నారా లోకేష్ క్లాస్ లుక్‌తో అల‌రిస్తున్నారు. మాస్ అప్పీల్ తో అద‌ర‌గొడుతున్నారు. న‌డ‌క‌లో వేగం, స్పందించే తీరు కూడా ఆక‌ట్టుకుంటోంది. నెల దాటినా విసుగు అన్న‌దే లేకుండా ప్ర‌తీ రోజూ ఫ్రెష్‌గా పాద‌యాత్ర ఆరంభిస్తున్న‌ట్టు ఉన్న లోకేష్ ఎన‌ర్జీ లెవ‌ల్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పాద‌యాత్ర‌లో లోకేష్‌తో న‌డ‌వాలంటే ప‌రుగులు పెట్టాల్సి వ‌స్తోంద‌ని యువ‌నేత‌లు అంటున్నారు. ఇటీవ‌ల యువ‌గ‌ళం యూత్ ఇంట‌రాక్ష‌న్‌లో త‌న లుక్‌, స్టైల్ అన్నీ మార‌డానికి భార్య బ్రాహ్మ‌ణి కార‌ణం అని లోకేష్ చెప్పుకొచ్చారు. డైట్ ప్లాన్‌, ఫిట్నెస్ వ్య‌వ‌హారాల‌న్నీ భార్యే చూస్తోంద‌ని చెప్పారు. తాను ఎక్క‌డ ఏం తిన్నా తెలిసిపోతుంద‌ని న‌వ్వుతూ వివ‌రించారు. లోకేష్ చెప్పినా, ఆ ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూసి ఆయ‌న ఏం తింటారు అనే ఆస‌క్తి చాలా మందిలో మొద‌లైంది. దీనిపై ఆయ‌నే క్లారిటీ ఇచ్చారు. ఉద‌యం నుంచి రాత్రి నిద్ర‌పోయేవ‌ర‌కూ యువ‌గ‌ళం పాద‌యాత్రలో త‌న దిన‌చ‌ర్య‌ని తెలియ‌జేశారు.

ఉద‌యం
క్యాంప్ సైటులో ఉద‌యం 6 గంట‌ల‌క‌ల్లా నిద్ర‌లేస్తారు.
6.30కి ఫ్రెష్ అయి బ్లాక్ కాఫీ తాగుతారు
7:00 గంట‌ల వ‌ర‌కూ పేప‌ర్లు, పీఆర్ టీమ్ బ్రీఫింగ్ తీసుకుంటారు.
అర‌గంట పాటు అంటే 7.30 వ‌ర‌కూ వ్యాయామం చేస్తారు
7:50కి స్నానం చేసి రెడీ అవుతారు.
7:50 నుంచి 8:00 వ‌ర‌కూ అల్పాహారం
8:30 వ‌ర‌కూ నాయకుల‌తో స‌మీక్ష స‌మావేశం
9:30 సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మం
పాద‌యాత్ర ప్రారంభం
ఈ టైము వ‌ర‌కూ లీట‌ర్ వాట‌ర్‌ తీసుకుంటారు

మ‌ధ్యాహ్నం
12.00 గంట‌లకు కోకోన‌ట్ వాట‌ర్
1:00- 1:30 మ‌ధ్యాహ్న భోజ‌నం (క్వినోవా విత్ వెజిట‌బుల్స్‌)
అల్లం టీ
1:30-2:00 నాయ‌కుల‌తో భేటీ
పాద‌యాత్ర ప్రారంభం
సాయంత్రంలోగా మ‌రో లీట‌ర్ వ‌ర‌కూ నీరు
5.00 గంట‌ల‌ కోకోన‌ట్ వాట‌ర్
7:00 విడిది కేంద్రం చేరిక
7:30 నాయ‌కుల‌తో స‌మీక్ష
8PM to 8:30PM - చాలా లైట్‌గా ఒక చిన్న క‌ప్పుతో తీసుకుంటారు( ఒక రోజు ఉడ‌క‌బెట్టిన వెజిట‌బుల్స్ మ‌రో రోజు ఉడ‌క‌బెట్టిన గుడ్డు , ఇంకో రోజు ఉడ‌క‌బెట్టిన చికెన్ .

ఇదండీ నారా లోకేష్ యువ‌గ‌ళంలో తాను ప‌రుగులు పెడుతూ, నేత‌ల్ని ప‌రుగులు పెట్టిస్తోన్న డైట్, వ్యాయామం, నిద్ర ప్లాన్‌.

ఢిల్లీలో వైసీపీకి చెందిన ఏ ప‌నైనా ముందు క‌నిపించేది ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. ఏ అంశం మీదైనా వినిపించే సాయిరెడ్డి గొంతు మూగ‌బోయింది. వైసీపీ త‌ర‌ఫున ఢిల్లీలో అన్నీ తానై వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టిన విజ‌య‌సాయిరెడ్డి అన్ని పోస్టుల‌తోపాటు ఢిల్లీ బాధ్య‌త‌లు పీకేశార‌ని తెలుస్తోంది. కేంద్రంతో లాబీయింగ్, ఢిల్లీ వ్య‌వ‌హారాల‌న్నీ రాజ్య‌స‌భ ఎంపీ నిరంజ‌న్ రెడ్డికి అప్ప‌గించార‌ని వైసీపీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మిధున్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నుకుని తండ్రి పెద్దిరెడ్డితో క‌లిసి మ‌ళ్లీ త‌న సీటుకే ఎస‌రు పెడ‌తార‌నే డౌటుతో నిరంజ‌న్ రెడ్డిని రంగంలోకి దింపారు వైఎస్ జ‌గ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్రం వైసీపీకి కొద్దిగా దూరం పెడుతూ వ‌స్తోంది. ఈ ప‌రిస్థితుల్లో తన‌ను జైలుకి పంపితే త‌న భార్య భార‌తి కాకుండా మంత్రి పెద్దిరెడ్డి బీజేపీతో క‌లిసి ముఖ్య‌మంత్రి అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తార‌నే భ‌యం మొద‌టి నుంచీ జ‌గ‌న్ రెడ్డిని వెంటాడుతోంది. అందుకే సాయిరెడ్డి ప్లేసులో తెలంగాణ‌కి చెందిన నిరంజ‌న్ రెడ్డికి ఢిల్లీ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. విజ‌య‌సాయిరెడ్డికి ముందుగా ఉత్త‌రాంధ్ర ఇన్చార్జిగా త‌ప్పించారు. ఆ త‌రువాత సోష‌ల్మీడియా ఇన్చార్జి నుంచి పీకేశారు. అనుబంధాల సంఘాల ఇన్చార్జి పోస్టూ పీకేశారు. ఢిల్లీలో వైసీపీ వ్య‌వ‌హారాలు చూసే ఈ చివ‌రి బాధ్య‌త‌ని లాగేసుకుని రాజ్య‌స‌భ ఎంపీ, జ‌గ‌న్ కేసులు చూసే లాయ‌ర్ నిరంజ‌న్ రెడ్డికి అప్ప‌గించారు.

మాస్క్ అడిగిన డాక్ట‌ర్ సుధాక‌ర్ జ‌గ‌న్ దెబ్బ‌కి పిచ్చోడ‌య్యాడు. మ‌ద్యం ధ‌ర‌లు దోపిడీపై ప్ర‌శ్నించిన ఓంప్ర‌తాప్ జ‌గ‌న్ పాల‌న‌లోనే శ‌వం అయ్యాడు. జ‌గ‌న్ రెడ్డి ట్రీట్మెంట్ ఎలా వుంటుంది అనే దానికి ఇవి ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. తాజాగా ఒంగోలుకి చెందిన వైసీపీ నేత‌ సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మాజీ మంత్రి బాలినేని, ఆయ‌న త‌న‌యుడిపై ఆరోప‌ణ‌లు చేశాడు. వెంట‌నే సుబ్బారావు గుప్తాపై జ‌గ‌న్ మార్క్ ట్రీట్మెంట్ ఆరంభ‌మైంది. గంజాయి కలిగి ఉన్నాడని గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. గతంలోనూ వైసీపీ తీరుని ఎండ‌గ‌ట్టి, అప్ప‌టి మంత్రి బాలినేనిపై ఆరోప‌ణ‌లు చేశాడ‌ని సుబ్బారావు గుప్తాపై బాలినేని అనుచ‌రులు సుభానీ గ్యాంగ్ దాడి చేసింది. తాజాగా బాలినేని గ్యాంగ్ ఓ హాస్ట‌ల్, దుకాణాల‌పై దాడి చేయ‌గా సుబ్బారావు గుప్తా మ‌ళ్లీ ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో ఏకంగా జ‌గ‌న్ రెడ్డి స్టైల్ గంజాయి కేసులు బ‌నాయించి మ‌రీ అరెస్టు చేశారు. ఒంగోలుకు చెందిన వైసీపీనేత వైశ్యుడైన‌ సుబ్బారావుగుప్తాపై గంజాయి కేసు బ‌నాయించ‌డాన్ని టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్రఅధ్యక్షులు డూండీ రాకేశ్ ఖండించారు. ఈ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ది ఉంటే రాష్ట్రంలో గంజాయి అమ్మేవాళ్లలో ఒక్క‌రినినైనా ప‌ట్టుకోవాల‌ని, ఆర్యవైశ్యుడైన సుబ్బారావుగుప్తాపై క‌క్ష సాధించేందుకు గంజాయి కేసులు బ‌నాయించ‌డం ముఖ్యమంత్రి సిగ్గుప‌డాల‌ని రాకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వైఎస్ జ‌గ‌న్ రెడ్డి సీఎం అయిన నుంచీ అమ‌రావ‌తి అంత‌మే పంతంగా పాల‌న సాగిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధానికి అసెంబ్లీ సాక్షిగా అంగీక‌రించి, ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్లేటు ఫిరాయించాడు. మూడు రాజ‌ధానులంటూ ఒక‌సారి, విశాఖ రాజ‌ధాని అని మ‌రోసారి డ్రామాలాడుతూ అమ‌రావ‌తిని ఆపేయాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నాడు. అయితే అమ‌రావ‌తిని ఎంత తొక్కుదామ‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తుంటే, అంత‌గా పైకి లేస్తోంద‌ని ఒక్కో సంఘ‌ట‌నా స్ప‌ష్టం చేస్తోంది. కెర‌టం నాకు ఆద‌ర్శం ..ఎందుకంటే ప‌డినా లేస్తున్నందుకు అన్నాడు స్వామి వివేకానంద‌. అమ‌రావ‌తి కూడా కెర‌టాన్ని ఆద‌ర్శంగా తీసుకుందేమో! ప‌డిన ప్ర‌తీసారీ అంత‌కంటే ఉవ్వెత్తున లేస్తోంది. నిర్మాణంలో ఉన్న ప్రపంచస్థాయి నగరాలతో ప్రఖ్యాత ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ఓ జాబితాలో అమ‌రావ‌తికి చోటు ద‌క్కింది. భవిష్యత్ నగరాల జాబితాలో ఏపీ రాజధాని అమరావతికి ప్లేస్ ద‌క్క‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రోసారి అమ‌రావ‌తి పేరు మారుమోగింది. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ వెల్లడించింది. అమరావతి భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవటం ఖాయమని చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read