టిడిపి అధినేత చంద్రబాబు, ఎన్నికలు జరుగుతున్న తీరు పై స్పందించారు. "మున్సిపల్ ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగితే గెలవలేమన్న భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను, ఓటర్లను భయపెడుతున్నారు. విశాఖపట్నంలోని ఏయూ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో పరిశీలనకు వెళ్లిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. మచిలీపట్నం 13వ డివిజన్ లో టీడీపీ సానుభూతిపరుడు దినకర్ మీద వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. విజయవాడలో టీడీపీ అభ్యర్ధులను బెదిరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను చూస్తుంటే.. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక వైసీపీ నేతల ప్రోద్భలంతోనే దాడులు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ కార్యకర్త పసుపు చొక్కా వేసుకున్నందుకే అతణ్ణి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించని పోలీసులు....వైసీపీ కార్యర్తలు పేట్రేగిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చోవడం హేయం. వైసీపీ నేతలు కత్తులు, కర్రలతో పేట్రేగిపోతుంటే.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండడం సరికాదు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి."

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని, రాష్ట్ర ప్రభుత్వం గంట రెండేళ్లుగా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన పై ఎలాంటి అభియోగాన్ని నిరూపించలేక పోయారు. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర పై పసలేని ఆరోపణలు చేస్తే, ఆయన సస్పెన్షన్ ను ఏడాదికి పైగా పొడిగించటాన్ని, సవాల్ చేస్తూ, ఏబీవెంకటేశ్వరరావు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విషయం పై, ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు పై ఈ రోజు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వర రావు పై ఉన్న ఆరోపణలు పై, దర్యాప్తు మొత్తం ఏప్రిల్ 6 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రోజు వారీ దర్యాప్తు ఎందుకు చేయటం లేదని, రోజు వారీ దర్యాప్తు చేసి, కేసుని వెంటనే క్లోజ్ చేయాలని పేర్కొంది. ఏప్రిల్ 30వ తేదీన, ఈ నివేదిక మొత్తం కోర్టుకు సమర్పించాలని, ఆదేశాలు ఇచ్చింది. తదుపతి విచారణను మే 3 వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తరుపున న్యాయవాది కలుగు చేసుకుని, తమకు ఆరు నెలల సమయం కావాలని, ఈ కేసు విచారణకు ఆరు నెలలు పడుతుందని కోర్టుకు తెలిపారు. అయితే దీని పై కోర్టు ఘాటుగా స్పందించింది.

abv 09032021 2

ఏడాదికి పైగా సస్పెన్షన్ వేటు వేసి, కాలం గడుపుతున్న సమయంలో, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆరు నెలలు ఎందుకు ? రోజు వారీ విచారణ చేపట్టి, ఈ కేసుని పూర్తి చేయండి అంటూ, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు సూచించింది. అయితే అవినీతి ఆరోపణలు లేననుంది, రివ్యూ కమిటీ ఏడాదికి పైగా పొడిగించటానికి వీలు లేదని, ఏబి వెంకటేశ్వరరావు తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే ఈయన మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు, ఈయన పై ఆరోపణలు మోపితే, వేరే డిపార్టుమెంటు లో పోస్టింగ్ ఇవ్వచ్చు కదా, ఇప్పటి వరకు ఎందుకు దూరం పెట్టారు అని కోర్టు ప్రశ్నించింది. ఒక సీనియర్ అధికారిని ఇంత కాలం ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. కేసు దర్యాప్తులో ఉందని, అందుకే పోస్టింగ్ ఇవ్వటం కుదరలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పగా, ఈ కేసుని వేగంగా దర్యాప్తు చేసి, తమకు నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. నిరుపించటానికి ఏమి ఆధారాలు లేకపోవటం, ఇలాగే సాగదీయాలని ప్రభుత్వం వేసిన ఎత్తులకు, సుప్రీం కోర్ట్ బ్రేక్ వేసింది.

మహిళా దినోత్సవంనాడే వైసీపీప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మహిళలను నానారకాలుగా, మగ పోలీసులసాయంతో ఇష్టారీతిన బూటుకాళ్లతో తన్నించాడని, పోలీసులు చేతులతో ఆడవారిని తాకరానిప్రదేశాల్లోతాకుతూ, జుట్లుపట్టుకొని దారుణంగా ఈడ్చిపారే శారని, మహిళారైతులపట్ల వారిభర్తలముందే నీచాతీనీచంగా పోలీసులు వ్యవహరించిన తీరుచూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వాపోయారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే "జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణలేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలిసిపోయింది. రాజధాని మహిళలు శాంతియుతంగా నిరసనతెలుపుకోవచ్చని గతంలో డీజీపీ చెప్పారు. మరినిన్న పోలీసులు రాజధానిమహిళలపట్ల ఎందుకంత దారుణం గా ప్రవర్తించారు? మహిళలు చేసిన ఘోరం-నేరమేమిటి? వారేమై నా ఉగ్రవాదులా..నేరస్తులా....లేకపోతే ప్రజావ్యతిరేక ఉద్యమాలు చేయడానికి వెళ్లారా? అమ్మవారి గుడికి వెళ్లాలనుకోవడమే వారు చేసినతప్పా? అమ్మవారి దర్శనానికి వెళ్లాలనుకున్నవారిపై పడి పోలీసులు అమాంతంగా మదమెక్కిన దున్నపోతుల్లా ప్రవర్తించారు 448రోజులుగా అమరావతికోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళ లు, ఎస్సీలు, మైనారిటీలపై తప్పుడుకేసులు పెట్టి, దొంగల్లాగా వారి కి సంకెళ్లు వేశారు. చరిత్రలో ఎక్కడాలేని విధంగా దళితులపై ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులుపెట్టి జైలుకుపంపింది. మహిళాదినోత్సవంపేరుతో దిశాయాప్ ల పేరుతో హాడావుడి చేస్తున్న జగన్ ప్రభుత్వం మహిళాదినోత్సవంనాడే మహిళలను పోలీసులబూట్లకిందేసి అణగదొక్కింది. ప్రభుత్వం, పాలకులు చేసిన పనికి, దౌర్జ న్యాలకు మహిళలకు రాష్ట్రంలో రక్షణ అనేది ఉందా? రోజుకొకప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతు న్నాయి. మహిళలపై దారుణాలు జరిగేరాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ నాలుగోస్థానంలో ఉంది. దాన్నిబట్టే చెప్పొచ్చు రాష్ట్రంలో మహిళల కు రక్షణఅనేది లేదని.

క్రైమ్ నెం-63, 64 అండర్ సెక్షన్ 143, 188, 332, 353, 506, 509, రెడ్ విత్ 149 ఐపీసీసెక్షన్ల కింద మహిళలపై కేసులుపెడతా రా? ఇదేమీదారుణం? రాజధానిమహిళలు చేసిన తప్పేమిటి? ఈ ప్రభుత్వానికి, పోలీసులకు బుద్ధి, జ్ఞానంఅనేది ఉందా? శాంతియుత మార్గంలో అమ్మవారి దర్శనానికివెళ్లే మహిళలను, అమ్మవారి కోసం వారుతీసుకెళుతున్న ప్రసాదాలను బూటుకాళ్లతో తన్నింది కాక, వారిపై ఇటువంటి సెక్షన్లు పెడతారా? అవమానకరంగా మహి ళలపై ప్రవర్తించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? రాష్ట్రంలో మహిళపై దాడులు జరుగుతూ,వారిహక్కులు కాలరాయబడుతుం టే, మహిళా కమిషన్ భజన చేస్తోందా? ప్రభుత్వానికి, జగన్ కు ఊడిగంచేస్తోందా. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కూడామహిళే కదా? ఆడవాళ్లను బూటుకాళ్లతోతన్నిన పోలీసులుకు ఆడవాళ్లు లేరా...వారికి తల్లులు, చెల్లెళ్లు, భార్యలు లేరా? ఉంటేవారిపై కూడా అలానే ప్రవర్తిస్తారా? మహిళలను, మహిళాపోలీసులతోనే అడ్డుకో వాలనే నినంబంధననుకాదని, దుర్మార్గంగాప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. డీఎస్పీ, సీఐ, ఎసై, కానిస్టేబుల్ సహ, ప్రతిఒక్కరినీ దారుణంగా శిక్షించాలి. మహిళలను తాకరానిచోట్ల తాకి, వారిని బూటుకాళ్లతో తన్ని, వారి భోజనాన్ని, అమ్మవారికిసమర్పించే ప్రసాదాలను నేలపాలు చేసిన పోలీసులను జగన్ ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేస్తున్నా. ఈప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మహిళలపై దౌర్జన్యా లు చేయడానికే ఉన్నారా? వారిప్రతాపమంతా ఆడవారిపైనేనా? ఇ టువంటి పనులుచేయడానికి వారికి సిగ్గుందా? ఏంనేరం చేశారని అమరావతి మహిళలపై పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారు? వారు ఏమైనా నక్సలైట్లా, లేక సంఘవిద్రోహశక్తులా..లేక ఉగ్రవాదులా? రాజధాని మహిళలపై అమానుషంగా, కర్కశంగా ప్రవర్తించిన ప్రతి పోలీస్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే.

ప్రభుత్వం, పోలీసులు ఇటువంటి దాష్టీకాలకు పాల్పడటం, ముమ్మాటికీ సిగ్గుచేటు. ప్రభావతి, మల్లీశ్వరి, గోవిందమ్మ, ప్రియాంక, శిరీష, రాధిక, రాయపాటి శైలజ ఎవరు వీరంతా? తీవ్రవాదులని వారిపై ఎఫ్ఐఆర్ లు నమోదుచేశారా? మహిళలపై వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమం త్రికి ఉన్నకపట ప్రేమ ఈ ఘటనతోనే అర్థమవుతోంది. మహిళల జోలికివచ్చినవారు ఏవిధంగా మట్టికొట్టుకుపోయారో, పురాణకాలం నుంచీచూస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితే అమరావతిలో జరగ నుంది. ఏపీలో మహిళలపై దుశ్శాసనపర్వానికి పాల్పడిన ప్రభు త్వం మట్టికొట్టుకుపోవడం ఖాయం. తమను ఎవరైనా వేధిస్తే, తమ కు ఏదైనా ఇబ్బందికలిగితే ఆడవారు పోలీసులకు చెప్పుకుంటారని , అటువంటిపోలీసులే ఆడవాళ్లను బూటుకాళ్లతో తన్ని, చీరలు పట్టుకొని లాగి, తాకరానిప్రదేశాల్లో తాకుతూ, ఇష్టానుసారం ప్రవర్తి స్తారా? డీఎస్పీ అయితే, ఒకమహిళరొమ్ములపై చేయివేసి నీచాతినీచంగా అచ్చోసిన ఆంబోతులా ప్రవర్తించాడు. పోలీసులు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ, ఉచ్ఛంనీచం లేకుండా ప్రవర్తిస్తు న్నారు. అదేపోలీస్ అధికారి భార్యరొమ్ములపై ఎవరైనా చేయేస్తే అతను ఊరుకుంటాడా? ఆడీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల ఇళ్లలోని ఆడవాళ్లపై చేతులేసి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, వారు ఊరుకుంటారా? ప్రభుత్వ, పోలీసుల చర్యలను తెలుగుజాతి యావ త్తూ ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నా. బ్రిటీష్ కాలంలో ఆనాటిపోలీసులు భారతీయమహిళలపై ప్రవర్తించిన దానికన్నా దారుణంగా, ఏపీ పోలీసులు అమరావతి రైతులపై అమానుషంగా ప్రవర్తించారు. జగన్ ప్రభుత్వం సాగించిన దుశ్శాసన పర్వాన్ని ఖండించాల్సిన బాధ్యత విజయవాడ-గుంటూరువాసులపై లేదా? ఆయాప్రాంతాలవారు రాజధాని ఉద్యమానికి, అమరావతి రైతులు, మహిళలకు సంఘీభావం ప్రకటించాల్సిన బాద్యతలేదా? పోలీసులు తన్నింది అమరావతి మహిళల్నిలే, మాఇంట్లోవాళ్లను కాదుకదా అనుకొని ఊరుకునే ప్రతిఒక్కరి ఇళ్లల్లోని ఆడవాళ్లకు కూడా భవిష్య త్ లోఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నాను.

రేపు ఇదే పోలీసులు మీ ఇళ్లలోని ఆడవాళ్లను కూడా బూటుకాళ్లతో తన్ని, వారి బట్టలుకూడా చించే పరిస్థితి వస్తుందని ప్రతిఒక్కరూ ఆలోచిం చండి. అమరావతిని నాశనంచేయడంతో రాష్ట్రమంతా సర్వనాశన మైంది. మంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు అమరావతిని ఎడారని, శ్మ శానమని అవహేళనగా మాట్లాడారు. అవన్నీ మర్చిపోయే మాటలే నా? ప్రభుత్వంలోని వారికి, పోలీసులకు తగినవిధంగా బుద్ధిచెప్పా ల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉంది. రాజధాని మహిళలను దారుణం గా అవమానించిన జగన్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో కోలు కోలేని విధంగా బుద్ధిచెప్పాలని రాష్ట్రవాసులను కోరుతున్నా. రాజధాని మహిళలపై దుర్మార్గంగా ప్రవర్తించిన పోలీసులపై ప్రభుత్వంచర్యలు తీసుకోవాలి. అమరావతి మహిళలపై హద్దులు మీరిప్రవర్తించిన డీఎస్పీసహా, కిందిస్థాయి కానిస్టేబుల్ వరకు చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాను. మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుకి సంబంధించిన అనేకసాక్ష్యాలు తమవద్ద ఉన్నాయి. వాటిఆధారంగా ఈప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంటుందని డిమాండ్ చేస్తున్నాను. (ఈ సందర్భంలో విలేకరుల సమావేశంలో మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుకి సంబంధించిన వీడియోలను, ఫొటోలను బొండా ఉమామహేశ్వ రరావు ప్రదర్శించారు) ఆడవారిపై పోలీసులతో అరాచకం చేయించి న జగన్, దిశాయాప్ పేరుతో మహిళా దినోత్సవాలు జరపడం హేయాతిహేయం, నీచాతినీచం. ఆడవారు ఏచీరలు కట్టుకోవాలో, ఎలాంటివస్త్రధారణ చేయాలో చెప్పే హక్కుఈపోలీసులకు ఎవరిచ్చా రు? ఈపోలీసులంతా ఖాకీచొక్కాలు తీసేసి బులుగుచొక్కాలు వేసుకున్నారు. వారిభార్యలు ఎటువంటి బట్టలువేసుకోవాలో, పక్కింటివారు చెబితే వారికెలా ఉంటుందో, మాకు అలానే ఉంటుం ది. మహిళలపై దుశ్శాసనపర్వానికి పాల్పడిన జగన్, ఆయన ప్రభుత్వం, పోలీసులకు తగినవిధంగా బుద్ధిచెప్పాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. వారంతా ముక్తకంఠంతో ఈచర్యను ఖండించకుం టే, భవిష్యత్ లో వారి ఇంట్లోని ఆడవాళ్లకు కూడా ఇదే పరిస్థితి వ స్తుందని హెచ్చరిస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఏమైనా విమర్శలు చేస్తే, వాళ్ళను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నాడని, లేదా వారు ఆ ఒక్క కులం అంటూ టార్గెట్ చేసి, ఎదురు దాడి చేయటంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని అయిపొయింది. ఆ విమర్శ ఏంటి, ఎందుకు చేసారు, దాంట్లో ఉన్న లోతు ఏమిటి, ఇలా దానిపైన మాత్రం ఎవరూ మాట్లాడరు. కేవలం ఎదురు దాడి చేయటం తప్పించుకోవటం. చివరకు తీర్పులు చెప్పే జడ్జీలను కూడా అలాగే టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇలాగే మరొకరు టార్గెట్ అయ్యారు. ఈ సారి నేషనల్ మీడియా. చివరకు నేషనల్ మీడియాలో తమకు వ్యతిరేక కధనాలు వస్తే, దానికి కారణం తెలుగుదేశం అని చెప్పేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రిపబ్లిక్ టీవీ ఛానల్ లో, జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులు, విదేశాల్లో చేసిన అవినీతి పై, విదేశీయులు కొంత మంది కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు, వారం రోజులు క్రిందట రిపబ్లిక్ టీవీలో సంచలన కధనం ప్రసారం అయ్యింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. అసలు ఆ ఫిర్యాదు చేసింది ఎవరు, ఏ కంపెనీ, ఏ వ్యక్తి, అసలు వీళ్ళు చేసిన స్కాం ఏంటి, ఎలా దొరికారు అనే విషయం పై, ఆరాలు తీయటం మొదలు పెట్టారు. అయితే వారం తిరగకుండానే, ఇప్పుడు మరో కధనం రిపబ్లిక్ టీవీలో ప్రసారం అయ్యింది.

arnab 09032021 2

జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన కొంత మంది, ప్రజా ప్రతినిధులు ఆయనతో విభేదిస్తున్నారని, పార్టీలో సంక్షోభం వచ్చే అవకాసం ఉంది అంటూ, సంచలన కధనం ఒకటి ప్రసారం అయ్యింది. దీంతో మళ్ళీ అలజడి రేగింది. ఇక లాభం లేదని, తమ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నారో ఏమో కానీ, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కోటరీలో నెంబర్ వన్ అయిన సజ్జల రామకృష్ణా రెడ్డి రంగంలోకి దిగారు. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ పై, విమర్శలు గుప్పించారు. దేశానికి పట్టిన పీడ అర్నాబ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు సజ్జల. చంద్రబాబు ఆదేశాల ప్రకారం, చంద్రబాబు కోసం ఆ కధనం రాసారని, తమకు అనుమానం ఉంది అంటూ సజ్జల వ్యఖ్యలు చేసారు. అర్నాబ్ ఫేక్ న్యూస్ వేశాడని, ఆ ఫేక్ న్యూస్ పై న్యాయ పరంగా ముందుకు వెళ్తామని, రిపబ్లిక్ టీవీ కధనాల్లో ఒక్కటి కూడా నిజం లేదని, చంద్రబాబు చెప్పినట్టు వార్తలు రాస్తున్నారు అంటూ, ఏకంగా నేషనల్ మీడియాను కూడా చంద్రబాబుకు అంటగట్టారు. ఇంకా నయం, కులంతో అంటగట్టలేదని, అందరూ అనుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read