసుకుంటారో చేసుకోండని రీతిలో మాట్లాడుతున్నా జగన్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.

టీడీ పీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేంద్రంతోపోరాడి రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టులను కూడా జగన్ నిర్వీర్యంచేశాడన్నారు. రాష్ట్రం మొత్తం ఆటవికరాజ్యంగా మార్చేసి, మహిళలు, మైనారిటీలు, దళితులు, బీసీలపై దాడులుచేయించడం తప్ప, జగన్ చేసిందేమిటో చెప్పాల న్నారు. ఆయన అమలుచేస్తున్న దిక్కుమాలినసంక్షేమపథకాలతో జనంలో ఆగ్ర హావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయన్నారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీలో రాష్ట్రానికి ఎటువంటి ఈక్వీటీ షేర్లు లేవని చెబుతున్న కేంద్రం, ఆ కర్మాగారం రాష్ట్రభూభాగంలో ఉన్నందున రాష్ట్రానికి అన్యాయంచేయకుండా, కార్మికులప్రయోజనాలను కాపా డాలని రఫీ డిమాండ్ చేశారు. ఏపీప్రజల త్యాగాల ఫలితంగానే వి శాఖఉక్కుఫ్యాక్టరీ రాష్ట్రానికి వచ్చిందన్నారు. ఒక్కఛాన్స్ అని బతి మాలి, ప్రజల ఓట్లతో జగన్ ముఖ్యమంత్రి అయింది విశాఖఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరంచేయడానికేనా అనిరఫీ ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి, కడపస్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రంనుంచి నిధులుతీసుకురాలేని అసమర్థముఖ్యమంత్రి ఉంటే ఎంత.. పోతేఎంతన్నారు. ఫోర్జరీసంతకాలతో నామినేషన్లు ఉపసం హరింపచేయడం, బెదిరించడం, డబ్బులకట్టలతో ప్రత్యర్థిపార్టీల వారిని లోబరుచుకొని ఏకగ్రీవాలు చేసుకోవడంతప్ప, వైసీపీనేతలు, మంత్రులు, ఏంచేస్తు న్నారని రఫీ ప్రశ్నించారు. రాష్ట్రప్రయోజనాల గురించి పట్టించుకోని వైసీపీమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను చూసిప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు. అధికారపార్టీ ఎంపీలకు ఏమాత్రం సిగ్గు, శరమున్నా, వారు విశాఖఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి సమాధానం చెప్పగానే, అందుకు సంబం ధించినప్రతులను చింపిపారేయాల్సిందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, బడ్జెట్ ప్రతులనుచించి తననిరసనవ్యక్తంచేసిన ఉదంతం, వైసీ పీవారికి గుర్తులేదా అనిరఫీ నిలదీశారు. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీక రణకు జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వమే నైతికబాధ్యత వహించా ల్సి ఉంటుందని రఫీ స్పష్టంచేశారు.

తమ ప్రాణ సమానమైన భూములు, విభజన జరిగి రోడ్డున పడ్డ రాష్ట్రానికి ఇచ్చిన అమరావతి రైతులు, గత రెండేళ్లుగా రోడ్డున పడి రోదిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి అమరావతికి మద్దతు తెలపటంతో, భూములు ఇచ్చిన రైతులు, ప్రభుత్వం మారగానే, మాటలు మార్చే వ్యక్తుల చేతిలో మోసపోయారు. అమరావతిని మూడు ముక్కలు చేసిన పాలకుల తీరుకు నిరసనగా, గత 450 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావటంతో, మహిళా రైతులు, కనకదుర్గమ్మ దర్శనం కోసం, అమరావతి నుంచి కాలి నడకన, విజయవాడ బయలుదేరారు. అయితే ఇందులో ఏమి తప్పు కనిపించిందో, ఎవరు అడ్డుకోమని చెప్పారో కానీ, శాంతియుతంగా మొక్కులు చెల్లించుకోవటానికి వెళ్తున్న మహిళలను, ప్రకాశం బ్యారేజి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. కాలి నడకన గుడికి వెళ్ళటం కూడా తప్పేనా ? మేము చేసిన పాపం ఏమిటి అంటూ, మహిళా రైతులు ప్రకాశం బ్యారేజీ మీదే కూర్చుని నిరసన తెలిపారు. అంతే ఒక్కసారిగా పోలీసులు వారి మీద పడి, వారిని ఈడ్చి పడేసారు. ఈడ్చుకుని వ్యానుల్లో ఎక్కించుకుని, తాడేపల్లి, మంగళగిరి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా, ఇలా చేయటం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

amaravati 08032021 1

ఈ విషయం తెలుసుకున్న రాజధాని ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితికి దారి తీసింది. ఒక్కసారిగా ప్రజలు అందరూ బయటకు వచ్చి నిరసన తెలిపారు. సేవ్ అమరావతి నినాదాలతో హోరెత్తించారు. సచివాలయం వద్దకు కవాతుగా వెళ్లి, తమకు జరిగిన అన్యాయాన్ని తెలియ చేస్తామని బయలుదేరారు. అయితే దారిలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా మళ్ళీ పోలీసులు తమ జులం ప్రదర్శించారు. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో రైతులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మహిళా దినోత్సవం రోజున, తమకు ఇది జగన్ ఇచ్చిన కానుక అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళా హోం మంత్రి, ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న చోటే, ఇలా మాకు సన్మానాలు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ, తమకు మద్దతుగా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఏసి రూముల్లో కూర్చుని, గొప్పగా గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి, మాకు జరుగుతున్న అన్యాయం పై ఎందుకు స్పందించరని ప్రశ్నిస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనల సందర్భంగా, అసలు ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, లోపల ఏమి మాట్లాడుతున్నారు అనేది, సస్పెన్స్ గానే ఉండి పోతున్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి, ఇది మాట్లాడాం అని చెప్పరు. ఆయన మీడియాలో మాత్రం, హోదా పై మెడలు వంచేసరని, పోలవరం పై గడగడలాడించారు అంటూ రాస్తారు. అయితే అసలు ఆయన లోపల ఏమి మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి ఏమి మాట్లాడుతున్నారు అనేది, ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా బయట పడింది. జగన్ మోహన్ రెడ్డి, ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా, ఎవరిని కలిసినా, ఎవరికి మెమొరాండంలు ఇచ్చినా, అసలు ఆ మెమొరాండంలో ఏమి ఉంది, ఆ మెమొరాండంలో ఏమి ఇచ్చారు అనేది తెలియదు. ఆ మెమొరాండంలు కూడా ఎప్పుడూ మీడియాకు ఇవ్వరు. అయితే జగన్ మోహన్ రెడ్డి పలానా వాళ్ళని కలిసారు, రాష్ట్రానికి రావాల్సిన అంశాల పై వాళ్ళతో చర్చించారు అనేది మాత్రమే, మీడియాకు చెప్తూ ఉంటారు. ఈ విషయంలో అనేక సార్లు మీడియా కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అసలు బయటకు చెప్పినట్టు, అక్కడ అడిగారా లేదా అనేది కూడా అందరికీ సందేహాలు వస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఇది బట్టబయలు అయ్యింది.

as 08032021 2

జనవరి 19వ తేదీన జగన్ మోహన్ రెడ్డి వచ్చి అమిత్ షా ని కలిసారు. అయితే ఫిబ్రవరి 19వతేదీన జగన్ వచ్చి అమిత్ షాని కలిసి, పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరారు, అటువంటి ప్రతిపాదన ఏమైనా ఉందా, కేంద్రం ఈ విషయంలో ఏమి చేయబోతుంది అంటూ, వైసీపీ ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు, కేంద్ర జల శక్తి మంత్రి సమాధానం ఇస్తూ, అటువంటి ప్రతిపాదన ఏది కేంద్ర హోం శాఖ వద్ద లేదు, అటువంటి మెమొరాండం కూడా ఏమి ఇవ్వలేదు అంటూ, చాలా స్పష్టంగా కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి, సమాధానంలో చెప్పారు. అయితే జనవరి 19వ తేదీన జగన్ మోహన్ రెడ్డి, అమిత్ షా ని కలిస్తే, పొరపాటున కానీ, లేదా ఎందుకో కానీ, ఫిబ్రవరి 19వ తేదీన అమిత్ షా ని కలిసారా అని ప్రశ్నించటం అందరినీ ఆశ్చర్యం కలిగింది. అయితే జనవరి 19వ తేదీన కూడా జగన్ మోహన్ రెడ్డి, మెమొరాండం ఏమి బయటకు ఇవ్వలేదు. కేవలం ప్రెస్ నోట్ ఒకటి పంపించారు. అయితే ఇప్పుడు మంత్రి ఇచ్చిన సమాధానంతో, పోలవరం అంచనాల పై, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు, జగన్ ఎటువంటి మెమొరాండం ఇవ్వలేదని తేలిపోయింది. మరి ఆ రోజు జగన్ ఎందుకు కలిసారో ఏమిటో ?

Advertisements

Latest Articles

Most Read